మనీ ‘ఫండి’స్తున్నారు...
భారతదేశంలో రెండవ మహిళా ఫండ్ మేనేజర్. 1998లో ఫండ్ మేనేజర్‌గా యూటీఐలో బాధ్యతలు చేపట్టారు. ఇప్పటికీ అక్కడే ఉన్నారు. ప్రస్తుతం ఈమె నిర్వహిస్తున్న ఆస్తుల విలువ రూ.7,000 కోట్లుపైనే ఉంది. యూటీఐ మాస్టర్ షేర్, ఎంఎన్‌సీ, ట్యాక్స్ సేవింగ్, టాప్ 100, డివిడెండ్ ఈల్డ్ వంటి ప్రధానమైన ఫండ్స్‌ను ఈమే నిర్వహిస్తున్నారు. గతంతో పోలిస్తే ఇప్పుడు ఈ రంగంపై మహిళలు ఆసక్తి చూపుతున్నారనేది స్వాతి మాట.
పేరు: స్వాతి కులకర్ణి(48)
హోదా: యూటిఐ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్, ఫండ్ మేనేజర్
నిర్వహిస్తున్న ఆస్తుల విలువ: రూ. 7,000 కోట్లు
రీసెర్చ్ ఎనలిస్ట్‌గా 1995లో కెరీర్ ప్రారంభించారు. 2007లో ఎస్‌బీఐలో రీసెర్చ్ హెడ్ అయ్యారు. 2010లో ఫండ్ మేనేజర్‌గా పదోన్నతి. ప్రస్తుతం ఈమె ఎస్‌బీఐ బ్లూచిప్, వన్ ఇండియాకి చెందిన రూ.1,200 కోట్ల ఆస్తులను నిర్వహిస్తున్నారు. ‘‘ఈ కెరీర్లో చాలా సవాళ్లున్నాయి. ఒక షేరును అంతా ఎగబడి కొంటున్నప్పుడు నేనైతే దానికి దూరంగా ఉండటానికే ఇష్టపడతా. అవసరమైతే ఆ లాభం పోగొట్టుకోవటానికైనా సిద్ధమే’’ అంటారు సొహిని.
పేరు: స్వాతి42)
హోదా: ఎస్‌బీఐఎంఎఫ్ ఫండ్ మేనేజర్
నిర్వహిస్తున్న ఆస్తులు: రూ.1,200కోట్లు
అవైవా లైఫ్ ఇన్సూరెన్స్ ఫండ్ మేనేజర్‌గా... రూ.8,000 కోట్ల ఆస్తులను నిర్వహిస్తున్నారు జ్యోతి వాశ్వాని. తాను పనిచేసిన జేఎం క్యాపిటల్, జేఎం షేర్ బ్రోకర్స్, ప్రభుదాస్ లీలాధర్ వంటి ప్రతిచోటా ఆమె పురుషులతో పోటీపడి వారికంటే ముందుండేవారు. ‘‘నేను 1995లో కెరీర్ ప్రారంభించినప్పుడు ఈ రంగంపై మహిళలకు ఆసక్తి లేదు. కానీ ఇప్పుడు ఫండ్ మేనేజర్లుగా రాణించడానికి చక్కటి వాతావరణం ఉంది’’ అంటారు జ్యోతి.
పేరు: జ్యోతి వాశ్వాని (43)
హోదా: అవైవా చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ ఆఫీసర్
నిర్వహిస్తున్న ఆస్తులు: రూ.8,000 కోట్లు
{ఫాంక్లిన్ టెంపుల్టన్ ఇండియా ఫండ్ మేనేజర్‌గా రూ.2,500 కోట్లకుపైగా ఆస్తులను నిర్వహిస్తున్నారు రోషి జైన్. 1998 సీఏ ఎగ్జామ్స్‌లో జాతీయ స్థాయిలో 2వ ర్యాంక్ సాధించిన జైన్... గోల్డ్‌మాన్ శాక్స్‌లో ఎనలిస్ట్‌గా వృత్తిని ప్రారంభించారు. సీఏ చేస్తుండగానే స్టాక్ మార్కెట్‌పై ఆసక్తితో ఈ రంగంలోకి ప్రవేశించారీమె. కెరీర్ కోసం పెళ్లికాకుండా ఒంటరిగా మిగిలిపోయినా... తనకు ఎలాంటి బాధా లేదంటున్నారీమె. పేరు: రోషి జైన్ (36)
హోదా: ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ ఇండియా వైస్ ప్రెసిడెంట్