వినోదమే వినోదం! | full Entertainment movie 'Idhega Aasha Paddav ' | Sakshi
Sakshi News home page

వినోదమే వినోదం!

Published Wed, Mar 19 2014 12:32 AM | Last Updated on Sat, Sep 2 2017 4:52 AM

వినోదమే వినోదం!

వినోదమే వినోదం!

 ‘పిజ్జా’ఫేం విజయ్ సేతుపతి, స్వాతి జంటగా గోకుల్ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం ‘ఇదక్కు తానై ఆశైపట్ట బాలకుమార’. ఈ చిత్రం‘ఇదేగా ఆశపడింది’ పేరుతో తెలుగులో విడుదల కానుంది. సుజన్, సమన్యరెడ్డి ఈ అనువాద చిత్రానికి నిర్మాతలు. త్వరలో విడుదల కానున్న ఈ సినిమా గురించి నిర్మాతలు మాట్లాడుతూ- ‘‘తమిళంలో అత్యధిక వసూళ్లు సాధించిన వినోదాత్మక చిత్రమిది. తెలుగు ప్రేక్షకులకు నచ్చే అంశాలన్నీ ఇందులో ఉన్నాయి. అంతా వినోదమే వినోదం. ఇటీవల విడుదలైన పాటలకు శ్రోతల నుంచి మంచి స్పందన లభిస్తోంది. త్వరలోనే సినిమాను విడుదల చేస్తున్నాం’’ అని తెలిపారు. అశ్విన్, నందిత, పశుపతి ఇతర పాత్రలు పోషించిన ఈ చిత్రానికి సంగీతం: సిద్దార్థ్ విపిన్.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement