
మణిచందన (ఫైల్)
గాందీనగర్ (విజయవాడ సెంట్రల్): స్వాతి వీక్లీ అసోసియేట్ ఎడిటర్, ఎడిటర్ వేమూరి బలరాం కుమార్తె మణిచందన (48) సోమవారం కన్నుమూశారు. ఆమె కొంతకాలంగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నారు. కొద్దిరోజుల కిందట పరిస్థితి విషమించడంతో ఆమెను ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చారు. అక్కడ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. స్వాతి వారపత్రిక నిర్వహణలో కీలకపాత్ర పోషిస్తున్న మణిచందన భర్త అనిల్‌కుమార్ ఆంధ్రప్రదేశ్ ఇన్‌కంటాక్స్ ప్రిన్సిపల్ కమిషనర్‌గా పనిచేస్తున్నారు. ఆమెకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. మణిచందన మృతిపట్ల పలువురు సంతాపం తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment