జిల్లా హన్మకొండకు చెందిన స్వాతి లండన్‌లో అనుమానాస్పదంగా మృతిచెందింది. అత్తింటి వారే స్వాతిని చంపారని ఆమె తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. స్వాతికి.. హన్మకొండకే చెందిన రాజేష్‌తో వివాహం జరిగింది. రాజేష్ లండన్‌లో సాఫ్టవేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నారు. వివాహం అనంతరం స్వాతిని రాజేశ్ లండన్ తీసుకెళ్లాడు. అయితే, నిశ్చితార్ధం జరిగినప్పటి నుంచే వరకట్నం కోసం స్వాతిని రాజేశ్, అతని కుటుంబసభ్యులు వేధించారని ఆమె తల్లిదండ్రులు అంటున్నారు. మానసికంగా, శారీరకంగా హింసించి స్వాతిని చంపేశారని ఆరోపించారు. న్యాయం కోసం రాజేష్ ఇంటి ముందు స్వాతి కుటుంబసభ్యుల ఆందోళనకు దిగారు.