
జెడ్పీ పీఠంపై స్వాతి
దశాబ్ద కాలం పాటు జెడ్పీలో అధికారం చెలాయించి, మరో పదేళ్లపాటు ప్రతిపక్షంలో కూర్చున్న తెలుగుదేశం పార్టీకి మళ్లీ దశ తిరిగి జిల్లా పరిషత్ అధ్యక్ష పీఠాన్ని దక్కించుకుంది.
విజయనగరం ఫోర్ట్ : దశాబ్ద కాలం పాటు జెడ్పీలో అధికారం చెలాయించి, మరో పదేళ్లపాటు ప్రతిపక్షంలో కూర్చున్న తెలుగుదేశం పార్టీకి మళ్లీ దశ తిరిగి జిల్లా పరిషత్ అధ్యక్ష పీఠాన్ని దక్కించుకుంది. జిల్లాలో24 జెడ్పీటీసీ స్థానాలను కైవసం చేసుకోవడం తో జిల్లా పరిషత్ చైర్మన్, వైస్ చైర్మన్ పదవులకు ఆ పార్టీకి చెందిన వేపాడ, గరివిడి జెడ్పీటీసీలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఉదయం 10 గంటలకు జిల్లా పరిషత్ అధ్యక్ష స్థానానికి వేపాడ జెడ్పీటీసీ శోభ స్వాతిరాణి, ఉపాధ్యక్ష స్థానానికి గరివిడి జెడ్పీటీసీ బలగం కృష్ణమూర్తి నామినేషన్లు వేశారు.
ఒంటి గంట కు ప్రిసైడింగ్ అధికారి, కలెక్టర్ కాంతిలాల్‌దండే జెడ్పీటీసీ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం కో ఆప్షన్ సభ్యుల ఎన్నిక నిర్వహించారు. కో ఆప్షన్ సభ్యులుగా రంజిత్‌కుమార్ నాయక్, షేక్ ఫరీద్ మాత్రమే నామినేషన్ వేయడంతో వారిద్దరూ ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ప్రకటించా రు. మధ్యాహ్నం 3 గంటలకు సభ్యులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. జెడ్పీ చైర్మన్, వైస్ చైర్మన్ పదవులకు ఒక్కొక్క నామినేషన్ రావడంతో చైర్‌పర్సన్‌గా స్వాతిరాణి, వైస్ చైర్మన్‌గా కృష్ణమూర్తి ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు కలెక్టర్ ప్రకటించి ప్రమాణస్వీకారం చేయించారు. జిల్లా వ్యాప్తంగా 34 జెడ్పీటీసీలకు గాను టీడీపీ 24, వైఎస్సార్‌సీపీ 10 స్థానాలు కైవసం చేసుకున్నాయి.దీంతో జెడ్పీ చైర్‌పర్సన్ పదవి టీడీపీ చేజిక్కించుకుంది.
ఒకే ఒక్కరు..
ప్రతిపక్ష ైవె ఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి దత్తిరాజేరు జెడ్పీటీసీ సభ్యురాలు గొటివాడ అప్పయ్యమ్మ మాత్రమే ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరుయ్యారు. ైవె ఎస్సార్‌సీపీ సభ్యులకు కేటాయించిన స్థానంలో కూర్చొని ఎన్నిక ప్రక్రియ ముగి సిన తర్వాత ఆమె వెళ్లిపోయారు. అరకులోయ ఎంపీ కొత్తప ల్లి గీత, ఎమ్మెల్సీ శర్మ, ఎమ్మెల్యేలు సుజయ్‌కృష్ణ రంగరావు, రాజన్నదొర, పుష్పశ్రీవాణి, విశాఖ ఎంపీ హరిబాబు ఎన్నికకు హాజరుకాలేదు.
సందడి చేసిన టీడీపీ నేతలు, కార్యకర్తలు:
పదేళ్ల తర్వాత జిల్లా పరిషత్ చైర్మన్ పదవిని చేజిక్కించుకోవడంతో టీడీపీ నేతలు జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో సందడి చేశారు. జిల్లా నలుమూలలు నుంచి వచ్చిన కార్యకర్తలతో జిల్లా పరిషత్ కార్యాలయం నిండిపోయింది. ఎన్నిక పూర్తయిన తరువాత కార్యకర్తలు డప్పు వాయిద్యాలతో జెడ్పీ చైర్‌పర్సన్, వైఎస్ చైర్మన్లు టీడీపీ కార్యలయం వరకు ఊరిగేంపుగా తీసుకుని వెళ్లారు.
బయోడేటా :
పేరు : శోభా స్వాతిరాణి,
పుట్టిన తేదీ : 12.8.1987
వయస్సు : 27 ఏళ్లు
వివాహం : 2007 ఆగస్టు 31
స్వగ్రామం : భీమవరం, అనంతగిరి మండలం, విశాఖజిల్లా
భర్త : గుల్లిపల్లి గణేష్, సాలూరు
కుమారుడు : ప్రతీక్
తల్లి : శోభా హైమావతి, మాజీ ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర మహిళాధ్యక్షురాలు.
తండ్రి : శోభా అప్పలరాజు, సీనియర్‌మేనేజర్, షిప్‌యార్డ్, విశాఖ.
విద్యార్హత : బి.డి.ఎస్ (దంతవిద్య)
రాజకీయం అనుభవం : రాజకీయ అనుభం లేదు. ఇదే మొదటి పదవి
జెడ్పీ వైస్ చైర్మన్ బయోడేటా
పేరు : బలగం కృష్ణ
పుట్టిన తేదీ : 1.7.1954
విద్యార్హత : ఎస్‌ఎస్‌ఎల్‌సీ
తల్లిదండ్రులు : సన్యాసమ్మ, రామునాయుడు(రెండో సంతానం)
భార్య : అప్పలనారాయణమ్మ(లేటు)
పిల్లలు : శ్రీను, రమేష్
స్వగ్రామం : తోండ్రంగి
రాజకీయ అనుభవం : 1995లో మొదటిసారిగా గరివిడి జెడ్పీటీసీ సభ్యునిగా గెలుపొందారు. సుమారు 16 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడిగా పని చేశారు.