
'మాకు 50 గజాల దూరంలోనే దారుణం'
'ఓ కత్తి తనలోకి దిగుతుంటే ఆ బాధతో వచ్చిన గట్టి కేక నేను విన్నాను. అప్పుడు నాతోసహా అక్కడ ఉన్న వాళ్లందరం ఆ కేక వచ్చిన వైపు చూశాం. స్వాతి మెడ నుంచి నెత్తురు వరదైకారిపోతుంది. కళ్లముందే కుప్పకూలిపోయింది' అని ఓ ప్రత్యక్ష సాక్షి స్వాతి కేసులో వివరణ ఇచ్చాడు.
చెన్నై: 'ఓ కత్తి తనలోకి దిగుతుంటే ఆ బాధతో వచ్చిన గట్టి కేక నేను విన్నాను. అప్పుడు నాతోసహా అక్కడ ఉన్న వాళ్లందరం ఆ కేక వచ్చిన వైపు చూశాం. స్వాతి మెడ నుంచి నెత్తురు వరదైకారిపోతుంది. కళ్లముందే కుప్పకూలిపోయింది. తన తల, చేతివేళ్లు, మెల్లగా కదులుతూనే ఉన్నాయి. అలా ఓ మూడు నిమిషాలపాటు ఆమె దేహమంతా వణుకుతూ కనిపించింది. ఈ దారుణమైన దృశ్యం నేను ఓ 50గజాల దూరం నుంచే చేశాను' అని డీ తమళారసన్ అనే ఓ టీచర్ మొట్టమొదటి ప్రత్యక్షసాక్షిగా చెప్పాడు.
గత శుక్రవారం చెన్నైలోని నుంగంబాకం రైల్వే స్టేషన్‌లో ఓ దుండగుడు ఇన్ఫోసిస్ ఉద్యోగి అయిన స్వాతిని అతి దారుణంగా నరికి చంపిన సంగతి తెలిసిందే. ప్రేమ పేరిట గత మే నెల నుంచి స్వాతిని వెంటాడుతున్న ఓ యువకుడే ఈ దారుణానికి పాల్పడినట్టు పోలీసులు గుర్తించారు. హైదరాబాద్ ఫొరెన్సిక్ సంస్థ సాయంతో ఇప్పటికే నిందితుడి హై రిజుల్యూషన్ ఫొటోలను చెన్నై పోలీసులు సంపాధించారు. ఈ కేసు విచారణలో భాగంగా కొంతమంది వివరణ ఇచ్చారు. వారు చెప్పిన విషయాలు ఎంత హృదయవిధారకంగా ఉన్నాయంటే..
'మొత్తం ఓ 60మందిమి. ప్రతి రోజు ఉదయం 6.50గంటలకు చంగల్పేట వెళ్లేందుకు రైల్వే స్టేషన్ కు వస్తాం. రైలు వస్తుందనగా పది నిమిషాల ముందు రెండో నెంబర్ ప్లాట్ ఫాంకు వస్తాం. ఆ శుక్రవారం రోజు కూడా స్వాతి వచ్చింది. తను కూడా రోజూ వస్తోంది. మహిళల కంపార్ట్ మెంట్ నిలిచే చోట మాకు 50గజాల దూరంలో తను నిల్చుంది. మేమంత జనరల్ కోచ్ కోసం ఉన్నాం. ఓ వ్యక్తి ఆమెతో చాలా సేపు రఫ్ గా కొద్ది నిమిషాలపాటు వ్యవహరించినట్లు కనిపించింది. ఈలోగా గట్టిగా ఓ పెద్ద కేక వినిపించింది. ఆ దుండగుడు ఆ అమ్మాయి మెడపై నరికాడు. స్వాతి అలా కుప్పకూలిపోతుండగా అతడు పరుగు ప్రారంభించాడు. అతడిని ఓ ఇద్దరు వెంబడించారు. ఒకరు అతడిపై రాళ్లు కూడా విసిరాడు. అదే సమయంలో రైలు వచ్చింది. అతడు వెంటనే ప్లాట్ ఫాం ఎక్కేసి అక్కడ నుంచి గోడదూకేసి పారిపోయాడు. అచేతనంగా రక్తపుమడుగులో పడిఉన్న స్వాతిని చూస్తూ మేమంతా రైలెక్కేసాం(ఓకింత భావోద్వేగానికి లోనవుతూ...). స్వాతి చాలా తెలివైన అమ్మాయి. అలాంటి అమ్మాయిని కోల్పోయామనే ఆలోచన కష్టంగా ఉంది' అంటూ ఆయన పోలీసులకు వివరణ ఇచ్చాడు. తాను నిందితుడిని కచ్చితండగా గుర్తుపడతానని చెప్పాడు.