
సాక్షి, వరంగల్: జిల్లా హన్మకొండకు చెందిన ఓ నవ వధువు లండన్‌లో అనుమానాస్పదంగా మృతి చెందింది. నగరంలోని ఏకశిలా పార్క్ సమీపంలో నివాసముంటున్న తిరుమలగిరి స్వామినాథం, భారతి దంపతుల కుమార్తె స్వాతికి సింగపూర్‌లో ఉద్యోగం చేస్తున్న నగర వాసి శ్రీపతి రాజేష్‌తో 2016 నవంబర్‌లో వివాహమైంది. అనంతరం రాజేష్‌కు లండన్లో అంతకన్నా పెద్ద ఉద్యోగం రావడంతో అక్కడికి మారిపోయారు. అప్పటి నుంచి అదనపు కట్నం కోసం వేధింపులు ప్రారంభించాడు. ఉన్నట్లుండి బుధవారం రాత్రి స్వాతి చనిపోయిందంటూ వారి కుటుంబ సభ్యులకు రాజేష్ ఫోన్ ద్వారా సమాచారం అందించాడు. అయితే రాజేష్, అతని కుటుంబ సభ్యులు తమ కూతురిని హత్య చేసి ఉంటారని ఆరోపిస్తూ రాజేష్ ఇంటి ముందు ఆందోళనకు దిగారు.
Comments
Please login to add a commentAdd a comment