ఇది స్వాతి స్వప్నం | Swathi In Tripura | Sakshi
Sakshi News home page

ఇది స్వాతి స్వప్నం

Published Fri, Aug 28 2015 11:34 PM | Last Updated on Sun, Sep 3 2017 8:18 AM

ఇది స్వాతి స్వప్నం

ఇది స్వాతి స్వప్నం

 ‘‘ఈ సినిమా ఫస్ట్‌లుక్ వచ్చాక చాలామంది ఫోన్ చేసి అభినందించారు. ఇందులో పల్లెటూరి నుంచి నగరానికి వచ్చే అమ్మాయి పాత్రలో నటించా. ఈ ‘త్రిపుర’ కోసం చాలా హోమ్‌వర్క్ చేశా’’ అని స్వాతి చెప్పారు. స్వాతి ప్రధాన పాత్రలో ‘గీతాంజలి’ ఫేమ్ రాజకిరణ్ దర్శకత్వంలో క్రేజీ మీడియా పతాకంపై జవ్వాజి రామాంజనేయులు సమర్పణలో ఎ.చినబాబు, ఎం.రాజశేఖర్ నిర్మించిన చిత్రం ‘త్రిపుర’. ఈ సినిమా టీజర్‌ను శుక్రవారం హైదరాబాద్‌లో ఆవిష్కరించారు. రాజకిరణ్ మాట్లాడుతూ, ‘‘కథాకథనాలు, మాటలు ఎలా ఉన్నా వాటికి తగ్గ పాత్రలు దొరికినపుడే మంచి సినిమా వస్తుంది. ఆ పాత్రలే స్వాతి, నవీన్‌చంద్ర, రావు రమేష్. ‘గీతాంజలి’ కంటే మంచి సినిమా ఇది’’ అని చెప్పారు. పాటల రచయిత చంద్రబోస్ మాట్లాడుతూ, ‘‘మనం ‘స్వాతికిరణం’, ‘స్వాతిముత్యం’ చూశాం.
 
 ఈ చిత్రం స్వాతి స్వప్నం. అంత అద్భుతమైన గొప్ప కథ. కథ విన్న తర్వాత మూడు రోజులు అదే లోకంలో ఉన్నాను’’ అన్నారు. ఈ సినిమాలో మంచి పాత్ర చేసినందుకు హీరో నవీన్‌చంద్ర ఆనందం వెలిబుచ్చారు. నిర్మాత చినబాబు మాట్లాడుతూ, ‘‘మా సంస్థకు కోన వెంకట్‌గారు గాడ్‌ఫాదర్. దర్శకుడు అద్భుతంగా తీశారు. తమిళంలో ‘తిరుపుర సుందరి’ పేరుతో విడుదల చేస్తున్నాం’’ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంగీత దర్శకుడు కామ్రాన్, రచయిత వెలిగొండ శ్రీనివాస్, ఎగ్జిక్యూటివ్ నిర్మాతలు శివ మల్లాల, రాధాకృష్ణ భట్టార్ తదితరులు మాట్లాడారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement