
రోదిస్తున్న కుటుంబసభ్యులు
హుజూరాబాద్: పిల్లలు ఆరోగ్యంగా ఉండడం లేదని హైదరాబాద్‌లో ఓ తల్లి కూతురుతో సహా ఐదంతస్తుల భవనం పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకోగా హుజూరాబాద్‌లో విషాదం నెలకొంది. మంగళవారం పట్టణంలో కుటుంబసభ్యులు, బంధువులు, స్నేహితుల అశ్రునయనాల మధ్య అంత్యక్రియలు జరిగాయి. హుజూరాబాద్ పట్టణంలోని విద్యానగర్‌కు చెంది న రిటైర్డు ఉపాధ్యాయుడు సత్యనారాయణ తన కూతు రు స్వాతి(31)ని ఇదే పట్టణానికి చెందిన మేనల్లుడైన ప్రదీప్‌కుమార్‌కు ఇచ్చి ఎనిమిదేళ్ల క్రితం వివాహం చేశాడు. వీరు హైదరాబాద్ లోని శేరిలింగంపల్లి నియోజకవర్గం చందానగర్ పీజేఆర్‌ఎస్‌క్‌లైవ్‌లోని సాయి పెరల్ రెసిడెన్సీలో నివాసం ఉంటున్నారు.
ప్రదీప్‌కుమార్ సాప్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తుండగా, స్వాతి హౌస్‌వైఫ్‌గా ఉంటోంది. వీరికి ఇద్దరు పిల్లలు అరుష్‌రాం(5), కుమార్తె శ్వాని(తొమ్మిది నెలలు) ఉన్నారు. మేనరికంతో సంపూర్ణ ఎదుగుదల లేని పిల్ల లు జన్మించారని స్వాతి ఎప్పుడూ మనోవేదనకు గురయ్యేది. ఎన్ని ఆస్పత్రులు తిరిగినా ఫలితం లేకుండా పోయేది. మానసికంగా కుంగిపోయిన స్వాతి ఈ నెల22న వారు నివాసం ఉంటున్న భవనంపై నుంచి కుమార్తెను తోసేసి, తాను దూకి ఆత్మహత్య చేసుకుంది. శనివారం ఇద్దరి మృతదేహాలను హుజూరాబాద్ తీసుకురాగా కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment