
వరంగల్ క్రైం: మరో ఎన్నారై పెళ్లి కూతురు వివాహమై ఏడాది పూర్తి కాకముందే విగత జీవిగా మారింది. వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండ అడ్వకేట్స్ కాలనీలో లలిత రెసిడెన్సీలో నివాసం ఉంటున్న తిరుమలగిరి స్వామినాథం, భారతిల కుమార్తె స్వాతి(27) లండన్‌లో హత్యకు గురైన విషయం గురువారం వెలుగులోకి వచ్చింది. వరంగల్ ఎల్‌ఐసీ–2లో డెవలప్‌మెంట్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న తిరుమలగిరి స్వామినా«థం, భారతిలకు ఇద్దరు సంతానం.
కొడుకు కార్తీక్, కూతురు స్వాతి. హన్మకొండ మచిలీబజార్‌కు చెందిన శ్రీపతి శ్రీనివాస్, విజయల కుమారుడు శ్రీపతి రాజేశ్‌తో 2016 నవంబర్ 4న స్వాతికి వివాహం జరిగింది. రాజేశ్ సింగపూర్‌లోని ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తుండటంతో రెండు నెలల పాటు దంపతులు సింగపూర్‌లో ఉన్నారు. ఆ తర్వాత రాజేశ్‌కు లండన్‌లోని ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగం వచ్చింది. లండన్‌లోనే ఉంటున్న రాజేశ్ అక్క స్వాతి, బావ రాజు దగ్గరలోనే ఓ ఇల్లు తీసుకొని 2017 మే 2న స్వాతిని లండన్‌కు తీసుకువెళ్లాడు.
అదనపు కట్నం కోసం..
రాజేశ్‌కు కట్నకానుకల కింద సుమారు రూ. 30 లక్షల వరకు ఇచ్చినట్లు మృతురాలి కుటుంబ సభ్యులు తెలిపారు. తాను సింగపూర్‌లో ఉద్యోగం చేయడం వల్ల రూ. 30 లక్షలే కట్నం వచ్చిందని.. అప్పుడే లండన్‌లో ఉద్యోగం చేస్తే ఎక్కువ కట్నం వచ్చేదని రాజేశ్ పలుమార్లు స్వాతితో చెప్పినట్లు ఆమె తల్లిదండ్రులు చెప్పారు. మరింత కట్నం తీసుకురావాలని స్వాతిని వేధింపులకు గురి చేసేవాడని.. అతడికి అత్త విజయ, ఆడబిడ్డ స్వాతి తోడయ్యారన్నారు.
ఇండియన్ ఎంబసీలో ఫిర్యాదు...
స్వాతిని అల్లుడు అదనపు కట్నం కోసం వేధించి హత్య చేసినట్లు ఆమె తల్లిదండ్రులు హైదరాబాద్‌లోని ఇండియన్ ఎంబసీలో గురువారం సాయంత్రం ఫిర్యాదు చేశారు. మృతదేహం తొందరగా హైదరాబాద్‌కు వచ్చే విధంగా ప్రభుత్వం చొరవ తీసుకో వాలని వారు కోరారు.
కాగా, స్వాతి మరణ వార్త తెలుసుకున్న బంధువులు స్వామినాథం ఇంటికి పెద్ద సంఖ్యలో వచ్చారు. మచిలీబజార్‌లోని రాజేశ్ ఇంటి వద్ద స్వాతి బంధువులు ఆందోళన చేశారు. ఇంటికి తాళం వేసి ఉండడంతో తలుపులు పగులకొట్టేం దుకు ప్రయత్నించారు.
అత్తమామలు పరారీ..
ఇరవై రోజులుగా స్వాతి నుంచి ఫోన్లు రావడం లేదని ఆమె తల్లిదం డ్రులు చెప్పారు. చివరగా ఈనెల 2న ఫోన్ చేసి వేధింపులు భరించలేకపోతు న్నానంటూ కన్నీళ్లు పెట్టుకుందన్నారు. బుధవారం ఉదయం రాజేశ్ బావ రాజు ఫోన్ చేసి స్వాతి కనబడటం లేద ని, లండన్‌లో మిస్సింగ్ కేసు నమోదు చేసినట్లు చెప్పినట్లు స్వామినాథం వెల్ల డించారు.
రాజేశ్ తల్లిదండ్రులుంటున్న మచిలీబజార్‌లోని ఇంటికి కుటుంబస భ్యులను పంపించగా తాళం వేసి ఉం దని.. వారు ముందుగానే పరారయ్యా రని రోదించారు. బుధవారం సాయం త్రం రాజు ఫోన్ చేసి.. స్వాతి కెంట్ సముద్రం ఒడ్డున పడిపోయిందని, ఊపిరితిత్తుల్లోకి నీళ్లు పోయాయని, చికిత్స జరుగుతుందని చెప్పినట్లు వివ రించారు. రాత్రి 10.30కి చనిపోయిం దని చెప్పినట్లు విలపించాడు.
Comments
Please login to add a commentAdd a comment