
కథపై నమ్మకంతో...
అభినయానికి ఆస్కారం ఉన్న చిత్రాలు చేస్తూ, నటిగా తన ప్రతిభ చాటుకుంటున్న స్వాతి నటిస్తున్న తాజా చిత్రం ‘త్రిపుర’
అభినయానికి ఆస్కారం ఉన్న చిత్రాలు చేస్తూ, నటిగా తన ప్రతిభ చాటుకుంటున్న స్వాతి నటిస్తున్న తాజా చిత్రం ‘త్రిపుర’. జవ్వాజి రామాంజనేయులు సమర్పణలో క్రేజీ మీడియా పతాకంపై ఎ. చినబాబు, ఎం. రాజశేఖర్ నిర్మిస్తున్న ఈ చిత్రం టీజర్‌ను హైదరాబాద్‌లో విడుదల చేశారు. ‘‘ఓ శక్తిమంతమైన కథాంశంతో ఈ చిత్రాన్ని తెర కెక్కిస్తున్నాం. స్వాతిలోని మరో కోణాన్ని ఆవిష్కరించే చిత్రం అవుతుంది’’ అని దర్శకుడు చెప్పారు. కథని నమ్మి చేస్తున్న చిత్రమిదని స్వాతి తెలిపారు.