
నాగర్‌కర్నూల్: నాగర్ కర్నూల్ జిల్లాలో ప్రియుడితో కలిసి భర్తను హత్యచేసి..యాసిడ్ దాడిగా చిత్రీకరించిన స్వాతిని పోలీసులు అరెస్ట్ చేసి ఆదివారం మీడియా ముందు ప్రవేశపెట్టారు. నిందితురాలు మంద స్వాతిని కోర్టుకు తరలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఇలాంటి ట్విస్ట్‌ను తమ సర్వీసులో చూడలేదని నాగర్ కర్నూలు అడిషనల్ ఎస్పీ చెన్నయ్య, డీఎస్పీ లక్ష్మినారాయణలు పేర్కొన్నారు.
మొదట నిందుతురాలు స్వాతిని మీడియాకు చూపకపోవడంతో మీడియా ప్రతినిధులు తమకు చూపెట్టాలని పట్టుబట్టడంతో మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ కేసులో రాజేష్‌ను ఏ1గాను, స్వాతిని ఏ2గానూ కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.