
సనత్‌నగర్: ‘మా వారిని మిస్సవుతున్నాను. ఆయన చాలా మంచివారు. పిల్లలను చక్కగా చూసుకోండి’ అంటూ ఓ గృహిణి పుట్టింటివారికి ఫోన్‌లో ఎస్‌ఎంఎస్‌లు పంపించి అనంతరం బలవన్మరణానికి ఒడిగట్టిన ఘటన సనత్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మోతీనగర్ కబీర్‌నగర్‌లో నివాసం ఉండే రమేష్‌గౌడ్, స్వాతి (32) దంపతులు. వీరికో కుమారుడు, కూతురు ఉన్నారు. రమేష్‌గౌడ్ ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని మోత్కూర్ పంచాయతీ సెక్రటరీగా విధులు నిర్వర్తిస్తున్నారు.
ఈ క్రమంలో మంగళవారం ఆత్మహత్యకు పాల్పడటానికి ముందు స్వాతి.. భర్తను మిస్సవుతున్నాను.. మా ఆయన ఎంతో మంచివాడు. తల్లిదండ్రులు, పిల్లలను బాగా చూసుకోండంటూ పలువురికి ఫోన్‌లో ఎస్‌ఎంఎస్‌లు పంపించింది. మోతీనగర్ సమీపంలో ఉంటున్న సోదరుడికి ఫోన్ చేసి ‘తాను చనిపోతున్నానంటూ చెప్పింది. దీంతో వారు హుటాహుటిన చేరుకుని ఇంటితలుపులను పగులగొట్టి చూడగా ఇంట్లోని ఫ్యాన్‌కు స్వాతి ఉరేసుకుని కనిపించింది. కొనఊపిరితో ఉన్న ఆమెను ఆస్పత్రికి తరలించగా అప్పటికే చనిపోయిందని వైద్యులు తెలిపారు.