
ప్రతీకాత్మక చిత్రం
చికిత్స నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో
హైదరాబాద్: చందానగర్ పోలీస్‌స్టేషన్ పరిధి గోపన్‌పల్లిలోని బెల్లా విస్తా విల్లాస్ ఆర్చ్ నిర్మాణంలో అపశృతి చోటుచేసుకుంది. పిల్లర్ కూలి ఇద్దరు చిన్నారులు మృతిచెందారు. శుక్రవారం రాత్రి బేబీ అమ్ములు(6), ప్రవల్లిక(3) అనే ఇద్దరు అక్కా చెల్లెల్లు ఆరుబయట ఆడుకుంటుండగా ప్రమాదవశాత్తూ పిల్లర్ కూలి చిన్నారులపై పడటంతో తీవ్రగాయాలు అయ్యాయి. చికిత్స నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతిచెందారు. చిన్నారుల తండ్రి దస్తగిరి లేబర్‌గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.