ఆర్టీసీ బస్సు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఉసురుతీసింది. చందానగర్ ఏఎస్సై జాఫర్ అలీ కథనం ప్రకారం..
హైదరాబాద్: ఆర్టీసీ బస్సు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఉసురుతీసింది. చందానగర్ ఏఎస్సై జాఫర్ అలీ కథనం ప్రకారం.. విజయవాడకు చెందిన వెంకటేశ్వర్లు కుమారుడు నవీన్‌కుమార్ (25) మదీనాగూడలోని కృష్ణా రెసిడెన్సీలో ఉంటూ గచ్చిబౌలిలోని టీసీఎస్ సంస్థలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పని చేస్తున్నాడు.
గురువారం మధ్యాహ్నం 12.30కి బైక్‌పై గచ్చిబౌలి వైపు వెళ్తుండగా... లింగంపల్లి అండర్ బ్రిడ్జ్ వద్ద హెచ్‌సీయూ డిపోకు చెందిన బస్సు నవీన్‌బైక్‌ను వెనుక నుంచి ఢీకొట్టింది. తలకు తీవ్రగాయం కావడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. నవీన్ స్నేహితుడు శ్రీకాంత్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.