వైవిధ్యభరిత పాత్రలతో సత్తా చాటుతున్న నటి వసుంధర. ఎస్పీ జననాథన్ దర్శకత్వం వహించిన పేరాన్మై చిత్రంలో జయంరవితో కలిసి నటించిన ఐదుగురు హీరోయిన్లలో ఈ భామ ఒకరు. ఈ సినిమా తరువాత పలు చిత్రాల్లో కథానాయికగా నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈమె నటనకు అవకాశం ఉన్న కథా చిత్రాలను ఎంపిక చేసుకుంటూ వస్తున్నారు. అదేవిధంగా విభిన్న కథా చిత్రాల దర్శకుల ప్రాజెక్టుల్లోనూ నటించేలా సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తున్నారు.
అలా ఈ ఏడాది కన్నై నంబాదే, తలైకూత్తల్ అనే రెండు సినిమాలతో పాటు మోడ్రన్ లవ్ చెన్నై అనే వెబ్ సిరీస్‌లోనూ నటించారు. కాగా వసుంధర ఇప్పుడు మళ్లీ బిజీ నటిగా మారారు. ఇప్పటి వరకు సెలక్టివ్ చిత్రాల్లోనే నటిస్తూ వచ్చిన ఈమె ఇప్పటి వరకు ఒక లెక్క ఇకపై ఒక లెక్క అంటున్నారు. ఇక నుంచి పాత్రల ఎంపికలో తన నిబంధనలను మార్చుకుంటున్నానంటున్నారు. ఇంతకుముందు ప్రతి నాయికగా నటిస్తే ప్రేక్షకుల్లో చెడు ఇమేజ్ క్రియేట్ అయ్యేదని, మారుతున్న కాలంలో అలాంటి పాత్రలను ఎంజాయ్ చేస్తున్నారని అన్నారు.
అందుకు తన అభిమాన నటి రమ్యకృష్ణనే ఒక ఉదాహరణ అని పేర్కొన్నారు. ఆమె ఇటీవల పాజిటివ్, నెగెటివ్ పాత్రల్లోనూ సత్తా చాటుతున్నారన్నారు. రెగ్యులర్ హీరోయిన్ పాత్రలతో బోర్ కొడుతోందని, విలనిజంతో నటనా ప్రతిభను నిరూపించుకునే అవకాశం ఉంటుందన్నారు. తాను ఇప్పుడు అలాంటి చాలెంజింగ్ పాత్రల కోసం ఎదురుచూస్తున్నట్లు పేర్కొన్నారు. అలా ప్రస్తుతం ఒక మల్టీస్టారర్ చిత్రంలో నెగెటివ్ పాత్రలో నటిస్తున్నట్లు చెప్పారు.
ఇది మహిళల ఇతివృత్తంతో సాగే క్రైమ్ థ్రిల్లర్ కథా చిత్రంగా ఉంటుందని చెప్పారు. పబ్ గోవా వెబ్‌సీరీస్ ఫేమ్ లక్ష్మీనారాయణన్‌రాజు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారని తెలిపారు. దీనితో పాటు ఒక భారీ బడ్జెట్ చిత్రంలో నటించనున్నట్లు చెప్పారు. తన పుట్టిల్లు తమిళనాడు అని, అయితే ఇకపై తెలుగు, మలయాళం భాషల్లోనూ నటించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.
చదవండి: నటి విచిత్రను ఇబ్బంది పెట్టిన తెలుగు హీరో ఎవరు.. కమల్ ఈ సాహసం చేయగలరా?
Comments
Please login to add a commentAdd a comment