గృహ కొనుగోలుదారులకు భారీ ఊరట | GST Lowered On New Home Sales | Sakshi
Sakshi News home page

గృహ కొనుగోలుదారులకు భారీ ఊరట

Published Sun, Feb 24 2019 5:49 PM | Last Updated on Sun, Feb 24 2019 5:50 PM

GST Lowered On New Home Sales - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ కేంద్ర ప్రభుత్వం గృహ కొనుగోలుదారులకు తీపికబురు అందించింది. నిర్మాణంలో ఉన్న నివాస సముదాయాల విక్రయంపై విధించే జీఎస్టీని ప్రస్తుత 12 శాతం నుంచి 5 శాతానికి జీఎస్టీ కౌన్సిల్‌ తగ్గించింది. అందుబాటు గృహాల కేటగిరీలో లేని అన్ని గృహాలకూ తగ్గించిన జీఎస్టీ వర్తిస్తుంది.

ఇక అందుబాటు గృహాలపై ఇప్పటివరకూ విధిస్తున్న 8 శాతం జీఎస్టీని 1 శాతానికి తగ్గిస్తూ ఆదివారం జరిగిన జీఎస్టీ కౌన్సిల్‌ భేటీలో నిర్ణయం తీసుకున్నారు. కాగా తగ్గించిన రేట్లు ఏప్రిల్‌ 1 నుంచి అమల్లోకి వస్తాయని ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ వెల్లడించారు.గృహ విక్రయాలపై జీఎస్టీని భారీగా తగ్గిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయంతో పాటు దిగివచ్చిన వడ్డీరేట్లతో సగటు జీవి సొంతింటి కల నెరవేరే అవకాశం ఉందని భావిస్తున్నారు. కాగా, ఈ నిర్ణయంతో దేశీయ నిర్మాణ రంగంలో ఉత్తేజం పెరుగుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement