affordable houses
-
హోమ్ లోన్‌పై నూరు శాతం పన్ను ప్రయోజనం..
న్యూఢిల్లీ: గృహ రుణాలకు చెల్లించే వడ్డీ మొత్తంపైనా ఆదాయపన్ను ప్రయోజనం కల్పించాలని రియల్టర్ల మండలి ‘క్రెడాయ్’ కేంద్ర ప్రభుత్వానికి కీలక సూచన చేసింది. ఇలా చేయడం వల్ల అందుబాటు ధరల ఇళ్లు, మధ్య శ్రేణి ఇళ్ల అమ్మకాలకు డిమాండ్ పెరుగుతుందని పేర్కొంది.అలాగే, రూ.45 లక్షలుగా ఉన్న అందుబాటు ధరల ఇళ్ల నిర్వచనాన్ని రూ.75–80 లక్షలకు పెంచాలని కోరింది. క్రెడాయ్ 25వ వ్యవస్థాపక దినం సందర్భంగా ప్రెసిడెంట్ బొమన్ ఇరానీ మీడియాతో మాట్లాడారు. నిర్మాణంలోని రూ.75–80 లక్షల ధరల్లోని ఇళ్ల ప్రాజెక్టులకు ఒక శాతం జీఎస్టీని అమలు చేయాలని, తద్వారా డిమాండ్‌కు ఊతం లభిస్తుందని చెప్పారు. ప్రస్తుతం రూ.45 లక్షల ధరల్లోపు నిర్మాణంలోని ఇళ్లకే ఒక శాతం జీఎస్టీ అమల్లో ఉంది. ఇంతకుమించిన ఇళ్లకు 5 శాతం జీఎస్టీ వసూలు చేస్తున్నారు. పైగా డెవలపర్లు ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్‌ను పొందేందుకు వీల్లేదు.‘‘ఎప్పుడో 2017లో రూ.45 లక్షల్లోపు ఇళ్లను అందుబాటు ధరల ఇళ్లుగా నిర్ణయించారు. నాటి నుంచి వార్షిక ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకుని చూసినా, ఈ ధరల పరిమితి రూ.75–80లక్షలకు సవరించాల్సి ఉంది’’అని బొమన్ ఇరానీ పేర్కొన్నారు. ధరల పరిమితిని పెంచడం వల్ల కొనుగోలు దారులు తక్కువ జీఎస్టీ నుంచి ప్రయోజనం పొందుతారని చెప్పారు. మరో కీలక సూచన.. ఇక అందుబాటు ధరల ఇళ్లకు ఎలాంటి ధరల పరిమితి విధించొద్దని క్రెడాయ్ మరో కీలక సూచన చేసింది. దీనికి బదులు మెట్రోల్లో 60 మీటర్ల కార్పెట్ ఏరియా, నాన్ మెట్రోల్లో 90 మీటర్ల కార్పెట్ ఏరియాను అందుబాటు ధరలకు పరిమితిగా కొనసాగించాలని కోరింది. పన్ను తగ్గించడం ద్వారా వినియోగదారుల చేతుల్లో నిధులు మిగులు ఉండేలా చూడాలని బొమన్ ఇరానీ ప్రభుత్వానికి సూచించారు.ప్రస్తుతం గృహ రుణాలపై ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.2లక్షల వరకు వడ్డీ చెల్లింపులపై సెక్షన్ 24 కింద ఆదాయపన్ను మినహాయింపు ప్రయోజనం ఉండగా, దీని స్థానంలో చెల్లించిన వడ్డీ మొత్తానికి (నూరు శాతం) పన్ను మినహాయింపు ఇవ్వాలని క్రెడాయ్ నూతన ప్రెసిడెంట్‌గా ఎన్నికైన శేఖర్ పటేల్ కోరారు. నూరు శాతం పన్ను మినహాయింపు ఇవ్వడం డిమాండ్‌ను పెద్ద ఎత్తున పెంచుతుందని ఇరానీ అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం నుంచి వివిధ రకాల ఆమోదాల కోసం 12–18 నెలల సమయం పడుతోందని, ఈ విషయంలో వ్యాపార సులభతర నిర్వహణకు వీలుగా చర్యలు తీసుకోవాలని క్రెడాయ్ చైర్మన్ మనోజ్ గౌర్ డిమాండ్ చేశారు. -
ఇక్కడ ఇళ్లు కొనడం సాధ్యమే!
న్యూఢిల్లీ: అందుబాటు ధరల ఇళ్లకు చిరునామాగా చెన్నై, అహ్మదాబాద్, కోల్‌కతా నగరాలు నిలుస్తున్నాయి. ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ (ఎంఎంఆర్), ఢిల్లీ నగరాలు మాత్రం ఇళ్ల కొనుగోలు పరంగా ఖరీదైనవని ప్రాప్‌టెక్ సంస్థ మ్యాజిక్‌బ్రిక్స్ వెల్లడించింది. ప్రధాన పట్టణాల్లో ఇళ్ల ధరల తీరుపై ఒక నివేదిక విడుదల చేసింది. ఓ ఇంటి వార్షిక ఆదాయం నుంచి ఇంటి ధర (పీఐ రేషియో) నిష్పత్తి 2020లో ఉన్న 6.6 శాతం నుంచి 2024లో 7.5 శాతానికి పెరిగింది. అంటే ఓ ఇంటి వారందరూ ఏడున్నరేళ్లు కష్టపడి సంపాదించినంతా వెచ్చిస్తే కానీ ఇల్లు సమకూర్చుకోలేని పరిస్థితి. పీఐ రేషియో చెన్నై, అహ్మదాబాద్, కోల్‌కతాలో 5 చొప్పున ఉంది. అందుకే ఇక్కడి ఇళ్ల ధరలు అందుబాటులో ఉన్నట్టు ఈ నివేదిక పేర్కొంది. ఎంఎంఆర్‌లో 14.3గా ఉంటే, ఢిల్లీలో 10.1గా ఉంది. అంటే ఇక్కడ ఇళ్ల ధరలు ఖరీదుగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈఎంఐ – నెలవారీ ఆదాయం రేషియో 2020లో ఉన్న 46 శాతం నుంచి 2024 నాటికి 61 శాతానికి పెరిగింది. అంటే నెలవారీ వేతనంలో ఈఎంఐ వాటా 61 శాతానికి చేరింది. ఇళ్ల కొనుగోలుదారులపై పెరిగిన ఈఎంఐ భారాన్ని ఇది సూచిస్తోంది. నెలవారీ ఆదాయంలో ఈఎంఐ రేషియో ఢిల్లీలో 82 శాతం, ఎంఎంఆర్‌లో 116 శాతంగా ఉంది. హైదరాబాద్, గురుగ్రామ్‌లో 61 శాతం చొప్పున ఉంది. అహ్మదాబాద్, చెన్నైలో 41 శాతంగా, కోల్‌కతాలో 47 శాతంగా ఉంది. అసాధారణంగా పెరిగిన ధరలు 2021 ద్వితీయ ఆరు నెలలతోపాటు 2022లోనూ ఇళ్ల ధరలు ఎంతో అందుబాటులో ఉన్నాయి. తక్కువ వడ్డీ రేట్లు, గృహ ఆదాయాలు తిరిగి పుంజుకోవడంతో ఈ కాలంలో ఇళ్ల ధరలు తిరిగి పుంజుకున్నాయి. సొంతిల్లు కలిగి ఉండాలన్న ఆకాంక్షతో డిమాండ్ సరఫరాను మించిపోయింది. దీంతో ఇళ్ల ధరలు అసాధారణ స్థాయిలో పెరిగాయి. దీంతో అందుబాటు ధరల ఇళ్ల కొనుగోలు పరంగా సవాళ్లను తీసుకొచి్చంది’’అని మ్యాజిక్‌బ్రిక్స్ సీఈవో సు«దీర్ పాయ్ పేర్కొన్నారు. -
ఇంటి కొనుగోలు భారం ఇక్కడ తక్కువ...! హైదరాబాద్ టాప్ సెకెండ్
దేశంలో ఎక్కడ ఇళ్ల కొనుగోలు భారం (అఫర్డబులిటీ) తక్కువ అనేదానిపై నైట్ ఫ్రాంక్ ఇండియా నివేదిక విడుదల చేసింది. 2024 ప్రథమార్ధంలో అగ్రశ్రేణి ఎనిమిది నగరాల్లో అఫర్డబులిటీ స్థిరంగా ఉందని ఈ నివేదిక పేర్కొంది. 2023 చివరి నుంచి స్థిరంగా ఉన్న వడ్డీ రేట్ల ఆధారంగా ఈ అఫర్డబులిటీని నిర్ధారించారు.ఎనిమిది నగరాల్లో కుటుంబాలు తమ ఆదాయంలో ఇంటి ఈఎంఐ కోసం ఎంత శాతం వెచ్చిస్తున్నారన్న దాని ఆధారంగా నైట్ ఫ్రాంక్ అఫర్డబిలిటీ ఇండెక్స్‌ను రూపొందించింది. ఇది ఈఎంఐ-టు-ఇన్కమ్ నిష్పత్తిని సూచిస్తుంది.ఇందులో అహ్మదాబాద్ 21% నిష్పత్తితో అత్యంత సరసమైన హౌసింగ్ మార్కెట్‌గా ఉద్భవించింది. పుణె, కోల్‌కతా 24% నిష్పత్తితో దగ్గరగా ఉన్నాయి. మరోవైపు ముంబై 51% నిష్పత్తితో అతి తక్కువ సరసమైన నగరంగా నిలిచింది. దీని తర్వాత 51% నిష్పత్తితో హైదరాబాద్ అతి తక్కువ సరసమైన నగరంగా ఉంది. ఒక నగరంలో నైట్ ఫ్రాంక్ అఫర్డబులిటీ సూచిక స్థాయి 40% అంటే, సగటున ఆ నగరంలోని కుటుంబాలు గృహ రుణ ఈఎంఐ కోసం వారి ఆదాయంలో 40% ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇది 50% కంటే ఎక్కువ ఉంటే భరించలేనిదిగా పరిగణిస్తారు.2019 నుంచి అన్ని మార్కెట్లలో మొత్తం అఫర్డబులిటీ మెరుగుపడింది. అయితే అహ్మదాబాద్‌లో 5% నుంచి హైదరాబాద్‌లో 26% వరకు మొదటి ఎనిమిది మార్కెట్లలో ధరలు పెరిగాయి. 2019 నుంచి అఫర్డబులిటీ 15 శాతం పాయింట్ల మేర కోలుకోవడంతో ముంబై అఫర్డబులిటీలో గణనీయ పెరుగుదలను నమోదు చేసింది.కోల్‌కతా మార్కెట్ స్థోమత 2019లో 32% నుండి H1 2024లో 24%కి మెరుగుపడింది. ఎన్‌సిఆర్ మరియు బెంగళూరులో స్థోమత స్థాయిలు అదే కాలంలో 6 శాతం పాయింట్లు పెరిగాయి. -
అయిదు ఐపీవోలకు సెబీ గ్రీన్ సిగ్నల్
న్యూఢిల్లీ: అఫోర్డబుల్ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ ఇండియా షెల్టర్ ఫైనాన్స్, పెన్సిళ్ల తయారీ సంస్థ డోమ్స్ ఇండస్ట్రీస్ తదితర అయిదు కంపెనీల పబ్లిక్ ఇష్యూలకు (ఐపీవో) మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ గ్రీన్ సిగ్నల్ ఇచి్చంది. జనా స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, శివ ఫార్మాకెమ్, ఒనెస్ట్ సంస్థలు కూడా ఈ జాబితాలో ఉన్నాయి. వీటికి నవంబర్ 7–16 మధ్య సెబీ అబ్జర్వేషన్ లెటర్స్ (ఓఎల్) జారీ చేసింది. ఐపీవోకి సెబీ ఆమోదముద్రగా ఓఎల్‌ను పరిగణిస్తారు. ఇండియా షెల్టర్ ఫైనాన్స్ రూ. 1,800 కోట్లు సమీకరించనుంది. డోమ్స్ కొత్తగా రూ. 350 కోట్ల విలువ చేసే షేర్లను జారీ చేయనుండగా, ప్రమోటర్లు రూ. 850 కోట్ల వరకు విలువ చేసే షేర్లను విక్రయించనున్నారు. జనా స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ రూ. 575 కోట్ల విలువ చేసే షేర్లను కొత్తగా జారీ చేయనుండగా, ప్రస్తుత ఇన్వెస్టర్లు, 40,51,516 షేర్లను విక్రయించనున్నారు. శివ ఫార్మాకెమ్ ఐపీవో పూర్తిగా ఆఫర్ ఫర్ సేల్ విధానంలో ఉండనుంది. ప్రమోటర్లు రూ. 900 కోట్ల వరకు విలువ చేసే షేర్లను విక్ర యించనున్నారు. ఎఫ్ఎంసీజీ సంస్థ ఒనెస్ట్ రూ. 77 కోట్ల విలువ చేసే షేర్లను కొత్తగా జారీ చేయనుండగా, ప్రమోటర్లు.. ఇతర వాటాదా రులు 32.5 కోట్ల షేర్లను విక్రయించనున్నారు. -
సప్లయి తగ్గింది.. డిమాండ్ పెరిగింది!
సాక్షి, హైదరాబాద్: కరోనా మహమ్మారి నేపథ్యంలో అందుబాటు గృహాల సరఫరా తగ్గినప్పటికీ.. డిమాండ్ మాత్రం పుంజుకుంది. దీంతో దేశంలోని ఏడు ప్రధాన నగరాలలో ఇన్వెంటరీ 21 శాతం క్షీణించాయి. 2020 జనవరి–మార్చి (క్యూ1)లో 2,34,600 అఫర్డబుల్ యూనిట్ల ఇన్వెంటరీ ఉండగా.. ఈ ఏడాది క్యూ1 నాటికి 1,86,150 యూనిట్లకు తగ్గాయని అనరాక్ డేటా వెల్లడించింది. ► రెండేళ్ల కోవిడ్ కాలంలో అఫర్డబుల్ గృహాల సప్లయి తగ్గింది. కరోనా కంటే ముందు 2019 జనవరి–మార్చి (క్యూ1)లో దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో 70,480 యూనిట్లు ప్రారంభం కాగా.. ఇందులో అందుబాటు గృహాల వాటా 44 శాతంగా ఉంది. కరోనా మొదలైన ఏడాది 2020 క్యూలోని గృహాల సప్లయిలో అఫర్డబుల్ వాటా 38 శాతం, 2021 క్యూ1లో 30 శాతం, ఈ ఏడాది క్యూ1 నాటికి 25 శాతానికి తగ్గింది. సప్లయి తగ్గడం వల్ల డెవలపర్లు అమ్ముడుపోకుండా ఉన్న గృహాల (ఇన్వెంటరీ)ని విక్రయించడంపై దృష్టిసారించారని అనరాక్ గ్రూప్ చైర్మన్ అనూజ్ పూరీ తెలిపారు. దీంతో గత రెండేళ్లలో ఏడు నగరాల్లోని అఫర్డబుల్ హౌసింగ్ ఇన్వెంటరీ 21 శాతం, లగ్జరీ గృహాల ఇన్వెంటరీ 5 శాతం తగ్గుముఖం పట్టాయి. ► ఈ ఏడాది తొలి త్రైమాసికం ముగింపు నాటికి దేశంలోని ఏడు ప్రధాన నగరాలలో 6,27,780 గృహాల ఇన్వెంటరీ ఉండగా.. ఇందులో 1,86,150 యూనిట్లు రూ.40 లక్షల లోపు ధర ఉన్న అందుబాటు గృహాలే. అదే గతేడాది క్యూ1లో ఇవి 2,17,63, 2020 క్యూ1లో 2,34,600 యూనిట్లున్నాయి. 2021 క్యూ1లో అత్యధికంగా చెన్నైలో 52%, పుణేలో 33 శాతం, ముంబైలో 27% అఫర్డబుల్ హౌసింగ్ ఇన్వెంటరీ తగ్గాయి. ► ఇదే రెండేళ్ల కరోనా సమయంలో రూ.2.5 కోట్లకు పైగా ధర ఉన్న అల్ట్రా లగ్జరీ గృహాల ఇన్వెంటరీ 5 శాతం మేర తగ్గింది. 2020 క్యూ1లో 41,750 యూనిట్ల ఇన్వెంటరీ ఉండగా.. గతేడాది క్యూ1 నాటికి 42,080కు, ఈ ఏడాది క్యూ1 నాటికి 39,810 యూనిట్లకు క్షీణించాయి. అత్యధికంగా ముంబైలో 16 శాతం, కోల్‌కతాలో 15 శాతం అల్ట్రా లగ్జరీ హౌసింగ్ ఇన్వెంటరీ తగ్గాయి. -
పట్టణాలు, నగరాల్లో.. త్వరలో సొంతిల్లు
సాక్షి, అమరావతి: పట్టణాలు, నగరాల్లో మధ్య తరగతి ప్రజలకు సొంతింటి కల సాకారం చేసే ప్రయత్నాలను రాష్ట్ర ప్రభుత్వం వేగవంతం చేసింది. లాభాపేక్షలేకుండా మధ్య తరగతి ప్రజలకు సరసమైన రేట్లకే ప్లాట్లు, ఘన వ్యర్థాల నిర్వహణపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం తన క్యాంపు కార్యాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. స్మార్ట్ టౌన్షిప్లో మౌలిక సదుపాయాలపై అధికారులు సమర్పించిన ప్రతిపాదనలను పరిశీలించిన సీఎం జగన్ కొన్ని మార్పులు, సూచనలు చేశారు. పట్టణాలు, నగరాల్లో మధ్య తరగతి ప్రజలకు అత్యున్నత జీవన ప్రమాణాలు కల్పించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని సీఎం జగన్ స్పష్టం చేశారు. ఇందులో భాగంగానే వివాదాలు లేని, ఇబ్బందులు లేని, అన్ని అనుమతులతో క్లియర్ టైటిల్‌తో లాభాపేక్ష లేకుండా సరసమైన ధరలకు ప్లాట్లు మధ్యతరగతికి అందుబాటులోకి తేవాలని ఆదేశించామన్నారు. వివిధ రాష్ట్రాల్లో అమలవుతున్న పట్టణ ప్రణాళికలపై అధికారులు వివరించారు. ఇది నిరంతర ప్రక్రియ.. మధ్య తరగతి ప్రజల సొంతింటి కల పథకాన్ని నెరవేర్చేందుకు భూములను ఎలా అందుబాటులోకి తీసుకురావాలి? మౌలిక సదుపాయాలను ఎలా కల్పించాలి? తదితర అంశాలపై సమావేశంలో ముఖ్యమంత్రి విస్తృతంగా చర్చించారు. మధ్యతరగతి ప్రజలకు సరసమైన ధరలకు ప్లాట్లు ఇవ్వడం అన్నది నిరంతర ప్రక్రియగా ఉండాలని సీఎం జగన్ పేర్కొన్నారు. అర్హులైన వారు ఎప్పుడు దరఖాస్తు చేసుకున్నా ప్లాట్లు ఇచ్చేవిధంగా ప్రణాళికకు రూపకల్పన చేయాలని ఆదేశించారు. వీటిని దృష్టిలో ఉంచుకుని భూములు అందుబాటులో ఉండేలా చూసుకోవాలని సీఎం సూచించారు. కొంత ల్యాండ్ బ్యాంకు ఉండడం వల్ల కొత్తగా వచ్చే దరఖాస్తుదారులకూ లాభాపేక్ష లేకుండా సరసమైన ధరలకు ప్లాట్లు ఇవ్వగలుగుతామని సీఎం పేర్కొన్నారు. పట్టణాల చుట్టూ రింగురోడ్లు.. పట్టణాల చుట్టూ రింగు రోడ్ల నిర్మాణానికి అధికారులు ప్రతిపాదన చేశారు. భూములు ఇచ్చిన వారికి, ప్రభుత్వానికి ఉభయతారకంగా ప్రయోజనం కలిగేలా రింగు రోడ్ల నిర్మాణ ప్రతిపాదనలుంటాయని వివరించారు. రింగురోడ్ల చుట్టూ స్మార్ట్‌టౌన్స్ లే అవుట్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. తొలివిడతగా 12 పట్టణాల్లో 18 లే అవుట్స్ చేపట్టాలని ప్రాథమికంగా నిర్ణయించారు. 25 నుంచి 200 ఎకరాల వరకు.. నగరాలు, పట్టణాల్లో జనాభా ప్రాతిపదికన కనీసం 25 ఎకరాల నుంచి 200 ఎకరాల వరకూ స్మార్ట్‌టౌన్స్ రూపకల్పనకు ప్రతిపాదనలను రూపొందించనున్నారు. పనులు ప్రారంభించిన తర్వాత 18 నెలల్లోగా లేఅవుట్ సిద్ధం చేసేలా ప్రణాళికలను తయారు చేయనున్నారు. వంద రోజుల పాటు ‘క్లీన్ ఆంధ్రప్రదేశ్’.. ఘన వ్యర్థాల నిర్వహణపైన ముఖ్యమంత్రి జగన్ సమీక్షించారు. రాష్ట్రాన్ని పరిశుభ్రంగా ఉంచేలా 100 రోజుల కార్యాచరణ ప్రణాళికను ‘క్లీన్ ఆంధ్రప్రదేశ్’(క్లాప్) పేరిట చేపట్టనున్నట్లు అధికారులు వివరించారు. ఎన్జీఓలు, ప్రజల భాగస్వామ్యం ఉండేలా ప్రణాళిక రూపొందిస్తున్నట్లు తెలిపారు. కొత్తగా 3,825 చెత్త సేకరణ వాహనాలు, ఆటో టిప్పర్లు, 6 వేలకు పైగా బిన్స్ ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. మున్సిపాలిటీల్లో వేస్ట్ మేనేజ్మెంట్ వ్యవస్థలతో పాటు బయోమైనింగ్ ప్రారంభించాలని సీఎం జగన్ ఆదేశించారు. ఈ కార్యక్రమాలతో పరిశుభ్రత విషయంలో మార్పు కనిపించాలని స్పష్టం చేశారు. సీఎం సమీక్షలో పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, సాలిడ్ అండ్ లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ టాస్క్‌ఫోర్స్ ఛైర్మన్ ఆళ్ల అయోధ్యరామిరెడ్డి, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి వై.శ్రీలక్షి, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ ఎం ఎం నాయక్, సీసీఎల్ఏ స్పెషల్ కమిషనర్ నారాయణ భరత్ గుప్త, ఆర్ధికశాఖ కార్యదర్శి గుల్జార్, టిడ్కో ఎండీ సీహెచ్ శ్రీధర్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
చవగ్గా అద్దె గృహ సముదాయాలు
న్యూఢిల్లీ: పట్టణాల్లోని వలస కూలీలు, పేదల కోసం చవకగా అద్దె గృహ సముదాయాలను(అఫర్డబుల్ రెంటల్ హౌజింగ్ కాంప్లెక్సెస్– ఏఆర్‌హెచ్‌సీ) అభివృద్ధి చేయాలన్న ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం జరిగిన భేటీలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. వలస కార్మికులకు.. తాము పని చేసే ప్రదేశాలకు దగ్గరలో చవకగా అద్దె ఇళ్లు అందించే ఉద్దేశంతో ఈ పథకం ప్రారంభించనున్నారు. ఇందులో భాగంగా, ప్రభుత్వ నిధులతో నిర్మితమై, ప్రస్తుతం ఖాళీగా ఉన్న హౌజింగ్ కాంప్లెక్స్‌లను 25 ఏళ్ల కన్సెషన్ అగ్రిమెంట్ ద్వారా ఏఆర్‌హెచ్‌సీలుగా మారుస్తారు. పట్టణ ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకంలో భాగంగా ఏఆర్‌హెచ్‌సీని అభివృద్ధి చేస్తారు. కన్సెషన్ అగ్రిమెంట్ పొందిన వ్యక్తి/సంస్థ ఆ భవన సముదాయానికి మరమ్మతులు చేసి, ఇతర సదుపాయాలు కల్పించి ఆవాసయోగ్యంగా మారుస్తారు. ఈ పథకానికి టెక్నాలజీ ఇన్నోవేషన్ గ్రాంట్ కింద రూ. 600 కోట్లను కేటాయించారు. కన్సెషన్ అగ్రిమెంట్‌దారులను పారదర్శకమైన బిడ్డింగ్ ప్రక్రియ ద్వారా ఆయా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు నిర్ణయిస్తాయి. 25 ఏళ్ల అగ్రిమెంట్ కాలం ముగిసిన తరువాత, ఆ కాంప్లెక్స్‌లు స్థానిక ప్రభుత్వాల ఆధీనంలోకి వెళ్తాయి. అనంతరం మళ్లీ బిడ్డింగ్ ప్రక్రియ జరుగుతుంది. సొంత భూమిలో ఏఆర్‌హెచ్‌సీలను నిర్మించాలనుకునే వారికి ప్రత్యేక అనుమతులు, సదుపాయాలు, ప్రత్యేక రుణ సౌకర్యాలు కల్పిస్తారు. పన్ను చెల్లింపుల్లోనూ రాయితీ ఇస్తారు. ఈ పథకం ద్వారా 3.5 లక్షల మంది లబ్ధి పొందుతారని ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ పథకాన్ని మే 14న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ప్రకటించారు. కరోనా వైరస్ కారణంగా ప్రకటించిన లాక్‌డౌన్‌తో ఇబ్బంది పడుతున్న ఉజ్వల పథకం లబ్ధిదారులైన పేద మహిళల కోసం ప్రకటించిన మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లను.. వారు సెప్టెంబర్ చివరి వరకు తీసుకోవచ్చని కేంద్రం ప్రకటించింది. ఇప్పటివరకు మూడు ఉచిత సిలిండర్లను తీసుకోని వారికి మాత్రమే ఈ సదుపాయం వర్తిస్తుంది. ‘ఉచిత రేషన్’కు కేబినెట్ ఆమోదం ఇటీవల దేశ ప్రజలను ఉద్దేశించి చేసిన ప్రసంగంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన నవంబర్ వరకు ఉచిత రేషన్ కార్యక్రమానికి బుధవారం కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. కరోనా కల్లోలం నేపథ్యంలో.. ఉపాధి కోల్పోయి తీవ్ర ఇబ్బందులు పడుతున్న పేదల ఆకలి తీర్చేందుకు నవంబర్ వరకు ఉచిత రేషన్ పథకాన్ని కొనసాగించనున్నట్లు జూన్ 30న మోదీ ప్రకటించిన విషయం తెలిసిందే. -
బడ్జెట్ 2019 : అందరికీ అందుబాటు గృహాలు
సాక్షి, న్యూఢిల్లీ : దేశంలోని ప్రతి కుటుంబానికి ఇల్లు సమకూరేలా అందుబాటు ఇళ్లను ప్రజలకు చేరువ చేస్తామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ భరోసా ఇచ్చారు. 2019--22 మధ్య 1.95 కోట్ల ఇళ్ల నిర్మాణం చేపడతామని చెప్పారు. ప్రభుత్వ రంగ సంస్ధల ఖాళీ భూముల్లో పేదలకు ఇళ్లు నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారు. ఇక సాగరమాలలో పోర్టుల కనెక్టివిటీ కొనసాగిస్తామని, ఉద్యోగాల కల్పనకు భారీ పెట్టుబడులకు బాటలు వేస్తామని చెప్పారు. దేశీయ, విదేశీ పెట్టుబడులను ప్రోత్సహించేందుకు సంస్కరణలను ముందుకు తీసుకువెళతామని స్పష్టం చేశారు. జీఎస్టీ నమోదిత సంస్ధలకు వడ్డీలో సబ్సిడీ, ఎంఎస్ఎంఈ సంస్ధల చెల్లింపులకు ప్రత్యేక వేదికను ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఎంఎస్ఎంఈలకు రెండు శాతం తక్కువ వడ్డీకే రుణాలు ఇస్తామని అన్నారు. -
గృహ కొనుగోలుదారులకు భారీ ఊరట
సాక్షి, న్యూఢిల్లీ : సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ కేంద్ర ప్రభుత్వం గృహ కొనుగోలుదారులకు తీపికబురు అందించింది. నిర్మాణంలో ఉన్న నివాస సముదాయాల విక్రయంపై విధించే జీఎస్టీని ప్రస్తుత 12 శాతం నుంచి 5 శాతానికి జీఎస్టీ కౌన్సిల్ తగ్గించింది. అందుబాటు గృహాల కేటగిరీలో లేని అన్ని గృహాలకూ తగ్గించిన జీఎస్టీ వర్తిస్తుంది. ఇక అందుబాటు గృహాలపై ఇప్పటివరకూ విధిస్తున్న 8 శాతం జీఎస్టీని 1 శాతానికి తగ్గిస్తూ ఆదివారం జరిగిన జీఎస్టీ కౌన్సిల్ భేటీలో నిర్ణయం తీసుకున్నారు. కాగా తగ్గించిన రేట్లు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తాయని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వెల్లడించారు.గృహ విక్రయాలపై జీఎస్టీని భారీగా తగ్గిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయంతో పాటు దిగివచ్చిన వడ్డీరేట్లతో సగటు జీవి సొంతింటి కల నెరవేరే అవకాశం ఉందని భావిస్తున్నారు. కాగా, ఈ నిర్ణయంతో దేశీయ నిర్మాణ రంగంలో ఉత్తేజం పెరుగుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. -
పీఎఫ్ చందాదారులకు చౌక ధరల్లో గృహాలు!
మెగా హౌసింగ్ స్కీమ్‌పై కేంద్రం కసరత్తు న్యూఢిల్లీ: పీఎఫ్ చందాదారులకు చౌకధరల్లో ఇళ్లు అందించే మెగా హౌసింగ్ స్కీమ్‌ను కార్మిక మంత్రిత్వ శాఖ సిద్ధం చేస్తోంది. ఎంప్లాయీస్ ప్రావిడెండ్ ఫండ్ ఆర్గనైజేషన్(ఈపీఎఫ్ఓ)లోని 5 కోట్ల మంది చందాదారులకు అందుబాటు ధరల్లో గృహాలను అందించడం కోసం ఈ స్కీమ్‌ను రూపొందిస్తున్నారని సమాచారం. 2022 నాటికి అందరికీ ఇళ్లు అనే ప్రభుత్వ లక్ష్యంలో భాగంగా కార్మిక శాఖ ఈ ప్రయత్నాలు చేస్తోంది. ఈపీఎఫ్ఓ తన చందాదారుల కోసం అందుబాటు ధరల్లో గృహాలను నిర్మించాలని, ఈపీఎఫ్ఓ నిధులను ఇందుకోసం వినియోగించాలని ఇటీవలనే ప్రధాని కార్యాలయం ఈపీఎఫ్ఓను కోరింది. ఈపీఎఫ్ఓ నిధుల్లో 15 శాతాన్ని అందుబాటు ధరల్లో గృహా రుణాల కోసం కేటాయిస్తే, రూ.70,000 కోట్ల రుణాలను, 3.5 లక్షల అదనపు చౌక-ధర గృహాలను అందించవచ్చని అంచనా. ప్రస్తుతం ఈపీఎఫ్ఓ రూ.6.5 లక్షల కోట్ల నిధులను నిర్వహిస్తోంది. ప్రతీ ఏటా ఉపాంత డిపాజిట్లు రూ.70,000 కోట్ల మేర పెరుగుతున్నాయి. ప్రస్తుతం ఈపీఎఫ్ఓలో నెలకు రూ.15,000 మూల వేతనం కంటే త క్కువగా ఆర్జించేవారి సంఖ్య 70% ఉంది. ఈ మెగా హౌసింగ్ స్కీమ్ కోసం ఆర్ధిక సంస్థలు తక్కువ వడ్డీరేట్లకే రుణాలిచ్చే విధంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. స్కీమ్ ఎలా ఉండొచ్చు.. ఈ స్కీమ్ కోసం ప్రభుత్వ రంగ బ్యాంకులు, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు, ఎన్బీసీసీ వంటి ప్రభుత్వ నిర్మాణ రంగ కంపెనీలు, డీడీఏ, పుడా, హుడా వంటి సంస్థలతో కలసి పనిచేయాలని కార్మిక శాఖ యోచిస్తోంది. తక్కువ ఆదాయ వర్గాల వారిని దృష్టిలో పెట్టుకొని కార్మిక శాఖ ఈ స్కీమ్‌ను రూపొందిస్తోంది. ఇంటి ధరలో కొంత మొత్తాన్ని చెల్లించడానికి పీఎఫ్ డిపాజిట్లను విత్‌డ్రా చేసుకోవడానికి చందాదారులను అనుమతించవచ్చు. తక్కువ ఆదాయ వర్గాలకు సబ్సిడీలను కూడా అందించే అవకాశాలున్నాయి. సదరు స్కీమ్ కోసం ఈపీఎఫ్ఓ చందాదారులను-తక్కువ ఆదాయం, మధ్య ఆదాయం, అధిక ఆదాయం... ఇలా మూడు కేటగిరీలుగా వర్గీకరిస్తారు. ఇళ్లు, ఇతర ప్రోత్సాహాకాలను ఈ ఆదాయాలను బట్టి అందిస్తారు. సభ్యులు తమ పీఎఫ్ అకౌంట్ల ద్వారానే గృహ రుణాల ఈఎంఐల ద్వారా చెల్లించాల్సి ఉంటుంది.