న్యూఢిల్లీ: త్వరలో టీకాల ధరలు తగ్గబోతున్నాయా అంటే అవుననే జవాబు వస్తోంది. వ్యాక్సిన్లపై ప్రస్తుతం ఉన్న పన్నులను తగ్గించే యోచనలో ఉంది కేంద్రం. వ్యాక్సిన్లపై పన్నులతో పాటు కొవిడ్ చికిత్సలో ఉపయోగిస్తున్న ఇతర ఔషధాలు, వైద్య పరికరాలపై విధిస్తున్న పనులు తగ్గించే దిశగా కేంద్రం అడుగులు వేస్తోంది.
28న మంత్రి మండలి
కొవిడ్ టీకాపై ప్రస్తుతం ఉన్న పన్నులు తగ్గించే అంశంపై చర్చించేందుకు ఈనెల 28న జీఎస్‌టీ మండలి సమావేశం కానుంది. కరోనా టీకాలపై పన్ను అంశమే ప్రధాన అజెండాగా ఈ సమావేశం జరుగబోతుందని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. టీకాలతో పాటు ప్రాసెస్డ్ ఫుడ్, , మెడికల్ గ్రేడ్ ఆక్సిజన్, మెడికల్ గ్రేడ్ పరికరాలపై పన్ను తగ్గింపు అంశాలను జీఎస్టీ మండలి పరిశీలించనుంది.
ధరలు తగ్గుతాయి
కరోనా సెకండ్ వేవ్ విలయంతో ప్రైవేటు సెక్టార్‌లో వ్యాక్సినేషన్‌కి కేంద్రం అనుమతి ఇచ్చింది. దేశంలో అందుబాటులో ఉన్న కోవీషీల్డ్, కోవాగ్జిన్, స్పుత్నిక్ వీ వ్యాక్సిన్‌ల ధరలను ఆయా కంపెనీలు ప్రకటించాయి. దాదాపుగా అన్ని కంపెనీల వ్యాక్సిన్ల ధరలు ఒక డోసు వెయ్యి రూపాయలకు పైగానే ఉన్నాయి. దీంతో జీఎస్టీ నుంచి మినహాయింపు ఇస్తే వ్యాక్సిన్ల ధర తగ్గి ప్రజలకు కొంత మేర ఉపశమనం కలుగుతుందని కేంద్రం భావిస్తోంది.
ఇక్కడే తయారీ
రష్యా తయారీ స్పుత్నిక్-వి టీకా ఉత్పత్తిని భారత్‌లో ప్రారంభించారు. ఆర్‌డీఐఎఫ్‌తో కుదిరిన ఒప్పందం ప్రకారం టీకా ఉత్పత్తిని పానేషియా బయోటెక్ సంస్థ చేపట్టగా ఇప్పటికే తొలి బ్యాచ్ టీకాలు సిద్ధమయ్యాయి. నాణ్యతా పరీక్షల కోసం తొలిబ్యాచ్ టీకాలను రష్యాలోని గామలేయ సెంటర్ ఫర్ క్వాలిటీ కంట్రోల్‌కు పంపించనున్నట్లు పానేషియా బయోటెక్ వెల్లడించింది
తగ్గనున్న కొవిడ్ వ్యాక్సిన్ ధరలు?
Published Tue, May 25 2021 7:23 PM | Last Updated on Tue, May 25 2021 9:16 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment