సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం ఢిల్లీ బయల్దేరి వెళ్లనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన ఈ నెల 15న ఢిల్లీలో జరగనున్న ఐదో నీతి ఆయోగ్ సమావేశంలో ఆయన పాల్గొననున్నారు. ఎన్డీఏ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న తొలి నీతి ఆయోగ్ సమావేశం కావడంతో దీనికి ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ సమావేశానికి హాజరు కావాలని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులను కేంద్రం ఆహ్వానించింది. నీతి ఆయోగ్ సమావేశం ముగిసిన అనంతరం శుక్రవారం రాత్రి కేసీఆర్ తిరిగి రాష్ట్రానికి రానున్నారు. కాగా, ఈ నెల 20న ఢిల్లీలో జీఎస్టీ మండలి సమావేశం జరగనుంది. రాష్ట్ర ఆర్థికమంత్రి హోదాలో హాజరు అయ్యేందుకు మరోసారి కేసీఆర్ ఢిల్లీ వెళ్లే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment