
గౌహతి: రెస్టారెంట్లపై వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం భారీ ఊరట నిచ్చింది. దేశవ్యాప్తంగా అన్ని హోటల్స్‌పై (స్టార్ హోటల్స్‌తప్ప) జీఎస్‌టీ రేటును 5శాతంగా నిర్ణయించింది. గౌహతిలో జరిగిన జీఎస్‌టీ మండలి సమావేశం అనంతరం కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ జీఎస్‌టీ స్లాబ్ రేట్ల వివరాలను మీడియాకు వివరించారు. జీఎస్‌టీ భారాన్ని హోటల్స్‌పై భారీగా తగ్గించినట్టు చెప్పారు. అలాగే దాదాపు 178 వస్తువులకు 28శాతం జీఎస్‌టీ నుంచి మినహాయింపు నిచ్చామనీ, 6 అంశాలను 5శాతంనుంచి జీరో శాతానికి తెచ్చామని చెప్పారు.
హోటల్స్‌పై జీఎస్‌టీ కౌన్సిల్‌లో బాగా చర్చ జరిగిందని ఆర్థికమంత్రి తెలిపారు. ఇప్పటివరకు 18శాతం ఉండగా, ఇపుడు 5శాతంగా నిర్ణయించామన్నారు. టర్నోవర్, ఏసీ, నాన్‌ఏసీతో సంబంధం లేకుండా రెస్టారెంట్లపై జీఎస్‌టీ రేటు 5శాతంగా ఉంటుందని తెలిపారు. ఏసీ, నాన్ ఏసీ తేడా లేకుండా..అలాగే టర్నోవర్‌తో సంబంధం లేకుండా రెస్టారెంట్లపై 5శాతం టాక్స్‌ను వినియోగదారులు చెల్లించాలి. అలాగే రూ. 7,500 రూము రెంట్ వసూలు చేసే స్టార్‌హోటల్స్‌పై 18శాతం జీఎస్‌టీ (ఐటీసీతో కలిపి) చెల్లించాల్సి ఉంటుంది. ఔట్ డోర్ కేటరింగ్‌పై 18శాతం (విత్ ఐటీసీ)గా ఉంటుంది. అయితే ఐటీసీ(ఇనపుడ్ టాక్స్ క్రెడిట్)లో కొన్నిసవరణలు చేసినట్టు చెప్పారు. ఇన్‌పుట్ క్రెడిట్‌ను హోటల్ యాజమాన్యం వినియోగదారులకు పాస్ చేయడం లేదనీ తమ దృష్టికి వచ్చిందన్నారు. అందుకే రెస్టారెంట్ల ఇండస్ట్రీకి ఐటీసీ లభించదని స్పష్టం చేశారు. ఈ కొత్త రేట్లు నవంబరు 15నుంచి అమల్లోకి రానున్నాయని ప్రకటించారు.
అలాగే జీఎస్‌టీ లేట్ ఫైలింగ్ ఫీజును కూడా భారీగా తగ్గించింది. రోజుకు రూ.200 నుంచి రోజుకు రూ.20లకు తగ్గించడం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment