సాక్షి, కోలకతా: కేంద్ర ఆర్థిక మంత్రి పీయూష్ గోయల్ నేతృత్వంలో నేడు (శనివారం) వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ) 29వ జీఎస్‌టీ కౌన్సిల్ సమావేశంలో కౌన్సిల్ కీలక నిర్నయాలు తీసుకుంది. ముఖ్యంగా రూపే కార్డు, భీమ్ ద్వారా డిజిటల్ లావాదేవీలకు పైలట్ ప్రాతిపదికన ప్రోత్సాహకాలను అమలు చేయనున్నట్లు ఆర్థిక మంత్రి పియూష్ గోయల్ ప్రకటించారు.
మరోవైపు జీఎస్‌టీ స్లాబులను రానున్న కాలంలో మూడుకు తగ్గించాలని ప్రభుత్వం యోచిస్తోంది. దేశ పన్నుల విధానాన్ని మరింత సరళీకృతం చేసేందుకు మినహాయింపు కేటగిరీతో పాటు, జీఎస్‌టీ స్లాబులను తగ్గించే అవకాశం ఉందని ఆర్థిక శాఖ మంత్రి ప్రధాన ఆర్థిక సలహాదారు సజీవ్ సన్యాల్ శనివారం చెప్పారు. భారత్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ నిర్వహించిన సమావేశంలో సంజీవ్ ఈ వివరాలను వెల్లడించారు. ప్రస్తుతం ఉన్న 5, 12, 18 , 28 శాతం నాలుగు స్లాబులకు బదులుగా, మూడు స్లాబులుగా( 5, 15, 25 శాతం) రేటు ఉండవచ్చారు. కేంద్రం జీఎస్‌టీ ప్రవేశపెట్టిన తర్వాత పన్ను సేకరణ గణనీయంగా పెరిగిందనీ, చాలా మంది ప్రత్యక్ష పన్నులు చెల్లిస్తున్నారన్నారు. ప్రత్యక్ష పన్నుల ఆదాయంపన్ను ఆదాయం బాగా కొనసాగితే రేట్లను తగ్గింపు ఉంటుందని సన్యాల్ తెలిపారు.
కాగా ఎంఎస్‌ఎంఈ రంగ సమస్యల పరిష్కారం కోసం ఆర్ధిక శాఖ సహాయ మంత్రి శివ్ ప్రతాప్ శుక్లా నేతృత్వంలోని మంత్రుల బృందాన్ని ఏర్పాటు చేసింది. దీంతోపాటు చట్టం, సంబంధిత సమస్యలను కేంద్రం , రాష్ట్ర పన్ను అధికారుల న్యాయ కమిటీ పరిశీలిస్తుంది. పన్నుల సంబంధిత సమస్యలను ఫిట్‌మెంట్ కమిటీ చూస్తుందని చెప్పారు.కౌన్సిల్ తదుపరి సమావేశం సెప్టెంబర్ 28-29 తేదీల్లో గోవాలో జరుగనుంది.
Comments
Please login to add a commentAdd a comment