GST slabs
-
జీఎస్టీ స్లాబ్‌ల్లో మార్పులు..!
న్యూఢిల్లీ: వస్తు సేవల పన్ను (జీఎస్టీ)కు సంబంధించి స్లాబ్ విధాన మార్పుసహా పలు అంశాలపై సంబంధిత రేట్ల హేతుబద్ధీకరణ మంత్రివర్గ కమిటీ (జీవోఎం) కీలక భేటీ జరిగింది. ఈ సందర్భంగా కొన్ని వస్తువులపై రేట్ల తగ్గింపు అవసరంపై సమీక్ష నిర్వహించి ఆయా అంశాలను జీఎస్టీ కౌన్సిల్ ముందు సమర్పించాలని పన్ను అధికారుల కమిటీని కోరింది.ఆరోగ్య, జీవిత బీమాపై జీఎస్టీ అంశాన్ని కొన్ని రాష్ట్రాల ప్రతినిధులు సమావేశంలో లేవనెత్తడం గమనార్హం. అయితే ఈ అంశాన్ని తదుపరి డేటా విశ్లేషణ కోసం కేంద్ర, రాష్ట్ర పన్ను అధికారులతో కూడిన ఫిట్మెంట్ కమిటీకి సిఫార్సు చేయడం జరిగింది. సెప్టెంబరు 9న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలో రాష్ట్రాల మంత్రులతో కూడిన జీఎస్టీ కౌన్సిల్ 54వ అత్యున్నత స్థాయి సమావేశంనేపథ్యంలో తాజా మంత్రివర్గ కమిటీ సమావేశం జరిగింది.జీవోఎం కన్వీనర్‌గా తన మొదటి సమావేశం అనంతరం బీహార్ ఉప ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి విలేకరులతో మాట్లాడుతూ, ‘‘జీఎస్టీ పన్ను స్లాబ్‌లలో మార్పు చేయరాదని కొంతమంది జీవోఎం సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. దీనిపై మరిన్ని చర్చలు జరుగుతాయి, ఆపై తుది నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది’’ అని పేర్కొన్నారు. ప్రస్తుత జీఎస్టీ విధానంలో సున్నా, 5, 12, 18. 28 శాతం ఐదు విస్తృత పన్ను స్లాబ్‌లు ఉన్నాయి. లగ్జరీ– డీమెరిట్ వస్తువులపై అత్యధికంగా 28 శాతం రేటు కంటే ఎక్కువ సెస్‌ను విధిస్తున్నారు. -
జీఎస్టీ రేట్ల క్రమబద్ధీకరణ ఇంకా నిర్ణయించలేదు
న్యూఢిల్లీ: జీఎస్టీ కౌన్సిల్ నియమించిన మంత్రుల బృందం జీఎస్టీ రేట్ల క్రమబద్ధీకరణపై ఇంకా చర్చించలేదని అధికార వర్గాలు వెల్లడించాయి. కర్ణాటక ముఖ్యమంత్రి బస్వరాజ్ బొమ్మై అధ్యక్షతన ఏడుగురు సభ్యుల బృందం పరిశీలనలో ఈ ప్రతిపాదన ఉంది. జీఎస్టీలో 5, 8, 12, 18, 28 శాతం రేట్లు అమల్లో ఉన్నాయి. దీనికి అదనంగా బంగారం, బంగారం ఆభరణాలపై 3 శాతం రేటు అమలవుతోంది. ఇందులో 5 శాతం శ్లాబ్‌ను ఎత్తివేసి, అందులో ఉన్న వాటిని 3, 8 శాతం శ్లాబుల్లోకి మార్చేసే ప్రతిపాదన మంత్రుల బృందం పరిశీలనలో ఉన్నట్టు వార్తలు వచ్చాయి. చదవండి: ప్రపంచంలోనే మరే దేశానికి సాధ్యపడకుండా..జెట్ స్పీడ్‌లో దూసుకుపోతున్న భారత్..! -
జీఎస్టీ శ్లాబులో మార్పులు, చేర్పులు... దానిని తొలగించే అవకాశం...!
వచ్చే నెలలో జరిగే జీఎస్టీ సమావేశంలో కౌన్సిల్ పలు కీలకమైన నిర్ణయాలను తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. జీఎస్టీలోని 5 శాతం శ్లాబ్‌ను తొలగించే ప్రతిపాదనను పరిశీలించే అవకాశం ఉంది. ఈ శ్లాబ్స్ లోని కొన్ని వస్తువులను 3 శాతానికి, మిగిలినవి 8 శాతం గా నిర్ణయించే అవకాశం ఉంది. ప్రస్తుతం జీఎస్టీ అనేది 5, 12, 18, 28 శాతం నాలుగు అంచెల నిర్మాణంగా ఉంది. అంతేకాకుండా బంగారం, బంగారు ఆభరణాలపై 3 శాతం పన్ను విధిస్తారు. అదనంగా, లెవీని ఆకర్షించని బ్రాండెడ్, ప్యాక్ చేయని ఆహార పదార్థాలు వంటి వస్తువులపై కూడా మినహాయింపు ఉంది. ఆదాయాన్ని పెంచుకోవడానికి కొన్ని ఆహారేతర వస్తువులను 3 శాతం శ్లాబ్‌కు తరలించడం ద్వారా మినహాయింపు వస్తువుల జాబితాను తగ్గించే నిర్ణయం కౌన్సిల్ తీసుకోవచ్చునని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇక 5 శాతం శ్లాబ్‌ను 7 లేదా 8 లేదా 9 శాతానికి పెంచడంపై చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. వచ్చే జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో కేంద్ర, రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో కూడిన జిఎస్టి కౌన్సిల్ తుది నిర్ణయం తీసుకోనుంది. లెక్కల ప్రకారం, ప్రధానంగా ప్యాకేజ్డ్ ఫుడ్ ఐటమ్స్‌తో కూడిన 5 శాతం శ్లాబ్‌లో ప్రతి 1 శాతం పెరుగుదల సుమారుగా ఏటా రూ. 50,000 కోట్ల అదనపు ఆదాయాన్ని పొందుతుంది. దీంతో ఆయా ప్యాకేజ్డ్ ఫుడ్ ధర పెరిగే అవకాశం ఉందని తెలుస్తుంది. జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో మంత్రుల బృందం వచ్చే నెల ప్రారంభంలో మార్పులకు సంబందించిన సిఫార్సులను ఖరారు చేసే అవకాశం ఉంది, ఇక తుది నిర్ణయం కోసం మే మధ్యలో జరిగే తదుపరి సమావేశంలో కౌన్సిల్ ముందు ఉంచబడుతుంది. -
ఇక జీఎస్టీ మూడు శ్లాబులేనా.. వాటి ధరలు పెరగనున్నాయా?
జీఎస్టీ కౌన్సిల్ తన తదుపరి సమావేశంలో అతి తక్కువ పన్ను శ్లాబ్ రేటును 5 శాతం నుంచి 8 శాతానికి పెంచాలని భావిస్తున్నట్లు సమాచారం. తద్వారా ఆదాయాలు పెరిగి రాష్ట్రాలు నష్ట పరిహారం కోసం కేంద్రంపై ఆధారపడకుండా ఉండటానికి గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ వ్యవస్థలో మార్పులు చేయాలని చూస్తున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. అతి తక్కువ శ్లాబ్ 5 శాతంను పెంచడంతో పాటు ఆదాయాన్ని పెంచడానికి వివిధ చర్యలను సూచిస్తూ రాష్ట్ర ఆర్థిక మంత్రుల బృందం ఈ నెల చివరినాటికి తన నివేదికను జీఎస్టీ మండలికి సమర్పించే అవకాశం ఉంది. 5 నుంచి 8కి.. ప్రస్తుతం, జీఎస్టీ కింద 5, 12, 18 & 28 శాతం పన్ను రేటు గల 4 శ్లాబులు ఉన్నాయి. కొన్ని అత్యావశ్యక వస్తువులకు పన్ను నుంచి మినహాయింపు లభిస్తే, మరికొన్ని వాటి మీద అతి తక్కువ మాత్రమే పన్ను విధిస్తున్నారు. ఇంకా లగ్జరీ, డీమెరిట్ ఐటమ్ ఉత్పత్తులకు అత్యధికంగా 28 శాతం పన్ను వర్తిస్తుంది. జీఎస్టీ తీసుకొచ్చిన కారణంగా రాష్ట్రాలు నష్టపోయిన ఆదాయాన్ని భర్తీ చేయడానికి కొత్తగా జీఎస్టీ పన్ను వ్యవస్థలో మార్పు చేయాలని కేంద్రం భావిస్తుంది. 5 శాతం శ్లాబును 8 శాతానికి పెంచడం ద్వారా కేంద్రానికి అదనంగా రూ.1.50 లక్షల కోట్ల వార్షిక ఆదాయం రావచ్చు అని అధికార వర్గాలు తెలిపాయి. ఆ సంఖ్యను కూడా తగ్గించాలి ప్రధానంగా ప్యాకేజ్డ్ ఆహార పదార్థాలపై విధిస్తున్ శ్లాబును 1 శాతం పెంచడం ద్వారా వార్షికంగా రూ.50,000 కోట్ల ఆదాయ లాభం లభిస్తుంది. హేతుబద్ధీకరణలో భాగంగా 5 శాతం రేటును 8 శాతంగాను, 12 శాతం రేటు గల వస్తువులను 18 శాతం శ్లాబులో కలపాలని, 28 శాతం రేటును యధాతథంగా ఉంచాలని కేంద్రం భావిస్తుంది. ఈ ప్రతిపాదన అమలులోకి వస్తే, ప్రస్తుతం 12 శాతం పన్ను విధించే అన్ని వస్తువులు మరియు సేవలు 18 శాతం శ్లాబ్ కిందకు మారతాయి. అంతేకాకుండా, జీఎస్టీ నుంచి మినహాయించిన వస్తువుల సంఖ్యను తగ్గించాలని కూడా జివోఎం ప్రతిపాదించింది. జూన్ నెలతో గడువు ముగింపు ప్రస్తుతం అన్ ప్యాకేజ్డ్, అన్ బ్రాండెడ్ ఫుడ్ & డైరీ ఐటమ్స్'కు జీఎస్టీ నుంచి మినహాయింపు లభిస్తుంది. జీఎస్టీ కౌన్సిల్ ఈ నెల చివర్లో లేదా వచ్చే నెల ప్రారంభంలో సమావేశమై జివోఎం నివేదికపై చర్చించి తదనుగుణంగా చర్యలు తీసుకుంటుందని వర్గాలు తెలిపాయి. గత కొన్ని ఏళ్లుగా జీఎస్టీ అమలులోకి తీసుకొని రావడం వల్ల రాష్ట్రాలు నష్టపోయే ఆదాయాన్ని కేంద్రమే చెల్లిస్తుంది. ఈ ప్రక్రియకు జూన్ నెలతో గడువు ముగిస్తుంది. జీఎస్టీ నష్టపరిహార ప్రక్రియ ముగింపుకు రావడంతో రాష్ట్రాలు కేంద్రంపై ఆధారపడకుండా స్వయం సమృద్ధి సాధించడానికి కేంద్రం జీఎస్టీ పన్ను వ్యవస్థలో మార్పులు చేయాలని భావిస్తుంది. జూలై 1, 2017న జీఎస్టీ అమలులోకి వచ్చింది. అప్పటి నుంచి జూన్ 2022 వరకు రాష్ట్రాలకు 5 సంవత్సరాల పరిహారం చెల్లిస్తామని పేర్కొంది. 2015-16 సంవత్సరాన్ని బేస్ ఇయర్‌గా చేసుకొని సంవత్సరానికి 14 శాతం వృద్దిని పరిగణలోకి తీసుకొని నష్టాన్ని లెక్కిస్తామని కేంద్రం అంగీకరించింది. అయితే, అనేక వస్తువులపై జీఎస్టీ తగ్గడం వల్ల ఈ 5 సంవత్సరాల కాలంలో రాష్ట్రాల ఆదాయం భారీగా తగ్గింది. కొన్ని సంవత్సరాలుగా జీఎస్టీ కౌన్సిల్ తరచుగా వాణిజ్యం & పరిశ్రమలకు అనుగుణంగా పన్ను రేట్లను సవరించింది. ఉదాహరణకు, జీఎస్టీ అమలులకి వచ్చిన కొత్తలో 28 శాతం పన్ను శ్లాబుల ఉన్న సంఖ్య 228 అయితే.. ప్రస్తుతం ఆ సంఖ్య 35కు తగ్గింది. (చదవండి: సామాన్యులకు మరో కొత్త టెన్షన్.. ఇక మనం వాటిని కొనలేమా?) -
జీఎస్టీలో మార్పులు ఉండకపోవచ్చు: సుశీల్
న్యూఢిల్లీ: ఆర్థిక మందగమనం కారణంగా ఇప్పట్లో జీఎస్టీ శ్లాబుల్లో మార్పులు ఉండకపోవచ్చని ఇంటిగ్రేటెడ్ గూడ్స్, సర్వీస్ ట్యాక్స్(ఐజీఎస్టీ) కన్వీనర్ సుశీల్ కుమార్ మోదీ శనివారం అన్నారు. కొనుగోళ్లు తగ్గుముఖం పట్టడంతో ఇప్పుడు జీఎస్టీ పెంచడం సరైన నిర్ణయం కాదన్నారు. ఆర్థిక మందగమనం కొనసాగుతున్నప్పుడు, జీఎస్టీ తగ్గించకపోతే.. పెంచడానికి కూడా అవకాశం ఉండదన్నారు. శనివారం ఆయన ‘భారత్: 5 బిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ వైపు పయనం’ అన్న అంశంపై ఎఫ్ఐసీసీఐ 92వ వార్షిక సమావేశంలో మాట్లాడారు. పన్ను రేట్లు పెంచడానికి ఏ రాష్ట్రమూ సిద్ధంగా లేదని చెప్పారు. -
ఇకపై జీఎస్టీ వడ్డన!
న్యూఢిల్లీ: దేశ ఆర్థిక పరిస్థితి అంతకంతకూ దిగజారుతోంది. వస్తు సేవల పన్ను(జీఎస్టీ ) ద్వారా ఆశించినంత వసూళ్లు జరగకపోవడంతో పలు వస్తువుల జీఎస్టీని సవరించాలని, పన్ను శ్లాబుల్ని పెంచాలని ప్రాథమికంగా నిర్ణయించినట్టు ఆర్థిక శాఖ వర్గాలు వెల్లడించాయి. డిసెంబర్ 18న కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ నేతృత్వంలోని జీఎస్టీ మండలి భేటీ కానుంది. ఆ మండలి సమావేశంలో జీఎస్టీ పెంపుపై తుది నిర్ణయం తీసుకుంటారు. కేంద్రం, రాష్ట్రాలకు చెందిన ఆర్థిక శాఖ అధికారులు మంగళవారం సమావేశమయ్యారు. ధరల స్థిరీకరణ, జీఎస్టీలో పన్నుల శాతం పెంపుపై కొన్ని సిఫార్సులు చేశారు. ప్రస్తుతం జీఎస్టీలో 5%, 12%, 18%; 28% శ్లాబులు ఉన్నాయి. 28శాతం కంటే తక్కువ ఉన్న శ్లాబుల్లో కూడా అదనంగా సెస్ వసూలు చేస్తున్నారు. అయినప్పటికీ కేంద్ర ఖజానాకి ఆశించినంత ఆదాయం రావడం లేదు. 5 శాతం పన్నుని 8శాతానికి , 12 నుంచి 15 శాతానికి పెంచే అవకాశాల్ని కూడా పరిశీలించినట్టు ఆర్థిక శాఖ వర్గాలు తెలిపాయి. ధరల్ని స్థిరీకరిస్తూనే ఖజానా ఆదాయాన్ని పెంచే మార్గాలను అన్వేషించారు. కొన్ని వస్తువులపై భారీగా సెస్ విధించాలని కూడా జీఎస్టీ మండలి యోచిస్తోంది. అంతే కాకుండా ప్రస్తుతమున్న పన్ను రేటు శ్లాబుల్ని మూడుకి కుదించాలని భావిస్తోంది. 2019–20 ఆర్థిక సంవత్సరానికి గాను ఏప్రిల్–నవంబర్ మధ్య జీఎస్టీ పన్ను వసూళ్లు బడ్జెట్ అంచనాలకంటే 40శాతానికి తగ్గినట్టు ప్రభుత్వ గణాంకాలు వెల్లడించాయి. -
భవిష్యత్‌లో మూడే జీఎస్టీ శ్లాబులు
-
సినిమా, టీవీలు చవక
న్యూఢిల్లీ: సామాన్యుడికి క్రిస్మస్ కానుక. లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ మధ్య తరగతి ప్రజలు విరివిగా వినియోగించే 23 వస్తువులు, సేవలపై పన్నును జీఎస్టీ మండలి తగ్గించింది. ధరలు తగ్గనున్న వాటిలో సినిమా టికెట్లు, టీవీ, కంప్యూటర్ తెరలు, పవర్ బ్యాంకులున్నాయి. శీతలీకరించిన, నిల్వ చేసిన కూరగాయలకు పూర్తి పన్ను మినహాయింపు ఇచ్చారు. ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ నేతృత్వంలో ఢిల్లీలో శనివారం జరిగిన జీఎస్టీ మండలి 31వ సమావేశంలో పలు వస్తువుల పన్ను రేట్లను హేతుబద్ధీకరిస్తూ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రస్తుతం 18 శాతం పన్ను పరిధిలోని రూ.100 వరకున్న సినిమా టికెట్లను 12 శాతం శ్లాబులో చేర్చారు. రూ.100కు పైనున్న టికెట్లపై పన్నును 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గించారు. మానిటర్లు, టీవీ తెరలపై పన్నును 28 శాతం నుంచి 18 శాతానికి కుదించారు. సవరించిన రేట్లు జనవరి 1 నుంచి అమల్లోకి వస్తాయి. పన్ను రేట్ల కోత వల్ల కేంద్ర ఖజానా ఏటా రూ.5,500 కోట్లు నష్టపోతుందని జైట్లీ వెల్లడించారు. పన్ను రేట్ల హేతుబద్ధీకరణ నిరంతర ప్రక్రియ అని, 28 శాతం శ్లాబు క్రమంగా కుచించుకుపోతోందని అన్నారు. 99 శాతం వస్తువులపై పన్నును 18 శాతం లేదా అంతకన్నా తక్కువకే పరిమితం చేస్తామని ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవలే ప్రకటించిన నేపథ్యంలో తాజా రేట్ల కోత ప్రాధాన్యం సంతరించుకుంది. 28 శాతం శ్లాబులో 28 వస్తువులే... గరిష్ట పన్ను శాతం అయిన 28 శాతం శ్లాబులో ఉన్న ఏడు వస్తువులు, సేవలపై పన్నును కుదించడంతో, ఇక ఆ శ్లాబులో 28 వస్తువులు, సేవలే మిగిలాయి. ఆటో మొబైల్ పరికరాలు, సిమెంట్, మద్యం, సిగరెట్లు, ఇతర విలాసవంత వస్తువులు, సేవలే అందులో ఉన్నాయి. పన్నును 28 శాతం నుంచి 18 శాతానికి కుదించిన వస్తువులు, సేవల జాబితాలో.. కప్పీలు(గిలక), ట్రాన్స్మిషన్ షాఫ్ట్(వాహనాల్లో క్లచ్, ఇంజిన్‌ను అనుసంధానించేది), పునర్వినియోగ టైర్లు, లిథియం అయాన్ పవర్ బ్యాంకులు, డిజిటల్ కెమెరాలు, వీడియో కెమెరా రికార్డర్లు, వీడియో గేమ్ పరికరాలున్నాయి. ఊతకర్ర, ఫ్లైయాష్ ఇటుకలపై 5 శాతం పన్ను.. దివ్యాంగుల ఉపకరణాలపై ప్రస్తుతం అమలవుతున్న పన్నును 28 శాతం నుంచి 5 శాతానికి కుదించారు. సరకు రవాణా వాహనాల థర్డ్ పార్టీ బీమా ప్రీమియాన్ని 18 శాతం నుంచి 12 శాతానికి తగ్గించారు. అత్యల్ప పన్ను శాతమైన 5 శాతం శ్లాబులో...ఊత కర్ర, ఫ్లైయాష్ ఇటుకలు, సహజ బెరడు, చలువరాళ్లను చేర్చారు. ఇతర దేశాల సహకారంతో ప్రభుత్వం సమకూర్చే నాన్–షెడ్యూల్డ్, చార్టర్డ్ విమానాల సేవలపై 5 శాతం జీఎస్టీ వర్తిస్తుంది. పునర్వినియోగ ఇంధన ఉపకరణాలు, వాటి తయారీపై కూడా 5 శాతం పన్ను విధించారు. శీతలీకరించిన, ప్యాక్ చేసిన కూరగాయలతో పాటు రసాయనాలతో భద్రపరచిన, తక్షణం తినడానికి సిద్ధంగా లేని కూరగాయలకు పన్ను మినహాయింపు ఇచ్చారు. జన్‌ధన్ యోజన ఖాతాదారులకు బ్యాంకులు అందించే సేవలను కూడా పన్ను పరిధి నుంచి తప్పించారు. ప్రయోజనాలు వినియోగదారులకు అందాలి: జైట్లీ నేషనల్ యాంటీ ప్రాఫిటీరింగ్ అథారిటీ(పన్ను ప్రయోజనాలకు సంబంధించిన ఫిర్యాదుల్ని పరిష్కరించే సంస్థ) ఎంతో చురుగ్గా పనిచేస్తోందని, పన్ను కోత ప్రయోజనాల్ని వినియోగదారులకు బదిలీచేయాలని జైట్లీ వ్యాపారులకు స్పష్టం చేశారు. ఇప్పటి దాకా జీఎస్టీ చెల్లించని, రిటర్నులను దాఖలుచేయని వ్యాపారులు వచ్చే మార్చి 31 లోగా ఆ పనులు పూర్తి చేయాలని, లేని పక్షంలో జరిమానా తప్పదని హెచ్చరించారు. జీఎస్టీ పన్ను వర్తింపుపై రెండు రాష్ట్రాల అడ్వాన్స్ రూలింగ్ అథారిటీలు(ఏఏఆర్)లు ఇచ్చే భిన్న తీర్పుల్ని పరిశీలించేందుకు కేంద్రీకృత ఏఏఆర్ను ఏర్పాటుచేయాలని జీఎస్టీ మండలి నిర్ణయించింది. కాగా, జీఎస్టీ రేట్ల కోతను బీజేపీయేతర పాలిత రాష్ట్రాలు వ్యతిరేకించాయి. ఈ నిర్ణయంతో తమ ఆదాయానికి గండిపడుతుందని ఆందోళన వ్యక్తం చేశాయి. పన్ను తగ్గింపు ద్వారా వాటిల్లే నష్టాన్ని భర్తీ చేయడానికి కేంద్రం ఐదేళ్లకు మించి పరిహారం చెల్లించాలని కేరళ డిమాండ్ చేసింది. 28% నుంచి 18%.. 32 అంగుళాల వరకున్న టీవీ తెరలు, కంప్యూటర్, రూ.100కు పైనున్న సినిమా టికెట్లు, డిజిటల్ కెమెరాలు, వీడియో కెమెరా రికార్డర్లు, కప్పీ, ట్రాన్స్మిషన్ షాఫ్ట్‌లు, గేర్ బాక్సులు, లిథియం అయాన్ పవర్ బ్యాంకులు, వీడియో గేమ్ పరికరాలు, పునర్వినియోగ టైర్లు 28% నుంచి 5%.. దివ్యాంగులను మోసుకెళ్లే వాహనాల విడి భాగాలు 18% నుంచి 5%.. చలువ రాయి ముక్కలు 12% నుంచి 0%.. మ్యూజిక్ బుక్స్ 5% నుంచి 0%.. శీతలీకరించిన, ప్యాకింగ్ చేసిన కూరగాయలు 18% నుంచి 12%.. రూ.100 లోపున్న సినిమా టికెట్లు, సహజ బెరడుతో తయారైన వస్తువులు తదితరాలు 12% నుంచి 5%.. సహజ బెరడు, ఊతకర్ర, ఫ్లైయాష్ ఇటుకలు -
జీఎస్టీ స్లాబులు తగ్గించే అవకాశం
సాక్షి, కోలకతా: కేంద్ర ఆర్థిక మంత్రి పీయూష్ గోయల్ నేతృత్వంలో నేడు (శనివారం) వస్తు సేవల పన్ను (జీఎస్టీ) 29వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో కౌన్సిల్ కీలక నిర్నయాలు తీసుకుంది. ముఖ్యంగా రూపే కార్డు, భీమ్ ద్వారా డిజిటల్ లావాదేవీలకు పైలట్ ప్రాతిపదికన ప్రోత్సాహకాలను అమలు చేయనున్నట్లు ఆర్థిక మంత్రి పియూష్ గోయల్ ప్రకటించారు. మరోవైపు జీఎస్టీ స్లాబులను రానున్న కాలంలో మూడుకు తగ్గించాలని ప్రభుత్వం యోచిస్తోంది. దేశ పన్నుల విధానాన్ని మరింత సరళీకృతం చేసేందుకు మినహాయింపు కేటగిరీతో పాటు, జీఎస్టీ స్లాబులను తగ్గించే అవకాశం ఉందని ఆర్థిక శాఖ మంత్రి ప్రధాన ఆర్థిక సలహాదారు సజీవ్ సన్యాల్ శనివారం చెప్పారు. భారత్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ నిర్వహించిన సమావేశంలో సంజీవ్ ఈ వివరాలను వెల్లడించారు. ప్రస్తుతం ఉన్న 5, 12, 18 , 28 శాతం నాలుగు స్లాబులకు బదులుగా, మూడు స్లాబులుగా( 5, 15, 25 శాతం) రేటు ఉండవచ్చారు. కేంద్రం జీఎస్టీ ప్రవేశపెట్టిన తర్వాత పన్ను సేకరణ గణనీయంగా పెరిగిందనీ, చాలా మంది ప్రత్యక్ష పన్నులు చెల్లిస్తున్నారన్నారు. ప్రత్యక్ష పన్నుల ఆదాయంపన్ను ఆదాయం బాగా కొనసాగితే రేట్లను తగ్గింపు ఉంటుందని సన్యాల్ తెలిపారు. కాగా ఎంఎస్ఎంఈ రంగ సమస్యల పరిష్కారం కోసం ఆర్ధిక శాఖ సహాయ మంత్రి శివ్ ప్రతాప్ శుక్లా నేతృత్వంలోని మంత్రుల బృందాన్ని ఏర్పాటు చేసింది. దీంతోపాటు చట్టం, సంబంధిత సమస్యలను కేంద్రం , రాష్ట్ర పన్ను అధికారుల న్యాయ కమిటీ పరిశీలిస్తుంది. పన్నుల సంబంధిత సమస్యలను ఫిట్మెంట్ కమిటీ చూస్తుందని చెప్పారు.కౌన్సిల్ తదుపరి సమావేశం సెప్టెంబర్ 28-29 తేదీల్లో గోవాలో జరుగనుంది. -
జీఎస్టీ శ్లాబులు తగ్గించే యోచన
విశాఖసిటీ: దేశంలో పేద కుటుంబాలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఒకే పన్ను.. ఒకే శ్లాబు విధానం ఎట్టి పరిస్థితుల్లోనూ అమలు చేయలేమని రాష్ట్ర ఆర్థిక, వాణిజ్య పన్నుల శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు వ్యాఖ్యానించారు. బీచ్‌రోడ్డులోని ఏయూ కన్వెన్షన్ సెంటర్లో సెంట్రల్ ట్యాక్స్ అండ్ కస్టమ్స్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో జీఎస్టీ మొదటి వార్షికోత్సవాన్ని నిర్వహించారు. ఈ సం దర్భంగా యనమల మాట్లాడుతూ గతంలో వ్యాట్ వచ్చినప్పుడు కూడా కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవల్సి వచ్చిందని గుర్తు చేశారు. ఒకే పన్ను, ఒకే దేశం, ఒకే మార్కెట్ అన్న నినాదంతో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీఎస్టీని 29 రాష్ట్రాలూ వ్యతిరేకించకపోవడం హర్షణీయమన్నారు. దేశవ్యాప్తంగా ఒకే పన్ను విధానం వల్ల దేశ ఆర్థిక అభివృద్ధికి దోహద పడుతుందన్నారు. బ్రాండెడ్, నాన్ బ్రాండెడ్ వస్తువులకు ట్యాక్స్‌లలో తేడా ఉంటుందన్నారు. ఒకే పన్ను విధానంలో ఒకే శ్లాబ్ పద్ధతి చాలా కష్టతరంతో కూడుకున్నదనీ, దీనికి బ్యాలెన్స్ చెయ్యాల్సిన అవసరం ఉందన్నారు. మన దేశంలో జీరోతో మొదలై ఐదు శ్లాబులుగా విభజించారన్నారు. ఈ విధానం వల్ల కొంత గందరగోళ పరిస్థితులు ఏర్పడిన విషయం వాస్తవమన్నారు. శ్లాబుల సంఖ్య తగ్గించే యోచనలో జీఎస్టీ కౌన్సిల్ ఆలోచిస్తోందనీ, ఈ నెల 21న జరిగే కౌన్సిల్ సమావేశంలో ఈ విషయం చర్చకు రానుందని తెలిపారు. వాణిజ్య, వర్తకుల్ని దృష్టిలో పెట్టుకొని ఎగ్జెమ్టెడ్ గూడ్స్‌ను జీఎస్టీ నుంచి తప్పించాలన్నారు. ప్రస్తుతం చక్కెర పరి శ్రమ ఇబ్బందుల్లో ఉన్న నేపథ్యంలో దానిపై సెస్ వెయ్యొద్దంటూ జీఎస్టీ కౌన్సిల్లో ప్రతిపాదించా మని వెల్లడించారు. ఏడాది గడుస్తున్నా ఇప్పటికీ కొన్ని సమస్యలు ఉత్పన్నమవుతున్నాయనీ, వాటన్నింటినీ శతశాతం పరిష్కరిస్తే జీఎస్టీ 100 శాతం ఉత్తమ ఫలితాలు రాబడుతుందన్నారు. కొన్ని వస్తువులపై పన్ను రేటు తగ్గింపు? ఎంపీ హరిబాబు మాట్లాడుతూ గతంలో అమల్లో ఉండే విధానాలతో వినియోగదారుల నుంచి వసూలు చేసిన పన్నుల్ని ప్రభుత్వాలకు చేరకుండా కొంతమంది వ్యాపారులు వ్యవహరించేవారనీ, జీఎస్టీ వచ్చిన తర్వాత వారి దారులు మూసుకుపోవడం వల్లే వ్యతిరేకతను వ్యక్తం చేశారన్నారు. 17 రకాల పన్నులు, 23 రకాల సెస్సులను ఏకతాటిపైకి తీసుకురావడం అభినందనీయమన్నారు. కేంద్ర ప్రభుత్వం కొన్ని వస్తువులపై పన్ను రేటును తగ్గించే యోచనలో ఉన్నట్లు హరిబాబు వెల్లడించారు. అదే విధంగా రిటర్న్స్ సరళీకృతం చేసేందుకు త్వరలో జరగనున్న జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో నిర్ణయం వెలువడనుందని తెలిపారు. -
జీఎస్టీపై ఇంకా గందరగోళం
న్యూఢిల్లీ: కేంద్ర వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) జూలై ఒకటవ తేదీ నుంచి అమల్లోకి వస్తోందని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కానీ దీన్ని ఇప్పట్లో అమలుచేసే పరిస్థితుల్లో లేమని ఇటు పారిశ్రామిక వర్గాలు, బ్యాంకింగ్ వర్గాలు, అటు అకౌంటింగ్ వర్గాలు చేతులు ఎత్తేస్తున్నాయి. ‘ఒకే దేశం ఒకే పన్ను’ విధానంతో కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ముందుకు వచ్చింది. 15, 18 శాతం, అంటే రెండే స్లాబుల్లో జీఎస్టీ పన్నును అమలు చేస్తామని ముందుగా చెప్పింది. అనేక పర్యాయాల కసరత్తు అనంతరం నాలుగు స్లాబ్‌లతో పన్నును ఖరారు చేసింది. ప్రపంచంలో నూజిలాండ్ దేశం ఒకే 15 శాతం స్లాబ్‌తో జీఎస్టీ పన్నును సక్రమంగా అమలుచేస్తూ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసుకుంటూ పోతుంటే భారత్ నాలుగు స్లాబ్‌తో దేశంలోని అన్ని వర్గాల్లో గందరగోళం సష్టించింది. భారత రాజ్యాంగం ప్రకారం కేంద్రం, రాష్ట్రాల మధ్య సమాఖ్య స్ఫూర్తి ఉండాలికనుక జీఎస్టీనీ, సీజీఎస్టీగా కేంద్రం, ఎస్జీఎస్టీగా రాష్ట్రాల మధ్య విభజించాల్సి వచ్చింది. ఓ రాష్ట్రాంలోని ఉక్కు కర్మాగారం ఉత్పత్తిచేసే ఐరన్ రాడ్లను అదే రాష్ట్రానికి చెందిన వినియోగదారుడికి విక్రయించినట్లయితే ఆ ఉక్కు కంపెనీ ఒక పన్ను మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వం ఖాతాలో, మరో మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఖాతాలో జమచేయాల్సి ఉంటుంది. పారిశ్రామిక కంపెనీలు పన్నులకు సంబంధించి ఏడాదికి 13 సార్లు రిటర్న్‌లు సమర్పిస్తుండగా, జీఎస్టీ అమల్లోకి వస్తే ఏడాదికి 37 సార్లు రిటర్న్‌లు సమర్పించాల్సి ఉంటుంది. అంటే నెలకు మూడేసి రిటర్న్‌లతోపాటు ఏడాది రిటర్న్‌లను సమర్పించాల్సి ఉంటుంది. ఇన్ని రిటర్న్‌లు సమర్పించడమంటే తమకు అధిక శ్రమ, అధిక సిబ్బందిని అవసరమవుతారని పలు రంగాలు వాపోతున్నాయి. జీఎస్టీనీ కచ్చితంగా లెక్కగట్టాలి కనుక ప్రతి వస్తువు కొనుగోలు, అమ్మకాల వివరాలను కచ్చితంగా కంపెనీలు నమోదు చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం అకౌంట్ల కోసం ఎక్కువ వరకు కంపెనీలు ‘టాలీ’ సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగిస్తున్నాయి. ఇక జీఎస్టీని అమలు చేసేందుకు ఈ సాఫ్ట్వేర్ ఉపయోగపడదని, కొత్త సాఫ్ట్‌వేర్‌ను అభివద్ధి చేసుకోవాల్సి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. బ్యాంకింగ్ రంగం కూడా సాఫ్ట్‌వేర్‌ను మార్చుకోవాల్సి వస్తుందని ఆ రంగానికి చెందిన నిపుణులు తెలియజేస్తున్నారు. జీఎస్టీలో తాజాగా చోటుచేసుకున్న మార్పులు సగం పారిశ్రామిక కంపెనీలకు తెలియవని, తెల్సిన కంపెనీలకు కూడా తమ సరుకులు ఏ స్లాబ్ పరిధిలోకి తెలియని స్థితిలోనే ఉన్నాయని ఆ రంగానికి చెందిన నిపుణులు చెబుతున్నారు. జూలై ఒకటవ తేదీ నుంచి కాకుండా సెప్టెంబర్ నెల నుంచి జీఎస్టీని అమలు చేస్తే బాగుంటుందని పారిశ్రామిక వర్గాలు కోరుతున్నాయి. ఒక్క జీఎస్టీని తప్ప ఏ పన్నులను అమలు చేయమని కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చినప్పటికీ వివిధ ఉత్పత్తులపై సెస్‌లు, అదనపు సుంకాలు అలాగే ఉన్నాయి.