tax system
-
కొత్తకు జైజై.. పాతకు బైబై..
సాక్షి, అమరావతి : ఉద్యోగస్తులు పాత పన్నుల విధానం కాకుండా కొత్త పన్నుల విధానం ప్రోత్సహించే విధంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రస్తుత బడ్జెట్లో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఆదాయపన్ను రిటర్నులు దాఖలును సులభతరం చేస్తున్నామన్న నెపంతో పొదుపుపై ఎటువంటి పన్ను ప్రయోజనాలు ఉండని కొత్త పన్నుల విధానం ఎంచుకునే దిశగా వేగంగా అడుగులు వేస్తున్నారు. పాత ఆదాయ పన్ను విధానంలో బీమా ప్రీమియం, గృహరుణం, పిల్లల చదువులు, పోస్టాఫీసు వంటి వివిధ సేవింగ్ పథకాలకు చేసే వ్యయాలను చూపించడం ద్వారా పన్ను భారం తగ్గించుకోవచ్చు. కానీ 2020లో తక్కువ పన్నురేట్లతో వివిధ శ్లాబులను కొత్త పన్నుల విధానం ప్రవేశపెట్టింది. కొత్త పన్నుల విధానం ఎంచుకున్న వారు పొదుపు, వ్యయాలపై ఎటువంటి మినహాయింపులు వర్తించవు. మొత్తం ఆదాయం ఎంత అయితే అంత పన్ను చెల్లించాల్సిందే. కొత్త పన్నుల విధానం సులభతరంగా ఉండటంతో పన్ను చెల్లింపుదారులు ఈ విధానంవైపే మొగ్గు చూపుతున్నారని, 2023–24లో ఆర్థిక సంవత్సరంలో మూడింట రెండొంతుల మంది కొత్త పన్నుల విధానంలో రిటర్నులు దాఖలు చేసినట్లు సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు. ఈ ఏడాది ఇప్పటి వరకు 8.61 కోట్ల మంది రిటర్నులు దాఖలు చేసినట్లు పేర్కొన్నారు. వీటిని దృష్టిలో పెట్టుకొని కొత్త పన్నుల విధానం ఎంచుకున్న వారికే ఈ మార్పులు వర్తిస్తాయని ఆమె స్పష్టం చేశారు. రానున్న కాలంలో అందరూ కొత్త పన్నుల విధానం ఎంచుకోవాలన్న ఉద్దేశ్యంతో పాత పన్నుల విధానంకు పన్ను మినహాయింపులను తగ్గిస్తూ కొత్త విధానానికి ప్రయోజనాలను పెంచుతున్నారని ట్యాక్స్ నిపుణులు పేర్కొంటున్నారు. కొత్తగా మార్పులు చేసిన తర్వాత పది లక్షల లోపు పన్ను ఆదాయం ఉన్న వారికి కొత్త పన్నుల విధానం ఎంచుకుంటేనే ప్రయోజనంగా ఉంటుందంటున్నారు. స్థిరాస్తి విలువ రూ.50 లక్షలు దాటితే టీడీఎస్..ఇక నుంచి రూ.50 లక్షలు దాటిన స్థిరాస్థి విలువను విక్రయిస్తే ఒక శాతం టీడీఎస్ చెల్లించాల్సి ఉంటుందని ఆర్థిక మంత్రి స్పష్టం చేశారు. ఆదాయపన్ను చట్టం సెక్షన్ 194ఐఏ సెక్షన్ ప్రకారం స్థిరాస్థి విలువ రూ.50 లక్షలు దాటితే ఒక శాతం టీడీఎస్ వసూలు చేయాలి. స్థిరాస్థి విలువను ఒకరికంటే ఎక్కువ మందికి అమ్మినా మొత్తం విలువను పరిగణనలోకి తీసుకొని టీడీఎస్‌ను వసూలు చేస్తారని ఆమె స్పష్టం చేశారు. కానీ ఈ టీడీఎస్ నుంచి వ్యవసాయ భూములకు మినహాయింపు ఇచ్చారు. స్టాండర్డ్ డిడక్షన్ రూ.75 వేలకు పెంపు కొత్త పన్ను విధానంలో ఉద్యోగులకు ఊరటనిస్తూ స్టాండర్డ్ డిడక్షన్ పరిమితిని 50% పెంచుతూ సీతారామన్ ప్రకటించారు. రూ.50 వేలుగా ఉన్న స్టాండర్డ్ డిడక్షన్‌ను రూ.75వేలకు పెంచారు. ఫ్యా మిలీ పెన్షన్‌దారుల స్టాండర్డ్ డిడక్షన్‌ను రూ. 15వేల నుంచి రూ.25 వేలకు పెంచారు. కొత్త పన్నుల విధానంలో 10% పన్నులోపు శ్లాబుల్లో స్వల్ప మార్పుల ను ప్రతిపాదించింది. కొత్త పన్నుల విధానంలో 3 లక్షల ఆదాయం వరకు పన్ను చెల్లించాల్సిన అవస రం లేదు. గతంలో 5% పన్ను శ్లాబు పరిధి రూ.3– 6 లక్షలుగా ఉంటే ఇప్పుడు దాన్ని రూ.3–7 లక్షలకు, గతంలో రూ.6–9 లక్షలుగా 10% పన్ను పరిధిని రూ.7–10 లక్షలకు పెంచా రు. ఈ మార్పుల వల్ల ప్రతీ పన్ను చెల్లింపుదారునికి రూ.17,500 ప్రయోజనం లభిస్తుంది. -
Ashneer Grover : ఎన్నాళ్లు ఇలా ప్రభుత్వాలకు ఊడిగం చేయాలి? :
విదేశాల్లో అంతర్జాతీయ క్రెడిట్ కార్డుల ద్వారా చేసే చెల్లింపులపై కేంద్రం టీసీఎస్ (ట్యాక్స్ కలెక్టెడ్ ఎట్ సోర్స్) ను వసూలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే, ఈ కొత్త పన్ను విధానాన్ని, అందులోని లోపాల్ని భారత్ పే మాజీ సహ వ్యవస్థాపకులు అశ్నీర్ గ్రోవర్ విమర్శిస్తూ వస్తున్నారు. తాజాగా, మరో సారి ట్యాక్స్ పేయర్లు ప్రభుత్వాలకు ఊడిగం చేస్తున్నారంటూ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. పైగా పన్నులు చెల్లించడం ఓ శిక్షే’నని అన్నారు. ఈ మేరకు పన్ను చెల్లింపులపై పలు మార్లు గతంలో ఆయన చేసిన వ్యాఖ్యలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి. ఎన్నాళ్లు ఇలా ఊడిగం చేయాలి కేంద్రం పన్నుల చెల్లింపు దారుల నుంచి 30 నుంచి 40 శాతం వరకు ట్యాక్స్ వసూలు చేస్తుందని, ప్రతిగా ఎలాంటి ప్రతిఫలం పొందలేకపోతున్నారని అశ్నీర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘ట్యాక్స్ పేయర్లు తమ సంపాదనలో కొంత బాగాన్ని దేశానికి ఇస్తున్నారు. కానీ వాళ్లు ఎలాంటి లబ్ధి పొందడం లేదు. రూ.10 మనం (ట్యాక్స్ పేయర్లను ఉద్దేశిస్తూ) సంపాదిస్తే అందులో రూ.4 ప్రభుత్వానికే ఇస్తున్నాం. దీంతో 12 నెలల సమయంలో 5 నెలలు ప్రభుత్వానికే పనిచేస్తున్నారు. అయినా ఇలా ట్యాక్స్ పేయర్లు వారీ జీవితంలో ప్రభుత్వాలకు ఎన్నాళ్లు ఇలా ఊడిగం చేయాలని ప్రశ్నించారు. కానీ పరిస్థితుల్ని బట్టి నడుచుకోవాల్సిందే తప్పదు’’ అని వ్యాఖ్యానించారు. ఉద్యోగులు ట్యాక్స్ ఎగవేతకు పాల్పడలేరు అంతేకాదు, వ్యాపారస్థులకు ట్యాక్స్ కట్టకుండా ఎలా తప్పించుకోవాలో తెలుసు. కానీ ఉద్యోగుల పరిస్థితి అలా కాదు. వేరే ప్రత్యామ్నాయం లేదు. శాలరీ నుంచే ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది. పైగా 18 శాతం జీఎస్టీ చెల్లిస్తున్నారు. అందుకే ట్యాక్స్ అనేది శిక్షతో సమానమేనన్న అభిప్రాయం వ్యక్తం చేశారు అశ్నీర్ గ్రోవర్. నేనే రాజకీయ నాయకుడిని అయితే దేశంలో ఆదాయపు పన్ను రేటును తగ్గించేందుకు ప్రాధాన్యత ఇస్తానని చెప్పారు. ప్రతి ఒక్కరూ 10 నుంచి 15 శాతం ట్యాక్స్ కట్టేలా నిర్ధేశిస్తా. తద్వారా ఇప్పుడు ఎక్కువ పన్నులు కట్టాల్సిన అవసరం ఉంది కాబట్టి ఎగ్గొట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. అదే పన్ను తక్కువగా ఎగవేతకు ప్రయత్నించరు. ప్రభుత్వ ఆదాయం పెరుగుతుందని అన్నారు. పార్టీలకు ఇచ్చే డొనేషన్లపై జీరో ట్యాక్సా గత నెలలో విదేశాల్లో క్రెడిట్ కార్డ్ వినియోగంపై 20 శాతం టీసీఎస్ వసూలు చేయడాన్నీ గ్రోవర్ తప్పుబట్టారు. విదేశాల్లో క్రెడిట్‌కార్డు వాడకంపై 20 శాతం పన్ను పార్టీలకు ఇచ్చే డొనేషన్లకు మాత్రం జీరో ట్యాక్స్ అంటూ ఎద్దేవా చేశారు. చదవండి👉 ‘విలాసాల రుచి మరిగి’..అశ్నీర్ గ్రోవర్, అతని భార్య మాధురి జైన్ గ్రోవర్‌కు మరో ఎదురు దెబ్బ! -
కొత్త పన్ను విధానం.. ఎవరికి?
ఏటా బడ్జెట్లో భాగంగా ప్రకటించే ఆదాయపన్ను శ్లాబు రేట్లు, మినహాయింపుల్లో మార్పుల గురించి తెలుసుకోవాలని వేతన జీవులు ఆసక్తిగా వేచి చూస్తుంటారు. ఆదాయపన్ను చట్టంలోని 1961 కింద ప్రభుత్వం ఆఫర్ చేస్తున్న పన్ను మినహాయింపులు, తగ్గింపుల ఆధారంగానే వేతన జీవుల పన్ను ప్రణాళిక ఆధారపడి ఉంటుంది. 2023–24 ఆర్థిక సంవత్సరం (అసెస్మెంట్ సంవత్సరం 2024–25) నుంచి నూతన పన్ను విధానాన్ని డిఫాల్ట్‌గా ఉంటుందని ఆర్థిక మంత్రి ప్రకటించారు. కనుక పన్ను చెల్లింపుదారులు కొత్త పన్ను విధానం గురించి తప్పకుండా అవగాహన కలిగి ఉండాలి. పన్నుల్లో మార్పులు నూతన పన్ను విధానంలో బేసిక్ పన్ను మినహాయింపు పరిమితి రూ.2.5 లక్షల నుంచి రూ.3 లక్షలకు పెరిగింది. అలాగే, వార్షిక పన్ను ఆదాయం రూ.7 లక్షల వరకు ఉంటే పన్ను చెల్లించాల్సిన అవసరం లేకుండా రాయితీ కల్పించారు. రూ.50,000 స్టాండర్డ్ డిడక్షన్ ప్రయోజనాన్ని నూతన పన్ను విధానానికి కూడా విస్తరించారు. అంటే రూ.7.5 లక్షల వరకు ఆదాయంపై పన్ను చెల్లించక్కర్లేదు. అలాగే, 37 శాతంగా ఉన్న గరిష్ట సర్‌చార్జీని 25 శాతానికి తగ్గించారు. రూ.5 కోట్లకు పైగా పన్ను ఆదాయం ఉన్న వారిపై దీని ప్రభావం ఉంటుంది. దీని వల్ల నికరంగా చెల్లించాల్సిన పన్ను రేటు 42.74 శాతం నుంచి 39 శాతానికి దిగొచ్చింది. మినహాయింపులు/తగ్గింపులు పాత పన్ను విధానంలో కొన్ని సాధనాలను వినియోగించుకోవడం ద్వారా పన్ను భారం తగ్గించుకోవచ్చు. ఈ ప్రయోజనాలు నూతన పన్ను విధానంలో లేవు. సెక్షన్ 80టీటీఏ/80టీటీబీ, లీవ్ ట్రావెల్ కన్సెషన్, హౌస్ రెంట్ అలవెన్స్, పిల్లల స్కూల్ ట్యూషన్ ఫీజులు, సెక్షన్ 10 (14) కింద ప్రత్యేక అలవెన్స్‌లు, అలాగే సెక్షన్ 80సీ, 80డీ, 80ఈలు పాత పన్ను విధానంలో అందుబాటులో ఉన్నాయి. అలాగే, సొంతంగా నివసిస్తున్న ఇంటి రుణంపై వడ్డీ చెల్లింపులపైనా (సెక్షన్ 24) మినహాయింపు ప్రయోజనం ఉంది. అదనపు ప్రయోజనాలు నూతన పన్ను విధానంలో కొన్ని మినహాయింపులు కల్పించారు. ఇవి పాత పన్ను విధానంలో లేవు. ప్రత్యేక సామర్థ్యాలు కలిగిన (వైకల్య బాధితులు) వారికి ఇచ్చే రవాణా అలవెన్స్, కన్వేయన్స్ అలవెన్స్, బదిలీ సమయంలో అయ్యే వ్యయాలు, ఎన్పీఎస్కు సంస్థలు చేసే జమలు (సెక్షన్ 80సీసీడీ(2)), రూ.50వేల స్టాండర్డ్ డిడక్షన్, అడిషనల్ ఎంప్లాయీ కాస్ట్ (సెక్షన్ 80జేజేఏ) ప్రయోజనాలు కొత్త పన్ను విధానంలో ఉన్నాయి. కుటుంబ పెన్షన్ ఆదాయం కోసం చేసే వ్యయాలకు సెక్షన్ 57 (ఐఐఏ) కింద బడ్జెట్లో పన్ను ప్రయోజనం కల్పించారు. అగ్నివీర్ కార్పస్ ఫండ్‌కు సెక్షన్ 80సీసీహెచ్ (2) కింద ఇచ్చే విరాళాలకూ పన్ను మినహాయింపు ప్రకటించారు. మదింపు తర్వాతే.. పన్ను చెల్లింపుదారు తప్పకుండా తమకు వచ్చే ఆదాయం, పెట్టుబడులు, గృహ రుణం, పన్ను తగ్గింపుల గురించి ఆర్థిక సంవత్సరం ఆరంభంలోనే అంచనా వేయాలి. ఈ మదింపు ఆధారంగా అనుకూలమైన పన్ను విధానాన్ని ఎంపిక చేసుకోవచ్చు. తక్కువ ఆదాయం ఇచ్చే జీవిత బీమా పథకాలు, పెన్షన్ పథకాల్లో ఇన్వెస్ట్ చేయడం ఇష్టం లేని వారికి కొత్త పన్ను విధానం అనుకూలంగా ఉంటుంది. ఈక్విటీలు, ఇతర పెట్టుబడి సాధనాల ద్వారా మెరుగ్గా నిర్వహించుకునే వారికి కూడా నూతన విధానమే ప్రయోజనం. సెక్షన్ 80సీ, 80డీ, హెచ్ఆర్ఏ లేదా గృహ రుణం కింద ప్రయోజనాలు కోరుకునే వారు పాత విధానంలోనే కొనసాగొచ్చు. ఇలాంటి సాధనాల్లో ఇన్వెస్ట్ చేయకుండా, పన్ను భారం తగ్గాలని కోరుకునే వారికి నూతన పన్ను విధానం అనుకూలం. - అమర్ దియో సింగ్ అడ్వైజరీ హెడ్ ఏంజెల్ వన్ -
నూతన పన్ను విధానం.. త్వరలో ఆర్థిక శాఖ సమీక్ష!
న్యూఢిల్లీ: వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులకు సంబంధించి మినహాయింపు రహిత పన్ను వ్యవస్థను త్వరలో సమీక్షించాలని ఆర్థికశాఖ ప్రతిపాదిస్తోంది. వ్యక్తిగత ఆదాయపు పన్ను చెల్లింపుదారుకు ఈ వ్యవస్థను మరింత ఆకర్షణీయంగా మలచడం దీని లక్ష్యమని ఉన్నత స్థాయి వర్గాలు వెల్లడించాయి. ఎటువంటి మినహాయింపులు లేని పన్ను వ్యవస్థ ఆవిష్కరణ దిశగా నడవాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆ వర్గాలు వెల్లడించాయి. తద్వారా మినహాయింపులు, తగ్గింపులతో కూడిన సంక్లిష్టమైన పాత పన్ను విధానం రద్దు చేయాలని కేంద్రం భావిస్తున్నట్లు విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఇందుకు సంబంధించిన సమాచారంలో కొన్ని ముఖ్యాంశాలు పరిశీలిస్తే.. ► గత 2020–21 వార్షిక బడ్జెట్ ఒక కొత్త పన్ను వ్యవస్థను ప్రవేశపెట్టింది. దీని ప్రకారం వివిధ మినహాయింపులతో కూడిన పాత పన్ను వ్యవస్థ లేదా మినహాయింపులు, తగ్గింపులు లేని తక్కువ పన్ను రేట్లను అందించే కొత్త పన్ను విధానాన్ని ఎంపిక చేసుకునే అవకాశం పన్ను చెల్లింపుదారులకు లభించింది. ► వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులకు ఉపశమనం కలిగించడం, ఆదాయపు పన్ను చట్టాన్ని సరళీకృతం చేయడం ఈ చర్య ఉద్దేశం. ►కొత్త పన్ను వ్యవస్థకు సంబంధించి ఎదురయిన అనుభవాలను బట్టి చూస్తే.. తమ గృహ, విద్యా రుణ బాధ్యతలను పూర్తి చేసుకున్న వ్యక్తులు... ‘క్లెయిమ్ చేయడానికి ఎటువంటి మినహాయింపులు లేనందున’ కొత్త పన్ను విధానంలోకి మారడానికి సిద్ధంగా ఉన్నట్లు స్పష్టమైన సంకేతాలు వచ్చాయి. ► కొత్త వ్యవస్థలో పన్నులను తగ్గించడం వల్ల... ఈ విధానం ఆకర్షణీయంగా మారుతుందని పలు వర్గాలు భావిస్తున్నాయి. కొత్త పన్ను వ్యవస్థ రేట్లు ఇలా... వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులకు సంబంధించి 2020 ఫిబ్రవరి 1న ప్రకటించిన కొత్త పన్ను విధానం ప్రకారం రూ. 2.5 లక్షల వరకు వార్షిక ఆదాయం ఉన్న వ్యక్తులు ఎలాంటి పన్ను చెల్లించనక్కర్లేదు. రూ. 2.5 లక్షల నుంచి 5 లక్షల మధ్య ఆదాయానికి పన్ను రేటు 5 శాతంగా ఉంది. రూ. 5 లక్షల నుంచి రూ. 7.5 లక్షల ఆదాయం ఉన్నవారు 10 శాతం తగ్గిన పన్ను రేటును చెల్లించాలి. రూ.7.5 లక్షల నుంచి రూ.10 లక్షల ఆదాయం ఉన్న వారు 15 శాతం, రూ.10 లక్షల నుంచి రూ.12.5 లక్షల మధ్య ఆదాయం ఉన్న వారు 20 శాతం, రూ.12.5 లక్షలు– రూ.15 లక్షల మధ్య ఆదాయం ఉన్న వారు 25 శాతం, రూ.15 లక్షలపైబడినవారు 30 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. కార్పొరేట్ విషయంలో... రేట్లను గణనీయంగా తగ్గించడం, మినహాయింపులను తొలగించడం ద్వారా కార్పొరేట్ పన్ను చెల్లింపుదారుల కోసం ఇదే విధమైన పన్ను విధానాన్ని సెప్టెంబర్ 2019లో ప్రవేశ పెట్టడం జరిగింది. ప్రస్తుతం ఉన్న కంపెనీలకు బేస్ కార్పొరేట్ పన్నును 30 శాతం నుంచి 22 శాతానికి తగ్గిస్తున్నట్లు అప్పట్లో ప్రభుత్వం ప్రకటించింది. 2019 అక్టోబర్ 1 తర్వాత ఏర్పాటై, 31 మార్చి 2024లోపు కార్యకలాపాలను ప్రారంభించిన తయారీ కంపెనీలకు పన్ను రేట్లను 25 శాతం నుండి 15 శాతానికి కేంద్రం తగ్గించింది. చదవండి👉 Form 16a: పన్ను చెల్లింపులు కనిపించడం లేదా? అప్పుడేం చేయాలి? -
పన్ను చెల్లింపును బాధ్యతగా భావించండి
న్యూఢిల్లీ: పన్ను వ్యవస్థలో మార్పులు చేసేందుకు గత ప్రభుత్వాలు జంకాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. తాము అధికారంలోకి వచ్చిన తరువాత పన్ను వ్యవస్థలో సానుకూల మార్పులు తీసుకువచ్చామని, పన్ను చెల్లింపుదారుడు కేంద్రంగా ఆ వ్యవస్థను మార్చామని వివరించారు. ఆంగ్ల వార్తాచానెల్ ‘టైమ్స్ నౌ’ నిర్వహించిన ఒక సదస్సులో బుధవారం ప్రధాని ప్రసంగించారు. దేశాభివృద్ధికి పన్ను ఆదాయం అవసరమని, అందువల్ల పన్ను పరిధిలో ఉన్నవారంతా తమ పన్నులను చెల్లించాలని కోరారు. పన్ను చెల్లింపును ఒక బాధ్యతగా, గౌరవంగా భావించాలని విజ్ఞప్తి చేశారు. పన్ను ఎగ్గొట్టేందుకు కొందరు చేసే ప్రయత్నాల వల్ల నిజాయితీగా పన్ను చెల్లించేవారు ఇబ్బందులు పడుతున్నారని ప్రధాని వ్యాఖ్యానించారు. ‘పన్ను చెల్లింపుదారుల హక్కులను స్పష్టంగా పేర్కొన్న అత్యంత పారదర్శక పన్ను చట్టం అమల్లో ఉన్న దేశాల్లో భారత్ ఒకటి. భారత్‌లో పన్ను చెల్లింపుదారులను వేధింపులకు గురి చేసే కాలం త్వరలోనే అంతరించిపోతుందని మీకు హామీ ఇస్తున్నా’ అన్నారు. పన్నులు చెల్లించకుండా ఉండేందుకు దారులు వెతికే కొందరివల్ల నిజాయితీగా తమ పన్నులను చెల్లిస్తున్నవారిపై అదనపు భారం పడుతోందని ప్రధాని ఆవేదన వ్యక్తం చేశారు. ‘కోటి రూపాయల వార్షికాదాయం చూపిన వారి సంఖ్య దేశవ్యాప్తంగా కేవలం 2200 మాత్రమే అన్నది నమ్మశక్యం కాని నిజం’ అన్నారు. -
కొత్త విధానంలో పన్ను తగ్గుదల ఉత్తుత్తిదేనా..?
సాక్షి, అమరావతి: కొత్త పన్నుల విధానంలో పన్ను రేట్లు తగ్గించడం వల్ల పన్ను భారం భారీగా తగ్గు తుందని, దీనివల్ల కేంద్ర ప్రభుత్వం రూ.40,000 కోట్ల ఆదాయం కోల్పోతుందన్న మాటల్లో వాస్తవం లేదని ట్యాక్సేషన్ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. కీలకమైన పన్ను మినహాయింపులను ఎత్తివేయడం వల్ల ప్రజల్లో పొదుపు అలవాటుపై తీవ్ర ప్రభావం చూపుతుందంటున్నారు. పన్ను భారం తగ్గించు కోవడానికి చాలామంది బీమా, పీపీఎఫ్, గృహ రుణాలు వంటివి తీసుకుంటున్నారని, ఇప్పుడు వీటిని తొలగించడం వల్ల ఈ పథకాలకు ఆసక్తి తగ్గిపోయే ప్రమాదం ఉందని ట్యాక్స్ నిపుణులు ఎంఎన్ శాస్త్రి స్పష్టం చేస్తున్నారు. వృద్ధిరేటును పెంచడం కోసం పొదుపు శక్తిని తగ్గించడం ద్వారా కొనుగోలు శక్తిని పెంచాలని ఆర్థికమంత్రి ఆలోచన కింద ఉన్నట్లు కనిపిస్తోందని, కానీ ఇది దీర్ఘకాలంలో మన ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపే అవకాశముందన్నారు. ఏ విధంగా చూసినా కొత్త విధానం కంటే పాత విధానమే భారం తక్కువగా ఉంటుందని ట్యాక్స్ నిపుణురాలు కె.వి.ఎల్.ఎన్ లావణ్య స్పష్టం చేస్తున్నారు.పన్ను రేటు సగానికి సగం తగ్గినా మినహాయింపులు ఎత్తివేయడం వల్ల పాత విధానం కంటే కొత్త విధానంలో పన్ను చెల్లించాల్సి వస్తోందన్నారు. ప్రస్తుత విధానంలో రూ.7.5 లక్షల ఆదాయం ఉన్న వారి వరకు మినహాయింపులను వినియోగించుకోవడం ద్వారా ఎటువంటి పన్ను చెల్లించనవసరం లేదని, అదే కొత్త విధానంలో అయితే ఏకంగా రూ.37,500 పన్ను చెల్లించాల్సి వస్తోందన్నారు. -
ఆ పన్నులు తగ్గిస్తాం : నిర్మలా సీతారామన్
సాక్షి, న్యూఢిల్లీ : దేశ ఆర్థిక వ్యవస్థ మందగమనంపై ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఆందోళన వ్యక్తం చేశారు. త్వరలో పన్ను వ్యవస్థలో సంస్కరణలు తెస్తామని స్పష్టం చేశారు. ఆర్థిక రంగానికి ఊతమిచ్చే చర్యలు చేపడుతామని చెప్పారు. ద్రవ్యోల్బణం తక్కువగా ఉన్నా.. అదుపులోనే ఉందని తెలిపారు. త్వరలో పారిశ్రామిక ఉత్పత్తి పెరుగుతుందని భావిస్తున్నామని వెల్లడించారు. ఢిల్లీలో నిర్మలా శనివారం మీడియాతో మాట్లాడుతూ.. (చదవండి : ఆర్థికమంత్రి వ్యాఖ్యలు : నెటిజనుల దుమారం) ఇల్లు కొనేవారికి రాయితీలు.. ‘వస్తువుల ఎగుమతులపై పన్నులు తగ్గించే యోచన చేస్తున్నాం. ఇల్లు కొనేవారికి మరిన్ని రాయితీలు అందజేస్తాం. విదేశీ పెట్టుబడులు పెరుగుతాయన్న సంకేతాలున్నాయి. అదనంగా కట్టిన జీఎస్టీ, ఆదాయపు పన్నును ఆన్లైన్లో వెనక్కి ఇచ్తేస్తాం. ఎగుమతులకిచ్చే బ్యాంకు రుణాలకు ఇన్సూరెన్స్‌తో గ్యారంటీ కల్పిస్తాం. వివిధ రుణాలకిచ్చే వడ్డీ రేటు దాదాపు 4 శాతం తగ్గించాం. ఈ నెల 19న బ్యాంకర్లతో ప్రత్యేక సమావేశం ఉంటుంది. చిన్న మొత్తాల్లో పన్ను చెల్లింపుదారులకు కఠిన చర్యలు ఉండవు. ఐటీ రిటర్న్స్‌లో జరిగే చిన్నచిన్న పొరపాట్లకు గతంలో మాదిరి పెద్ద చర్యలు ఉండవు. ఈజ్ ఆఫ్ డూయింగ్‌లో భారత్ స్థానం మెరుగైంది. ఎగుమతిదారులకు ఊరటనిచ్చేలా ఎంఈఐఎస్ అనే కొత్త పథకం ప్రవేశపెడుతున్నాం. ఎంఈఐఎస్ వల్ల టెక్స్టైల్స్ రంగంతో పాటు ఇతర రంగాలకు ప్రయోజనం ఉంటుంది’అన్నారు. (చదవండి : ఆర్థిక వ్యవస్థ అద్భుతం..మరి ఉద్యోగాలు ఎక్కడ..?) -
జీఎస్టీ స్లాబులు తగ్గించే అవకాశం
సాక్షి, కోలకతా: కేంద్ర ఆర్థిక మంత్రి పీయూష్ గోయల్ నేతృత్వంలో నేడు (శనివారం) వస్తు సేవల పన్ను (జీఎస్టీ) 29వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో కౌన్సిల్ కీలక నిర్నయాలు తీసుకుంది. ముఖ్యంగా రూపే కార్డు, భీమ్ ద్వారా డిజిటల్ లావాదేవీలకు పైలట్ ప్రాతిపదికన ప్రోత్సాహకాలను అమలు చేయనున్నట్లు ఆర్థిక మంత్రి పియూష్ గోయల్ ప్రకటించారు. మరోవైపు జీఎస్టీ స్లాబులను రానున్న కాలంలో మూడుకు తగ్గించాలని ప్రభుత్వం యోచిస్తోంది. దేశ పన్నుల విధానాన్ని మరింత సరళీకృతం చేసేందుకు మినహాయింపు కేటగిరీతో పాటు, జీఎస్టీ స్లాబులను తగ్గించే అవకాశం ఉందని ఆర్థిక శాఖ మంత్రి ప్రధాన ఆర్థిక సలహాదారు సజీవ్ సన్యాల్ శనివారం చెప్పారు. భారత్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ నిర్వహించిన సమావేశంలో సంజీవ్ ఈ వివరాలను వెల్లడించారు. ప్రస్తుతం ఉన్న 5, 12, 18 , 28 శాతం నాలుగు స్లాబులకు బదులుగా, మూడు స్లాబులుగా( 5, 15, 25 శాతం) రేటు ఉండవచ్చారు. కేంద్రం జీఎస్టీ ప్రవేశపెట్టిన తర్వాత పన్ను సేకరణ గణనీయంగా పెరిగిందనీ, చాలా మంది ప్రత్యక్ష పన్నులు చెల్లిస్తున్నారన్నారు. ప్రత్యక్ష పన్నుల ఆదాయంపన్ను ఆదాయం బాగా కొనసాగితే రేట్లను తగ్గింపు ఉంటుందని సన్యాల్ తెలిపారు. కాగా ఎంఎస్ఎంఈ రంగ సమస్యల పరిష్కారం కోసం ఆర్ధిక శాఖ సహాయ మంత్రి శివ్ ప్రతాప్ శుక్లా నేతృత్వంలోని మంత్రుల బృందాన్ని ఏర్పాటు చేసింది. దీంతోపాటు చట్టం, సంబంధిత సమస్యలను కేంద్రం , రాష్ట్ర పన్ను అధికారుల న్యాయ కమిటీ పరిశీలిస్తుంది. పన్నుల సంబంధిత సమస్యలను ఫిట్మెంట్ కమిటీ చూస్తుందని చెప్పారు.కౌన్సిల్ తదుపరి సమావేశం సెప్టెంబర్ 28-29 తేదీల్లో గోవాలో జరుగనుంది. -
పన్ను సంస్కరణల బిల్లుకు ట్రంప్ ఆమోదం
వాషింగ్టన్: అమెరికా పన్ను వ్యవస్థలో భారీ సంస్కరణలు తీసుకొచ్చేందుకు ఉద్దేశించిన బిల్లుపై ఆ దేశాధ్యక్షుడు ట్రంప్ శుక్రవారం సంతకం చేశారు. ఇది అమెరికా ప్రజలకు తన క్రిస్మస్ కానుక అని అన్నారు. గత 30 ఏళ్లలో ఇంత భారీ సంస్కరణలు తీసుకురావడం ఇదే తొలిసారి. ఇప్పటికే అమెరికా సెనెట్, ప్రతినిధుల సభ ఆమోదం పొందిన బిల్లుపై ట్రంప్ కూడా సంతకం చేయడంతో ఇది త్వరలోనే అమల్లోకి రానుంది. దీనివల్ల అమెరికన్ల వ్యక్తిగత ఆదాయంపై పన్ను తగ్గుతుంది. వాణిజ్య పన్ను కూడా 21 శాతానికి పరిమితమవుతుంది. కాగా, ఈ కొత్త బిల్లును డెమొక్రాట్లు విమర్శిస్తున్నారు. దీనివల్ల అమెరికాకు 1.5 ట్రిలియన్ డాలర్ల ఆదాయం తగ్గడంతోపాటు ఆ దేశంలో పనిచేసేందుకు వచ్చిన కుటుంబాలపై అధిక భారం పడుతుందనీ, 1.3 కోట్ల మందికి హెల్త్ ఇన్సూ్యరెన్స్ లభించకపోవడం వల్ల ఆరోగ్యరంగం స్థిరత్వం దెబ్బతింటుందని కాంగ్రెస్ సభ్యుడు రాజా కృష్ణమూర్తి అన్నారు. -
జీఎస్టీ అమలుకు నెట్వర్క్ సిద్ధం
న్యూఢిల్లీ: జీఎస్టీ‘జీఎస్టీ నెట్వర్క్పన్ను వ్యవస్థ కి సాంకేతిక పరిజ్ఞ ానాన్ని అందిస్తున్న ’ జూలై 1 నుంచి నూతన విజయవంతంగా అమలు చేసేందుకు అవసరమైన అన్ని రకాల సాఫ్ట్వేర్ పరీక్షలను ప్రయోగాత్మకంగా పూర్తి చేసినట్టు మంగళవారం ప్రకటించింది. తమ పోర్టల్‌లో ఇప్పటికే 66 లక్షల మంది పన్ను చెల్లింపుదారులు నమోదు చేసుకున్నట్టు జీఎస్టీఎన్ సంస్థ చైర్మన్ నవీన్ కుమార్ తెలిపారు. కొత్త పన్ను చెల్లింపుదారుల నమోదుకూ అవకాశం కల్పించినట్టు చెప్పారు. అవసరమైన అన్ని పరీక్షలు నిర్వహించిన అనంతరం ఈ నెల 25 నుంచి రిజిస్ట్రేషన్లకు సిద్ధం చేశామని, ఈ వ్యవస్థ సాఫీగా నడుస్తుందని హామీ ఇస్తున్నట్టు పేర్కొన్నారు. -
గ్రామీణ డిమాండ్‌పై వర్షాభావ ప్రభావం: జైట్లీ
దుబాయ్: దేశంలో గత రెండేళ్లుగా నెలకొన్న వర్షాభావ పరిస్థితుల ప్రభావం గ్రామీణ ప్రాంత డిమాండ్‌పై పడిందని ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ సోమవారం పేర్కొన్నారు. పెట్టుబడిదారులతో ఇక్కడ జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం దేశంలో వృద్ధి రేటు 7.3 శాతం పైనే నమోదవుతుందని అన్నారు. రానున్న ఆర్థిక సంవత్సరాల్లో ఈ రేటు మరింత మెరుగుపడుతుందని కూడా తెలిపారు. భారత్‌కు పెట్టుబడులను ఆకర్షించడం లక్ష్యంగా జైట్లీ యునెటైడ్ అరబ్ ఎమిరైట్స్‌లో రెండు రోజుల పర్యటన జరుపుతున్నారు. దేశంలో వ్యాపార అవకాశాలను ఈ పర్యటన సందర్భంగా ఆయన ఇన్వెస్టర్లకు వివరిస్తున్నారు. భారీ వృద్ధి రేటు సాధన లక్ష్యంగా కేంద్రం ఆర్థిక సంస్కరణల బాటలో ముందుకు వెళుతుందని తెలిపారు. పెట్టుబడిదారులకు సానుకూల రీతిలో పన్నుల వ్యవస్థను సరళీకరిస్తామని ఈ సందర్భంగా జైట్లీ పేర్కొన్నారు. -
పెట్టుబడులకు స్వర్గధామం..!
చీకట్లో ఉన్న అంతర్జాతీయ ఆర్థిక రంగానికి కాంతిరేఖ భారత్ ♦ పన్నుల వ్యవస్థను, వ్యాపార ప్రక్రియను మరింత సరళీకరిస్తాం ♦ మేధో హక్కులను పరిరక్షిస్తాం ♦ ఇండో జర్మన్ బిజినెస్ లీడర్ల సదస్సులో ప్రధాని మోదీ బెంగళూరు: ‘ప్రపంచ ఆర్థిక రంగంలో చీకట్లు అలుముకున్న సమయంలో.. పెట్టుబడులకు వెలుగురేఖగా భారత్ నిలుస్తోంద’ని ప్రధాని మోదీ అభివర్ణించారు. భారత్‌లో పెట్టుబడులకు, వ్యాపారాలకు ఇది సరైన సమయమని పిలుపునిచ్చారు. తాము అధికారంలోకి వచ్చిన 15 నెలల్లోనే అంతర్జాతీయంగా ప్రముఖ వ్యాపార సంస్థల దృష్టిలో భారత్ విశ్వసనీయతను తిరిగి నిలబెట్టగలిగామన్నారు. బెంగళూరులో మంగళవారం నాస్కామ్ ఆధ్వర్యంలో జరిగిన ఇండోజర్మన్ బిజినెస్ సమ్మిట్‌లో జర్మనీ చాన్స్‌లర్ ఎంజెలా మెర్కెల్‌తో కలసి మోదీ పాల్గొన్నారు. సదస్సులో భారత్, జర్మనీలకు చెందిన ఐటీ, వ్యాపార, వాణిజ్య ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సరళమైన పన్ను వ్యవస్థను ఏర్పాటు చేస్తామని, మేధో హక్కులను పరిరక్షిస్తామని పెట్టబడిదారులకు మోదీ హామీ ఇచ్చారు. వస్తు సేవల పన్ను(జీఎస్టీ) బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టామని, సంబంధిత చట్టం 2016 నుంచి అమల్లోకి వస్తుందన్న విశ్వాసం తనకుందన్నారు. పెట్టుబడులకు, వ్యాపారాలకు అత్యంత అనువైన దేశంగా భారత్‌ను మార్చేందుకు తన ప్రభుత్వం చేపట్టిన, చేపట్టనున్న చర్యలను మోదీ వివరించారు. త్వరలో దివాళా నిబంధనావళిని రూపొందిస్తామని, కంపెనీ లా ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. నిజమైన పెట్టుబడిదారులకు, నిజాయితీ పరులైన పన్ను చెల్లింపుదారులకు పన్నుల విషయాల్లో సులభతరమైన విధానాన్ని అవలంబిస్తామన్నారు. ఎన్డీయే అధికారంలోకి వచ్చిన తరువాత చాన్నాళ్లుగా ఇన్వెస్టర్లలో నెలకొన్న భయాందోళనలను తొలగించామని తెలిపారు. ఎఫ్‌పీఐలపై కనీస ప్రత్యామ్నాయ పన్ను(ఎమ్ఏటీ)ను విధించబోమన్నారు. భారత్, జర్మనీ సంబంధాలు సామర్ధ్యానికి తగ్గ స్థాయిలో లేవన్న మోదీ.. జర్మనీ బలంగా ఉన్న రంగాల్లో తాము భాగస్వామ్యాన్ని కోరుకుంటున్నామన్నారు.మెట్రో రైల్, జాతీయ రహదారులు, 100 స్మార్ట్ సిటీలు, 5 కోట్ల ఇళ్లు, రైల్వేల అధునీకరణ.. తదితర అనేక రంగాల్లో పెట్టుబడులకు, వ్యాపారాలకు భారత్‌లో అపార అవకాశాలున్నాయని, జర్మన్ కంపెనీలు వాటిని సద్వినియోగం చేసుకోవాలని మోదీ కోరారు. ‘ప్రపంచవ్యాప్తంగా హార్డ్‌వేర్‌ను నడిపిస్తోంది భారత సాఫ్ట్వేర్.. అంతర్జాతీయ సాంకేతికతను సుసంపన్నం చేస్తోంది భారత దేశ సామర్ధ్యం..దేశదేశాల్లో ఉత్పత్తి వ్యవస్థకు స్ఫూర్తినిస్తోంది భారత మార్కెట్’ అని వ్యాఖ్యానించారు. సదస్సులో మోదీ, మెర్కెల్‌ల సమక్షంలో ఐదు బీ టూ బీ ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. ఇండో- ఈయూ ఫ్రీ ట్రేడ్ చర్చలు పునఃప్రారంభం కావాలి సదస్సులో మెర్కెల్ మాట్లాడుతూ.. భారతీయ ఇన్వెస్టర్లను జర్మనీలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా ఆహ్వానించారు. భారత్, యూరోపియన్ యూనియన్ల మధ్య ఫ్రీ ట్రేడ్ ఒప్పందానికి సంబంధించిన చర్చలను పునః ప్రారంభించాలన్నారు. జర్మనీ, భారత్‌ల మధ్య వాణిజ్యం 16 బిలియన్ యూరోలకు చేరిందని, ఈ సంవత్సరం అది మరింత పెరగాలని ఆకాంక్షించారు. 1,600లకు పైగా జర్మన్ కంపెనీలు భారత్‌లో క్రియాశీలకంగా ఉన్నాయని, వాటిలో కొన్ని వందేళ్లకు పైగా భారత్‌లో సేవలందిస్తున్నాయన్నారు. ఐరాస భద్రతామండలిలో శాశ్వత సభ్యత్వం కోసం జీ 4 దేశాలుగా భారత్, జపాన్, జర్మనీ, బ్రెజిల్ పరస్పరం సహకరించుకుంటున్నాయన్నారు. టర్కీలో ఈ నవంబర్‌లో జరిగే జీ 20 దేశాల సదస్సు సందర్భంగా మరోసారి మోదీతో భేటీ అయ్యే అవకాశం తనకు లభిస్తుందన్నారు. అంతకుముందు, ఇరువురు నేతలు బెంగళూరులోని జర్మన్ ఆటోమోటివ్ సంస్థ బాష్ ప్రాంగణాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా భారత్‌లో 2015లో రూ. 650 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు బాష్ ప్రకటించింది. -
ఉందిలే.. మంచి కాలం!
మోదీ సర్కారు చెబుతున్న మంచి రోజులు(అచ్ఛే దిన్) వచ్చేస్తున్నాయా? ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆర్థిక సర్వే ఇదే విషయాన్ని స్పష్టం చేసింది. అంతర్జాతీయంగా నెలకొన్న సానుకూల పరిస్థితులు, సుస్థిర ప్రభుత్వం కొలువుదీరడంతో భవిష్యత్తులో రెండంకెల వృద్ధి దిశగా మనం దూసుకెళ్లనున్నామని పేర్కొంది. ఇక మరిన్ని భారీ సంస్కరణలను ప్రవేశపెట్టాల్సిన సమయం ఆసన్నమైందని పిలుపునిచ్చింది. సబ్సిడీల తగ్గింపు, డిజిన్వెస్ట్‌మెంట్ నిధులను భారీగా సమీకరించడం ద్వారా వచ్చే ఆదాయాన్ని ప్రభుత్వం ఇన్ఫ్రా ఇతరత్రా రంగాల్లో భారీగా వెచ్చించాలని కూడా సూచించింది. నియంత్రణలు, పన్నుల వ్యవస్థను సరళతరం చేయడం ద్వారా దేశంలో వ్యాపారానికి మెరుగైన వాతావరణ్నా కల్పించాలని పేర్కొంది. తద్వారా ప్రైవేటు రంగం కూడా ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడానికి తమవంతు పాత్ర పోషిస్తుందనేది సర్వే సారాంశం. మొత్తంమీద మోదీ ‘మేక్ ఇన్ ఇండియా’ కలలకు మార్గం సుగమం చేసే దిశగా ఆర్థిక సర్వే తగిన బాటలు వేసింది. సంస్కరణల మోత.. రెండంకెల వృద్ధి.. ⇒ 2014-15 ఆర్థిక సర్వేలో దిశానిర్దేశం... ⇒ వచ్చే ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు 8.5 శాతానికి చేరే చాన్స్ ⇒ భారీస్థాయి కీలక సంస్కరణలకు సరైన సమయం ఇదే... ⇒ ప్రభుత్వ పెట్టుబడి వ్యయాలను భారీగా పెంచాలి... ⇒ వ్యాపారాలకు సానుకూల వాతావరణం కల్పించాలి... ⇒ నియంత్రణలు, పన్నుల వ్యవస్థను మరింత సరళం చేయాలి... ⇒ అంతర్జాతీయంగా సానుకూల పరిణామాలు, ⇒ సుస్థిర ప్రభుత్వంలో భారత్‌కు అద్భుత అవకాశం ⇒ సబ్సిడీల తగ్గింపుతో ద్రవ్యలోటుకు కళ్లెమేయాలి... న్యూఢిల్లీ: కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న తొలి పూర్థి స్థాయి బడ్జెట్‌ను ప్రతిబింబించేలా 2014-15 ఏడాది ఆర్థిక సర్వే వెలువడింది. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ శుక్రవారం దీన్ని పార్లమెంటులో ప్రవేశపెట్టారు. వచ్చే ఆర్థిక సంవత్సరం(2015-16)లో మన స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ) వృద్ధి రేటు ఏకంగా 8.1-8.5 శాతానికి దూసుకెళ్తుందని సర్వే అంచనా వేసింది. అటు తర్వాత సంవత్సరాల్లో కూడా 8-10 శాతం స్థాయిలో రెండంకెల వృద్ధిని అందుకునేందుకు పుష్కలంగా అవకాశాలున్నాయని పేర్కొంది. జీడీపీ గణాంకాల లెక్కింపునకు బేస్ రేటును 2005-06 నుంచి 2011-12కు మార్చిన నేపథ్యంలో ప్రస్తుతం ఆర్థిక సంవత్సరం వృద్ధి రేటు 7.4 శాతానికి(గత అంచనా 6 శాతం) చేరుతుందని ప్రభుత్వం తాజాగా అంచనా వేయడం తెలిసిందే. ‘అంతర్జాతీయంగా ముడిచమురు ధరల తగ్గుదల ఇతరత్రా సానుకూల పరిణామాలతోపాటు సుస్థిరమైన ప్రభుత్వం కొలువుదీరడం భారత్‌కు చరిత్రాత్మకమైన అవకాశం కల్పిస్తోంది. అత్యంత కీలకమైన భారీ(బిగ్ బ్యాంగ్) సంస్కరణలను ప్రవేశపెట్టేందుకు ఇదే సరైన సమయం. తద్వారా భారత్ ఆర్థిక వ్యవస్థను రెండంకెల వృద్ధి దిశగా దూసుకుపోయేలా చేయొచ్చు’ అని సర్వే పేర్కొంది. కఠిన పన్నుల వ్యవస్థకు చెక్... దేశంలో పన్నుల వ్యవస్థ, యంత్రాంగాన్ని పారదర్శకంగా, మరింత సరళంగా తీర్చిదిద్దాలని.. తద్వారా పన్ను చెల్లింపుదారులకు అత్యంత స్నేహపూర్వక వాతావరణాన్ని సృష్టించాలని సర్వే సూచించింది. అవసరమైన పన్ను మినహాయింపులు, ప్రోత్సాహకాలను కూడా కల్పించాలని పేర్కొంది. దీనివల్ల కార్పొరేట్ రంగానికి పెట్టుబడి నిధులపై భారం తగ్గడంతోపాటు దేశంలో పొదుపును కూడా ప్రోత్సహించేందుకు దోహదం చేస్తుందని అభిప్రాయపడింది. వృద్ధి, పెట్టుబడులు పుంజుకోవాలంటే సంస్కరణల అమలుతో పాటు పన్నుల యంత్రాంగాన్ని మెరుగుపరచడం కూడా చాలా కీలకమైన అంశమని పేర్కొంది. వ్యాపారాలకు మెరుగైన పరిస్థితుల కల్పన.. కార్మిక, భూసేకరణ సంస్కరణలు, సబ్సిడీల హేతుబద్ధీకరణ, ప్రభుత్వ రంగ కంపెనీ(పీఎస్‌యూ)ల్లో వాటా విక్రయాల జోరు పెంచడం వంటివి కూడా ఆర్థికాభివృద్ధికి ప్రధానమైనవేనని సర్వే తేల్చిచెప్పింది. కాగా, ద్రవ్యోల్బణం ప్రస్తుత తగ్గుముఖ ధోరణి కొనసాగుతుందని.. ఆర్బీఐ వృద్ధి అంచనాలను మించి జీడీపీ ప్రగతి నమోదుకానుందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణియన్ విలేకరులకు చెప్పారు. ఆర్థిక సర్వే రూపకల్పనకు ఆయనే నేతృత్వం వహించారు. కాగా, ప్రణాళిక సంఘం స్థానంలో ఏర్పాటైన నీతి ఆయోగ్... రాష్ట్రాలు, కేంద్రం మధ్య మరింత సహృద్భావ వాతావరణ, సహకారానికి దోహదం చేయనుందని సర్వే వెల్లడించింది. 14వ ఫైనాన్స్ కమిషన్ గురించి ప్రత్యేక చాప్టర్లో పేర్కొంటూ.. కమిషన్ సిఫార్సులను అమలు చేయడం ద్వారా ప్రభుత్వం చాలా కీలక నిర్ణయం తీసుకుందని పేర్కొంది. ఈ సందర్భంగా దేశ తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ, ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీల వ్యాఖ్యలను ప్రస్తావించింది. సర్వే ఇంకా ఏం చెప్పిందంటే... ⇒ వస్తు-సేవల పన్ను(జీఎస్టీ) అమలుతో దేశ ఆర్థిక వ్యవస్థలో సమూల మార్పులు(గేమ్ చేంజింగ్) సుసాధ్యం కానున్నాయి. ⇒ సబ్సిడీలను నేరుగా లబ్ధిదారులకు అందించేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవడం చాలా ముఖ్యం. ప్రభుత్వం అనుసరించనున్న జన్‌ధన్-ఆధార్-మొబైల్(జామ్) వ్యవస్థ ద్వారా ప్రత్యక్షంగా నగదు బదిలీ సులభతరం కానుంది. ⇒ వచ్చే ఆర్థిక సంవత్సరం(2015-16)లో కరెంట్ అకౌంట్ లోటు(క్యాడ్) జీడీపీలో 1 శాతానికి పరిమితం కావచ్చు. ⇒ రిటైల్ ద్రవ్యోల్బణం కూడా 5-5.5 శాతం స్థాయిలో ఉండొచ్చని అంచనా. 2013 చివరినుంచి చూస్తే ద్రవ్యోల్బణం రేటులో 6 శాతంపైగా తగ్గుదల నమోదైంది. ⇒ వృద్ధి రేటుకు బూస్ట్ లభించాలంటే రిజర్వ్ బ్యాంక్ పాలసీ వడ్డీరేట్లను తగ్గించాల్సిన అవసరం ఉంది. ⇒ భారీగా దిగొచ్చిన ముడిచమురు ధరలు, సంస్కరణలు, రుతుపవనాలు ఆశాజనకంగా ఉండటం వంటివి కూడా వృద్ధికి చేదోడుగా నిలవనున్నాయి. ⇒ విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల(ఎఫ్‌పీఓ) నిధుల ప్రవాహం... డాలరుతో రూపాయి మారకం విలువ స్థిరపడేందుకు(ప్రస్తుతం 62 స్థాయిలో ఉంది) దోహదం చేసింది. ఏప్రిల్ 2014 నుంచి 38.4 డాలర్ల విదేశీ నిధులు దేశీ స్టాక్, డెట్ మార్కెట్లోకి ప్రవహించాయి. ⇒ దీనివల్ల దేశీ స్టాక్ మార్కెట్లు పరుగులు తీస్తున్నాయి. గతేడాది ఏప్రిల్ నుంచి సెన్సెక్స్ 31% పైగా దూసుకెళ్లింది. ద్రవ్యలోటు కట్టడి లక్ష్యం 3%... ఆర్థిక క్రమశిక్షణ దిశగా ప్రభుత్వం మరిన్ని చర్యలు తీసుకోవాల్సిన అవసరాన్ని సర్వే నొక్కిచెప్పింది. రానున్న సంవత్సరాల్లో ద్రవ్యలోటును (ప్రభుత్వ ఆదాయ, వ్యయాల్లో వ్యత్యాసం) జీడీపీలో 3 శాతానికి పరిమితం చేయాలని నిర్ధేశించింది. ‘స్థిరమైన వృద్ధి పెరుగుదలకు ప్రభుత్వ పెట్టుబడులు చాలా కీలకం. దీనికోసం వ్యయాల నియంత్రణ, సబ్సిడీల తగ్గింపు-హేతుబద్ద్ధీకరణ ద్వారా ఆదాయ వనరులను పెంచుకోవాలి. డిజిన్వెస్ట్‌మెంట్ ద్వారా మరిన్ని నిధులను సమీకరించేలా చూడాలి. వీటన్నింటినీ ప్రభుత్వ పెట్టుబడులకు మళ్లించాలి. అయితే, ఆర్థిక వ్యవస్థ దీర్ఘకాలిక వృద్ధికి ప్రైవేటు రంగ పెట్టుబడులే ప్రధాన చోదకంగా పనిచేస్తాయి. దీనికి చేదోడుగా ప్రభుత్వ పెట్టుబడులను పెంచడంపై దృష్టిపెట్టాలి. ముఖ్యంగా రైల్వేల అభివృద్ధి వల్ల కనెక్టివిటీ పెరగడంతోపాటు రైల్వేలు ఆర్థిక వ్యవస్థ పునరుత్తేజంలో కీలక ప్రాత పోషిస్తాయి. భవిష్యత్తులో ప్రభుత్వ రంగ పెట్టుబడుల కోసం మాత్రమే రుణ సమీకరణ అనే సిద్ధాంతాన్ని భారత్ అనుసరించాలి. సంస్కరణలతోనే సర్వే లక్ష్యాలు సాధ్యం న్యూఢిల్లీ: ఆర్థిక సర్వే లక్ష్యాల సాధనకు ఆర్థిక సంస్కరణల కొనసాగింపు అవసరమని భారత్ పారిశ్రామిక ప్రతినిధులు పేర్కొన్నారు. ద్రవ్య పటిష్టత, దిగువస్థాయిలో ద్రవ్యోల్బణం ధోరణి కొనసాగుతుందని సర్వే పేర్కొంటున్నందున... సరళీకరణ పరపతి విధానాల వైపు పయనం, తక్కువ వడ్డీరేట్ల వ్యవస్థ రూపకల్పనకు మార్గం సుగమం అవుతుందని, దీనివల్ల పటిష్ట వృద్ధికి బాటలు పడతాయని ఫిక్కీ ప్రెసిడెంట్ జోత్స్నా సూరీ పేర్కొన్నారు. పెట్టుబడుల వృద్ధిపై ప్రభుత్వం దృష్టి సారించాల్సిన సమయమిదని సీఐఐ డెరైక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ అన్నారు. స్టార్టప్‌ల జోరు... దేశంలో స్టార్టప్ కంపెనీలు జోరు మీద ఉన్నాయి. ఈ విషయంలో ప్రపంచంలోనే నాల్గవ అతిపెద్ద దేశంగా భారత్ ఆవిర్భవించింది. ప్రస్తుతం 3,100 పైగానే దేశంలో స్టార్టప్ కంపెనీలు ఉన్నాయి . టెక్నాలజీ, సాఫ్ట్వేర్ ఉత్పత్తుల వృద్ధి దీనికి ప్రధాన కారణం. ఐటీ సంబంధిత అనుబంధ పరిశ్రమలు దేశంలో అత్యధికంగా ఉపాధి అవకాశాలను కల్పిస్తున్నాయి. కన్సల్టెన్సీ మార్కెట్ల విషయంలో కూడా దేశం వేగంగా వృద్ధి సాధిస్తోంది. ముఖ్యంగా ఇంజనీరింగ్ కన్సల్టెన్సీ మంచి వృద్ధి సాధిస్తోంది. పసిడి దిగుమతి ఆంక్షల తొలగింపు పసిడి దిగుమతులపై ఆంక్షలను తొలగించాల్సిన సమయమిది. ఇందుకు తగిన పరిస్థితులన్నీ ఇప్పుడు ఆర్థిక వ్యవస్థలో నెలకొన్నాయి. కరెంట్ అకౌంట్ లోటు కట్టడి, దేశంలోని విదేశీ పెట్టుబడుల రాక, గణనీయ స్థాయిలో పెరిగిన విదేశీ మారకద్రవ్య నిల్వలు, దాదాపు స్థిర మారకపు విలువల పరిస్థితి... ఇలా పలు ఆర్థిక అంశాలు నియంత్రణల తొలగింపునకు పూర్తి సానుకూలంగా ఉన్నాయి. ఆంక్షల వల్ల అక్రమ రవాణా పెరుగుతున్న విషయం ఇక్కడ ప్రస్తావనాంశం. ఈ కామర్స్‌లో అద్భుత అవకాశాలు భారత్ ఈ-కామర్స్ రంగం రానున్న ఐదేళ్ల కాలంలో 50 శాతం వృద్ధిని నమోదుచేసుకుంటుంది. ఇంటర్నెట్ వినియోగం వేగంగా విస్తరిస్తుండడం దీనికి ప్రధాన కారణం. అయితే ఇక్కడ వినియోగదారుల ప్రయోజనాల పరిరక్షణపై కొంత ఆందోళన నెలకొంది. వినియోగదారుల పరిరక్షణా చట్టంలో కొన్ని సవరణలను ప్రతిపాదిస్తున్నాం. పీడబ్ల్యూసీ అంచనాల ప్రకారం 2014లో ఈ కామర్స్ రంగం విలువ 16.4 బిలియన్ డాలర్లు. 2015లో ఇది 22 బిలియన్ డాలర్లకు చేరుకునే అవకాశం ఉంది. వ్యవసాయానికి మరింత సహాయం వ్యవసాయ రంగం అభివృద్ధికి మరింత సహాయం అందించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఈ రంగంలో పరిశోధనలకు సంబంధించి పెట్టుబడులు పెరగాలి. గిడ్డంగులు వంటి బ్యాక్ఎండ్ మౌలిక సదుపాయాల కల్పనపైనా వ్యయాలు పెరగాలి. నీటి సరఫరా సదుపాయాలు మెరుగుపడాలి. సబ్సిడీలు లక్ష్యాలను చేరేలా లోటుపాట్లను సవరించాలి. రైతుల ఆదాయాలు పెరిగేలా వ్యవస్థలో మార్పులు జరగాలి. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కార్యకలాపాలను పునర్వ్యవస్థీకరించాలి. -
పటిష్ట, స్థిర పన్నుల వ్యవస్థ ఏర్పాటు
అమెరికా ఆర్థిక మంత్రికి ప్రధాని మోదీ హామీ న్యూఢిల్లీ: భారత్ పటిష్టవంతమైన, సుస్థిర పన్నుల వ్యవస్థను ఏర్పాటు చేస్తుందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ గురువారం పేర్కొన్నారు. అమెరికా ఆర్థికమంత్రి జాకబ్ లీతో సమావేశం సందర్భంగా ఆయన ఈ విషయం తెలిపారు. భారత్, అమెరికాల మధ్య ఆర్థిక సహకారమే వాటి వ్యూహాత్మక సంబంధాలకు మూల స్తంభమని వ్యాఖ్యానించారు. భారత్‌లో పెట్టుబడులకు అమెరికా కంపెనీలు చూపుతున్న ఆసక్తిపట్ల నరేంద్రమోదీ హర్షం వ్యక్తం చేసినట్లు ఈ మేరకు వెలువడిన ఒక ప్రకటన తెలిపింది. ప్రధాని ప్రారంభించిన జన ధన యోజనను అమెరికా ఆర్థికమంత్రి ఈ సందర్భంగా ప్రశంసించారు. భాగస్వామ్య సమావేశం...: గురువారం జరిగిన భారత్-అమెరికా 5వ ఎకనమిక్ అండ్ ఫైనాన్షియల్ పార్ట్నర్షిప్ సదస్సులో జాకబ్ లీ, భారత్ ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ పాల్గొన్నారు. వీరితోపాటు ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్, అమెరికా ఫెడరల్ రిజర్వ్ వైస్ చైర్మన్ స్టాన్లీ ఫీచర్ కూడా పాల్గొన్నారు. రెండు దేశాల మధ్య ఇప్పటికే 100 బిలియన్ డాలర్లకు పెరిగిన వాణిజ్యం మరింత వృద్ధి బాటన పయనిస్తుందన్న ఆశాభావాన్ని జాకబ్ లీ సందర్భంగా వ్యక్తం చేశారు. ఇందుకు భారత్‌లో చేపట్టిన సంస్కరణలు దోహదపడతాయని అన్నారు. వృద్ధి పెంపునకు చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో తయారీ తదితర రంగాల్లో భారీగా విదేశీ పెట్టుబడులను కోరుకుంటున్నట్లు జెట్లీ పేర్కొన్నారు.