వాషింగ్టన్: అమెరికా పన్ను వ్యవస్థలో భారీ సంస్కరణలు తీసుకొచ్చేందుకు ఉద్దేశించిన బిల్లుపై ఆ దేశాధ్యక్షుడు ట్రంప్ శుక్రవారం సంతకం చేశారు. ఇది అమెరికా ప్రజలకు తన క్రిస్మస్ కానుక అని అన్నారు. గత 30 ఏళ్లలో ఇంత భారీ సంస్కరణలు తీసుకురావడం ఇదే తొలిసారి. ఇప్పటికే అమెరికా సెనెట్, ప్రతినిధుల సభ ఆమోదం పొందిన బిల్లుపై ట్రంప్ కూడా సంతకం చేయడంతో ఇది త్వరలోనే అమల్లోకి రానుంది. దీనివల్ల అమెరికన్ల వ్యక్తిగత ఆదాయంపై పన్ను తగ్గుతుంది. వాణిజ్య పన్ను కూడా 21 శాతానికి పరిమితమవుతుంది. కాగా, ఈ కొత్త బిల్లును డెమొక్రాట్లు విమర్శిస్తున్నారు. దీనివల్ల అమెరికాకు 1.5 ట్రిలియన్ డాలర్ల ఆదాయం తగ్గడంతోపాటు ఆ దేశంలో పనిచేసేందుకు వచ్చిన కుటుంబాలపై అధిక భారం పడుతుందనీ, 1.3 కోట్ల మందికి హెల్త్ ఇన్సూ్యరెన్స్ లభించకపోవడం వల్ల ఆరోగ్యరంగం స్థిరత్వం దెబ్బతింటుందని కాంగ్రెస్ సభ్యుడు రాజా కృష్ణమూర్తి అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment