Versions
-
ఐఫోన్ 13 రిలీజ్‌కి రెడీ.. ఎన్ని వెర్షన్లలో తెలుసా ?
Apple iPhone 13 : యాపిల్ గాడ్జెట్ లవర్స్ ఎంతో ఆసక్తి ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చింది. ఐఫోన్ 13 విడుదలకు తేదీ ఖరారయ్యింది. సెప్టెంబరు 14న కాలిఫోర్నియా వేదికగా ఈ ఫోన్‌ను విడుదల చేయనుంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న యాపిల్ అభిమానులు వీక్షించేలా ఈ వేడుకని ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. చక్కర్లు కొడుతున్న రూమర్స్ ఐఫోన్ 13కి సంబంధించి ఇప్పటికే అనేక రూమర్స్ చక్కర్లు కొడుతున్నాయి. సిమ్ కార్డ్ అవసరం లేకుండా లియో టెక్నాలజీ ఆధారంగా ఈ ఫోన్ పని చేస్తుంది. ఎమర్జెన్సీ మెసేజ్ ఆప్షన్ అందుబాటులో ఉంటుందని ఇలా రకరకాల వార్తలు బయటకు వస్తున్నాయి. అయితే వీటిలో ఏ ఒక్కదాన్ని యాపిల్ సంస్థ అధికారికంగా ధ్రువీకరించలేదు. నాలుగు వెర్షన్లలో ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో ప్రతీ మోడల్‌కి సంబంధించి లైట్, ప్రో, మినీ, మ్యాక్స్, ప్లస్ లాంటి వెర్షన్లు మార్కెట్లోకి వస్తున్నాయి. మొదట ఒక వెర్షన్ విడుదలైన తర్వాత దానికి పైనా కింద అన్నట్టుగా మిగిలిన వెర్షన్లు విడుదల అవుతున్నాయి. ప్రాథమికంగా ఫోన్ ఒకే రకంగా ఉన్నా ఫీచర్లలో కొన్ని తేడాల వల్ల ధరల్లో హెచ్చు తగ్గులు ఉంటాయి. అయితే ఈ మార్కెట్ స్ట్రాటజీకి భిన్నంగా వెళ్లాలని యాపిల్ నిర్ణయించినట్టు సమాచారం. అందువల్లే ఒకేసారి ఐఫోన్ 13కి సంబంధించి నాలుగు వెర్షన్లు విడుదల చేయనున్నట్టు సమాచారం. ఆ నాలుగు ఇవే యాపిల్ సంస్థ నుంచి వస్తోన్న ఐఫోన్ 13కి సంబంధించి ఐఫోన్ 13, ఐఫోన్ 13 మినీ, ఐఫోన్ 13 ప్రో, ఐఫోన్ 13 ప్రోమ్యాక్స్ వెర్షన్లుగా మార్కెట్లోకి రాబోతున్నట్టు మొబైల్ పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ఒకే మోడల్‌కి సంబంధించి వరుసగా వెర్షన్స్ వస్తుండటంతో కొనుగోలుదారుల సైతం వేచి చూసే ధోరణి అవలంభిస్తున్నారు. కాబట్టి ఒకేసారి అన్ని వెర్షన్లు రిలీజ్ చేయడం వల్ల ఎవరికి నచ్చింది వారు సెలక్ట్ చేసుకుంటారనే వ్యూహంతో యాపిల్ ఉంది. ధర ఎంతంటే ? మార్కెట్ వర్గాల అంచనా ప్రకారం అమెరికాలో కనిష్ట ధర 799 డాలర్లుగా ఉంది. అయితే భారత మార్కెట్‌కి వచ్చే సరికి స్థానిక ట్యాక్సుల ఆధారంగా ధర కొంచెం హెచ్చుగా ఉండే అవకాశం ఉంది. వెర్షన్ అమెరికా (ఇండియా) ఐఫోన్ 13 799 డాలర్లు (రూ. 58,600) ఐఫోన్ 13 మినీ 699 డాలర్లు (రూ. 51,314) ఐఫోన్ 13 ప్రో 999 డాలర్లు (రూ.73,300) ఐఫోన్ 13ప్రోమ్యాక్స్ 1,099 డాలర్లు (రూ 80,679) చదవండి: Apple: పడిపోయిన యాపిల్ మార్కెట్! భారమంతా ఐఫోన్ 13 పైనే? -
కరోనాకు మరో శక్తివంతమైన ఫావిపిరావిర్ డ్రగ్
సాక్షి,హైదరాబాద్: ఔషధ తయారీ సంస్థ ఎఫ్డీసీ లిమిటెడ్ భారతదేశంలో కోవిడ్-19 తేలికపాటి లక్షణాలకు వినియోగించే మందులను లాంచ్ చేసింది. తాజాగా 800 ఎంజీ ఫావిపిరావిర్ ట్యాబ్లెట్లను అందుబాటులోకి తెచ్చింది. కరోనా చికిత్సలో వాడే ఫావిపిరావిర్‌ను పిఫ్లు ఫావెంజా బ్రాండ్లలో కంపెనీ విక్రయిస్తోంది.ఇకపై వీటి 800 ఎంజీ వెర్షన్ మందులు మరింత శక్తివంతంగా పనిచేస్తాయని కంపెని చెబుతోంది. 800 ఎంజీ ట్యాబ్లెట్లతో రోగులకు చికిత్స వ్యయం 30 శాతం తగ్గుతుందని ఎఫ్డీసీ ప్రతినిధి మయంక్ టిక్కా తెలిపారు. అలాగే రోగి తీసుకోవలసిన మాత్రల సంఖ్యను 75శాతం తగ్గించడానికి సహాయపడుతుందన్నారు. మందుల షాపులతోపాటు ఆసుపత్రులకు అనుబంధంగా ఉన్న ఫార్మాసీల్లోనూ నవంబరు 1 నుంచి ఇవి లభిస్తాయి. -
కొత్త శిఖరాలకు సెన్సెక్స్, నిఫ్టీలు
గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక వృద్ధిరేటు ఐదేళ్ల కనిష్టానికి పడిపోయింది. నిరుద్యోగం 45 ఏళ్ల గరిష్ట స్థాయికి చేరింది. మే నెల వాహన విక్రయాలు నిరాశపరిచాయి. కంపెనీల క్యూ4 ఫలితాలు అంతంతమాత్రంగానే ఉన్నాయి. అంతర్జాతీయ సంకేతాలు బలహీనంగా ఉన్నాయి. ఇన్ని ప్రతికూలతల మధ్య మన స్టాక్ మార్కెట్ కూడా పడిపోవాలి. కానీ దీనికి భిన్నంగా సోమవారం స్టాక్ మార్కెట్ భారీగా లాభపడింది. అన్ని రంగాల షేర్లలో కొనుగోళ్ల సునామీ వెల్లువెత్తింది. కీలక రేట్లను ఆర్బీఐ తగ్గించగలదన్న అంచనాలకు సంస్కరణలు కొనసాగుతాయనే ఆశలు కూడా జత కావడంతో సెన్సెక్స్, నిఫ్టీలు ఇంట్రాడేలోనూ, ముగింపులోనూ కొత్త రికార్డ్లను నెలకొల్పాయి. సెన్సెక్స్ 40 వేల పాయింట్లు, నిఫ్టీ 12 వేల పాయింట్లపైకి ఎగబాకాయి. ప్రపంచ మార్కెట్లు నష్టపోయినా, ముడి చమురు ధరలు భారీగా పతనం కావడం, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు కొనసాగుతుండటం, రూపాయి బలపడటం సానుకూల ప్రభావం చూపించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 553 పాయింట్ల లాభంతో 40,268 పాయింట్ల వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 166 పాయింట్లు పెరిగి 12,089 పాయింట్ల వద్ద ముగిశాయి. సెన్సెక్స్ 40 వేల పాయింట్ల ఎగువున ముగియడం ఇదే మొదటిసారి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 40,309 పాయింట్ల వద్ద, నిఫ్టీ 12,103 పాయింట్ల వద్ద జీవిత కాల గరిష్ట స్థాయిలను తాకాయి. మార్కెట్ పరుగు సంబరాల్లో బీఎస్ఈ ఎండీ, సీఈఓ ఆశిష్‌కుమార్ చౌహాన్ తదితరులు రూ.1.76 లక్షల కోట్లు పెరిగిన ఇన్వెస్టర్ల సంపద స్టాక్ మార్కెట్ భారీగా లాభపడటంతో ఇన్వెస్టర్ల సంపద రూ.1.76 లక్షల కోట్లు పెరిగింది. ఇన్వెస్టర్ల సంపదగా పరిగణించే బీఎస్ఈలో లిస్టైన కంపెనీల మొత్తం మార్కెట్ విలువ రూ.1,76,402 కోట్ల నుంచి రూ.1,56,14,417 కోట్లకు ఎగసింది. లాభాలు ఎందుకంటే..! 1. రేట్ల కోత అంచనాలు గత ఆర్థిక సంవత్సరం చివరి క్వార్టర్లో జీడీపీ ఐదేళ్ల కనిష్టానికి, 5.8 శాతానికి చేరిందని కేంద్ర గణాంకాల సంస్థ(సీఎస్ఓ) శుక్రవారం వెల్లడించింది. మార్చి క్వార్టర్లో జీడీపీ తగ్గడంతో ఈ వారంలో జరిగే మోనేటరీ పాలసీ కమిటీ(ఎంపీసీ)సమావేశంలో ఆర్బీఐ కీలక రేట్లను తగ్గిస్తుందనే అంచనాలు బలం పుంజుకున్నాయి. దీంతో అన్ని రంగాల షేర్లలో కొనుగోళ్లు జోరుగా సాగాయని నిపుణులంటున్నారు. 2. ప్యాకేజీ, సంస్కరణలపై ఆశలు.... గత క్యూ4 జీడీపీ ఐదేళ్ల కనిష్టానికి పడిపోవడంతో వినియోగం జోరును పెంచే సంస్కరణలు కేంద్ర ప్రభుత్వం తెస్తుందనే ఆశలు పెరిగాయి. శుక్రవారం జరిగిన తొలి కేబినెట్ భేటీలో రైతులు, చిన్న వ్యాపారులకు కేంద్రం సానుకూల నిర్ణయాలు తీసుకోవడం కలిసి వచ్చింది. 3. భారీగా చమురు ధరల పతనం ఈ ఏడాది ఏప్రిల్ 30 నుంచి చూస్తే, ముడి చమురు ధరలు 15 శాతం మేర పతనమయ్యాయి. గత శుక్రవారం నాడే 2 శాతం క్షీణించగా, సోమవారం 1 శాతం పతనమయ్యాయి. 4. విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు గత నెల మొదటి మూడు వారాల వరకూ నికర అమ్మకందారులుగా ఉన్న విదేశీ ఇన్వెస్టర్లు ఎన్నికల ఫలితాల కారణంగా నికర కొనుగోలుదారులుగా మారారు. మొత్తం మే నెలలో రూ.9,031 కోట్లు నికర పెట్టుబడులు పెట్టిన విదేశీ ఇన్వెస్టర్లు ఒక్క సోమవారం రోజే రూ.3,069 కోట్ల మేర మ న స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టడం విశేషం. 5. పుంజుకున్న రూపాయి డాలర్‌తో రూపాయి మారకం విలువ 44 పైసలు పుంజుకుని 69.26కు చేరింది. 6. జూన్ రోల్ ఓవర్ల జోరు జూన్ సిరీస్ నిఫ్టీ ఫ్యూచర్స్ రోల్ ఓవర్స్ 72 శాతంగా ఉన్నాయి. ఈ రోల్ ఓవర్స్ మూడు నెలల సగటు 69 శాతమే. మూడు నెలల సగటు కన్నా అధికంగా ఉండటం మార్కెట్ షార్ట్‌టర్మ్ ట్రెండింగ్ పీరియడ్‌లోకి ప్రవేశించడాన్ని సూచిస్తోందని టెక్నికల్ ఎనలిస్ట్‌లు అంటున్నారు. 7. హెవీ వెయిట్స్ ర్యాలీ సూచీలో హెవీ వెయిట్స్‌ను చూస్తే, సెన్సెక్స్ మొత్తం 553 పాయంట్ల లాభంలో ఒక్క రిలయన్స్ ఇండస్ట్రీస్ వాటాయే 91 పాయింట్లుగా ఉంది. హెచ్డీఎఫ్సీ వాటా 76 పాయింట్లుగా, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ వాటా 63 పాయింట్లుగా, టీసీఎస్ వాటా 45 పాయింట్లు, హెచ్‌యూఎల్ వాటా 36 పాయింట్లుగా ఉంది. మొత్తం మీద ఈ ఐదు షేర్ల వాటాయే 311 పాయింట్లుగా ఉంది. మరిన్ని విశేషాలు... ► 31 సెన్సెక్స్ షేర్లలో మూడు షేర్లు –ఐసీఐసీఐ బ్యాంక్, ఎన్టీపీసీ, ఐటీసీలు నష్టపోయాయి. మిగిలిన 28 షేర్లు లాభపడ్డాయి. ► బీఎస్ఈలో 19 రంగాల సూచీలు లాభాల్లో ముగిశాయి. ► నిఫ్టీ 50లో 44 షేర్లు లాభపడగా, ఆరు షేర్లు నష్టపోయాయి. ► మే నెలలో వాహన విక్రయాలు 13 శాతం పెరగడంతో హీరో మోటొకార్ప్ షేర్ 6 శాతం లాభంతో రూ.2,843 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో బాగా లాభపడిన షేర్ ఇదే. ► గత వారం ముడి చమురు ధరలు బాగా పతనం కావడంతో పెయింట్, ప్రభుత్వ రంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు, టైర్, విమానయాన సంస్థల షేర్లు లాభపడ్డాయి. ► విమానయాన ఇంధనం ధరలు తగ్గడంతో విమానయాన రంగ షేర్లు జోరుగా పెరిగాయి. ఇంట్రాడేలో ఆల్‌టైమ్‌హై, రూ.157ను తాకిన స్పైస్‌జెట్ చివరకు 4 శాతం లాభంతో రూ.152 వద్ద ముగిసింది. ► నికర లాభం దాదాపు రెట్టింపు కావడంతో అపోలో హాస్పిటల్స్ ఎంటర్ప్రైజెస్ షేర్ 10 శాతం పెరిగి రూ.1,360 వద్ద ముగిసింది. ► గత క్యూ4 ఆర్థిక ఫలితాలు అంచనాలను మించడంతోఅదానీ గ్యాస్‌సహా గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీల షేర్లు ఇంట్రాడేలో ఆల్‌టైమ్ హైలను తాకాయి. ► స్టాక్ మార్కెట్ దుమ్మురేపుతున్నా, హెరిటేజ్ ఫుడ్స్ షేర్ సోమవారం 5 శాతం పతనమై, 30 నెలల కనిష్ట స్థాయి, రూ.388ని తాకింది. చివరకు 5.3 శాతం నష్టంతో రూ.391 వద్ద ముగిసింది. కంపెనీ ప్రమోటరైన చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్‌లో ఘోర పరాజయం పాలవడంతో గత ఏడు రోజుల్లో ఈ షేర్ 20 శాతం మేర పతనమైంది. ► ముడి చమురు ధరలు తగ్గడం, రేట్ల కోత అంచనాలు బలం పుంజుకోవడంతో ప్రభుత్వ బాండ్ల రాబడులు పడిపోయాయి. పదేళ్ల బాండ్ల రాబడులు 6.998 శాతానికి చేరాయి. 2017, నవంబర్ తర్వాత బాండ్ల రాబడులు 7 శాతం దిగువకు పడిపోవడం ఇదే మొదటిసారి. ► సెన్సెక్స్, నిఫ్టీలతో పాటే ఇంట్రాడేలో పలు షేర్లు ఆల్‌టైమ్ హైలను తాకాయి. బజాజ్ ఫిన్సర్వ్, టైటాన్, హెచ్డీఎఫ్సీ, అదానీ గ్యాస్, గుజరాత్ గ్యాస్, ఇంద్రప్రస్థ గ్యాస్ తదితర షేర్లు ఈ జాబితాలో ఉన్నాయి -
సంకీర్ణంలోనే సంస్కరణలు
తమను గెలిపిస్తే సుస్థిరమైన పాలనను అందిస్తామని, అనేక పార్టీలతో కూడిన విపక్ష కూటమి అధికారంలోకి వస్తే ప్రభుత్వం మూణ్నాళ్ల ముచ్చటే అవుతుందని ప్రధాని మోదీ పదే పదే చెబుతున్నారు. అయితే, మన దేశానికి శక్తిమంతమైన నేతల కంటే పార్లమెంటులో మెజారిటీ లేని నేతల వల్లే మంచి జరుగుతోందని చరిత్ర చెబుతోంది.2014 ఎన్నికల ముందు వరకు మూడు దశాబ్దాల పాటు కేంద్రంలో ఏకపార్టీ ప్రభుత్వం లేదు. ఓటర్లు ఏ ఒక్క పార్టీకీ పూర్తి మెజారిటీ కట్టబెట్టలేదు.అప్పుడంతా దేశ రాజకీయాల్లో సంకీర్ణ శకం నడిచింది. అనేక పార్టీలతో కూడిన సంకీర్ణ ప్రభుత్వాల మంత్రివర్గంలో విభేదాలు తలెత్తడం, వేడివేడి చర్చలు, సంప్రదింపులు,బుజ్జగింపుల తర్వాత ఏకాభిప్రాయ సాధనతో ప్రధాన మంత్రులు విధాన నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. అయితే, ఈ సంకీర్ణ(బలహీన) ప్రభుత్వాల హయాంలోనే దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అయింది. ఆర్థిక సంస్కరణలకు తెరలేచింది. దేశం వివిధ రంగాల్లో పురోభివృద్ధి సాధించింది. వృద్ధి రేటు పెరిగింది. కోట్ల మంది పేదలు దారిద్య్రరేఖ నుంచి బయట పడటం కూడా ఈ సంకీర్ణ ప్రభుత్వ శకంలోనే జరిగింది. అయితే, సంకీర్ణ ప్రభుత్వాల ఆలోచన సరికాదని ఇప్పటికీ పలువురు భావిస్తున్నారు. భారత ఆర్థిక వ్యవస్థలో అసలైన వ్యవస్థాగత మార్పులు చూడాలంటే ఈ ఎన్నికల్లో ఓటర్లు ఒకే పార్టీకి భారీ మెజారిటీ కట్టబెట్టాలని వారు గట్టిగా చెబుతున్నారు. మోదీ చెబుతున్నది కూడా ఇదే. అయితే, గత చరిత్రను పరిశీలిస్తే వాస్తవాలు మరోలా ఉన్నాయి. గత ఎన్నికల్లో ఓటర్లు మోదీకి పూర్తి మెజారిటీ కట్టబెట్టారు. మోదీ నాయకత్వంలోని బలమైన ప్రభుత్వం చెప్పుకోతగ్గ సంస్కరణలేమీ తీసుకురాలేదు. మోదీ తీసుకున్న ఏకైక ‘బలమైన’ విధాన నిర్ణయం.. పెద్ద నోట్ల రద్దు. సంకీర్ణ ప్రభుత్వం ఊహించడానికి కూడా వెనకాడే ఈ నిర్ణయం ఫలితంగా 2016, నవంబర్ నుంచి దేశ కరెన్సీలో 86 శాతం చెత్తబుట్టపాలయింది. నిజానికి మోదీ తీసుకున్న ఈ చర్యనే విపక్షాలు ప్రధాన ఎన్నికల ప్రచారాంశం చేస్తున్నాయి. గత సంకీర్ణ ప్రభుత్వాల చరిత్రను పరిశీలిస్తే 1990వ దశకం చివర్లో కేవలం రెండేళ్లు మాత్రమే దేశాన్ని పాలించిన యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వమే సంస్కరణలను ముందుకు తీసుకెళ్లింది. అతి తక్కువ సమయం అధికారంలో ఉన్న యునైటెడ్ ఫ్రంట్ చేసిన ఈ పనిని పూర్తి మెజారిటీ పొందిన బీజేపీ, కాంగ్రెస్ ప్రభుత్వాలు కూడా చేయలేకపోయాయి. ప్రస్తుతం దేశంలో అమల్లో ఉన్న ఆదాయం పన్ను విధానాన్ని ప్రవేశపెట్టింది యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వమే. 1991 నాటి సంస్కరణలు కూడా పార్లమెంటులో మెజారిటీ లేని ప్రభుత్వం తీసుకువచ్చినవే. ఆ సంస్కరణలను ముందుకు తీసుకెళ్లింది కూడా ‘బలహీన ప్రధాని’అయిన మన్మోహన్ సింగ్. ఈ బలహీన ప్రధానే పదేళ్ల పాటు ఆ పదవిలో కొనసాగారు. కొన్ని సంవత్సరాల తర్వాత కేంద్రంలో మెజారీటీ ఉన్న పార్టీ అధికారంలోకి వచ్చింది. ఆ ప్రభుత్వ హయాంలో సంస్కరణలు వేగం పుంజుకోలేదు. నిజం చెప్పాలంటే ఆ కాలంలో సంస్కరణలు దాదాపు పూర్తిగా అటకెక్కాయనే చెప్పాలి. ఆ తర్వాత వచ్చిన సంకీర్ణ ప్రభుత్వమే మళ్లీ వాటిని బయటకు తీసింది. పూర్తి మెజారిటీ సాధించిన ఒకే పార్టీ ఆధ్వర్యంలోని ప్రభుత్వాల కంటే సంకీర్ణ ప్రభుత్వాలు బాగా పని చేస్తుంటే మన దేశంలోని మేథావులు వాటి గురించి ఎందుకు ఇంతగా భయపడుతున్నారు. ఇది ఒక రకంగా న్యూనతా భావమని చెప్పాలి. అమెరికా, బ్రిటన్ వంటి పరిణతి చెందిన ప్రజాస్వామ్య దేశాల్లో సుస్థిరమైన ద్వంద్వ పార్టీ విధానం ఉంది. సంకీర్ణ ప్రభుత్వాలు సంక్లిష్టమైన సంస్కరణలు తీసుకురాలేవని, ప్రతికూల ఫలితాలనిచ్చే ఆర్థిక నిర్ణయాలు తీసుకుంటాయన్న భయాలే సంకీర్ణాల పట్ల విముఖతకు కారణమవుతున్నాయి. సంకీర్ణాలు సమ్మిళితాలు. భారత దేశ విలక్షణత అయిన భిన్నత్వంలో ఏకత్వానికి ఇవి ప్రతీకలు.భవిష్యత్తులో ఇబ్బందులు కలిగించే నిర్ణయాలేవీ ఇవి తీసుకోవు. తాజా ఎన్నికల్లో ఓటర్లు ఏ నిర్ణయం తీసుకున్నారన్నది మే 23 వరకు తెలియదు. ఈ ఎన్నికల్లో మోదీ మళ్లీ అధికారంలోకి వచ్చినా, పార్లమెంటులో ఆయన పార్టీకి పూర్తి మెజారిటీ వచ్చే అవకాశాలు లేవని చాలా మంది పరిశీలకులు అంగీకరిస్తున్నారు. ఒకవేళ ఇదే నిజమయితే మనం మళ్లీ సంకీర్ణ శకంలోకి వెళతాం.కాగా, అన్నింటికీ రాజీ పడుతూ బలహీనంగా ఉండే సంకీర్ణ ప్రభు త్వం వద్దని అనేక మంది చెబుతున్నారు. అయితే, ఆ సంకీర్ణ ప్రభుత్వాలే దేశంలో నిజమైన మార్పుకు కారణమని గత పాతికేళ్ల చరిత్ర నిరూపిస్తోంది. -
హెచ్1బీల శ్రమ దోచేస్తున్నారు
అమెరికాలో హెచ్1బీ వీసాపై ఉద్యోగం చేస్తున్నవారు దోపిడీకి గురవుతున్నారని, వేధింపుల్ని ఎదుర్కొంటున్నారని ‘సౌత్ ఆసియా సెంటర్ ఫర్ ది అట్లాంటిక్ కౌన్సిల్’ అనే సంస్థ జరిపిన అధ్యయనంలో తేలింది. వారికి శ్రమకు తగిన వేతనం లభించడం లేదని, పని ప్రదేశాల్లో పరిస్థితులు దారుణంగా ఉన్నాయని అమెరికాకు చెందిన ఆ సంస్థ వెల్లడించింది. ఉద్యోగులు ఇలాంటి పరిస్థితుల్లో పనిచేయడం వల్ల దేశానికే ఎక్కువ నష్టమని హెచ్చరించింది. హెచ్1బీ వీసా ద్వారా అమెరికాలో శాశ్వత నివాసానికి వీలు కల్పించేలా వీసా విధానంలో సంస్కరణలు చేస్తామని, నైపుణ్యం కలిగిన విదేశీ ఉద్యోగుల్ని ప్రోత్సహిస్తామంటూ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన నేపథ్యంలో ఆ సంస్థ ఈ అధ్యయనం చేసింది. హెచ్1బీ ఉద్యోగుల హక్కుల్ని కాపాడాలని, వారు పనిచేసే వాతావరణాన్ని మెరుగుపరచాలని ఆ సంస్థ తన నివేదికలో సూచించింది. వేతనాలు ఎక్కువగా ఇచ్చి ప్రతిభ కలిగిన విదేశీ ఉద్యోగుల్ని పనిలోకి తీసుకుంటే అమెరికా ఆర్థిక వ్యవస్థకు మరింత బలం చేకూరుతుందని అభిప్రాయపడింది. ‘హెచ్1బీ ఉద్యోగులు తక్కువ వేతనాలకే పనిచేయాల్సి వస్తోంది. వారి శ్రమను దోపిడీ చేస్తున్నారు. వేధింపులకు గురిచేస్తున్నారు. పని చేసే ప్రదేశాల్లోనూ దారుణమైన పరిస్థితులున్నాయి’ అని వివరించింది. ఈ పరిస్థితులను మెరుగుపర్చేందుకు పలుసూచనలు చేసింది. మొదట చేయాల్సింది హెచ్1బీ ఉద్యోగుల వేతనాల పెంపు అని స్పష్టం చేసింది. అపుడే ట్రంప్ కోరుకుంటున్నట్లు నిపుణులైన ఉద్యోగులు వస్తారని తెలిపింది. నైపుణ్యం కలిగిన అమెరికన్లనూ ఉద్యోగాల్లోకి తీసుకోవాలని, అర్హతల్ని బట్టి వారిని అత్యున్నత పదవుల్లో నియమించాలని పేర్కొంది. ఇక ఉద్యోగుల భర్తీ విషయంలో పారదర్శకంగా వ్యవహరించాలని సూచించింది. హెచ్1బీ వీసాల జారీలో మొదట దరఖాస్తు చేసుకున్న వారికి మొదటి ప్రాధాన్యం ఇవ్వడం, లాటరీ ద్వారా వారిని ఎంపిక చేయడం వంటి విధానాలకు స్వస్తి పలికి, నైపుణ్యం ఆధారంగానే వీసాలివ్వాలని సూచనలు చేసింది. -
పన్ను సంస్కరణల బిల్లుకు ట్రంప్ ఆమోదం
వాషింగ్టన్: అమెరికా పన్ను వ్యవస్థలో భారీ సంస్కరణలు తీసుకొచ్చేందుకు ఉద్దేశించిన బిల్లుపై ఆ దేశాధ్యక్షుడు ట్రంప్ శుక్రవారం సంతకం చేశారు. ఇది అమెరికా ప్రజలకు తన క్రిస్మస్ కానుక అని అన్నారు. గత 30 ఏళ్లలో ఇంత భారీ సంస్కరణలు తీసుకురావడం ఇదే తొలిసారి. ఇప్పటికే అమెరికా సెనెట్, ప్రతినిధుల సభ ఆమోదం పొందిన బిల్లుపై ట్రంప్ కూడా సంతకం చేయడంతో ఇది త్వరలోనే అమల్లోకి రానుంది. దీనివల్ల అమెరికన్ల వ్యక్తిగత ఆదాయంపై పన్ను తగ్గుతుంది. వాణిజ్య పన్ను కూడా 21 శాతానికి పరిమితమవుతుంది. కాగా, ఈ కొత్త బిల్లును డెమొక్రాట్లు విమర్శిస్తున్నారు. దీనివల్ల అమెరికాకు 1.5 ట్రిలియన్ డాలర్ల ఆదాయం తగ్గడంతోపాటు ఆ దేశంలో పనిచేసేందుకు వచ్చిన కుటుంబాలపై అధిక భారం పడుతుందనీ, 1.3 కోట్ల మందికి హెల్త్ ఇన్సూ్యరెన్స్ లభించకపోవడం వల్ల ఆరోగ్యరంగం స్థిరత్వం దెబ్బతింటుందని కాంగ్రెస్ సభ్యుడు రాజా కృష్ణమూర్తి అన్నారు. -
యుద్ధ సన్నద్ధతతో ఉండండి
బీజింగ్: ఎల్లప్పుడూ యుద్ధ సన్నద్ధతతో ఉండాలని చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ ఆ దేశ సైన్యానికి పిలుపునిచ్చారు. కమ్యూనిస్టు పార్టీకి విధేయంగా ఉంటూ, యుద్ధాలు గెలవడంపై దృష్టిపెట్టాలన్నారు. ఇటీవల ముగిసిన కమ్యూనిస్ట్ పార్టీ కాంగ్రెస్(సీపీసీ) జిన్‌పింగ్‌కు తిరిగి అధ్యక్ష పగ్గాలు అప్పగించిన నేపథ్యంలో ఆయన గురువారం రెండోసారి పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా జిన్‌పింగ్ సీనియర్ మిలిటరీ అధికారులతో సమావేశమయ్యారు. సైన్యంలో సంస్కరణలు అమలుచేయడంతో పాటు, వినూత్న విధానాలు అవలంబించాలని సైనికాధికారులకు సూచించారు. చట్టాలు, నియంత్రణలకు లోబడి కఠిన ప్రమాణాలతో సైన్యాన్ని ముందుకు నడిపించాలని దిశానిర్దేశం చేశారు. మిలిటరీలో పార్టీని పటిష్టం చేయాలని, యుద్ధ సన్నద్ధతకు సంబంధించి కసరత్తులను తీవ్రతరం చేయాలని కోరారు. సైన్యం భవిష్యత్ ప్రణాళికలకు ఎదురవుతున్న వ్యూహాత్మక సమస్యలను పరిష్కరించాలని సూచించారు. -
సంస్కరణలతో వాణిజ్య బంధానికి బూస్ట్
* అమెరికా వాణిజ్య మంత్రి ప్రిట్జ్‌కెర్ * నేటి నుంచి భారత్‌లో పర్యటన వాషింగ్టన్: భారత్‌తో ద్వైపాక్షిక వాణిజ్యాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్లే విషయంలో అమెరికా సానుకూలతతో ఉంది. ద్వైపాక్షిక వాణిజ్యం 109 బిలియన్ డాలర్లకు చేరుకుందని, జీఎస్టీ వంటి నూతన సంస్కరణలతో ఇది మరింత విస్తృతం అవుతుందని అమెరికా ఆదివారం ప్రకటించింది. అమెరికా వాణి జ్య మంత్రి పెన్నీ ప్రిట్జ్‌కెర్ 3 రోజుల భారత పర్యటన సోమవారం నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆమె మీడియాతో మాట్లాడారు. పర్యాటకం, ప్రాం తీయ ఒప్పందాలు అనేవి 2017లో రెండు దేశాల మధ్య వాణిజ్య సహకార విస్తృతికి దృష్టి సారించాల్సిన అంశాలుగా గుర్తించినట్టు ఆమె తెలిపారు. పదేళ్లలో మూడు రెట్ల వృద్ధి ‘అమెరికా - భారత్ ద్వైపాక్షిక వాణిజ్యం 2005లో 37 బిలియన్ డాలర్లుగా ఉంటే, 2015లో 109 బిలియన్ డాలర్లకు చేరుకుంది. 2015లో భారత్‌లో అమెరికా కంపెనీలు 28 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెడితే... అమెరికాలో భారత కంపెనీలు 11 బిలియన్ డాలర్లు వెచ్చించాయి. అమెరికాలోని భారత అనుబంధ కంపెనీలు 52వేల మందికిపైగా ఉద్యోగాలు కల్పిస్తున్నాయి’ అని ప్రిట్జ్‌కెర్ గణాంకాలను వెల్లడించారు. ఇరుదేశాలు పరస్పరం కలసి సాధిం చేందుకు అద్భుతమైన సామర్థ్యాలు ఉన్నాయని పేర్కొన్నారు. భారత్ చర్యల్ని స్వాగతిస్తున్నాం... వ్యాపార వాతావరణాన్ని మెరుగు పరిచే విషయంలో భారత్ చర్యలను స్వాగతిస్తున్నట్టు చెప్పారు. జీఎస్టీ, దివాళా చట్టాల ఆమోదం, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల విధానాన్ని సరళతరం చేయడం వంటి మోదీ సర్కారు ప్రతిష్టాత్మక సంస్కరణల ఎజెండా కారణంగా... రానున్న కాలంలో ఆర్థిక సహాకారం మరింత బలోపేతం అవుతుందని ప్రిట్జ్‌కెర్ ఆశాభావం వ్యక్తం చేశారు. జీఎస్టీ ఆమోదం అనేది చరిత్రాత్మక విజయంగా అభివర్ణించారు. 500 బిలియన్ డాలర్ల లక్ష్యం ముంబై: అమెరికాతో ద్వైపాక్షిక వాణిజ్యాన్ని సమీప భవిష్యత్తులో 500 బిలియన్ డాలర్లకు తీసుకెళ్లాలన్న లక్ష్యాన్ని కేంద్రం విధించుకుంది. ప్రస్తుతం ఇది 109 బిలియన్ డాలర్లుగానే ఉంది. పీడబ్ల్యూసీ, అమెరికన్ చాంబర్ ఆఫ్ కామర్స్ (ఐఏసీసీ) సంయుక్త నివేదిక ప్రకారం... ఎయిరోస్పేస్, రక్షణ, బ్యాకింగ్, ఆర్థిక సేవలు, బీమా, రసాయనాలు, సరుకు రవాణా, ఇంధన, మౌలిక రంగాల్లో అపారమైన అవకాశాలున్నాయని, దేశీయంగా వృద్ధి చెందడమే కాకుండా, ప్రపంచ వ్యాప్తంగానూ వ్యాపార కేంద్రంగా భారత్ స్థానాన్ని బలోపేతం చేస్తుందని ఈ నివేదిక వెల్లడించింది. అలాగే, పోర్టులు, ఆయిల్, గ్యాస్, ఫార్మా రంగాల్లోనూ అవకాశాలున్నాయని నివేదిక పేర్కొంది. -
యూరోజోన్‌లో ‘గ్రీస్’ ముసలం..!
ఇప్పటికే మాంద్యంతో నెట్టుకొస్తున్న 19 దేశాల యూరోజోన్ కూటమిలో గ్రీస్ రూపంలో మరోసారి ముసలం మొదలైంది. గ్రీస్ రాజకీయ పరిణామాలు ఆ దేశాన్ని యూరో జోన్ కూటమి నుంచి బయటికి పంపే దిశగా తీసుకెళుతున్నాయి. ఎందుకంటే అక్కడ అధ్యక్ష ఎన్నికల్లో అధికార పక్షం నిలబెట్టిన అభ్యర్థికి తగిన మద్దతు దక్కలేదు. దీంతో ఈ నెలాఖరులో అనివార్యంగా ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికల్లో ప్రతిపక్ష సిరిజా పార్టీ అధికారాన్ని చేజిక్కించుకోవచ్చన్న అంచనాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. అయితే సిరిజా పార్టీ నాయకుడు అలెక్సిస్ సిప్రాస్ గతంలో ప్రవేశపెట్టిన సంస్కరణలకు (ఉద్యోగాలు, ప్రభుత్వ వ్యయాల్లో కోతలు ఇతరత్రా) తాను వ్యతిరేకమని చెబుతున్నారు. దీంతో యూరోజోన్ అస్థిత్వానికే ముప్పు వాటిల్లుతుందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. 2010లో గ్రీస్ దివాలా అంచుకు చేరుకోవడంతో యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్, ఐఎంఎఫ్‌లు జోక్యం చేసుకుని సహాయ ప్యాకేజీలు అందించాయి. దీనికి ప్రతిగా ఆ దేశం సంస్కరణలను ప్రవేశపెట్టింది. ప్రస్తుతం గ్రీస్ ప్రభుత్వ అప్పులు 376 బిలియన్ డాలర్లకు పెరిగాయి. గ్రీస్ స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ)తో పోలిస్తే ఇది 177 శాతం. వచ్చే మార్చినాటికి గ్రీస్ ఖజానా ఖాళీ కానుంది. ఇదే సమయంలో ఈసీబీకి దాదాపు 8 బిలియన్ డాలర్ల రుణ చెల్లింపులు జరపాలి. కొత్త సర్కారు కనుక సంస్కరణలను ఉపసంహరించి... చెల్లింపుల్లో విఫలమైతే(డీఫాల్ట్) ఆ దేశానికి భారీగా అప్పులిచ్చిన(ప్రభుత్వ బాండ్లను కొనుగోలు చేసిన) జర్మనీ(24 బిలియన్ డాలర్ల మేర), ఇతరత్రా దేశాలపై తీవ్ర ప్రభావం పడుతుంది. ఈ కూటమిలోని ఇతర బలహీన(అధిక అప్పుల భారం ఉన్నవి) దేశాలూ ఇదే బాటపడితే యూరోజోన్ విచ్ఛిన్నం అయ్యేందుకు.. చివరికి యూరో కరెన్సీ కనుమరుగయ్యేందుకు కూడా దారీతీయొచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. జర్మనీ మాత్రం గ్రీస్ యూరోజోన్ నుంచి బయటికెళ్లిపోయినా ఇబ్బందేమీ లేదంటోంది. ముడిచమురు ముచ్చెమటలు! ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ తగ్గుముఖం పట్టడానికి తోడు సరఫరా విపరీతంగా పెరిగిపోవటంతో ముడిచమురు ధర అంతకంతకూ పడిపోతోంది. తాజాగా ఐదున్నరేళ్ల కనిష్టమైన 50 డాలర్ల దిగువకు నెమైక్స్ క్రూడ్ బ్యారెల్ రేటు దిగజారడం ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మందగమనంపై ఆందోళనలను మరింత పెంచుతోందని కొటక్ సెక్యూరిటీస్‌కు చెందిన దీపేన్ షా అభిప్రాయపడ్డారు. యూరప్, జపాన్ ఇతరత్రా ఆర్థిక వ్యవస్థల బలహీనతతో పాటు అమెరికా, రష్యా వంటి దేశాల నుంచి అధిక సరఫరాలే క్రూడ్ పతనానికి ప్రధాన కారణమని పరిశీలకులు చెబుతున్నారు. చమురు ఎగుమతి దేశాల కూటమి(ఒపెక్)లోని ప్రధాన దేశమైన సౌదీ కూడా క్రూడ్ ధర 20 డాలర్ల స్థాయికి పడిపోయినా.. ఇప్పట్లో తాము ఉత్పత్తిని తగ్గించేదిలేదని తెగేసి చెబుతుండటంతో ధర ఇం కెంత జారిపోతుందోననే ఆందోళనలు పెరుగుతున్నాయి. -
లాభంతో మొదలు
-
బడ్జెట్‌కు ముందు ర్యాలీ చాన్స్
మార్కెట్ కదలికలపై స్టాక్ నిపుణుల అంచనా బుల్ ట్రెండ్‌కు అవకాశం సంస్కరణల అంచనాలతో కొనుగోళ్ల దూకుడు సెన్సెక్స్ 500 పాయింట్ల వరకూ పెరగవచ్చు న్యూఢిల్లీ: సంస్కరణలు, బడ్జెట్‌పై ఆశలతో ఈ వారం స్టాక్ మార్కెట్లలో ర్యాలీ వచ్చే అవకాశముందని విశ్లేషకులు అంచనా వేశారు. ఆర్థిక వ్యవస్థకు ప్రోత్సాహాన్నిచ్చే పటిష్ట ప్రతిపాదనలపై ఇన్వెస్టర్లు ఆశావహంగా ఉన్నట్లు తెలిపారు. దీంతో ఈ వారం మార్కెట్లు కొనుగోళ్లతో కళకళలాడతాయని పేర్కొన్నారు. సంస్కరణలతో కూడిన చర్యలపై అంచనాలతో ప్రధాన సూచీలు లాభాలతో దూసుకెళతాయని అభిప్రాయపడ్డారు. ప్రామాణిక సూచీ సెన్సెక్స్ 400 నుంచి 500 పాయింట్ల వరకూ పుంజుకునే అవకాశమున్నదని చెప్పారు. ఎన్ఎస్ఈ ప్రధాన సూచీ నిఫ్టీ సైతం 150 పాయింట్లు లాభపడవచ్చునని పేర్కొన్నారు. జూలై 10న బడ్జెట్ ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వచ్చే నెల 10న లోక్‌సభలో వార్షిక సాధారణ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. వెరసి ఈ వారం స్టాక్ మార్కెట్లలో ముందస్తు(ప్రీబడ్జెట్) ర్యాలీకి తెరలేవనున్నదని సీఎన్ఐ రీసెర్చ్ హెడ్ కిషోర్ ఓస్వాల్ అంచనా వేశారు. ఫైనాన్షియల్ రంగ సంస్కరణలతోపాటు, రక్షణ, రైల్వేలు వంటి వ్యవస్థలలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల(ఎఫ్‌డీఐలు) పరిమితిని పెంచే అవకాశమున్నట్లు చెప్పారు. సంస్కరణలతో కూడిన పటిష్ట బడ్జెట్‌ను ట్రేడర్లు ఊహిస్తున్నారని జియోజిత్ బీఎన్పీ పరిబాస్ రీసెర్చ్ హెడ్ అలెక్స్ మాథ్యూ పేర్కొన్నారు. అయితే నరేంద్ర మోడీ అధ్యక్షతన ఏర్పడిన కొత్త ప్రభుత్వం ఇటీవల తీసుకున్న నిర్ణయాలు మార్కెట్ మూడ్‌ను కొంతమేర దెబ్బకొట్టాయని వ్యాఖ్యానించారు. ప్రధానంగా నేచురల్ గ్యాస్ ధర పెంపు నిర్ణయాన్ని వాయిదా వేయడమేకాకుండా రైల్వే చార్జీల పెంపు విషయంలో వెనక్కుతగ్గడం సెంటిమెంట్‌ను బలహీనపరిచిందని చెప్పారు. ప్రతిపక్షాల తీవ్ర వ్యతిరేకత నేపథ్యంలో 80 కిలోమీటర్ల వరకూ సబర్బన్ రైళ్ల ద్వితీయ శ్రేణి టికెట్ ధరల పెంపు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవడం, నెలవారీ సీజన్ టికెట్ల ధరలను తగ్గించడం వంటి నిర్ణయాలను కేంద్ర ప్రభుత్వం తీసుకున్న విషయం విదితమే. ఆరేళ్ల గరిష్టానికి పీనోట్స్ పెట్టుబడులు పార్టిసిపేటరీ నోట్ల(పీనోట్స్) ద్వారా దేశీ స్టాక్స్‌లోకి మళ్లే విదేశీ పెట్టుబడుల విలువ మే నెలలో 35 బిలియన్ డాలర్లకు(రూ. 2.12 లక్షల కోట్లు) చేరింది. ఇది గత ఆరేళ్లలోనే అత్యధికం. ఏప్రిల్ లో వీటి విలువ రూ. 1,87,486 కోట్లుగా నమోదైంది. అంటే 13% వృద్ధి నమోదైంది. సంపన్న వర్గాలు(హెచ్ఎన్ఐలు), హెడ్జ్ ఫండ్స్ తదితర విదేశీ ఇన్వెస్ట్మెంట్ సంస్థలు దేశీ మార్కెట్లో పీనోట్ల ద్వారా పెట్టుబడిపెడతారు. -
టెన్త్ సంస్కరణలకు పచ్చజెండా
హైదరాబాద్: తొమ్మిది, పదో తరగతి పరీక్షల విధానంలో సంస్కరణలు తీసుకొచ్చేందుకు ప్రభుత్వం బుధవారం అనుమతి ఇచ్చింది. సీబీఎస్ఈ తరహాలో పదో తరగతి పరీక్షల్లో కొత్త విధానాన్ని తీసుకురావాలని రాష్ట్ర విద్యాపరిశోధన, శిక్షణ మండలి (ఎస్సీఈఆర్టీ) చేసిన ప్రతిపాదనలకు సర్కారు ఆమోదముద్ర వేసింది. వచ్చే విద్యాసంవత్సరం(2014-15) నుంచి నూతన విధానం అమల్లోకి రానుంది. ఇటీవల పదో తరగతి పుస్తకాలను మార్పు చేసిన విద్యాశాఖ.. బట్టీ విధానానికి స్వస్తి చెప్పి విద్యార్థి స్వతహాగా ఆలోచించి, తెలుసుకొని నేర్చుకునే విధానానికి ఓకే చెప్పింది. అందుకు అనుగుణంగా పరీక్ష విధానంలోనూ సంస్కరణలు చేయాలని నిర్ణయించింది. పరీక్ష విధానంలో మార్పులు, పాఠ్య పుస్తకాల్లో మార్పులపై త్వరలో ఉపాధ్యాయులకు కూడా శిక్షణ ఇవ్వనుంది. జూన్‌లో స్కూళ్లు తెరిచిన వెంటనే 9, 10 తరగతుల్లో కొత్త విధానంలో బోధన, అభ్యసన విధానం అమల్లోకి రానున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. సంస్కరణలపై ఇప్పటికే ఉపాధ్యాయ సంఘాలు, జిల్లా స్థాయి అధికారులతో ఎస్సీఈఆర్టీ అధికారులు చర్చలు జరిపారు. వారి నుంచి వచ్చిన అభిప్రాయాల మేరకు 9 పేపర్లలో పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించారు. భాషా సబ్జెక్టుల్లో ఒక్కో పేపరు (ప్రథమభాష, ద్వితీయ భాష, తృతీయ భాష), భాషేతర సబ్జెక్టుల్లో (గణితం, సైన్స్, సోషల్) రెండేసి పేపర్ల చొప్పున ఉంటాయి. రెండేసి పేపర్లు ఉండే సబ్జెక్టుల పరీక్షల్లో ఒక్కో పేపరుకు 40 మార్కుల చొప్పున రెండు పేపర్లకు కలిపి 80 మార్కులు, ఇంటర్నల్స్‌కు 10 మార్కుల చొప్పున రెండింటికి 20 మార్కులు ఉంటాయి. వీటికి అనుగుణంగా గ్రేడింగ్ విధానం కూడా మారనుంది. ఇదీ తాజా గ్రేడింగ్ గ్రేడ్ భాషల్లో భాషేతర సబ్జెక్టుల్లో {Vేడ్ మార్కుల పరిధి మార్కుల పరిధి పాయింట్ ఎ1 91-100 46-50 10 ఎ2 81-90 41-45 9 బి1 71-80 36-40 8 బి2 61-70 31-35 7 సి1 51-60 26-30 6 సి2 41-50 21-25 5 డి1 35-40 18-20 4 డి2 0-34 0-17 3 -
సంస్కరణలకు మసి పూశారు
నాటి బొగ్గు మంత్రులు సోరెన్, దాసరి అడ్డుకున్నారు బొగ్గుశాఖ మాజీ కార్యదర్శి పి.సి.పరేఖ్ ఆరోపణలు ప్రధాని తన మంత్రులను నియంత్రించలేకపోయారు ప్రభుత్వ సంస్థల సీఈఓలు, డెరైక్టర్లను ఎంపీలు బ్లాక్మెయిల్ చేసి డబ్బులు దండుకున్నారు ప్రధాని అధికారాన్ని వినియోగించి ఉంటే స్కాం జరిగేది కాదు న్యూఢిల్లీ: కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖలో తలపెట్టిన సంస్కరణలను.. ఆ శాఖ మంత్రులుగా పనిచేసిన శిబూసోరెన్, దాసరి నారాయణరావులు సహా పలువురు మంత్రులు, వివిధ పార్టీల ఎంపీలు అడ్డుకున్నారని.. ఆ సంస్కరణలు అమలైతే బొగ్గు కుంభకోణం జరగకుండా నిరోధించే అవకాశం ఉండేదని బొగ్గు శాఖ మాజీ కార్యదర్శి పి.సి.పరేఖ్ పేర్కొన్నారు. ‘‘బొగ్గు గనులకు బహిరంగ టెండర్లు పిలవాలన్న నా ప్రతిపాదనను ఈ ఇద్దరు మంత్రులూ తీవ్రంగా వ్యతిరేకించారు. నేను ప్రతిపాదించిన సంస్కరణల అమలుకు సంబంధించి దురదృష్టవశాత్తూ ప్రధానమంత్రి (మన్మోహన్సింగ్) తన మంత్రులను నియంత్రించలేకపోయారు’’ అని ఆయన చెప్పారు. 2005 డిసెంబర్లో పదవీ విరమణ చేసిన ఐఏఎస్ అధికారి పరేఖ్.. బొగ్గుశాఖ కార్యదర్శిగా తన అనుభవాలను ‘క్రూసేడర్ ఆర్ కాన్స్పిరేటర్? - కోల్ గేట్ అండ్ అదర్ ట్రూత్స్ (ధర్మయుద్ధ సైనికుడా లేక కుట్రదారుడా? - బొగ్గు కుంభకోణం - ఇతర నిజాలు)’ అనే పేరుతో పుస్తకం రాశారు. ఈ పుస్తకాన్ని సోమవారం ఢిల్లీలో సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ జి.ఎస్.సింఘ్వీ ఆవిష్కరించారు. బొగ్గు కుంభకోణంపై దర్యాప్తు చేస్తున్న సీబీఐ.. పరేఖ్‌ను కూడా నిందితుడిగా పేర్కొంటున్న విషయం తెలిసిందే. పుస్తకావిష్కరణ సందర్భంగా పరేఖ్ మీడియాతో మాట్లాడారు. ‘‘బొగ్గు గనులను ఇంటర్నెట్ అధారిత వేలంలో పెట్టాలన్న ప్రధానమంత్రి నిర్ణయాన్ని మంత్రులు ఎలా తల్లకిందులు చేశారో చూశా. ప్రభుత్వ రంగ సంస్థలకు చీఫ్ ఎగ్జిక్యూటివ్‌లు, డెరైక్టర్లను ఎలా నియమించారో నేను మంత్రిత్వశాఖలో చూశాను. సీఈఓలు, డెరైక్టర్ల నియామకానికి బాహాటంగానే డబ్బులు అడిగారు. అధికారులను, ప్రభుత్వ సంస్థల సీఈఓలను ఎంపీలు బ్లాక్మెయిల్ చేసి, డబ్బులు దండుకోవటం చూశా. ప్రభుత్వ అధికారులు నిజాయితీగా గౌరవప్రదంగా పనిచేయలేని పరిస్థితిని మనం కల్పించాం’’ అని ఆయన విచారం వ్యక్తంచేశారు. బొగ్గు శాఖ ప్రధాని మన్మోహన్ అధీనంలో ఉన్నప్పుడు మాత్రమే ఏ కొంచెమైనా సంస్కరణలు అమలు జరిగాయని చెప్పారు. ప్రధాని తన అధికారాన్ని వినియోగించినట్లయితే.. బొగ్గు కుంభకోణం జరిగేది కాదని ఒక ప్రశ్నకు సమాధానంగా పేర్కొన్నారు. బొగ్గు కుంభకోణానికి సంబంధించి కుమారమంగళం బిర్లాతో కలిసి పరేఖ్ కుట్ర పన్నినట్లు సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేయటం గురించి ప్రశ్నించగా.. ‘‘కుట్ర జరిగిందని సీబీఐ చెప్తోంది. కుట్ర జరగలేదని నేను చెప్పటం లేదు. అయితే.. కుట్ర జరిగిందీ అంటే.. అది నిర్ణయం తీసుకునే వ్యక్తుల మధ్య జరగాలి. తుది నిర్ణయం తీసుకున్నది ప్రధానమంత్రి. అంటే.. నేను కుట్రలో భాగస్వామిని అయితే.. ప్రధాని కూడా కుట్రలో భాగస్వామి కావాల్సి ఉంటుంది’’ అని ఆయన వ్యాఖ్యానించారు. ఎన్నికల సమయంలో ఈ పుస్తకం ఆవిష్కరించటం గురించి ప్రశ్నించగా.. ‘‘మన రాజకీయ వ్యవస్థ, సివిల్ సర్వీసెస్‌లలో పతనాన్ని గురించి నేనీ పుస్తకం రాశా’’ అని బదులిచ్చారు. పరేఖ్‌కు సీబీఐ క్లీన్ చిట్ ఇస్తుంది: మాజీ కాగ్ ఇదిలావుంటే.. పరేఖ్‌కు బొగ్గు కుంభకోణంలో సీబీఐ క్లీన్ చిట్ ఇస్తుందని మాజీ కంప్ట్రోలర్ ఆడిటర్ జనరల్ (కాగ్) వినోద్‌రాయ్ అభిప్రాయపడ్డారు. పుస్తకావిష్కరణకు హాజరుకాలేకపోయిన ఆయన తన ప్రసంగాన్ని రాతపూర్వకంగా పంపించగా కార్యక్రమ నిర్వాహకులు చదివి వినిపించారు. ‘బొగ్గు శాఖకు చెందిన ఫైళ్లన్నిటినీ నేను పరిశీలించాను. పరేఖ్‌కు సంబంధించి ఎలాంటి నేరపూరిత ఉద్దేశమూ లేదు. పెద్ద చేపలు తప్పించుకుంటాయి. కొద్ది మంది నిజాయితీ అధికారులు మాత్రం వేధింపులకు గురవుతారు. అయినా.. వ్యవస్థపై నాకు నమ్మకముంది. సీబీఐ దర్యాప్తు పూర్తిచేశాక పరేఖ్‌పై నేరపూరిత ఉద్దేశాలు మోపజాలమన్న నిర్ధారణకు వస్తారని నేను విశ్వసిస్తున్నా’అని అన్నారు. ప్రధాని పారదర్శకంగా చేశారు: కాంగ్రెస్ ప్రధాని మన్మోహన్‌కు తన మంత్రివర్గంలోని మంత్రులపై నియంత్రణ లేదంటూ పరేఖ్ చేసిన ఆరోపణలపై కాంగ్రెస్ పార్టీ ఆచితూచి స్పందించింది. బొగ్గు గనుల కేటాయింపులను మన్మోహన్ మరింత పారదర్శకం చేశారని, ఈ విషయంలో ఐదుగురు కాంగ్రెసేతర ముఖ్యమంత్రుల నుంచీ వ్యతిరేకత ఎదుర్కొన్నారని ప్రధానిని సమర్థించింది. పరేఖ్ రాసిన పుస్తకాన్ని తాము ఇంకా చదవలేదని, దానిని అధ్యయనం చేశాక స్పందిస్తామని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్‌దీప్‌సూర్జేవాలా మీడియాతో పేర్కొన్నారు. సోనియా, రాహుల్ బదులివ్వాలి ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌కు రాజకీయ అధికారం నామమాత్రమేనంటూ.. బొగ్గుశాఖ మాజీ కార్యదర్శి పి.సి.పరేఖ్, ప్రధానమంత్రి మాజీ సలహాదారు సంజయ్‌బారులు తమ పుస్తకాల్లో వెల్లడించిన అంశాలపై కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీలు వివరణ ఇవ్వాలని బీజేపీ డిమాండ్ చేసింది. ‘‘మేం ఇప్పటివరకూ చెప్తున్న విషయాన్నే ఈ రెండు పుస్తకాలూ పునరుద్ఘాటించాయి. ఈ ప్రశ్నలకు బదులిచ్చే బాధ్యత నుంచి ఆ కుటుంబం తప్పించుకో జాల దు. పరేఖ్, బారులు లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన సమయమిది. సోనియాగాంధీ, రాహుల్‌గాంధీలు సమాధానం చెప్పితీరాలి’’ అని బీజేపీ అధికార ప్రతినిధి నిర్మలా సీతారామన్ మీడియాతో వ్యాఖ్యానించారు. వారసత్వ రాజకీయాలు గత పదేళ్లలో దేశాన్ని నాశనం చేశాయన్నారు. -
సంస్కరణలను కొనసాగిస్తా
ఏపీజేఎఫ్ ‘ద లీడర్-మీట్ ద పీపుల్’ కార్యక్రమంలో చంద్రబాబు ఉద్యోగాలు పోతాయేమోనని ఉద్యోగులు భయపడొద్దని వినతి హైదరాబాద్: తాను మళ్లీ అధికారంలోకి వస్తే సంస్కరణలు యథావిధిగా కొనసాగుతా యని టీడీపీ అధినేత చంద్రబాబు నాయు డు చెప్పారు. అయితే అందులో మానవీయ కోణం ఉంటుందని కొత్త భాష్యం చెప్పారు. సంస్కరణల వల్ల ఉద్యోగాలు పోతాయం టూ ప్రభుత్వ ఉద్యోగులె వరూ భయపడొద్దని అన్నారు. తాను సీఎం గా ఉన్నప్పుడు రెండో దశ సంస్కరణలు చేప ట్టగా వాటివల్ల కొన్ని మంచి, కొన్ని చెడు ఫలితాలు వచ్చాయ న్నారు. ఎన్నికల్లో బొటాబొటీ మెజారిటీ ఇస్తే ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు వారి చుట్టే తిరగాల్సి వస్తుందన్నారు. ఆదివారం ఏపీ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (ఏపీజేఎఫ్) నగరంలోని ఒక కన్వెన్షన్ సెంటర్లో చంద్రబాబుతో ‘ది లీడర్-మీట్ ది పీపుల్’ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ సందర్భంగా చంద్రబాబు ప్రసంగించారు. ఈసారి జరిగే ఎన్నికలు రాష్ట్రానికి కీలకమన్నారు. ప్రజలు ఈసారి ఎన్నికల్లో కులం, మతం, ప్రాంతం, డబ్బు వగైరాల గురించి పట్టించుకోవద్దని కోరారు. కాంగ్రెస్ పార్టీ నుంచి పెద్ద సంఖ్యలో నేతలు వస్తున్నారని, వారికి ప్రజాసేవ చేసే అవకాశం ఇచ్చేందుకే పార్టీలో చేర్చుకుంటున్నానని సమర్థించుకున్నారు. సమావేశంలో పాల్గొన్న ఒక డ్వాక్రా మహిళ, ఒక విద్యార్థిని డ్వాక్రా రుణాలు రద్దు, ఇంటింటికో ఉద్యోగం ఎలా సాధ్యమని ప్రశ్నించగా చిత్తశుద్ధితో ప్రయత్నిస్తే సాధ్యమేనన్నారు. ఏపీ ఎన్జీవో సంఘం అధ్యక్షుడు అశోక్‌బాబు మాట్లాడు తూ మీరు సీఎంగా ఉన్నప్పుడు ఉద్యోగాల భర్తీ అస్సలు జరగలేదని, కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ వ్యవస్థను ప్రవేశపెట్టారని గుర్తుచేశారు. ఆ సమయం లో ఉద్యోగుల్లో అభద్రతాభావం, భయం నెలకొందని చెప్పారు. పారిశ్రామికవేత్త హరిశ్చంద్రప్రసాద్ మాట్లాడుతూ పదేళ్లపాటు ఉమ్మడి రాజధాని హైదరా బాద్‌లో విధులు నిర్వర్తించాలంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి రెండు వేల కోట్లు ఖర్చవుతుందని, అంతే మొత్తాన్ని ఒకే ఏడాది ఖర్చు చేస్తే నూతన భవనాలు మొదలైనవి నిర్మిం చుకోవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీజేఎఫ్ గౌరవ సలహాదారు కొమ్మినేని శ్రీనివాసరావు, గౌరవాధ్యక్షుడు కందుల రమేశ్ తదితరులు పాల్గొన్నారు.