
సంస్కరణలను కొనసాగిస్తా
ఏపీజేఎఫ్ ‘ద లీడర్-మీట్ ద పీపుల్’ కార్యక్రమంలో చంద్రబాబు
ఉద్యోగాలు పోతాయేమోనని ఉద్యోగులు భయపడొద్దని వినతి
హైదరాబాద్: తాను మళ్లీ అధికారంలోకి వస్తే సంస్కరణలు యథావిధిగా కొనసాగుతా యని టీడీపీ అధినేత చంద్రబాబు నాయు డు చెప్పారు. అయితే అందులో మానవీయ కోణం ఉంటుందని కొత్త భాష్యం చెప్పారు. సంస్కరణల వల్ల ఉద్యోగాలు పోతాయం టూ ప్రభుత్వ ఉద్యోగులె వరూ భయపడొద్దని అన్నారు. తాను సీఎం గా ఉన్నప్పుడు రెండో దశ సంస్కరణలు చేప ట్టగా వాటివల్ల కొన్ని మంచి, కొన్ని చెడు ఫలితాలు వచ్చాయ న్నారు.
ఎన్నికల్లో బొటాబొటీ మెజారిటీ ఇస్తే ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు వారి చుట్టే తిరగాల్సి వస్తుందన్నారు. ఆదివారం ఏపీ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (ఏపీజేఎఫ్) నగరంలోని ఒక కన్వెన్షన్ సెంటర్‌లో చంద్రబాబుతో ‘ది లీడర్-మీట్ ది పీపుల్’ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ సందర్భంగా చంద్రబాబు ప్రసంగించారు. ఈసారి జరిగే ఎన్నికలు రాష్ట్రానికి కీలకమన్నారు. ప్రజలు ఈసారి ఎన్నికల్లో కులం, మతం, ప్రాంతం, డబ్బు వగైరాల గురించి పట్టించుకోవద్దని కోరారు. కాంగ్రెస్ పార్టీ నుంచి పెద్ద సంఖ్యలో నేతలు వస్తున్నారని, వారికి ప్రజాసేవ చేసే అవకాశం ఇచ్చేందుకే పార్టీలో చేర్చుకుంటున్నానని సమర్థించుకున్నారు. సమావేశంలో పాల్గొన్న ఒక డ్వాక్రా మహిళ, ఒక విద్యార్థిని డ్వాక్రా రుణాలు రద్దు, ఇంటింటికో ఉద్యోగం ఎలా సాధ్యమని ప్రశ్నించగా చిత్తశుద్ధితో ప్రయత్నిస్తే సాధ్యమేనన్నారు. ఏపీ ఎన్‌జీవో సంఘం అధ్యక్షుడు అశోక్‌బాబు మాట్లాడు తూ మీరు సీఎంగా ఉన్నప్పుడు ఉద్యోగాల భర్తీ అస్సలు జరగలేదని, కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్ వ్యవస్థను ప్రవేశపెట్టారని గుర్తుచేశారు.
ఆ సమయం లో ఉద్యోగుల్లో అభద్రతాభావం, భయం నెలకొందని చెప్పారు. పారిశ్రామికవేత్త హరిశ్చంద్రప్రసాద్ మాట్లాడుతూ పదేళ్లపాటు ఉమ్మడి రాజధాని హైదరా బాద్‌లో విధులు నిర్వర్తించాలంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి రెండు వేల కోట్లు ఖర్చవుతుందని, అంతే మొత్తాన్ని ఒకే ఏడాది ఖర్చు చేస్తే నూతన భవనాలు మొదలైనవి నిర్మిం చుకోవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీజేఎఫ్ గౌరవ సలహాదారు కొమ్మినేని శ్రీనివాసరావు, గౌరవాధ్యక్షుడు కందుల రమేశ్ తదితరులు పాల్గొన్నారు.