హైదరాబాద్: తొమ్మిది, పదో తరగతి పరీక్షల విధానంలో సంస్కరణలు తీసుకొచ్చేందుకు ప్రభుత్వం బుధవారం అనుమతి ఇచ్చింది. సీబీఎస్‌ఈ తరహాలో పదో తరగతి పరీక్షల్లో కొత్త విధానాన్ని తీసుకురావాలని రాష్ట్ర విద్యాపరిశోధన, శిక్షణ మండలి (ఎస్‌సీఈఆర్‌టీ) చేసిన ప్రతిపాదనలకు సర్కారు ఆమోదముద్ర వేసింది. వచ్చే విద్యాసంవత్సరం(2014-15) నుంచి నూతన విధానం అమల్లోకి రానుంది. ఇటీవల పదో తరగతి పుస్తకాలను మార్పు చేసిన విద్యాశాఖ.. బట్టీ విధానానికి స్వస్తి చెప్పి విద్యార్థి స్వతహాగా ఆలోచించి, తెలుసుకొని నేర్చుకునే విధానానికి ఓకే చెప్పింది. అందుకు అనుగుణంగా పరీక్ష విధానంలోనూ సంస్కరణలు చేయాలని నిర్ణయించింది. పరీక్ష విధానంలో మార్పులు, పాఠ్య పుస్తకాల్లో మార్పులపై త్వరలో ఉపాధ్యాయులకు కూడా శిక్షణ ఇవ్వనుంది. జూన్‌లో స్కూళ్లు తెరిచిన వెంటనే 9, 10 తరగతుల్లో కొత్త విధానంలో బోధన, అభ్యసన విధానం అమల్లోకి రానున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. సంస్కరణలపై ఇప్పటికే ఉపాధ్యాయ సంఘాలు, జిల్లా స్థాయి అధికారులతో ఎస్‌సీఈఆర్‌టీ అధికారులు చర్చలు జరిపారు. వారి నుంచి వచ్చిన అభిప్రాయాల మేరకు 9 పేపర్లలో పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించారు. భాషా సబ్జెక్టుల్లో ఒక్కో పేపరు (ప్రథమభాష, ద్వితీయ భాష, తృతీయ భాష), భాషేతర సబ్జెక్టుల్లో (గణితం, సైన్స్, సోషల్) రెండేసి పేపర్ల చొప్పున ఉంటాయి. రెండేసి పేపర్లు ఉండే సబ్జెక్టుల పరీక్షల్లో ఒక్కో పేపరుకు 40 మార్కుల చొప్పున రెండు పేపర్లకు కలిపి 80 మార్కులు, ఇంటర్నల్స్‌కు 10 మార్కుల చొప్పున రెండింటికి 20 మార్కులు ఉంటాయి. వీటికి అనుగుణంగా గ్రేడింగ్ విధానం కూడా మారనుంది.
ఇదీ తాజా గ్రేడింగ్
గ్రేడ్ భాషల్లో భాషేతర సబ్జెక్టుల్లో {Vేడ్
మార్కుల పరిధి మార్కుల పరిధి పాయింట్
ఎ1 91-100 46-50 10
ఎ2 81-90 41-45 9
బి1 71-80 36-40 8
బి2 61-70 31-35 7
సి1 51-60 26-30 6
సి2 41-50 21-25 5
డి1 35-40 18-20 4
డి2 0-34 0-17 3
టెన్త్ సంస్కరణలకు పచ్చజెండా
Published Thu, May 15 2014 12:20 AM | Last Updated on Sat, Sep 2 2017 7:21 AM
Advertisement