విదేశాల్లో అంతర్జాతీయ క్రెడిట్ కార్డుల ద్వారా చేసే చెల్లింపులపై కేంద్రం టీసీఎస్ (ట్యాక్స్ కలెక్టెడ్ ఎట్ సోర్స్) ను వసూలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే, ఈ కొత్త పన్ను విధానాన్ని, అందులోని లోపాల్ని భారత్ పే మాజీ సహ వ్యవస్థాపకులు అశ్నీర్ గ్రోవర్ విమర్శిస్తూ వస్తున్నారు.
తాజాగా, మరో సారి ట్యాక్స్ పేయర్లు ప్రభుత్వాలకు ఊడిగం చేస్తున్నారంటూ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. పైగా పన్నులు చెల్లించడం ఓ శిక్షే’నని అన్నారు. ఈ మేరకు పన్ను చెల్లింపులపై పలు మార్లు గతంలో ఆయన చేసిన వ్యాఖ్యలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి.
ఎన్నాళ్లు ఇలా ఊడిగం చేయాలి
కేంద్రం పన్నుల చెల్లింపు దారుల నుంచి 30 నుంచి 40 శాతం వరకు ట్యాక్స్ వసూలు చేస్తుందని, ప్రతిగా ఎలాంటి ప్రతిఫలం పొందలేకపోతున్నారని అశ్నీర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘ట్యాక్స్ పేయర్లు తమ సంపాదనలో కొంత బాగాన్ని దేశానికి ఇస్తున్నారు. కానీ వాళ్లు ఎలాంటి లబ్ధి పొందడం లేదు. రూ.10 మనం (ట్యాక్స్ పేయర్లను ఉద్దేశిస్తూ) సంపాదిస్తే అందులో రూ.4 ప్రభుత్వానికే ఇస్తున్నాం. దీంతో 12 నెలల సమయంలో 5 నెలలు ప్రభుత్వానికే పనిచేస్తున్నారు. అయినా ఇలా ట్యాక్స్ పేయర్లు వారీ జీవితంలో ప్రభుత్వాలకు ఎన్నాళ్లు ఇలా ఊడిగం చేయాలని ప్రశ్నించారు. కానీ పరిస్థితుల్ని బట్టి నడుచుకోవాల్సిందే తప్పదు’’ అని వ్యాఖ్యానించారు.
ఉద్యోగులు ట్యాక్స్ ఎగవేతకు పాల్పడలేరు
అంతేకాదు, వ్యాపారస్థులకు ట్యాక్స్ కట్టకుండా ఎలా తప్పించుకోవాలో తెలుసు. కానీ ఉద్యోగుల పరిస్థితి అలా కాదు. వేరే ప్రత్యామ్నాయం లేదు. శాలరీ నుంచే ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది. పైగా 18 శాతం జీఎస్టీ చెల్లిస్తున్నారు. అందుకే ట్యాక్స్ అనేది శిక్షతో సమానమేనన్న అభిప్రాయం వ్యక్తం చేశారు అశ్నీర్ గ్రోవర్.
నేనే రాజకీయ నాయకుడిని అయితే
దేశంలో ఆదాయపు పన్ను రేటును తగ్గించేందుకు ప్రాధాన్యత ఇస్తానని చెప్పారు. ప్రతి ఒక్కరూ 10 నుంచి 15 శాతం ట్యాక్స్ కట్టేలా నిర్ధేశిస్తా. తద్వారా ఇప్పుడు ఎక్కువ పన్నులు కట్టాల్సిన అవసరం ఉంది కాబట్టి ఎగ్గొట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. అదే పన్ను తక్కువగా ఎగవేతకు ప్రయత్నించరు. ప్రభుత్వ ఆదాయం పెరుగుతుందని అన్నారు.
పార్టీలకు ఇచ్చే డొనేషన్లపై జీరో ట్యాక్సా
గత నెలలో విదేశాల్లో క్రెడిట్ కార్డ్ వినియోగంపై 20 శాతం టీసీఎస్ వసూలు చేయడాన్నీ గ్రోవర్ తప్పుబట్టారు. విదేశాల్లో క్రెడిట్‌కార్డు వాడకంపై 20 శాతం పన్ను పార్టీలకు ఇచ్చే డొనేషన్లకు మాత్రం జీరో ట్యాక్స్ అంటూ ఎద్దేవా చేశారు.
చదవండి👉 ‘విలాసాల రుచి మరిగి’..అశ్నీర్ గ్రోవర్, అతని భార్య మాధురి జైన్ గ్రోవర్‌కు మరో ఎదురు దెబ్బ!
Comments
Please login to add a commentAdd a comment