గ్రామీణ డిమాండ్‌పై వర్షాభావ ప్రభావం: జైట్లీ
దుబాయ్: దేశంలో గత రెండేళ్లుగా నెలకొన్న వర్షాభావ పరిస్థితుల ప్రభావం గ్రామీణ ప్రాంత డిమాండ్‌పై పడిందని ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ సోమవారం పేర్కొన్నారు. పెట్టుబడిదారులతో ఇక్కడ జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం దేశంలో వృద్ధి రేటు 7.3 శాతం పైనే నమోదవుతుందని అన్నారు. రానున్న ఆర్థిక సంవత్సరాల్లో ఈ రేటు మరింత మెరుగుపడుతుందని కూడా తెలిపారు.
భారత్‌కు పెట్టుబడులను ఆకర్షించడం లక్ష్యంగా జైట్లీ యునెటైడ్ అరబ్ ఎమిరైట్స్‌లో రెండు రోజుల పర్యటన జరుపుతున్నారు. దేశంలో వ్యాపార అవకాశాలను ఈ పర్యటన సందర్భంగా ఆయన ఇన్వెస్టర్లకు వివరిస్తున్నారు. భారీ వృద్ధి రేటు సాధన లక్ష్యంగా కేంద్రం ఆర్థిక సంస్కరణల బాటలో ముందుకు వెళుతుందని తెలిపారు. పెట్టుబడిదారులకు సానుకూల రీతిలో పన్నుల వ్యవస్థను సరళీకరిస్తామని ఈ సందర్భంగా జైట్లీ పేర్కొన్నారు.