జీఎస్టీ సమావేశానికి మంత్రి హరీశ్‌కు ఆహ్వానం  | GST Meeting: Minister Harish Rao Got Invitation To Attend At Lucknow | Sakshi
Sakshi News home page

జీఎస్టీ సమావేశానికి మంత్రి హరీశ్‌కు ఆహ్వానం 

Published Sun, Sep 12 2021 3:40 AM | Last Updated on Sun, Sep 12 2021 3:40 AM

GST Meeting: Minister Harish Rao Got Invitation To Attend At Lucknow - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో ఈనెల 17న జరిగే వస్తు సేవల పన్ను (జీఎస్టీ) కౌన్సిల్‌ 45వ సమావేశంలో పాల్గొనాల్సిందిగా ఆర్థికమంత్రి హరీశ్‌రావుకు ఆహ్వానం అందింది. ఈ మేరకు జీఎస్టీ కౌన్సిల్‌ ఎక్స్‌ అఫీషియో కార్యదర్శి తరుణ్‌ బజాజ్‌.. హరీశ్‌రావుకు లేఖ ద్వారా ఆహ్వానం పంపారు. లక్నో గోమతినగర్‌లోని తాజ్‌ వివాంటాలో జరిగే ఈ సమావేశానికి కౌన్సిల్‌ సభ్యుడి హోదాలో హాజరు కావాలని, కోవిడ్‌ నిబంధనల నేపథ్యంలో ప్రతి రాష్ట్రం నుంచి కౌన్సిల్‌ సభ్యుడితో పాటు ఇద్దరు అధికారులను మాత్రమే సమావేశానికి తీసుకురావాలని ఆ లేఖలో తరుణ్‌ బజాజ్‌ పేర్కొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement