సాక్షి, హైదరాబాద్: వైరస్ బారి నుంచి ఎలా తప్పించుకోవాలోనన్న ఆదుర్దా.. భవిష్యత్తుపై బెంగ.. ఎలా.. ఏం చేయాలి?.. ఇదీ కరోనా నేపథ్యంలో దాదాపు అందరి మనస్థితి. ఒకపక్క కరోనా.. మ రోపక్క దాదాపు రెండున్నర నెలలుగా వివిధ దశ ల్లో అమల్లో ఉన్న లాక్‌డౌన్.. ఈ సమయంలో తమకెదురైన సమస్యలు, అనుభవాలను దృష్టిలో పెట్టుకుని మునుముందు ఎలాంటి పరిస్థితుల్ని ఎదుర్కోవాలోననే భయం, ఆందోళన అధికమవుతున్నాయి. వివిధ రంగాల్లో ఉద్యోగాలు, స్వయం ఉపాధి అవకాశాలు తగ్గిపోవడం, చిన్న వ్యాపారాలు దెబ్బతినడం, ఇలా అన్నిస్థాయిల వ్యక్తులు, కు టుంబాలను, ముఖ్యంగా మధ్య, దిగువ మధ్య త రగతి, కింది తరగతి వర్గాలను భవిష్యత్‌పై ఆందో ళన ఒత్తిడికి గురిచేస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో తమలో గూడుకట్టుకుంటున్న భయాల్ని దూరం చేసుకునేందుకు వైద్యనిపుణులు, మానసి క విశ్లేషకులు, సైకియాట్రిస్ట్‌లు, సైకాలజిస్ట్‌ల çసూ చనలు తీసుకుంటున్న వారి సంఖ్య పెరిగింది.
అందరిలో అదే ఆందోళన
ప్రైమరీ స్కూళ్ల పిల్లలు మొదలుకుని వయోవృద్ధు ల వరకు దాదాపు అన్ని వర్గాలపై ప్రత్యక్షంగా, ప రోక్షంగా కరోనా పరిణామాలు ప్రభావం చూపుతున్నాయి. కొన్ని మినహాయింపులతో లాక్‌డౌన్ దాదాపుగా ఎత్తేసిన నేపథ్యంలో వివిధ పనులు, కార్యక్రమాలపై బయటకు వస్తున్న వారి సంఖ్య ఒక్కసారిగా పెరిగింది. దీంతో మాస్క్‌లు పెట్టుకున్నా, శానిటైజర్లు వాడుతున్నా, భౌతికదూరం పాటిస్తున్నా.. బహిరంగ ప్రదేశాల్లో కాంటాక్ట్‌లోకి వచ్చే వ్యక్తుల నుంచి తమకు వైరస్ సోకుతుందేమోననే భయాలు, ఆందోళనలు ఇటీవల మరింత గా పెరిగాయి. షుగర్, బీపీ, గుండెజబ్బులు, కిడ్నీ ఇతర సమస్యలున్న వారు అసలు కరోనా పరిస్థితుల్ని అధిగమించి మనగలుగుతామా?, వైరస్ సోకి ఆసుపత్రికి వెళ్తే మళ్లీ క్షేమంగా ఇంటికొస్తామా?, తమ తర్వాత కుటుంబం పరిస్థితి ఏమిటి? అనే భయాందోళనలతో గడుపుతున్నారు. మ రికొందరికి ఉద్యోగం ఉంటుందా పో తుందా? భవిష్యత్‌లో ఆర్థిక పరిస్థితి, ఆ రోగ్యం సంగతేమిటి?, పిల్లల చదువులెలా? అనే అనుమానాలు పట్టిపీడిస్తున్నా యి. ఆర్థిక, వ్యక్తిగత, ఇతర సమస్యలపై దంపతుల మధ్య వాదులాటలు పెరుగుతున్నా యి. వివిధ సమస్యలపై భిన్నమైన వ్యక్తులు, రంగాల నుంచి తనకు నెల, నెలన్నర రోజుల్లోనే 60 దాకా ఫోన్‌కాల్స్ వచ్చాయని సైకాలజిస్ట్ డాక్టర్ సి.వీరేందర్ తెలిపారు. పిల్లల ఆన్‌లైన్ చదువులు, పేరెంట్స్ చదువంటూ వెంటపడడంపై ఫిర్యాదు లు, ఆర్థిక పరిస్థితులపై ఆందోళనలు.. ఇలా కౌన్సెలింగ్‌కు వస్తున్న వారి సంఖ్య కూడా ఇటీవల బాగా పెరిగిందని ఆయన చెప్పారు.
ఆసక్తికి తగ్గట్టు ప్రోత్సహిస్తే..
పిల్లలకు ఆన్‌లైన్ క్లాసులు మొదలుకావడంతో వారిపై ఒత్తిడి పెరుగుతోంది. పిల్లల్ని ఎలా ఎం గేజ్ చేయాలో తెలియక పెద్దలు అయోమయపడుతున్నారు. ఈ సమయంలో చదువంటూ పోరుతుండడం సరికాదు. పుట్టినప్పటి నుంచి ప్రతీ ఒక్కరిలో పదిరకాల తెలివితేటలుంటా యి.పెరిగే కొద్దీ వాటిలో 2–3 బలంగా మారతాయి. వాటిని గుర్తించి వారి అభిరుచికి తగ్గట్టు, వారు కోరుకునే రంగాల్లో ప్రోత్సహిస్తే భవిష్యత్‌లో రాణించి ఉన్నతస్థాయికి చేరతారు. – డాక్టర్ సి.వీరేందర్, సైకాలజిస్ట్
Comments
Please login to add a commentAdd a comment