బంగ్లాదేశ్‌లో ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఫలితంగా నదులు ఉప్పొంగి వరదలు సంభవిస్తున్నాయి. వరదల బారినపడి 20 మంది ప్రాణాలు కోల్పోయారు. 52 లక్షల మందికి పైగా జనం వరదల కారణంగా నిరాశ్రయులయ్యారని సంబంధిత అధికారులు మీడియాకు తెలిపారు. వీరికి ఆహారం, తాగునీరు, మందులు, దుస్తులు అందించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. అయితే మారుమూల ప్రాంతాల్లో రోడ్లు మూసుకుపోవడంతో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం ఎదురవుతోంది.
తాత్కాలిక ప్రభుత్వ ప్రధాన సలహాదారు మహ్మద్ యూనస్ మీడియాతో మాట్లాడుతూ వరద బాధితులను ఆదుకునేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నామని, పరిస్థితులు కాస్త మెరుగువుతున్నాయని అన్నారు. నోబెల్ శాంతి బహుమతి గ్రహీత యూనస్ బంగ్లాదేశ్‌లో తాత్కాలిక ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తున్నారు. మాజీ ప్రధాని షేక్ హసీనా దేశం విడిచి వెళ్లిన తర్వాత యూనస్ ప్రమాణ స్వీకారం చేశారు.
కాగా దేశంలోని 11 వరద ప్రభావిత జిల్లాల్లో ఏర్పాటు చేసిన 3,500 షెల్టర్లలో నాలుగు లక్షల మందికి పైగా ప్రజలు తలదాచుకుంటున్నారని అధికారులు తెలిపారు. 750 వైద్య బృందాలు వారికి వైద్య సహాయం అందిస్తున్నాయి. ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ, బోర్డర్ గార్డ్ బంగ్లాదేశ్ బృందాలు సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment