
2021 నాటికి ‘వర్కింగ్ ఏజ్’ జనాభా 64%
న్యూఢిల్లీ: దేశంలో పనిచేసే వయసులో ఉన్నవారి జనాభా నిష్పత్తి 2001లో ఉన్న 58 శాతం నుంచి 64 శాతానికిపైగా పెరిగే అవకాశం ఉందని కేంద్రం ఆర్థిక సర్వేలో అంచనా వేసింది. వీరిలో 20 ఏళ్ల నుంచి 35 ఏళ్ల వయసువారు ఎక్కువగా ఉంటారని తెలిపింది. 2020 నాటికి 125 కోట్లకు చేరుకునే దేశ జనాభాలో ప్రజల సగటు వయసు 29 ఏళ్లుగా ఉంటుందని వివరించింది. 2011 నుంచి 2016 మధ్యలో 6.35 కోట్ల మంది యువతీయువకులు కొత్తగా ఈ జాబితాలో చేరతారని ప్రభుత్వం తెలిపింది. మానవ వనరుల అభివృద్ధికి ఈ జనాభా పెరుగుదలను అవకాశంగా మలచుకోవాలని సర్వే సూచించింది