ఎక్కువ మంది పిల్లలుంటే జనాభా సంక్షోభాన్ని తగ్గించొచ్చని అపరకుబేరుడు ఎలాన్ మస్క్ వాదిస్తున్నారు. అయితే, తాజాగా పిల్లలు, ఓటింగ్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఓ యూజర్ చేసిన ట్వీట్‌కు స్పందించిన మస్క్..సంతానం లేని వారు ఓటు వేసేందుకు అనర్హులుగా పరిగణలోకి తీసుకోవాలని అన్నారు. ట్విటర్ యూజర్ డేటాహజార్డ్ ‘తల్లిదండ్రులకు ఓటు హక్కును పరిమితం చేయకుండా ప్రజాస్వామ్యంలో ఆచరణ సాధ్యం కాదంటూ చేసిన ట్వీట్‌కు ప్రతిస‍్పందించారు. ఆ కామెంట్‌ను సమర్ధిస్తూ మస్క్ రిప్లయి ఇచ్చారు.
గత ఏడాది జననాల రేటుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆల్ ఇన్ సమ్మిట్‌లో మాట్లాడుతూ .. కొంతమంది తక్కువ పిల్లలుంటే పర్యావరణానికి మంచిదని భావిస్తారు. ఇది అర్ధం లేని వ్యవహారం. జనాభా పెరుగుతున్నప్పటికీ పర్యావరణం బాగానే ఉంటుందని వ్యాఖ్యానించారు.
Democracy is probably unworkable long term without limiting suffrage to parents.
— ~~datahazard~~ (@fentasyl) July 2, 2023
Helps solve the procreation problem, too. https://t.co/9zZ6eV56W1
అర్ధం పర్ధం లేని మాటలు
అందుకు జపాన్‌లో క్షీణిస్తున్న జననాల రేటును ఉదహరించారు. 2021లో జపాన్ జనాభా 600,000 మంది క్షీణించిందని, తద్వారా తన ఉనికిని కోల్పేయే ప్రమాదం ఉందని అన్నారు.జనాభా ఎక్కువగా ఉంటే ప్రపంచ నాగరికత క్షీణించదని, పిల్లలను కలిగి ఉండటం పర్యావరణానికి హానికరం కాదని తన వైఖరిని కూడా స్పష్టం చేశారు. నాగరికతను కాపాడుకోవడానికి ఇది చాలా అవసరమని పేర్కొన్నారు.
చైనాలో జనాభా
చైనాలో జనాభా పెరుగుదల రేటు భారీ స్థాయిలో పడిపోతోందంటూ వచ్చిన పలు నివేదికలపై మస్క్ కీలక వ్యాఖ్యలు చేశారు. అతి తొందరలోనే చైనా జనాభా పతనాన్ని చవిచూడనుందని హెచ్చరించారు. చైనాలో జననాల రేటు గణనీయంగా క్షీణిస్తోందని .. రానున్న రోజుల్లో మరింత పతనం అవుతుందని అంచనా వేశారు.
Comments
Please login to add a commentAdd a comment