Voting rights
-
ఓటేసిన 2.1 కోట్ల అమెరికన్లు
భారత సార్వత్రిక ఎన్నికల్లో ఓటింగ్‌కు 36 గంటల ముందే ప్రచారానికి తెర పడుతుంది. కానీ అమెరికాలో అలా కాదు. కనీసం నాలుగు వారాల పాటు ప్రచారం, ఓటింగ్ సమాంతరంగా సాగుతాయి. అమెరికా అధ్యక్ష ఎన్నికలకు మరో 12 రోజులే ఉంది. నవంబర్ 5న దేశవ్యాప్తంగా పోలింగ్ జరగనుంది. కానీ ఏకంగా 2.1 కోట్ల మంది అమెరికన్లు ఇప్పటికే ఓటు హక్కు వినియోగించుకోవడం విశేషం. డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్, రిపబ్లికన్ పార్టీ ప్రత్యర్థి డొనాల్డ్ ట్రంప్ హోరాహోరీగా తలపడుతుండటం తెలిసిందే.1.33 కోట్ల పోస్టల్ ఓట్లుఫ్లోరిడా వర్సిటీ ఎలక్షన్ ల్యాబ్ డేటా ప్రకారం 78 లక్షల ఓట్లు వ్యక్తిగత పద్ధతుల ద్వారా పోలయ్యాయి. మిగతా 1.33 కోట్ల పై చిలుకు ఓట్లు పోస్టల్ బ్యాలెట్ల ద్వారా పోలయ్యాయి. ఆసియన్ అమెరికన్లలో మాత్రం 1.7 శాతం మంది మాత్రమే ముందస్తు ఓటింగ్‌ను ఉపయోగించుకున్నట్టు ఎలక్షన్ ల్యాబ్ తెలిపింది. దాని గణాంకాల ప్రకారం వ్యక్తిగత ప్రారంభ ఓటర్లలో 41.3 శాతం మంది రిప బ్లికన్లు ఓటు వేయగా, డెమొక్రాట్లు 33.6 శాతం మంది ఓటు వేశారు. పోస్టల్ బ్యా లెట్ల ద్వారా డెమొ క్రాట్లు 20.4 శాతం, రిపబ్లికన్లు 21.2 శాతం ఓటు హక్కును వినియో గించుకున్నారు.జార్జియా రాష్ట్రంలో నాలుగో వంతు ఓటర్లు ఇప్పటికే ఓటేశారు. 18.4 లక్షల మంది జార్జియన్లు ఓటు హక్కును వినియోగించుకున్నారని సెక్రటరీ ఆఫ్ స్టేట్ కార్యాలయం తెలిపింది. ఇలినాయీ, టెక్సాస్ రాష్ట్రాల్లోనూ ముందస్తు ఓటింగ్ ఎక్కువగా జరిగింది. ఓటింగ్ సెంటర్లలో ఎక్కడ చూసినా పార్కింగ్ ప్రదేశాలు కిక్కిరిసి కన్పించాయి.అత్యధికంగా ఓటేసింది రిపబ్లికన్లే7 అతి కీలక స్వింగ్ స్టేట్లయిన అరిజోనా, నెవెడా, విస్కాన్సిన్, మిషిగన్, పెన్సిల్వేని యా, నార్త్ కరోలినా, జార్జియాల్లో ఫలితాలే అధ్యక్ష ఎన్నికల విజేతను నిర్ణయిస్తాయని అమెరికా రాజకీయ పండితులు చెబుతుంటారు. ఈ కీలక యుద్ధభూమి రాష్ట్రాల్లో ముందస్తు ఓటింగ్‌లో రిపబ్లికన్ ఓటర్లే పెద్ద సంఖ్యలో కనిపిస్తున్నారని సీనియర్ పొలి టికల్ జర్నలిస్ట్ మార్క్ హాల్పెరిన్ అన్నారు. బహుశా మాజీ అధ్యక్షుడు ట్రంప్ విజయానికి ఇది సూచిక కావచ్చని అభిప్రాయపడ్డారు. రిపబ్లికన్లు ఊహించిన దానికంటే ఎక్కువ సంఖ్యలో ముందస్తు ఓటింగ్‌లో పాల్గొంటున్నట్టు న్యూయార్క్ టైమ్స్ తెలిపింది. ఈ విషయంలో రిపబ్లికన్ పార్టీ బాగా శ్రమించిందని అరిజోనాలో ముందస్తు బ్యాలెట్లను ట్రాక్ చేసే డెమొక్రాటిక్ రాజకీయ వ్యూహకర్త శామ్ అల్మీ అంగీకరించారు.ప్రత్యేక సౌలభ్యం.. ముందస్తు ఓటింగ్ అమెరికా ఓటర్లకున్న ప్రత్యేకమైన సౌలభ్యం. వారు మెయిల్– ఇన్– బ్యాలెట్ ద్వారా ఓటు హక్కును వినియోగించుకుంటారు. దీన్ని మన దగ్గరి పోస్టల్ బ్యాలెట్‌తో పోల్చవచ్చు. కొన్ని చోట్ల పోలింగ్ రోజుకు వారాల ముందే పోలింగ్ కేంద్రాలను తెరుస్తారు. ముందుగానే ఓటేయాలనుకునే వారు నిర్ధారిత బూత్‌లకు వెళ్లి ఓటు హక్కును వినియోగించుకుంటారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
Lok sabha elections 2024: ఓటేస్తే డిస్కౌంట్... ఫ్రీ హెయిర్ కట్!
ప్రజాస్వామ్యంలో ఓటే వజ్రాయుధం! మన రాత మారాలన్నా, నేతల తలరాతలు మార్చాలన్నా మన చేతుల్లోనే ఉంది. అందుకే ప్రతి ఓటరూ ఓటు హక్కు వినియోగించుకోవాలంటూ ఎన్నికల సంఘం కోడై కూస్తోంది. అయినా కొందరిలో మాత్రం చలనం శూన్యం. అందుకే, ఈ ఓట్ల జాతరలో దుమ్మురేపేందుకు మేము సైతం అంటున్నారు కొందరు ఔత్సాహిక వ్యాపారులు. అటు ఓటింగ్ శాతం, ఇటు తమ వ్యాపారం పెరిగేలా బంపర్ ఆఫర్లు ప్రకటిస్తున్నారు. ‘ఓటేసి వేలిపై సిరా చుక్క చూపండి, డిస్కౌంట్ పొందండి’ అంటూ ఓటర్లను ఊరిస్తున్నారు. ఉత్తరాఖండ్ హోటల్, రెస్టారెంట్ అసోసియేషన్ తాజాగా ఆఫర్ ప్రకటించింది. రాష్ట్రంలో 19న శుక్రవారం ఒకే విడతలో లోక్‌సభ ఎన్నికలు పూర్తవుతాయి. పోలింగ్ ముగిసిన తర్వాత నుంచి 20వ తేదీ సాయంత్రం దాకా తమ హోటళ్లు, రెస్టారెంట్లలో ఏం తిన్నా బిల్లులో 20 శాతం డిస్కౌంట్ ఇస్తామని తెలిపింది. ఓటింగ్ శాతాన్ని పెంచేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని, వేలిపై సిరా గుర్తు చూపి డిస్కౌంట్ పొందచ్చొని అసోసియేషన్ ప్రెసిడెంట్ సందీప్ సాహ్ని చెబుతున్నారు. శుక్రవారమే రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్ జరగనున్న తమిళనాడులోని చెంగల్పట్టు జిల్లాలో కూడా ఓటేసిన వారికి పోలింగ్ రోజు హోటళ్లు, ఫుడ్ స్టాల్స్, బేకరీలు.. ఇలా ఎక్కడ ఏం తిన్నా 5 శాతం తగ్గింపు లభిస్తుంది. ఓటర్లను ప్రోత్సహించేందుకే ఈ చర్యలు చేపట్టినట్లు జిల్లా కలెక్టర్ ఎస్.అరుణ్ రాజ్ చెప్పారు. ఇక కాంచీపురం కలెక్టర్ కలైసెల్వి మోహన్ వాటర్ బాటిళ్లపై పోలింగ్ సంబంధ పోస్టర్లను అతికించడం ద్వారా ఓటర్లలో చైతన్యం నింపుతున్నారు. ఏప్రిల్ 26న రెండో విడతలో పోలింగ్ జరిగే మహారాష్ట్రలోని అకోలాకు చెందిన అనంత కౌల్కర్ అదిరిపోయే ఆఫరిచ్చాడు. ఓటేసి సిరా గుర్తు చూపిన వారికి తన సెలూన్లో ఫ్రీగా హెయిర్ కట్ చేస్తాననంటూ షాపు ముందు బోర్డు పెట్టేశాడు. మే 25న ఆరో విడతలో పోలింగ్ జరగనున్న జంషెడ్‌పూర్‌లో కూడా ఓటేసిన వారికి హోటళ్లు, రెస్టారెంట్లు, మాల్స్, కోచింగ్ సెంటర్ల నిర్వాహకులు డిస్కౌంట్ ఇచ్చేలా ఈసీ అధికారులు ఒప్పించారు. గత నవంబర్‌లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బైక్ ట్యాక్సీ సంస్థ ర్యాపిడో 2,600 పై చిలుకు పోలింగ్ బూత్‌లకు ఫ్రీ రైడ్స్ ఆఫర్ చేయడం తెలిసిందే. ఈసారి సార్వత్రిక ఎన్నికలు ఏడు విడతల్లో జూన్ 1 దాకా సుదీర్ఘంగా జరగనున్న నేపథ్యంలో ఆఫర్ల జోరు కూడా పెరిగేలా కనిపిస్తోంది! -
2024: ఎన్నికల ఏడాది
2024ను ఎన్నికల ఏడాదిగా పిలవాలేమో. ఎందుకంటే ఈ ఏడాది ఏకంగా 50కి పైగా దేశాల్లో సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి! ఒక్క ఏడాదిలో ఇన్ని దేశాల్లో ఎన్నికలు జరగడం చరిత్రలో ఇదే తొలిసారి. అలా 2024 రికార్డులకెక్కబోతోంది. పైగా అత్యధిక జనాభా ఉన్న టాప్ 10 దేశాల్లో ఏకంగా ఏడు ఈసారి ఎన్నికల పోరుకు సిద్ధమవుతుండటం విశేషం. ఆ లెక్కన ప్రపంచ జనాభాలో దాదాపు సగం మంది ఈ ఏడు ఓటు హక్కును వినియోగించుకోనుండటం ఇంకో విశేషం! ప్రపంచంలోనే అత్యధిక జనాభా ఉన్న భారత్ మొదలుకుని అగ్ర రాజ్యం అమెరికా దాకా ఈ జాబితాలో ఉన్న ముఖ్యమైన దేశాలను ఓసారి చూద్దాం... బంగ్లాదేశ్ 17 కోట్ల జనాభా ఉన్న బంగ్లాదేశ్ ఈ ఏడాది ఎన్నికలు జరగనున్న తొలి దేశం. జనవరి 7న అక్కడ సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. అయితే విపక్షాలన్నింటినీ నిరీ్వర్యం చేసి ఏకపక్ష ఎన్నికల ప్రహసనానికి తెర తీశారంటూ ప్రధాని షేక్ హసీనా ఇంటా బయటా విమర్శలు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వ అణచివేతను తట్టుకోలేక పలువురు విపక్ష నేతలు ప్రవాసంలో గడుపుతున్నారు. బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పారీ్టతో పాటు విపక్షాలన్నీ బాయ్‌కాట్ చేసిన ఈ ఎన్నికల్లో హసీనా మరోసారి నెగ్గడం, వరుసగా ఐదోసారి అధికారంలోకి రావడం లాంఛనమే కానుంది. ప్రజాస్వామ్యానికి చెల్లుచీటీ పాడి చైనా మాదిరిగా దేశంలో హసీనా ఏక పార్టీ వ్యవస్థను నెలకొల్పేలా ఉన్నారని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. తైవాన్ చైనా పడగ నీడన తన స్వతంత్ర ప్రతిపత్తిని కాపాడుకునేందుకు ఆపసోపాలు పడుతున్న తైవాన్‌లో జనవరి 13న అధ్యక్ష ఎన్నికలు జరుగుతున్నాయి. అధికార డీపీపీ తరఫున ప్రస్తుత అధ్యక్షుడు సై ఇంగ్ వెన్కు బదులుగా లై చింగ్ టే బరిలో ఉన్నారు. ఆయనకు వెన్కు మించిన స్వాతంత్య్ర ప్రియునిగా పేరుంది. ఉదారవాద క్యోమింటాంగ్ నేత హో యూ యీ, తైవాన్ పీపుల్స్ పార్టీ తరఫున కో వెన్ జే ఆయనను సవాలు చేస్తున్నారు. డీపీపీ 2016 నుంచీ అధికారంలో కొనసాగుతోంది. ఈసారి కూడా అది అధికారంలోకి వస్తే యుద్ధానికి దిగైనా తైవాన్ను విలీనం చేసుకుంటానంటూ చైనా ఇప్పటికే బెదిరిస్తోంది. దాంతో ఈ ఎన్నికలు తైవాన్‌కు ఒకరకంగా జీవన్మరణ సమస్యగా పరిణమించాయి. పాకిస్తాన్ 24 కోట్ల జనాభా ఉన్న పాక్ అనిశి్చతికి మారుపేరు. షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 8న సార్వత్రిక ఎన్నికలు జరగాలి. కానీ అవి వాయిదా పడే సూచనలే ఎక్కువగా కని్పస్తున్నాయి. సైన్యాన్ని ఎదిరించి ప్రధాని పదవి కోల్పోయి అవినీతి కేసుల్లో జైలు పాలైన పీటీఐ చీఫ్ ఇమ్రాన్‌ఖాన్ పోటీకి దారులు మూసుకుపోయినట్టు కని్పస్తున్నాయి. ఆయన నామినేషన్లు ఇప్పటికే తిరస్కరణకు గురయ్యాయి. ఎన్నికలు స్వేచ్ఛాయుత వాతావరణంలో జరగడం అనుమానంగా మారింది. సైన్యం దన్నుతో పాకిస్తాన్ ముస్లిం లీగ్ (పీఎంఎల్) విజయం, ప్రవాసం నుంచి తిరిగొచి్చన ఆ పార్టీ నేత నవాజ్ షరీఫ్ మరోసారి ప్రధాని కావడం లాంఛనమేనని అక్కడి రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. ఇండొనేసియా 27 కోట్ల పై చిలుకు జనాభా ఉన్న ఇండొనేసియాలో కూడా ఫిబ్రవరిలో ఎన్నికలున్నాయి. అధ్యక్షుడు, ఉపాధ్యక్షునితో పాటు జిల్లా, రాష్ట్ర, జాతీయ పార్లమెంటు సభ్యులకు ఫిబ్రవరి 14న ఒకే రోజున ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే రెండు టర్ములు పూర్తి చేసుకున్న అధ్యక్షుడు జొకో విడొడొ స్థానంలో రక్షణ మంత్రి 72 ఏళ్ల ప్రాబొవో సుబియంటో బరిలో ఉన్నారు. గంజర్ ప్రనోవో, అనీస్ బస్వేదన్ గట్టి పోటీ ఇస్తున్నారు. భారత్ 140 కోట్లకు పైగా జనాభా, 90 కోట్ల పై చిలుకు ఓటర్లతో ప్రపంచంలోకెల్లా అతి పెద్ద ప్రజాస్వామ్యంగా అలరారుతున్న భారత్ ఏప్రిల్, మే నెలల్లో సార్వత్రిక ఎన్నికల సమరానికి సన్నద్ధమవుతోంది. ఇన్ని కోట్ల మంది ఓటర్లు అత్యంత శాంతియుతంగా, ప్రజాస్వామికంగా ఓటు హక్కును వినియోగించుకోవడాన్ని ఎన్నికలు జరిగిన ప్రతిసారీ ప్రపంచమంతా అబ్బురపాటుతో వీక్షించడం పరిపాటిగా మారింది. ఈ ఎన్నికల్లో ప్రధానిగా నరేంద్ర మోదీ హ్యాట్రిక్ ఖాయమని అత్యధిక రాజకీయ అంచనాలు చెబుతున్నాయి. బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ కూటమిని 2014లో ఆయన ఒంటి చేత్తో అధికారంలోకి తేవడం తెలిసిందే. 2019లోనూ మోదీ మేజిక్ రిపీటైంది. ఈసారి దానికి ఎలాగైనా అడ్డుకట్ట వేయాలని కాంగ్రెస్ సారథ్యంలో 28 విపక్ష పారీ్టలతో కూడిన విపక్ష ఇండియా కూటమి ప్రయతి్నస్తోంది. మెక్సికో జూన్ 2న ఎన్నికలకు మెక్సికో సిద్ధమవుతోంది. 13 కోట్ల జనాభా ఉన్న ఈ దేశ చరిత్రలోనే తొలిసారిగా అధ్యక్ష పదవితో పాటు మొత్తం 32 రాష్ట్రాల గవర్నర్లు, జాతీయ కాంగ్రెస్, స్థానిక సంస్థల స్థానాలకు ఒకేసారి ఎన్నికలు జరగనున్నాయి. క్లాడియా షేన్‌బామ్ రూపంలో ఈసారి తొలిసారిగా ఓ మహిళ అధ్యక్ష పదవి చేపట్టే ఆస్కారం కనిపిస్తుండటంతో ఈ ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. సైంటిస్టు, మెక్సికో సిటీ మాజీ మేయర్ అయిన ఆమె అధికార మొరేనా పార్టీ తరఫున బరిలో దిగుతున్నారు. యూరోపియన్ యూనియన్ యూరోపియన్ యూనియన్‌లోని మొత్తం 27 దేశాల ప్రజలూ కీలకమైన ప్రతి ఐదేళ్లకోసారి యూరప్ పార్లమెంటులో తమ ప్రతినిధులను ప్రత్యక్ష ఓటింగ్ పద్ధతిలో ఎన్నుకుంటారు. విద్య, వైద్యం మొదలుకుని ఉపాధి దాకా ఆ దేశాలను తీవ్రంగా ప్రభావితం చేసే పలు కీలక రంగాలకు సంబంధించి నిర్ణాయక చట్టాలు చేయడంలో పార్లమెంటుదే కీలక పాత్ర. దాంతో జూన్ 6 నుంచి 9 దాకా జరగనున్న ఈ ఎన్నికలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మొత్తం 720 మంది పార్లమెంటు సభ్యులు ఎన్నికవుతారు. దక్షిణాఫ్రికా 6 కోట్ల పై చిలుకు జనాభా ఉన్న ఈ దేశంలో మే–ఆగస్టు మధ్య సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. 1994లో దేశంలో వర్ణ వివక్ష అంతమయ్యాక జరుగుతున్న ఏడో ఎన్నికలివి. అప్పటినుంచీ అధికారంలో కొనసాగుతున్న ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ (ఏఎన్సీ) ఈసారి విజయానికి కావాల్సిన 50 శాతం మార్కును దాటడం కష్టకాలమేనంటున్నారు. గత అక్టోబర్‌లో జరిగిన సర్వేలో ఆ పారీ్టకి మద్దతు 45 శాతానికి పడిపోయింది. అవినీతి మకిలి అధ్యక్షుడు సిరిల్ రామాఫోసాకు ఈసారి ప్రధాన అడ్డంకిగా మారేలా కని్పస్తోంది. అధికారంలోకి వస్తూనే పూర్వ అధ్యక్షుడు జాకబ్ జుమా అవినీతిని క్షమించడం తీవ్ర వ్యతిరేకతకు దారి తీసింది. అధికారుల్లో పెచ్చరిల్లిన అవినీతి పరిస్థితిని ఏఎన్‌సీకి మరింత ప్రతికూలంగా మార్చిందంటున్నారు. విపక్ష డెమొక్రటిక్ అలయెన్స్ దానికి గట్టిపోటీ ఇచ్చేలా కని్పస్తోంది. అమెరికా 33 కోట్ల పై చిలుకు జనాభా ఉన్న అగ్ర రాజ్యంలో అధ్యక్ష ఎన్నికలు ఎప్పుడూ ప్రపంచాన్ని ఆకర్షించేవే. అధ్యక్షున్ని ఎన్నుకోవడంతో పాటు ప్రతినిధుల సభలో మొత్తం స్థానాలతో పాటు సెనేట్‌లో మూడో వంతు సీట్లకు కూడా పోలింగ్ జరుగుతుంది. అయితే ఈసారి నవంబర్ 5న జరగనున్న ఎన్నికలపై మరింత ఆసక్తి నెలకొనేలా ఉంది. మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెంపరితనమే అందుకు ఏకైక కారణం! 2020 అధ్యక్ష ఎన్నికల్లో ఓటమిని ఒప్పుకునేందుకు ఆయన ససేమిరా అనడం, తననే విజేతగా ప్రకటించాలంటూ మొండికేయడం తెలిసిందే. డెమొక్రటిక్ అభ్యర్థి జో బైడెన్‌ను అధ్యక్షునిగా ప్రకటించకుండా అడ్డుకునేందుకు ఏకంగా క్యాపిటల్ భవనంపైకి తన మద్దతుదారులను దాడికి ఉసిగొల్పారు ట్రంప్. ఆ కేసులో ఆయన దోషిగా తేలడం, ఈసారి అధ్యక్ష ఎన్నికల్లో పోటీకి అనర్హునిగా మారే ప్రమాదంలో పడటం విశేషం! ఈ గండం గట్టెక్కితే ట్రంప్ మరోసారి బైడెన్‌తోనే తలపడతారు. ఘనా 3 కోట్ల జనాభా ఉన్న ఈ దేశంలో డిసెంబర్ 7న ఎన్నికలు జరగనున్నాయి. వరుసగా రెండోసారి అధ్యక్షునిగా కొనసాగుతున్న ననా అకుఫో అడో స్థానంలో కొత్త నేతను ఎన్నుకునేందుకు ప్రజలు సిద్ధమవుతున్నారు. అధికార న్యూ పేట్రియాటిక్ పార్టీ, విపక్ష నేషనల్ డెమొక్రటిక్ కాంగ్రెస్ మధ్య ఈసారి హోరాహోరీ ఖాయమంటున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
సాక్షి కార్టూన్ 01-12-2023
-
ఒకేసారి ఓటు ప్రజాస్వామ్యానికి చేటు
‘ఒకే దేశం– ఒకే ఎన్నిక’ను సమర్థించే వారి దగ్గర రెండు వాదనలు ఉన్నాయి. మొదటిది – ఖర్చు తగ్గుతుంది. రెండవది – ఒకేసారి ఎన్నికలు జరగడం వల్ల ఎన్నికల నియమావళి ఆంక్షలు దేశవ్యాప్తంగా ఒకే కాలానికి వర్తింపులో ఉంటాయి. దాని వల్ల అభివృద్ధి కుంటుపడదు. ఇక వ్యతిరేక వాదనలు వివేచన, వాస్తవికతల్లోంచి జనించినవి. ఓటు హక్కును ‘ప్రజాస్వామ్యంలోని అత్యంత ప్రాథమికమైన భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ’ అని చెబుతారు. ఆ హక్కుకు ‘ఒకే దేశం–ఒకే ఎన్నిక’ విధానం పరిమితులను విధిస్తుంది. పార్లమెంటరీ ఎన్నికలు ఇప్పటికే అధ్యక్ష తరహా ఎన్నికలుగా మారుతున్న పరిస్థితుల్లో, ఈ ఏకకాల ఎన్నికలు పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని మొత్తంగానే నాశనం చేసే ప్రమాదం ఉంది. ‘ఒకే దేశం–ఒకే ఎన్నిక’ వల్ల ప్రయోజ నాలు, నిష్ప్రయోజనాలను నేను సరిగ్గా, సరళంగా, సమతులంగా చెప్పగలనేమో చూద్దాం! ‘ఒకే దేశం – ఒకే ఎన్నిక’ అనే భావన పైన, ఆ ఆవశ్యకత పైన అవగాహన కోసం ఇది మీకు సహాయకారిగా ఉండవచ్చు. ‘ఒకే దేశం – ఒకే ఎన్నిక’ను సమర్థించే వారి దగ్గర రెండు వాదనలు ఉన్నాయి. మొదటిది, ఖర్చు తగ్గుతుంది. కదా మరి, దేశ వ్యాప్తంగా ఒకేసారి ఐదేళ్లకు జరిగే ఎన్నికల ఖర్చు... వివిధ సమయా లలో అనేకసార్లు జరిగే పలు ఎన్నికల మొత్తానికీ అయ్యే ఖర్చు కంటే తక్కువగానే ఉంటుంది. అయితే థరూర్, చక్రవర్తి అదేమంత చెప్పు కోదగిన పొదుపు కాదని అంటున్నారు. ఏడాదికి రూ. 5,000 కోట్ల లోపే ఉండే ఆ పొదుపు మొత్తం లేకున్నా కూడా భారత్ వంటి ఒక పెద్ద ఆర్థిక వ్యవస్థలో అది ఏమంత నిర్ణయాత్మకమైన ఆందోళన కారకం కాదనేది వారి వాదన. రెండవ అనుకూల వాదన ఏమిటంటే, దేశం మొత్తానికీ ఒకేసారి ఎన్నికలు జరగడం వల్ల ఎన్నికల నియమావళి ఆంక్షలు దేశవ్యాప్తంగా ఒకే కాలానికి వర్తింపులో ఉంటాయి. దాని వల్ల ఎప్పుడూ ఏదో ఒకచోట అమలులో ఉండే ఎన్నికల ఆంక్షల కారణంగా అభివృద్ధి కుంటుపడటం అనే సమస్య ఉండదు. ప్రస్తుతం సార్వత్రిక ఎన్నికల నియమావళి అన్నది దేశవ్యాప్తంగా అమలుకావలసి ఉన్నప్పటికీ రాష్ట్ర స్థాయిలో ఆ నియమావళి అమలు పెద్ద విషయంగా ఉండటం లేదు. అసలు అమలవుతోందా అన్నది కూడా ముఖ్యమైన ప్రశ్న. అక్కడ ఆంక్షల్ని అతిక్రమిస్తున్నది అధికార పార్టీకి చెందినవారైతే నియమావళి నిస్సందేహంగా అమలు కానట్లే! ఇక వ్యతిరేక వాదనలు వివేచన, వాస్తవికతల్లోంచి జనించే ప్రాథమికమైన స్వభావం కలిగి ఉన్నవి. ఓటు హక్కును ‘‘ప్రజాస్వా మ్యంలోని అత్యంత ప్రాథమికమైన భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ’’ అని చెబుతారు. ఆ హక్కుకు ‘ఒకే దేశం– ఒకే ఎన్నిక’ పరిమితులను విధిస్తుంది. ఉదాహరణకు, ప్రభుత్వం తన మెజారిటీ కోల్పోయి నప్పుడు కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకునేందుకు ఓటర్లకు ఉన్న హక్కును హరించేలా పార్లమెంటును కొనసాగించే మార్గాల అన్వేషణ జరిగే అవకాశం ఉంటుంది. అలాగే ‘ఒకే దేశం–ఒకే ఎన్నిక’ అనే ఈ భావన మనం కోరుకుంటున్న ప్రజాస్వామ్య ప్రయాణ మార్గాన్ని విఘాత పరచనూవచ్చు. ఆ మార్గాన్ని మనం విస్తృతపరచుకోవడానికి, మరింత లోతుకు తీసుకు వెళ్లడానికి ‘ఒకే దేశం–ఒకే ఎన్నిక’ విధానం అడ్డుపడుతుంది. ఉదా హరణకు, ఓటు వేసి ఎన్నుకున్న నాయకులను తిరిగి వెనక్కు పంపే హక్కు మనకు ఉండాలి. 50 ఏళ్ల క్రితమే 1974లో వాజ్‌పేయి ఈ ‘రీకాల్’ హక్కు అవసరాన్ని గుర్తించారు. అయితే ‘ఒకే దేశం–ఒకే ఎన్నిక’ ఈ హక్కుకు విరుద్ధమైనది. ఐదేళ్లకోసారి ఎన్నికలు అనే విధానం... ఓటు వేసి, ప్రభుత్వాలను ఎన్నుకునేందుకు పౌరులకున్న అవకాశాన్ని కుదించడం ద్వారా మన ప్రజాస్వామ్యాన్ని ఇరుకైనదిగా మార్చేస్తుంది. ఇప్పుడిక ‘ఒకే దేశం–ఒకే ఎన్నిక’ విధానం అమలుకు అవసర మైన రాజ్యాంగ సవరణల చిక్కుల దగ్గరికి వద్దాం. మొదటిది–ఎన్నికల ఏకకాలీనత కోసం సవరణలు! ఆ సవరణల వల్ల కొన్ని రాష్ట్రాల్లో శాసనసభలు పొడిగింపును పొందుతాయి. మరికొన్ని చోట్ల శాసనసభల కాలపరిమితిని కుదించాల్సి వస్తుంది. అప్పుడది కచ్చితంగా ప్రజాతీర్పునకు వ్యతిరేకంగా ఆడుతున్న ఆట అవదా? ఓటర్లు ఇచ్చిన ఐదేళ్ల కాలాన్ని ఏకపక్షంగా తగ్గించడమో, పెంచడమో చేసినట్లే కదా! ఐదేళ్ల కన్నా ముందే ప్రభుత్వం పడిపోతే అప్పుడు రెండో రకం సవరణలు అవసరం అవుతాయి. మిగిలిన కాలానికి రాష్ట్రపతి పాలన రాష్ట్ర స్థాయిలో అవాంఛనీయమైనదీ, కేంద్రస్థాయిలో అసాధ్యమైనదీ. ఇందుకు ఒక పరిష్కారం– జర్మనీ తరహా నిర్మాణాత్మక అవిశ్వాస తీర్మానం. ఎలాగంటే, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే బలం ఉంటే తప్ప అవిశ్వాస తీర్మానంతో ప్రభుత్వాన్ని పడగొట్టడానికి లేదక్కడ. పడగొట్టినవాళ్లే ప్రభుత్వాన్ని నిలబెట్టాలి. వినడానికి బాగుంది కానీ, ఆచరణలో ఎల్లవేళలా ఇది సాధ్యమా? ఉదాహరణకు, పాలకపక్షం నుంచి చీలిపోయిన పక్షం, ప్రతిపక్షం వైపు మొగ్గు చూపడానికి నిరా కరిస్తే అప్పుడేం జరుగుతుంది? ఆ పరిస్థితుల్లో ప్రభుత్వం తన మెజా రిటీని కోల్పోతుంది, కానీ ఆ స్థానంలోకి వచ్చేవారెవరూ లేకపోవడం వల్ల అలాగే కుంటుతూ నడుస్తుంది. లేదా ఒకవేళ సంకీర్ణ కూటమిలోని భేదాభిప్రాయాల వల్ల బడ్జెట్‌కు పార్లమెంటులో ఆమోదం లభించలేదనే అనుకుందాం? అప్పుడిక పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థలో అటువంటి ప్రభుత్వం తప్పనిసరిగా రాజీనామా చేయాల్సిందే. కానీ çసభ్యుల బలం ఉన్న కారణంగా బడ్జెట్‌కు ఆమోదం పొందలేని ఆ ప్రభుత్వం ఏమీ కుప్పకూలి పోదు. ఇలాంటి సందర్భాలలో ఐదేళ్ల కాల వ్యవధిలో మిగిలి ఉన్న కాలానికి మాత్రమే ఎన్నికలు నిర్వహించుకోవచ్చని ఎన్నికల సంఘం సూచించింది. అయితే అది ఓటు అనే వనరును నిర్లక్ష్యంగా ఉపయో గించుకున్నట్టు అవదా? ఓటు విలువ కొన్నిసార్లు ఐదేళ్ల కాలానికీ, మరి కొన్నిసార్లు ఐదేళ్లలో మిగిలిన భాగానికీ ఉంటుందా? ప్రజాస్వామ్యంలో రెండు రకాల ఓట్లు ఉండొచ్చా? ఇవీ ‘ఒకే దేశం–ఒకే ఎన్నిక’ భావనకు సంబంధించి పైపైన ఆలో చిస్తేనే ఉత్పన్నమయ్యే ప్రాథమిక ఆందోళనలు. భారతదేశ ప్రజాస్వా మ్యానికి సంబంధించి మరొక మూడు ఆందోళనకరమైన ప్రశ్నలు కూడా ఉన్నాయి. మొదటిది – పార్లమెంటరీ ఎన్నికలు ఇప్పటికే అధ్యక్ష తరహా ఎన్నికలుగా మారుతున్న పరిస్థితుల్లో, ఈ ఏకకాల ఎన్నికలనేవి ఆ ధోరణిని తీవ్రతరం చేసి మన పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని మొత్తంగానే నాశనం చేసే ప్రమాదం లేదా? రెండవది – ఒక జాతీయ పార్టీ మంచి ఊపులో ఉన్నప్పుడు, ఏక కాల ఎన్నికలు బహుళ పార్టీ వ్యవస్థను ఒకే పార్టీ ఉన్న దేశంగా మార్చకుండా ఉంటాయా? మూడవది – ఎన్నికలు మన ప్రజా శాసన సభ్యులను ప్రతిస్పందించే వారిగా, జవాబుదారీగా ఉండేవారిగా చేస్తాయని మనకొక నమ్మకం. అయితే ఐదేళ్లకోసారి మాత్రమే ఎన్నికలను నిర్వహిస్తే మధ్యలో ఏం జరిగినా వారు తమకు పట్టనట్లుగా, అహంకారంగా ఉండిపోయే అవకాశం లేదా? ఈ సమస్యల గురించి జాగ్రత్తగా ఆలోచించండి. మరీ ముఖ్యంగా మూడు అంశాలపై మీరు దృష్టి పెట్టవలసిన అవసరం ఉంది: ఏకకాల ఎన్నికల ఆవశ్యకత, వాటిని అమలు చేయడంలో వచ్చే చిక్కులు, అనంతరం వచ్చే పర్యవసానాలు. ఆ తర్వాత ‘ఇది సరైనదేనా?’ అనే ప్రశ్నకు జవాబు ఇచ్చుకోండి. కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
అవి ‘అర్ధం, పర్ధం లేని మాటలే’.. ఎలాన్ మస్క్ సంచలన వ్యాఖ్యలు!
ఎక్కువ మంది పిల్లలుంటే జనాభా సంక్షోభాన్ని తగ్గించొచ్చని అపరకుబేరుడు ఎలాన్ మస్క్ వాదిస్తున్నారు. అయితే, తాజాగా పిల్లలు, ఓటింగ్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ యూజర్ చేసిన ట్వీట్‌కు స్పందించిన మస్క్..సంతానం లేని వారు ఓటు వేసేందుకు అనర్హులుగా పరిగణలోకి తీసుకోవాలని అన్నారు. ట్విటర్ యూజర్ డేటాహజార్డ్ ‘తల్లిదండ్రులకు ఓటు హక్కును పరిమితం చేయకుండా ప్రజాస్వామ్యంలో ఆచరణ సాధ్యం కాదంటూ చేసిన ట్వీట్‌కు ప్రతిస్పందించారు. ఆ కామెంట్‌ను సమర్ధిస్తూ మస్క్ రిప్లయి ఇచ్చారు. గత ఏడాది జననాల రేటుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆల్ ఇన్ సమ్మిట్‌లో మాట్లాడుతూ .. కొంతమంది తక్కువ పిల్లలుంటే పర్యావరణానికి మంచిదని భావిస్తారు. ఇది అర్ధం లేని వ్యవహారం. జనాభా పెరుగుతున్నప్పటికీ పర్యావరణం బాగానే ఉంటుందని వ్యాఖ్యానించారు. Democracy is probably unworkable long term without limiting suffrage to parents. Helps solve the procreation problem, too. https://t.co/9zZ6eV56W1 — ~~datahazard~~ (@fentasyl) July 2, 2023 అర్ధం పర్ధం లేని మాటలు అందుకు జపాన్‌లో క్షీణిస్తున్న జననాల రేటును ఉదహరించారు. 2021లో జపాన్ జనాభా 600,000 మంది క్షీణించిందని, తద్వారా తన ఉనికిని కోల్పేయే ప్రమాదం ఉందని అన్నారు.జనాభా ఎక్కువగా ఉంటే ప్రపంచ నాగరికత క్షీణించదని, పిల్లలను కలిగి ఉండటం పర్యావరణానికి హానికరం కాదని తన వైఖరిని కూడా స్పష్టం చేశారు. నాగరికతను కాపాడుకోవడానికి ఇది చాలా అవసరమని పేర్కొన్నారు. చైనాలో జనాభా చైనాలో జనాభా పెరుగుదల రేటు భారీ స్థాయిలో పడిపోతోందంటూ వచ్చిన పలు నివేదికలపై మస్క్ కీలక వ్యాఖ్యలు చేశారు. అతి తొందరలోనే చైనా జనాభా పతనాన్ని చవిచూడనుందని హెచ్చరించారు. చైనాలో జననాల రేటు గణనీయంగా క్షీణిస్తోందని .. రానున్న రోజుల్లో మరింత పతనం అవుతుందని అంచనా వేశారు. చదవండి👉 విడుదల కాకుండానే..మెటా ‘థ్రెడ్స్’కు ఎదురు దెబ్బ! -
వలస ఓట్లపై హడావిడి
ఎన్నికల్లో ఓటర్ల భాగస్వామ్యం పెంచడానికి చేస్తున్న సరికొత్త ఆలోచన చర్చ రేపుతోంది. దేశీయంగా వలస వెళ్ళిన ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకొనేందుకు వీలుగా రిమోట్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ (ఆర్వీఎం)లను తీసుకురావాలనే ప్రయత్నంపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. భారత ఎన్నికల సంఘం జనవరి 18న ఈ కొత్త యంత్రాల ప్రయోగాత్మక ప్రదర్శన జరుపుతోంది. అది చూసి, నెలాఖరులోగా తమ సూచనలు తెలియపరచాలని రాజకీయ పార్టీలను ఆహ్వానించింది. ఏడు పదులు దాటిన భారత ప్రజాస్వామ్య ఎన్నికల చరిత్రలో ఇలా దేశంలోని లక్షలాది వలసజీవుల్ని సైతం భాగం చేయాలనే ఆలోచన స్వాగతనీయమే. కానీ, ఇప్పుడున్న ఈవీఎంల వినియోగంపైనే సందేహాలు మసురుతున్న వేళ... కొత్త ప్రయత్నం ఏ మేరకు లోపరహితమన్నది చూడాలి. ఇప్పటికే, కాంగ్రెస్, తృణమూల్, డీఎంకె సహా ప్రతిపక్షాలు లేవనెత్తుతున్న ప్రశ్నలకు జవాబులు వెతకాలి. వలస జీవులకు రిమోట్ ఓటింగ్ కల్పించడంపై ఎన్నికల సంఘంలో చర్చలు కొత్తేమీ కాదు. దేశీయ వలసదారులకు ఓటింగ్ అవకాశాలు కల్పించాలంటూ కొన్నేళ్ళుగా అభ్యర్థనలున్నాయి. అలా వచ్చిన ఓ అభ్యర్థనపై సుప్రీమ్ కోర్ట్ 2015లోనే ఆదేశాలిచ్చింది. రిమోట్ ఓటింగ్‌కు అవకాశాలు పరిశీలించాలని ఎన్నికల సంఘాన్ని నిర్దేశించింది. పరోక్ష ఓటింగ్, పోస్టల్ బ్యాలెట్, ఇంటర్నెట్ ఓటింగ్, ముందస్తు ఓటింగ్ లాంటి పలు మార్గాలను ఎన్నికల సంఘ అధికారుల కమిటీ పరిశీలించింది. రకరకాల కారణాలతో ఆ పద్ధతులను సిఫార్సు చేయలేదు. సమగ్ర ఓటర్ల జాబితా సిద్ధం చేయాలని సదరు కమిటీ సిఫార్సు చేసింది. ఎన్నికల సంఘం మాత్రం తాజాగా సమస్య సాంకేతిక పరిష్కారంతో, ఈ బహుళ నియోజకవర్గ రిమోట్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ (ఆర్వీఎం) నమూనాను ముందుకు తెచ్చింది. ఇప్పటికే వాడుతున్న ఈవీఎం మోడల్‌కు మార్పులు చేర్పుల రూపమే – ఆర్వీఎం. వలసజీవులు తాము పనిచేస్తున్న నగరాల్లోని పోలింగ్ కేంద్రాల్లోనే తమ స్వస్థలానికి చెందిన నియోజక వర్గాల ఓటింగ్‌లో పాల్గొనేందుకు ఇది వీలు కల్పిస్తుంది. ఈ ప్రతిపాదన అమలైతే సొంతూరికి దూరంగా ఉన్న ఓటర్ తన సొంత నియోజక వర్గం తాలూకు రిటర్నింగ్ అధికారితో ఆన్లైన్లో కానీ, ఆఫ్‌లైన్‌లో కానీ ముందుగా రిమోట్ ఓటరుగా రిజిస్టర్ చేయించుకోవాలి. అప్పుడు ప్రస్తుతం సదరు ఓటర్ నివసిస్తున్నచోటే ప్రత్యేక పోలింగ్ కేంద్రం, ఆర్వీఎం పెడతారు. ప్రభుత్వ రంగ సంస్థ ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా రూపొందించిన ఈ ఆర్వీఎం వివిధ నియోజక వర్గాలకు ఒకేసారి పనిచేస్తుందట. ఓటర్ నియోజక వర్గాన్ని బట్టి అప్పటికప్పుడు మారే డైనమిక్ బ్యాలెట్ డిస్ప్లే ద్వారా ఒకే రిమోట్ పోలింగ్ బూత్ నుంచి 72 నియోజక వర్గాలకు అది పనికొస్తుందట. దీనికి ఇంటర్నెట్ కనెక్టివిటీ అవసరం లేదట. ఆలోచన మంచిదే. ఈ యంత్రాల్ని సరిగ్గా వినియోగిస్తే గనక స్వస్థలం నుంచి వలస వెళ్ళిన ఓటర్లు ఇప్పుడిక తమ రాజ్యాంగబద్ధమైన ఓటు హక్కు వినియోగానికి కష్టపడి సొంత జిల్లాలకు వెళ్ళాల్సిన అవసరం లేదు. వెళ్ళలేని పరిస్థితుల్లో తమ హక్కును వృథా కానివ్వనక్కర లేదు. 2011 నాటి జనాభా లెక్కల ప్రకారం 37 శాతం జనాభా (45.36 కోట్ల మంది) తమ స్వస్థలాల్ని వదిలి, దేశీయంగా వలసపోయినవారే. వీరిలోనూ నూటికి 85 మంది తమ సొంత రాష్ట్రంలోనే విద్య, ఉద్యోగం, వివాహం లాంటి రకరకాల కారణాలతో గ్రామాల నుంచి పట్టణ ప్రాంతాలకు వలసపోతున్నారు. వీరంతా ఎన్నికల వేళ స్వస్థలాల్లో ఓటు వినియోగించుకోలేక పోతున్నారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో 91.2 కోట్ల మంది భారతీయులకు ఓటు హక్కుంటే, వారిలో 67.4 శాతమే ఓటేశారు. 30 కోట్ల పైచిలుకు మంది తమ హక్కును వినియోగించుకోలేదు. అంటే, ప్రతి ముగ్గురిలో ఒకరు ఓటు వేయనే లేదు. వలస వల్ల అధికశాతం ఓటు హక్కు వినియోగించు కోవట్లేదు గనక, వారు ఎక్కడున్నా ఓటేసే వీలు కల్పిస్తే పోలింగ్ శాతం పెరుగుతుందనేది ఎన్నికల సంఘం ఆలోచన. దీనికి చట్టపరంగా, సాంకేతికంగా, పాలనాపరంగా అనేక సమస్యలున్నాయి. ‘వలసజీవి’ అనే మాటకు భారత రిజిస్ట్రార్ జనరల్, కేంద్ర కార్మిక శాఖ, జాతీయ నమూనా సర్వే సంస్థల్లో ఒక్కోచోట ఒక్కో నిర్వచనం ఉంది. అసలు స్వస్థలానికి ఎంతకాలంగా దూరంగా ఉంటే వలస ఓటర్? రిమోట్ నియోజకవర్గాల్లో ఎన్నికల నియమావళి అమలుచేసేదెట్లా? ఈ వలసజీవుల్ని ఎలా గుర్తించాలి, ఎలా సురక్షిత వాతావరణం కల్పించాలి? రిమోట్ ఓటర్ల డేటా లేదని ఎన్నికల సంఘమే చెబుతోంది. కానీ, 2023లో 9 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ప్రయోగాత్మకంగా ఆర్వీఎంలను వాడాలనీ, 2024 సార్వత్రిక ఎన్నికలకు పూర్తిగా అమలు చేయాలనీ పాలకుల పనుపున తహతహలాడుతోంది. అసలు ముందుగా ప్రజాప్రాతినిధ్య చట్టం, ఎన్నికల నిర్వహణ, ఓటర్ల నమోదు నియమాలు మార్చాలి. ఆలోచించి చేయాల్సిన ఈ పనుల్ని హడావిడిగా నడిపించి, చటుక్కున చేతిలోకి రిమోట్ తీసుకుంటే అనుమానాలు బలపడతాయి. ఎలక్ట్రానిక్ డిస్ప్లేతో ఓటింగ్‌పై అంతర్జాతీయంగానూ అనుమానాలున్నాయి. బలమైన ఆధారాలు లేకున్నా ఎన్నికల్లో మోసాలకు ఇది వీలు కల్పిస్తుందని ఓ భావన. సాఫ్ట్వేర్ ప్రోగ్రామింగ్‌లో కుయుక్తులు, యంత్రాల భద్రత, వేసిన ఓట్లు ఏ మేరకు సురక్షితం లాంటి చర్చనీయాంశాలున్నాయి. ఇటీవల గుజరాత్ ఎన్నికల్లో ఆఖరి గంటలో 10 – 12 శాతం ఓటింగ్ రేపిన సందేహాలనూ విస్మరించలేం. రేపు రిమోట్ ఓటింగ్‌లోనూ ఇలాంటివే పరిపాటైతే, అసలు ఎన్నికల ప్రక్రియపైనే నమ్మకం పోతుంది. అప్పుడిక ప్రజాస్వామ్యానికి అర్థం ఏముంటుంది! -
నిజమైన రైతులకే ఓటు హక్కు
సాక్షి, అమరావతి: సహకార సంఘాల్లో బోగస్ సభ్యత్వాలను నియంత్రించి, నిజమైన రైతులకే ఓటు హక్కు కల్పించే దిశగా సహకార శాఖ చర్యలు ప్రారంభించింది. సహకార ఎన్నికలకు ముందు కార్యకర్తలు, నాయకులకు సహకార సంఘాల్లో గంపగుత్తగా సభ్యత్వం ఇచ్చే విధానానికి స్వస్తి పలుకుతోంది. నిజమైన రైతులు, కౌలుదారులకే ఓటు హక్కు కల్పించే దిశగా అడుగులు వేస్తోంది. ఫలితంగా ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం నిజమైన రైతులకే దక్కనుంది. ఈ మేరకు నిబంధనల్లో మార్పులు చేస్తోంది. ఓటు హక్కు వినియోగం, సభ్యత్వ అర్హతలపై రూపొందించిన నిబంధనలను సహకార సంఘాలకు వివరిస్తూ మూడు రోజుల క్రితం సర్క్యులర్ జారీ చేసింది. కేవలం ఎన్నికల కోసమే సభ్యత్వం తీసుకున్న రైతులు, భూమిలేని వ్యక్తులు, ధ్రువీకరణ పత్రాలు లేని కౌలుదారులు, సంఘాల సేవలు వినియోగించుకోని రైతులను గుర్తించి వారిని అనర్హులుగా ప్రకటించాలని ఆదేశించింది. ఈ వడపోత కార్యక్రమం ద్వారా ఓటర్ల సంఖ్య సగానికి తగ్గే అవకాశాలు లేకపోలేదని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. గంపగుత్త ఓట్లకిక చెల్లు అధిక టర్నోవర్ ఉన్న సంఘాలకు పాలకవర్గ సభ్యులుగా పోటీ చేయడానికి రైతులు ఎక్కువగా ఆసక్తి చూపుతారు. ఎన్నికల్లో పోటీ చేయాలనే ఆసక్తి ఉన్న రైతులు వారి స్నేహితులు, బంధువులు, కౌలుదారులకు గంపగుత్తగా ఓటు హక్కు కల్పిస్తున్నారు. వారి పేరు మీద సభ్యత్వ రుసుము వీరే చెల్లించి, ఎన్నికల్లో వారి ఓటును పొందుతున్నారు. ఈ విధానంలో ఎన్నికైన పాలకవర్గం రైతులకు ఆశించిన స్ధాయిలో సేవలు అందించనందున ప్రభుత్వం నిబంధనలలో మార్పులు చేసింది. కాగా, కొత్త నిబంధనలను గ్రామాల్లోని రైతులకు వివరించాలని సహకార సంఘాల రిజిస్ట్రార్ జి.వాణీమోహన్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కొత్త నిబంధనలు ఇవీ.. - ఆంధ్రప్రదేశ్ కో– ఆపరేటివ్ సహకార చట్టం–1964ను సవరిస్తూ 2006లో తీసుకువచ్చిన మార్పుల అమలు. - సభ్యత్వం కోరే వ్యక్తి ఆ సంఘం భౌగోళిక పరిధిలో యజమాని లేదా కౌలుదారునిగా ఉండాలి. కౌలుదారుడైతే గ్రామ రెవిన్యూ అధికారి ధ్రువీకరణ పత్రం కలిగి ఉండాలి. యజమానిగా ఉండే రైతు తనకున్న భూమికి సంబంధించిన పట్టాదారు పాస్ పుస్తకం, విక్రయ దస్తావేజు, గ్రామ రెవిన్యూ అధికారి జారీ చేసిన సర్టిఫికెట్ కలిగి ఉండాలి. భూ విస్తీర్ణం, సరిహద్దులు, సర్వే నంబరు తదితర వివరాలను జత చేయాలి. - కనీసం రూ.300 షేరు ధనం కలిగి ఉండాలి. సంఘం నుంచి ఏడాది కాలంలో కనీసం రూ.1,000 రుణం తీసుకుని ఉండాలి. లేదా ఎరువులు, పురుగు మందులు కొనుగోలు చేసి ఉండాలి. ఈ రెండూ లేకపోతే రూ.1,000 కనీసం డిపాజిట్ చేసి ఉండాలి. అప్పుడే ఎన్నికల్లో పోటీ చేయడానికి అర్హత లభిస్తుంది. - సంఘంలో చేరిన నాటి నుంచి ఎన్నికల నోటిఫికేషన్ వెలువడటానికి మధ్య కనీసం 30 రోజులు నిరాటంకంగా సభ్యునిగా కొనసాగి ఉండాలి. - సంఘంలో తీసుకున్న రుణాన్ని ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం చెల్లించిన రికార్డు ఉండాలి. - సంఘంలోని సభ్యునికి సాధారణ ప్రాంతంలో రూ.5 వేలు, షెడ్యూల్ ప్రాంతంలో రూ.2,500కు తక్కువ కాకుండా సంఘంలో డిపాజిట్ ఉండాలి. ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందు కనీసం రెండేళ్లు వరుసగా ఈ డిపాజిట్ కలిగిన వారికే పోటీచేసే అవకాశం. - స్వయం సహాయక సంఘాలు అయితే ఎన్నికల నోటిఫికేషన్‌కు ఆరు నెలల ముందు కనీసం రూ.10 వేల రుణం తీసుకుని ఉండాలి. భూమితో సంబంధం లేకుండా గ్రూపంతటికీ కలిపి ఒక ఓటు ఉంటుంది. పోటీ చేయడానికి అర్హత ఉండదు. ఈ సంఘాలు రైతులు, కౌలుదారులకు రుణాల మంజూరు, విత్తనాలు, ఎరువులు, క్రిమి సంహారక మందులను విక్రయిస్తున్నాయి. గ్రామాల్లో అందుబాటులో ఉండి, బహిరంగ మార్కెట్లో కంటే ధరలు తక్కువగా ఉండటంతో రైతులు వీటి సేవలను వినియోగించుకుంటున్నారు. -
జనాభా నియంత్రణపై సంచలన వ్యాఖ్యలు
సాక్షి, న్యూఢిల్లీ : ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లలు కలిగిన వారి ఓటింగ్ హక్కును వెనక్కితీసుకోవాలని ఆథ్యాత్మిక గురువు బాబా రాందేవ్ కోరారు. వారిని ఎన్నికల్లో పోటీ చేయకుండా నిరోధించాలని సూచించారు. ఇద్దరు పిల్లలకు మించి సంతానం ఉన్నవారిని ప్రభుత్వ పాఠశాలు, ఆస్పత్రుల్లో ప్రవేశం కల్పించరాదని, వారికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వరాదని రాందేవ్ పేర్కొన్నారు. ప్రభుత్వం ఈ చర్యలు చేపడితే జనాభా నియంత్రణ సాధ్యమవుతుందన్నారు. అలీఘర్‌లో దుస్తుల షోరూం పతంజలి పరిధాన్‌ను ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ హిందువులైనా, ముస్లింలైనా జనాభా నియంత్రణే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగాలన్నారు. బాబా రాందేవ్ గతంలోనూ ఈ తరహా వ్యాఖ్యలు చేశారు. ఇద్దరి కంటే ఎక్కువ పిల్లల్ని కన్న వివాహితుల ఓటు హక్కు రద్దు చేయాలని, తనలాంటి బ్రహ్మచారులకు ప్రత్యేక హోదా ఇచ్చి గుర్తింపు కల్పించాలని ప్రభుత్వానికి సూచించారు. -
సర్కార్ ఎఫెక్ట్: పీక్స్‌లో 49-పీ
స్టార్ హీరో, ఇళయ దళపతి విజయ్, ప్రముఖ దర్శకుడు మురుగదాస్ కాంబినేషన్లో వచ్చిన లేటెస్ట్ మూవీ ‘సర్కార్’ పలు వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది. ముఖ్యంగా అభ్యంతరకరమైన దృశ్యాలంటూ తమిళనాడు సర్కార్ గుర్రుగా ఉండటం ఒక ఎత్తయితే.. ఈ మూవీ ఒక కీలక అంశంపై చర్చకు తెరతీయడం మరోఎత్తు. అదే సెక్షన్ 49-పీ. ఓటు హక్కుపై అవగాహనపెంచడం ద్వారా సమాజంలో మార్పు తేవడానికి కొంత ప్రయత్నం చేసిన ఈ మూవీ 49-పీ అంశాన్ని చర్చకు తెచ్చిందంటే ఏ మాత్రం అతిశయోక్తి కాదేమో. ఈ మూవీలో 49పీ’ అనే ప్రస్తావన హీరో విజయ్ ద్వారా తేవడంతో ఒక్కసారిగా 49-పీపై జనానికి ఆసక్తి పెరిగింది. సర్కార్ మూవీని దర్శించిన ప్రేక్షకజనం గూగుల్‌లో 49పీ’ కోసం భారీగా సెర్చ్ చేసేశారు. దీంతో గూగుల్ ట్రెండింగ్ అనలిటిక్స్‌లో టాప్‌లో నిలిచింది. సినిమా విడుదలైన 24 గంటల్లోనే ఈ పరిణామం చోటు చేసుకుంది. దీంతో సర్కార్ మూవీ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ ఈ విషయాన్ని ట్విటర్లో పోస్ట్ చేసింది. చర్చకు నేపథ్యం సన్ పిక్చర్స్ బ్యానర్ లో విడుదలైన ఈ సినిమా తమిళంతో పాటుగా, తెలుగులోనూ విడుదలైన సంగతి తెలిసిందే. ఇక అసలు విషయానికి వస్తే ఈ మూవీ కథలో ఎన్నారై సుందర్ రామస్వామి (విజయ్) ప్రపంచంలో నెంబర్ వన్ కార్పొరేట్ సంస్థకు సీఈవో పని చేస్తుంటారు. ఎన్నికల్లో తన ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఇండియాకు వస్తాడు. ఈ క్రమంలో ఆయన ఓటు ఎవరో దొంగ ఓటు వేస్తారు. ఈ క్రమంలో ‘సెక్షన్ 49పి’ అంటూ ఒక చట్టాన్ని బయటపెడతారు. దీంతో ‘సెక్షన్ 49పి’ తీవ్ర చర్చనీయాంశమైంది. ఇప్పటి వరకు ఇలాంటి సెక్షన్ ఒకటుందని ఆ విషయం తమకు తెలియదని, సినిమా ద్వారా ఈ విషయాన్నీ తెలియజేసినందుకు సర్కార్ యూనిట్ తోపాటు, తమఅభిమాన హీరో విజయ్‌కు కూడా ధన్యవాదాలు చెబుతున్నారు ఫ్యాన్స్. 49-పీ అంటే ఏమిటి? తన ఓటును మరొకరు వేసి దుర్వినియోగపర్చినప్పుడు, ఒక పౌరుడు తన ఓటును కాపాడుకునేందుకు రాజ్యాంగం కల్పించిన ఒక హక్కు. పోలింగ్ సమయంలో తన ఓటును ఎవరైనా వేసినట్టు సదరు ఓటురు గుర్తిస్తే వెంటనే సంబంధిత పోలింగ్ బూత్‌కు వెళ్లి ఆ ఓటును వెనక్కి తీసేయమని అధికారులను కోరే అవకాశాన్ని ఈ సెక్షన్ పౌరుడికి కల్పిస్తుంది. ‘కండక్ట్ ఆఫ్ ఎలక్షన్ రూల్స్ 1961’లోని సెక్షన్ 49పీ చెబుతున్న అంశం ఇదే! ఈ విషయాన్నే ‘సర్కార్’ మూవీలో హీరో విజయ్ చేత చెప్పించారు డైరెక్టర్ మురుగదాస్. మరోవైపు తమిళనాడు సర్కార్ గుర్రుగా ఉన్న నేపథ్యంలో ఈ చిత్రంలో అభ్యంతరకరమైన సన్నివేశాలను, డైలాగులను తొలగించేందుకు ఈ మూవీ మేకర్స్ అంగీకరించినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా ఓటర్లకు మిక్సర్ గ్రైండ్లను అభ్యర్థులు పంపిణీ చేసే సీన్ తో సహా..ఇంకా పలు వివాదాస్పద డైలాగులను ఎడిట్ చేసే అవకాశాలున్నాయని సమాచారం. Google search trends peak for #49P after the release of #Sarkar. https://t.co/677MFHqDia@ARMurugadoss #BlockBusterSarkar #Thalapathykingofboxoffice pic.twitter.com/szBBPY1vIH — Sun Pictures (@sunpictures) November 7, 2018 -
మేఘాలయలో ఓటేయనున్న ఇటలీ, స్వీడన్, అర్జెంటీనా!
ఉమ్నియా: మేఘాలయ ఎన్నికల్లో ఓ వింత చోటుచేసుకోబోతోంది. ఇటలీ, స్వీడన్, అర్జెంటీనా, ఇండోనేసియాతోపాటు ప్రామిస్లాండ్, హోలీలాండ్, జెరూసలేం...తదితరాలన్నీ అక్కడి ఎన్నికల్లో ఓటేయబోతున్నాయి. అదేంటీ..ఈ దేశాలకు మేఘాలయ ఎన్నికలతో ఏంటీ సంబంధం అని ఆశ్చర్యపోతున్నారా? అయితే, ఇవన్నీ ఇక్కడ ఈ నెల 27న జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోనున్న యువ ఓటర్ల పేర్లు..! ఇవే కాదు, వారాలు.. సండే, థర్స్డే, రాష్ట్రాలు గోవా, త్రిపుర లాంటి పేర్లు కూడా ఉన్నాయి. రాష్ట్రంలోని ఖాసీ తెగ ప్రజల్లో ఇలాంటి విచిత్రమైన పేర్లుండటం సహజం. ఎన్నికల జాబితాలో ఈ పేర్లను చూసిన అధికారులు పొట్టచెక్కలయ్యేలా నవ్వుకుంటున్నారట..! -
ఓటరు నమోదుకు చర్యలు చేపట్టాం
► కలెక్టర్ అమ్రపాలి హన్మకొండ అర్బన్: జిల్లాలో 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరిని ఓటర్లుగా నమోదు చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ అమ్రపాలి తెలిపారు. శుక్రవారం రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి బన్వర్‌లాల్ జిల్లా కలెక్టర్లతో స్పెషల్ సమ్మరి రివిజన్ పై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో స్పెషల్ సమ్మరి రివిజన్ కోసం విస్తృత ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. జిల్లాలో మొత్తం 696 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని, కొత్తగా ఏర్పాటు చేయడంలేదని తెలిపారు. ఇప్పటికే రాజకీయ పార్టీలతో సమావేశాలు ఏర్పాటు చేసి ఓటర్ల జాబితా అందజేశామని, బూత్‌లెవల్ ఏజెంట్లను నియమించాలని కోరినట్లు పేర్కొన్నారు. సమ్మరి రివిజన్ లో ఫారం–6 కింద 11,037, ఫారం 7కింద 1933, ఫారం–8 కింద 6795, ఫారం 8(ఏ) కింద 569 దరఖాస్తులు అందాయని వివరించారు. వీటిలో ఎక్కువ శాతం పరిష్కరించామని తెలిపారు. అదేవిధంగా ఈవీఎంల గోదాం నిర్మాణం కోసం గతంలో కేటయించిన రూ.17లక్షలు లాప్స్ అయ్యాయని, వాటికోసం మరోసారి ప్రతిపాదనలు పంపుతున్నామని తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్ లో డీఆర్వో శోభ, ఎన్నికల రిటర్నింగ్ అధికారులు, సహాయ ఎన్నికల అధికారులు పాల్గొన్నారు. -
ఫండ్స్‌కు కొత్త నిబంధనల అమలు
ముంబై: మ్యూచువల్ ఫండ్స్ రంగానికి సంబంధించి మంగళవారం(ఏప్రిల్ 1) నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాయి. ఫలితంగా ఇకపై నెలకోసారి తమ నిర్వహణలోని ఆస్తుల వివరాలు ఫండ్స్ వెల్లడించాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఓటింగ్ హక్కులను వినియోగించుకుంటే అందుకు తగిన కారణాలను వెల్లడించాల్సి వస్తుంది. మ్యూచువల్ ఫండ్ రంగంపై మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ రూపొందించిన తాజా నిబంధనలను ఫండ్ హౌస్‌లు ఇకపై తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది. వివిధ విభాగాలకు చెందిన పథకాల ద్వారా ఫండ్స్ నిర్వహిస్తున్న ఆస్తులు, ఇన్వెస్టర్ల వివరాలు వెల్లడించాల్సి ఉంటుంది. తమ వెబ్సైట్ల ద్వారా ప్రతీ నెల కు సంబంధించిన వివరాలను 7 రోజుల్లోగా ప్రకటించాల్సి ఉంటుంది. దీంతోపాటు దేశీ మ్యూచువల్ ఫండ్స్ అసోసియేషన్(యాంఫీ) వెబ్సైట్లలో కూడా వివరాలను ప్రకటించాలి. ఈ బాటలో ప్రతీ క్వార్టర్ ముగిశాక 10 రోజుల్లోగా ఓటింగ్‌కు సంబంధించిన వివరాలను వెల్లడించాలి. వార్షిక నివేదికలోనూ ఈ వివరాలను పేర్కొనాల్సి ఉంటుంది. ఓటింగ్ హక్కుల వినియోగంపై ఆడిటర్ల నుంచి సర్టిఫికేషన్‌ను పొందాల్సి ఉంటుంది. ప్రస్తుతం దేశంలో 45 ఫండ్ హౌస్‌లు కార్యకలాపాలను కలిగి ఉన్నాయి. వీటి నిర్వహణలో ఉన్న ఆస్తుల విలువ రూ. 9 లక్షల కోట్లకుపైనే.