ratio
-
బ్యాంకులకు డిపాజిట్ల కష్టాలు
న్యూఢిల్లీ: గడిచిన రెండు సంవత్సరాల్లో పెరిగిన రుణ డిమాండ్ స్థాయిలో డిపాజిట్ల సమీకరణకు బ్యాంక్‌లు సమస్యలు ఎదుర్కొన్నట్టు ఇన్ఫోమెరిక్స్ రేటింగ్స్ తెలిపింది. షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంక్‌లు 2023–24లో జారీ చేసిన రుణాలు రూ.1,64,98,006కోట్లుగా ఉన్నాయి. క్రెడిట్ టు డిపాజిట్ రేషియో (సీడీ రేషియో) ఈ కాలంలో 75.8 శాతం నుంచి 80.3 శాతానికి పెరిగింది. త్రైమాసికం వారీగా చూసిన కానీ షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకుల డిపాజిట్ల కంటే రుణాల వృద్ధి ఎక్కువగా ఉన్నట్టు ఇన్ఫోమెరిక్స్ నివేదిక తెలిపింది.2018–19 నుంచి 2023–24 మధ్య కాలంలోనూ డిపాజిట్ల కంటే రుణాల వృద్ధి ఎక్కువగా ఉన్నట్టు వెల్లడించింది. ప్రత్యామ్నాయ పెట్టుబడుల సాధనాలు, అసంఘటిత రంగంలో ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో నగదు ఎక్కువగా ఉండడం డిపాజిట్ల సమీకరణపై ప్రభావం చూపించినట్టు ఈ నివేదిక తెలిపింది. 30 ఏళ్లలోపు ఇన్వెస్టర్ల సంఖ్య 2018–19 నాటికి 22.6 శాతంగా ఉంటే, 2025 జూలై నాటికి 39.9 శాతానికి పెరగడాన్ని ప్రస్తావించింది. యువ ఇన్వెస్టర్లలో ఈక్విటీ మార్కెట్ల పట్ల పెరిగిన ఆసక్తిని ఈ ధోరణి తెలియజేస్తున్నట్టు పేర్కొంది. ఇదే కాలంలో 30–39 వయసులోని ఇన్వెస్టర్ల బేస్ (సంఖ్య) స్థిరంగానే ఉన్నట్టు తెలిపింది. సంయుక్త కృషి అవసరం: డిపాజిట్ల నిష్పత్తి పెరగాలంటే బ్యాంక్‌లు, ప్రభుత్వం ఉమ్మడిగా చర్యలు చేపట్టాల్సి ఉంటుందని ట్రూనార్త్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సీఈవో రోచక్ బక్షి అభిప్రాయపడ్డారు. సాధారణ ప్రజల నుంచి చిన్న మొత్తాల్లో డిపాజిట్లు సమీకరించే వెనుకటి ధోరణి నుంచి బయటకు రావాలని.. పెద్ద మొత్తంలో కార్పొరేట్ డిపాజిట్లను ఆకర్షించడంపై దృష్టి సారించాలని సూచించారు.బ్యాంక్ టర్మ్ డిపాజిట్లలో 47 శాతం 60 ఏళ్లు నిండిన వృద్ధులవే ఉన్నట్టు, యువతరం బ్యాంక్ డిపాజిట్ల వట్ల ఆసక్తి చూపించడం లేదన్న దానికి నిదర్శనమని చెప్పారు. కనీసం ఆదాయపన్ను అధిక శ్లాబులోని వారికి అయినా బ్యాంక్ డిపాజిట్ల వడ్డీపై పన్ను భారాన్ని తగ్గించాలని భక్షి సూచించారు. ఏటా వడ్డీపై టీడీఎస్ మినహాయించడం కాకుండా, డిపాజిట్ కాల వ్యవధి ముగిసిన సమయంలోనే పన్నును పరిగణనలోకి తీసుకోవాలన్నారు. -
జనాభా పెరుగుతోంది...కానీ సంతానోత్పత్తి రేటు పడిపోతోంది!
ఒకవైపు ప్రపంచ వ్యాప్తంగా జనభా విపరీతంగా పెరుగుతోంది. ప్రస్తుత (2024 నాటికి) ప్రపంచ జనాభా సుమారు ఎనిమిది బిలియన్లుగా ఉంది. అయితే ప్రపంచవ్యాప్తంగా సంతానోత్పత్తి గణనీయంగా పడి పోతోంది. ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా ఈ స్పెషల్ స్టోరీ మీకోసం.గత కొన్ని దశాబ్దాలతో పోలిస్తే జనాభా పెరుగుదల తక్కువ స్థాయిలో ఉన్నప్పటికీ, పెరుగుతూనే ఉంది. వార్షిక జనాభా వృద్ధి రేటు కాలక్రమేణా క్షీణిస్తూ వస్తోంది. 20వ శతాబ్దం మధ్యలో ఇది దాదాపు 2 శాతంగా ఉండగా ఇదిపుడు ఒక శాతానికి పడిపోయింది.. సంతానోత్పత్తి రేట్లు తగ్గడం , మెరుగైన ఆరోగ్య సంరక్షణ వంటి వాటిని కారణాలుగా చెబుతున్నప్పటికీ, సంతానోత్పత్తి రేటు తగ్గడం కొంత ఆందోళన కలిగించే విషయంగతంలో జనన , మరణాల రేట్లు ఎక్కువగా ఉన్నాయి. ఫలితంగా జనాభా పెరుగుదల నెమ్మదించింది. ప్రచార అవగాహన, అభివృద్ధి నేపథ్యంలో జనన రేట్లు తగ్గాయి. అలాగే శిశుమరణాల రేటు కూడా తగ్గింది.ఆయుర్దాయం పెరగడం , జననాల రేటు తగ్గడం వల్ల, అనేక దేశాల్లో యువకుల సంఖ్య తగ్గుతోంది. వృద్ధుల నిష్పత్తి పెరుగుతోంది. ఇది ఆరోగ్య సంరక్షణ , సామాజిక వ్యవస్థలకు సవాళ్లను విసురుతోంది.పాపులేషన్ పిరమిడ్ (నిర్దిష్ట జనాభా వయస్సు ,లింగ కూర్పుతో ఏడిన గ్రాఫ్). అభివృద్ధి చెందిన దేశాలలో సమతుల్యాన్ని సూచిస్తూ దీర్ఘచతురస్రాకారంగా ఉంటే, అభివృద్ధి చెందుతున్న దేశాల్లో యువతరం ఎక్కువ ఉంటోంది. అందుకే ఇక్కడి పాపులేషన్ పిరమిడ్ , పిరమిడ్ ఆకారంలో ఉంటోంది.ప్రపంచ వ్యాప్తంగా పట్టణీకరణ కూడా బాగా పెరింది. 2050 నాటికి, ప్రపంచ జనాభాలో 68 శాతం మంది నగరాల్లో నివరసిస్తారని అంచనా. పట్టణీకరణ మౌలిక సదుపాయాలు, పర్యావరణం, జీవన నాణ్యతను ప్రభావితం చేస్తుంది.అధిక జనాభా ఆందోళనలు: ప్రపంచ జనాభా పెరుగుదల మందగించినప్పటికీ, అధిక జనాభా గురించి ఆందోళనలు కొనసాగుతున్నాయి. వనరుల కొరత, పర్యావరణ క్షీణత , అవస్థాపనపై ఒత్తిడి క్లిష్టమైన సమస్యలని మరి కొందరు వాదిస్తున్నారు. సంతానోత్పత్తి రేటు2021లో ప్రపంచవ్యాప్తంగా మొత్తం సంతానోత్పత్తి రేటు 1 (TFR) అంటే ఒక మహిళకు 2.3 మంది పిల్లలున్నారు. ఇదే 1965లో 5.1గా ఉంటే, 1970లో 4.8, 1980లో 3.7, 1990లో 3.3గా ఉండి 2000లో 2.8కి పడిపోయింది. 2000లో వేగం తగ్గింది. 2000-15 మధ్య 5 సంవత్సరాల సగటు 0.07తో పోలిస్తే, 2015- 2020 మధ్య ఒక్కో మహిళకు 0.17 మంది పిల్లలు తగ్గారు.ఇటీవలి లాన్సెట్ నివేదిక ప్రకారం ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన భారత్‌లోనూ జనాభా పెరుగుదల రేటు క్రమంగా తగ్గుతోందని, సంతానోత్పత్తి రేటు పడిపోతుందటమే దీనికి కారణం. అలాగే దేశంలో 1950లో 6.18గా సంతానోత్పత్తి రేటు, 2021నాటికి అది 2 కంటే దిగువకు పడిపోయింది. ఇది ఇలాగే కొనసాగితే, 2050 నాటికి దేశంలో సంతానోత్పత్తి రేటు 1.3కు, 2100నాటికి 1.04కు పడిపోవచ్చని కూడా హెచ్చరించింది. మారిన వాతావరణ పరిస్థితులు, పెరుగుతున్న కాలుష్యం, ఆహారపుటలవాట్లలో మార్పులు, యాంత్రిక జీవనశైలి, పని ఒత్తిళ్లు, ఆందోళన, ఆలస్యంగా వివాహం చేసుకోవడం వెరసి సంతానోత్పత్తిపై ప్రభావం చూపుతున్నట్టు ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు సంతానోత్పత్తి రేటులో తగ్గుదల.. ఉత్పాదక శక్తిపై ప్రభావం చూపి దేశాల ఆర్థిక వ్యవస్థలను తీవ్రంగా ప్రభావితం చేస్తుంది.ఆసియాలో సంతానోత్పత్తి రేట్లుప్రతి స్త్రీకి 0.9 పిల్లలు చొప్పున ప్రపంచవ్యాప్తంగా అత్యల్ప సంతానోత్పత్తి రేటును కలిగి ఉన్న దేశంగా దక్షిణ కొరియా నిలిచింది. 1.0 వద్ద ప్యూర్టో రికో , మాల్టా, సింగపూర్ ,హాంగ్‌కాంగ్‌లో ఒక్కో మహిళకు 1.1 చొప్పున పిల్లలున్నారు.ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన రెండు దేశాలు, చైనా (1.7) ,భారతదేశం (2.2) సంతానోత్పత్తి రేటును కలిగి ఉన్నాయి. ఈ రెండు గణాంకాలు ఈ దేశాలలో పునరుత్పత్తికి సంబంధించిన ప్రభుత్వ విధానాలు, సాంస్కృతిక అంచనాల ద్వారా ప్రభావితమవుతాయి. ఉదాహరణకు చైనా సుమారు 1980 - 2016 వరకు ఒకటే బిడ్డ విధానాన్ని" కొనసాగించింది, అయితే ఆగస్టు 2021లో వివాహిత జంటలు ముగ్గురు పిల్లలను కలిగి ఉండవచ్చని అధికారికంగా ఒక చట్టాన్నిఆమోదించింది. ఇండియాలో కూడా అనధికారంగా చాలామంది జంటలు వన్ ఆర్ నన్ పద్ధతినే అవలంబిస్తుండటం గమనార్హం. -
ఐదో దశ ఓటింగ్‌పై ఎన్నికల సంఘం ఆందోళన?
2024 లోక్‌సభ ఎన్నికల ఐదవ దశలో ఆరు రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 49 స్థానాలకు ఓటింగ్ జరిగింది. ఈసారి 57.5 శాతం మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. గత సారి అంటే 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికల కంటే ఇప్పటి ఓటింగ్ ఐదు శాతం తక్కువ.2019 ఎన్నికల ఐదో దశలో 62.0 శాతం మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇలా ఓటింగ్ ట్రెండ్ తగ్గుముఖం పట్టడం అటు రాజకీయ పార్టీల్లో, ఇటు ఎన్నికల సంఘంలో మరోసారి ఆందోళన పెంచింది. ఐదో దశలో మహారాష్ట్రలో 13, ఉత్తరప్రదేశ్‌లో 14, పశ్చిమ బెంగాల్లో 7, బీహార్‌లో 5, జార్ఖండ్‌లో 3, ఒడిశాలో 5, జమ్ము-కశ్మీర్, లడఖ్లలో ఒక్కో స్థానానికి పోలింగ్ జరిగింది.ఈ రాష్ట్రాల్లో అత్యధికంగా పశ్చిమ బెంగాల్లో 73 శాతం, అత్యల్పంగా మహారాష్ట్రలో 48.88 శాతం పోలింగ్ నమోదైంది. బీహార్‌లో 52.55 శాతం, జమ్మూకశ్మీర్‌లో 54.21 శాతం, జార్ఖండ్‌లో 63 శాతం, ఒడిశాలో 60.72 శాతం, ఉత్తరప్రదేశ్‌లో 57.43 శాతం, లడఖ్‌లో 67.15 శాతం ఓటింగ్ నమోదైంది. సోమవారం సాయంత్రం 7 గంటల వరకు అందుబాటులో ఉన్న ఎన్నికల సంఘం అధికారిక సమాచారం ప్రకారం ఈ దశలో అంచనా వేసిన ఓటింగ్ శాతం 57.38గా నమోదైంది.2019లో ఈ సీట్లలో నమోదైన ఓటింగ్ శాతం విషయానికొస్తే బెంగాల్‌లోని ఈ స్థానాల్లో 80 శాతానికి పైగా ఓటింగ్ జరిగింది. మహారాష్ట్రలో 55.7 శాతం, బీహార్‌లో 57.2 శాతం, జమ్మూ కాశ్మీర్లో 34.6 శాతం, జార్ఖండ్‌లో 65.6 శాతం, ఒడిశాలో 72.9 శాతం, ఉత్తరప్రదేశ్‌లో 58.6 శాతం, లడఖ్‌లో 71.1 శాతం మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.జమ్మూ కశ్మీర్‌లోని బారాముల్లా లోక్‌సభ నియోజకవర్గంలో ఈసారి 54 శాతానికి పైగా ఓటింగ్ జరిగింది. ఇది దాదాపు నాలుగు దశాబ్దాలలో అత్యధికం. ఈసారి మొత్తం ఓటింగ్ శాతం 54.21, ఇది 1984లో ఈ నియోజకవర్గంలో 58.84 శాతం ఓటింగ్ తర్వాత అత్యధికం. లోక్‌సభ ఎన్నికలకు ఇంక రెండు దశలు మాత్రమే మిగిలాయి. మే 25న ఆరో దశ, జూన్ ఒకటిన చివరి దశ పోలింగ్ జరగనుంది. జూన్ 4న ఓట్ల లెక్కింపు నిర్వహించనున్నారు. లోక్‌సభ ఎన్నికల ఐదో దశ ముగియడంతో 428 స్థానాలకు ఎన్నికలు పూర్తయ్యాయి. -
2032–33 నాటికి కట్టాల్సింది.. రూ.2.5 లక్షల కోట్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంపై అప్పుల భారం తీవ్రంగా ఉందని, రానున్న పదేళ్లలో రుణాల తిరిగి చెల్లింపు ఇబ్బందిగా మారే అవకాశం ఉందని ‘కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్)’నివేదికలో పేర్కొంది. మార్కెట్ రుణాల మీద వడ్డీ, అసలు కలిపి.. 2032–33 నాటికి రాష్ట్ర ప్రభుత్వం రూ.2,52,048 కోట్లను చెల్లించాల్సి ఉంటుందని తెలిపింది. 2022 మార్చి 31తో ముగిసిన (2021–22) ఆర్థిక సంవత్సరం నాటికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, నిర్వహణ తీరుపై కాగ్ రూపొందించిన ఈ నివేదికను రాష్ట్ర ప్రభుత్వం గురువారం అసెంబ్లీ ముందుపెట్టింది. బడ్జెట్లో పేర్కొనకుండా తీసుకున్న రుణాల్లో (ఆఫ్ బడ్జెట్) కాళేశ్వరానికే ఎక్కువగా ఉన్నాయని కాగ్ పేర్కొంది. ‘కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్టు కార్పొరేషన్ లిమిటెడ్ (కేఐపీసీఎల్)’కింద రూ.66,854 కోట్లు తీసుకున్నారని.. ఈ రుణాల అసలు, వడ్డీ కలిపి 14 ఏళ్లలో రూ.1,45,545 కోట్లు చెల్లించాలని పేర్కొంది. దీనితో సమీప భవిష్యత్తులో అభివృద్ధి ప్రణాళికల విషయంలో రాష్ట్ర సామర్థ్యం పరిమితం అవుతుందని వ్యాఖ్యానించింది. కాగ్ నివేదికలోని అంశాలివీ.. ► రెవెన్యూ రాబడులు 26 శాతం పెరిగినా మిగులును సాధించడంలో రాష్ట్రం వరుసగా మూడో ఏడాది కూడా విఫలమైంది. బడ్జెట్ నుంచి చెల్లిస్తున్న ఆఫ్ బడ్జెట్ రుణాలు, ఇతర చెల్లింపులను కలిపితే.. జీఎస్డీపీలో అప్పుల నిష్పత్తి 37.77 శాతంగా ఉంది. ఇది ఎఫ్ఆర్బీఎం చట్టం నిర్దేశించిన దానికంటే 12.77 శాతం, 15వ ఆర్థిక సంఘం నిర్దేశించిన దానికంటే 8.47 శాతం ఎక్కువ. ►2021–22లో రెవెన్యూ వ్యయం 11 శాతం పెరిగింది. ఇందులో జీతాలు, వడ్డీ చెల్లింపులే ఎక్కువ భాగం ఉన్నాయి. విద్య, ఆరోగ్యం మీద ఖర్చు విషయంలో రాష్ట్రం వెనుకంజలో ఉంది. మొత్తం వ్యయంలో 8శాతం విద్య, 4శాతం ఆరోగ్యంపై ఖర్చు చేశారు. ► అంతకుముందు ఏడాదితో పోలిస్తే మూలధన వ్యయం 81శాతం పెరిగింది. 2021–22లో రూ.28,874 కోట్లు మూలధన వ్యయం కింద ఖర్చుపెట్టారు. అయితే 2022 నాటికి పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టుల మీద రూ.1,09,612 కోట్లు మూలధనం ఖర్చయింది. ► బడ్జెట్ వ్యయం కింద రూ.2,30,872 కోట్లకు ప్రభుత్వం అసెంబ్లీ అనుమతి తీసుకుంది. తర్వాత అనుబంధంగా రూ.24,144 కోట్ల మేర అంచనాలకు ఆమోదం తెలిపింది. అయితే రెవెన్యూ ఖర్చు రూ.2,63,092 కోట్లుకాగా.. నికర అధిక వ్యయం రూ.8,076 కోట్లు. వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సులను పరిగణనలోకి తీసుకోకపోతే అయిన ఖర్చు రూ.1,95,818 కోట్లే. అంటే బడ్జెట్ అంచనాల్లో వాస్తవఖర్చు 77శాతమే. ► 2014–15 నుంచి 2020–21 వరకు కలిపి బడ్జెట్లకు అదనంగా చేసిన రూ.2,14,062 కోట్ల ఖర్చుకు అసెంబ్లీ ఆమోదం పొందాల్సి ఉంది. ఇది ప్రజావనరుల నిర్వహణలో క్రమశిక్షణ రాహిత్యమే. ► దళితబంధు కోసం రూ.1,000 కోట్లు కేటాయించారు. కానీ వినియోగ పద్దులో రూ.4,442 కోట్లు ఖర్చు చూపెట్టారు. వాస్తవంగా ఖర్చయినది రూ.2,101 కోట్లు మాత్రమే. అనర్హులకు ‘ఆసరా’తో రూ.1,175 కోట్లు నష్టం అర్హతలేని 2.02 లక్షల మందికి లబ్ధి కలిగిందన్న కాగ్ సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వివిధ కేటగిరీల కింద అనర్హులకు ఆసరా పింఛన్లు అందుతున్నాయని కం్రప్టోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) నివేదిక పేర్కొంది. పంచాయతీరాజ్–గ్రామీణాభివృద్ధి శాఖ కొందరు లబ్ధిదారులను అనర్హులుగా గుర్తించినా కూడా వారిని జాబితా నుంచి తొలగించారని తెలిపింది. దీనితో 2021 మార్చి 31తో ముగిసిన (2020–21) ఆర్థిక సంవత్సరంలో 2.02 లక్షల మంది అనర్హులకు రూ.1,175 కోట్ల మేర అక్రమ చెల్లింపులు జరిగినట్టు తేల్చింది. కుటుంబ ఆదాయానికి సంబంధించిన సిస్టమ్‌లో అంతర్గతంగా కచ్చితమైన నియంత్రణలు లేవని.. దీనితో నిర్దేశిత పరిమితి కంటే ఎక్కువ ఆదాయమున్నవారికీ లబ్ధి కలిగిందని తెలిపింది. సమగ్ర కుటుంబ సర్వే (ఎస్కేఎస్) డేటాలోని వివరాల ప్రకారం.. రాష్ట్రంలోని 16శాతం కుటుంబాలకు ఆసరా పింఛన్లకు అర్హత లేదని స్పష్టమవుతోందని, అయినా పింఛన్ దరఖాస్తుల పరిశీలన, మంజూరు, గుర్తింపు ప్రక్రియలను సమర్థవంతంగా చేయలేదని తప్పుపట్టింది. 2018 ఏప్రిల్ నుంచి 2021 మార్చి మధ్య సగటున నెలకు 2.30 లక్షల (6 శాతం) మంది లబ్ధిదారులకు పింఛన్ల చెల్లింపు జరగలేదని పేర్కొంది. ఇసుక విధానంలో లోపాలతో ఖజానాకు గండి ఇసుక వెలికితీతలో టీఎస్ఎండీసీ తీరును తప్పుపట్టిన కాగ్ సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఇసుక విధానంలోని లోపాలతో, రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ (టీఎస్ఎండీసీ) తీరుతో ఖజానాకు నష్టం వాటిల్లిందని ‘కాగ్’పేర్కొంది. టీఎస్‌ఎండీసీతో ఒప్పందం కుదుర్చుకున్న గిరిజన సంఘాలు నిబంధనలకు విరుద్ధంగా ఇసుక తవ్వకాలను సబ్ లీజ్‌కు అప్పగించడంతో.. థర్డ్ పార్టీకి రూ.11.61 కోట్లు అనుచిత లబ్ధి జరిగిందని పేర్కొంది. దుమ్ముగూడెం వద్ద ఇసుక కాంట్రాక్టర్లకు చెల్లించే ధర నిర్ణయంలో ఆలస్యంతో రూ.172.64 కోట్ల మేర ప్రభుత్వం ఆదాయం కోల్పోయిందని పేర్కొంది. అధిక లోడింగ్, వాహనాల కదలికలను గుర్తించే సీసీ కెమెరాలు, జీపీఎస్ పరికరాలను అరకొరగా ఏర్పాటు చేయడం సరికాదని తెలిపింది. ఇసుక రేవులు, నిల్వ కేంద్రాల కార్యకలాపాలపై టీఎస్ఎండీసీ పర్యవేక్షణ లోపభూయిష్టమని పేర్కొంది. అనుమతులు లేకుండా చేపట్టిన తవ్వకాలతో 2022 మార్చి నాటికి రూ.108.96 కోట్ల మేర ప్రభుత్వ ఆదాయానికి గండిపడిందని కాగ్ తెలిపింది. 2016–21 మధ్య రూ.171.32 కోట్లు రహదారి చార్జీలు వసూలైతే.. అందులో ప్రభుత్వం రూ.162.27 కోట్లను ఇతర ప్రయోజనాలకు మళ్లించిందని పేర్కొంది. -
Women : ఆడబిడ్డల ఆంధ్రా!
సాక్షి, అమరావతి: దేశంలో, రాష్ట్రంలో జననాల్లో బాలికల సంఖ్య పెరుగుతోంది. 2014–15 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే.. దేశంలో ప్రతి వెయ్యి మంది బాలురకు 2022–23లో బాలికల నిష్పత్తి 15కు పెరగ్గా, రాష్ట్రంలో 24కు పెరిగింది. దేశం మొత్తంతోపాటు చాలా రాష్ట్రాల్లో గతంలో కన్నా జననాల్లో బాలికల నిష్పత్తి పెరుగుతోందని, ఇది శుభపరిణామమని కేంద్ర మహిళా శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ పేర్కొంది. అయితే బిహార్‌తో పాటు మిజోరాం, నాగాలాండ్‌లలో గతం కన్నా బాలికల నిష్పత్తి తగ్గడం ఆందోళన కలిగిస్తోందని తెలిపింది. బేటీ బచావో బేటీ పఢావో పథకం ద్వారా బాలికలు, మహిళా సాధికారతకు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖతో కలిసి ప్రయత్నాలు చేస్తున్నట్టు కేంద్ర మహిళా శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ పథకం కింద జనన సమయంలో లింగ నిర్ధారణను గుర్తించే చర్యలను ప్రభుత్వం నిలుపుదల చేసిందని, ఆడపిల్లల జననాల పట్ల అవగాహన పెంచేందుకు చర్యలు చేపట్టిందని తెలిపింది. ఆడపిల్లల అభివృద్ధికి ప్రోత్సాహం ఆడపిల్లల విద్య, పెరుగుదల, అభివృద్ధి, హక్కులకు మద్దతుగా సానుకూల చర్యలను ప్రోత్సహించడానికి అన్ని స్థాయిల్లో ప్రయత్నాలు చేస్తున్నట్టు కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ వెల్లడించింది. ఇందుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు తగిన మార్గదర్శకాలతో కూడిన కార్యాచరణ క్యాలెండర్ జారీ అయినట్లు తెలిపింది. దానిని జాతీయ, రాష్ట్ర, జిల్లా స్థాయిలో అమలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు పేర్కొంది. లింగ నిష్పత్తి తగ్గకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖలు రాసినట్టు తెలిపింది. -
AP: స్టూడెంట్-టీచర్ నిష్పత్తిలో ఉత్తమం
సాక్షి, అమరావతి: మూడున్నరేళ్లుగా వైఎస్సార్ సీపీ ప్రభుత్వం చేపట్టిన విద్యారంగ సంస్కరణలు, అత్యుత్తమ బోధనా విధానాలు, శిక్షణా కార్యక్రమాలు, నాడు – నేడు ద్వారా పాఠశాలలను మౌలిక వసతులతో తీర్చిదిద్దడం సత్ఫలితాలనిస్తున్నట్లు మరోసారి తేటతెల్లమైంది. జగనన్న అమ్మ ఒడి, విద్యా కానుక తదితర ప్రోత్సాహాలతో ప్రభుత్వ పాఠశాలల్లో పెద్ద ఎత్తున విద్యార్థుల చేరికలు పెరగగా అందుకు తగ్గట్లుగా ఉపాధ్యాయులను సమకూర్చడంతో నాణ్యమైన బోధన అందుతోంది. దేశవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు, టీచర్ల నిష్పత్తి (పీపుల్, టీచర్ రేషియో)లో ఆంధ్రప్రదేశ్ మెరుగైన స్థితిలో ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఇతర పెద్ద రాష్ట్రాల కన్నా ఏపీలో పరిస్థితి ఎంతో బాగున్నట్లు కేంద్ర గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఈమేరకు కేంద్ర విద్యా శాఖ ఈనెల 13వతేదీన పార్లమెంట్‌కు లిఖిత పూర్వకంగా తెలియచేసింది. రాష్ట్రాలవారీగా పీపుల్, టీచర్ రేషియో వివరాలను వెల్లడించాలని యూపీకి చెందిన బీజేపీ ఎంపీ అజయ్‌నిషాద్ కోరగా లోక్‌సభకు వివరాలను సమర్పించింది. ►2021–22 గణాంకాల ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో విద్యార్థులు – ఉపాధ్యాయుల నిష్పత్తి ప్రైమరీ స్కూళ్లలో 24 : 1గా, అప్పర్ ప్రైమరీలో 17 : 1 చొప్పున ఉంది. అంటే ప్రైమరీ తరగతుల్లో 24 మంది విద్యార్ధులకు ఒకరు చొప్పున ఉపాధ్యాయుడు ఉండగా అప్పర్ ప్రైమరీలో 17 మంది విద్యార్ధులకు ఒకరు చొప్పున టీచర్ ఉన్నారు. ►పాఠశాల విద్యకు ఆయువు పట్టు లాంటి ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో విద్యార్ధులు, ఉపాధ్యాయుల నిష్పత్తిని జాతీయ విద్యాహక్కు చట్టం 2009లో స్పష్టంగా నిర్దేశించారు. ఈ చట్టం ప్రకారం పీపుల్, టీచర్ రేషియో ప్రైమరీలో 30 మంది విద్యార్ధులకు ఒక టీచర్ (30 : 1) ఉండాలి. అప్పర్ ప్రైమరీలో 35 మంది విద్యార్ధులకు ఒక టీచర్ (35 : 1) ప్రకారం ఉండాలని పేర్కొన్నారు. అయితే ఏపీలో అంతకంటే మెరుగ్గా టీచర్లు అందుబాటులో ఉండటం గమనార్హం. ►ఏపీలో పీపుల్, టీచర్ రేషియో జాతీయ సగటుకన్నా మెరుగ్గా ఉన్నట్లు కేంద్ర గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. విద్యార్ధులు – ఉపాధ్యాయుల నిష్పత్తి జాతీయ స్థాయిలో ప్రైమరీలో 28 : 1 కాగా అప్పర్ ప్రైమరీలో 24 : 1 చొప్పున ఉంది. పెద్ద రాష్ట్రాల కంటే మెరుగ్గా.. దేశంలో ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్‌లో ఉత్తమ ప్రమాణాలతో విద్యా బోధన జరుగుతున్నట్లు కేంద్రం విడుదల చేసిన సమాచారాన్ని విశ్లేషిస్తే స్పష్టమవుతోంది. దశాబ్దాలుగా విద్యారంగంలో అగ్రస్థానంలో కొనసాగిన కేరళ, తమిళనాడు, పంజాబ్, ఉత్తరప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్ తదితర రాష్ట్రాల కంటే ఏపీలో టీచర్ల నిష్పత్తి మెరుగైన స్థితిలో ఉన్నట్లు వెల్లడవుతోంది. విద్యాహక్కు చట్టం ప్రకారం అప్పర్ ప్రైమరీలో 35 : 1 నిష్పత్తిలో పీపుల్, టీచర్ రేషియో ఉండాలి. ఏపీలో అంతకంటే మెరుగ్గా 17 మంది విద్యార్ధులకు ఒకరు చొప్పున ప్రభుత్వం టీచర్లను నియమించింది. -
కరోనా కేసులతో వణికిపోతున్న మేడ్చల్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. పాజిటివిటీ రేటు కూడా పెరిగింది. పాజిటివిటీ రేటు ఒక శాతం లోపుంటే కరోనా నియంత్రణలో ఉన్నట్లు లెక్క. కానీ రాష్ట్రంలో గత వారం సరాసరి పాజిటివిటీ రేటు మూడు శాతం నమోదైంది. అయితే ఏడు జిల్లాల్లో మాత్రం ఏకంగా నాలుగు శాతానికి మించడం ఆందోళన కలిగిస్తోంది. అత్యధికంగా మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 6.95 శాతం పాజిటివిటీ రేటు నమోదైంది. ఆ తర్వాత జీహెచ్ఎంసీలో 5.65, రంగారెడ్డి జిల్లాలో 4.92, నిజామాబాద్ జిల్లాలో 4.81, కామారెడ్డి జిల్లాలో 4.51, సంగారెడ్డి జిల్లాలో 4.21, మెదక్ జిల్లాలో 4.02 శాతం నమోదైందని వైద్య ఆరోగ్యశాఖ నివేదిక వెల్లడించింది. అత్యంత తక్కువగా వనపర్తి జిల్లాలో 0.25 శాతం, గద్వాల, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో 0.29 శాతం చొప్పున పాజిటివిటీ రేటు నమోదైనట్లు తెలిపింది. 17 జిల్లాల్లో ఒక శాతం కంటే తక్కువగా పాజిటివిటీ రేటు నమోదైనట్లు ప్రభుత్వానికి సమర్పించిన నివేదికలో పేర్కొంది. చదవండి: కరోనా నేపథ్యంలో పరీక్షలు వాయిదా 3.3 శాతానికి పెరిగిన పడకల ఆక్యుపెన్సీ కేసుల పెరుగుదల నేపథ్యంలో ఆక్సిజన్, ఐసీయూ పడకల ఆక్యుపెన్సీ శాతం కూడా కాస్త పెరిగినట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. గాంధీ సహా జిల్లా ఆసుపత్రుల్లో కరోనా బాధితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఈ నెల ఒకటో తేదీన రాష్ట్రంలో ఆక్సిజన్, ఐసీయూ పడకలు 2.7 శాతం నిండిపోగా, ఈ నెల 12వ తేదీనాటికి 3.3 శాతానికి పెరిగింది. అయితే చాలావరకు కేసులు పెద్దగా సీరియస్ కావడం లేదని వైద్య వర్గాలు అంటున్నాయి. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా కోవిడ్ రోగుల కోసం 56,036 పడకలు కేటాయించారు. ఇందులో 97 శాతం వరకు ప్రస్తుతం ఖాళీగానే ఉన్నాయి. పెరిగిన పిల్లల పడకలు పద్నాలుగు ఏళ్లలోపు వయస్సున్న పిల్లలు వ్యాక్సిన్ తీసుకోవడానికి వీల్లేదు. దీంతో ప్రభుత్వం ముందుజాగ్రత్తగా పిల్లల పడకలను పెంచింది. 33 జిల్లాల్లోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆక్సిజన్, ఐసీయూ పడకలను 6 వేలు చేసింది. అందులో ఆక్సిజన్ పడకలు 4,125 ఉండగా, ఐసీయూ పడకలు 1,875 ఉన్నాయి. అలాగే ఆయా ఆసుపత్రుల్లో పిల్లల వైద్యులు 256 మంది అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టింది. కొనసాగుతున్న ఫీవర్ సర్వే రాష్ట్రంలో లక్షణాలు ఉన్న వ్యక్తులను గుర్తించడం కోసం ఫీవర్ సర్వే జరుగుతోంది. తద్వారా ముందస్తుగా గుర్తించడం, ఐసోలేషన్‌లో ఉంచడం, వైద్యం చేయడం వంటివి చేస్తున్నారు. చాలా మందికి తేలికపాటి లక్షణాలే ఉంటాయి. కొందరికి అసలు లక్షణాలే ఉండటం లేదని తేలింది. రాష్ట్రవ్యాప్తంగా ఫీవర్ క్లినిక్‌లు అందుబాటులో ఉన్నాయి. రాష్ట్రంలో 1,231 ర్యాపిడ్ యాంటిజెన్ పరీక్షా కేంద్రాలున్నాయి. అలాగే ప్రభుత్వ ఆధ్వర్యంలో 34 చోట్ల, ప్రైవేట్ లేబొరేటరీల్లో 76 చోట్ల ఆర్టీపీసీఆర్ పరీక్షలు జరుగుతున్నాయి. అలాగే మొబైల్ పరీక్షలు కూడా జరుగుతున్నాయి. రోజుకు కనీసం 71,600 టెస్టులు లక్ష్యం ప్రతిరోజూ లక్ష కరోనా నిర్ధారణ పరీక్షలు చేయాలని వైద్య ఆరోగ్యశాఖ భావిస్తోంది. కనీసం 71,600 పరీక్షలైనా చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు నివేదిక వెల్లడించింది. అత్యధికంగా హైదరాబాద్‌లో రోజుకు కనీసం 12,300 పరీక్షలు చేయాలని భావిస్తున్నారు. అయితే కనీసం కంటే ఎక్కువగానే కొన్నిసార్లు రాష్ట్రంలో పరీక్షలు నిర్వహించారు. కాగా ఇప్పటికే రెండుసార్లు కనీస లక్ష్యానికి మించి టెస్టులు నిర్వహించారు. ఈ నెల 12వ తేదీన ఏకంగా 90,021 పరీక్షలు చేయగా అంతకుముందు రోజు 83,153 పరీక్షలు చేశారు. మరోవైపు కొందరు సొంతంగా పరీక్షలు చేసుకుంటున్నారు. అవి రోజుకు దాదాపు 10 వేలకు పైగానే ఉంటాయని అంచనా వేస్తున్నారు. -
జనాభా వృద్ధికి జాగ్రత్తగా పగ్గం
దేశంలో జనాభా విస్ఫోటన భయం కొంత తగ్గినట్టే! జనాభా వృద్ధి నియంత్రణ చర్యలు ఫలితా లిస్తున్నాయి. దాదాపు దేశమంతటా ఆశించిన స్థాయిలోనే జనాభా వృద్ధిని కట్టడి చేయగలిగినట్టు జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (ఎన్ఎఫ్హెచ్ఎస్–5) తేల్చింది. మరో ఆరోగ్యకరమైన సంకేతం... దేశంలో మహిళా జనాభా పురుష జనాభాను దాటడం. ప్రతి వెయ్యి మంది పురుషులకు దేశంలో 1020 మంది మహిళలున్నట్టు తాజా సర్వే తెలిపింది. ఇలా మహిళల జనాభా పెరగడం, దాదాపు మూడు దశాబ్దాల ఈ సర్వే పర్వంలో తొలి నమోదు! అయితే ఈ లింగ నిష్పత్తి జననాల స్థాయిలో (ఎస్సార్బీ) ఇలా లేదు! అక్కడ పరిస్థితి భిన్నంగానే ఉంది. ప్రతి వెయ్యిమంది పురుషులకు 929 మంది మహిళలే ఉంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్లుహెచ్‌వో) సహజమని చెప్పే స్త్రీ–పురుష నిష్పత్తి 950–1000తో పోలిస్తే ఇది తక్కువే! కానీ, అయిదేళ్ల కిందటి 2015–16 సర్వే (ఎన్ఎఫ్హెచ్ఎస్–4) చెప్పిన నిష్పత్తి (919–1000) కన్నా ప్రస్తుత పరిస్థితి మెరుగే! పరిమిత నమూనాలతో జరిపే ఈ సర్వే ఫలితాలను ప్రామాణికంగా భావించరు. పదేళ్లకోసారి వచ్చే సాధా రణ జనాభా లెక్కలే ప్రామాణికం. 2001, 2011 జనాభా లెక్కల్లో స్త్రీ–పురుష నిష్పత్తి సరళి కూడా ఇట్లాగే ఉంది. సాపేక్షంగా ఈ సర్వే నివేదికలూ వాస్తవికతకు దగ్గరగా ఉన్నట్టే! ఒకటి మాత్రం నిజం. వివిధ సమాజాల్లో ఈ లింగవివక్ష, కాన్పుకు ముందే లింగ నిర్ధారణ దురదృష్టకరం, నేరం! ఆడ పిల్లలను అంతమొందించే బ్రూణహత్యలు జరుగుతూనే ఉన్నాయి. వెయ్యిమంది పురుషులకు హిమాచల్‌ప్రదేశ్(875), తమిళనాడు(878), హరియాణా(893), ఒడిశా(894) లాగే తెలంగాణ (894)లోనూ మహిళల సంఖ్య తక్కువగా నమోదయింది. ఆంధ్రప్రదేశ్‌లో కొంత మెరుగ్గా (934) ఉంది. కేరళలో అయిదేళ్ల కింద 1047గా ఉన్న మహిళల సంఖ్య తాజాగా 951కి పడిపోయింది. ఢిల్లీలో 812 నుంచి ఏకంగా 923కి పెరిగింది! ఒట్టి జననాల్లో కాకుండా మొత్తం జనాభాలో మహి ళల నిష్పత్తి పురుషుల కన్నా ప్రస్తుతం పెరగడానికి పలు కారణాలుంటాయి. మరణాల రేటులో వ్యత్యాసం, మహిళల్లో ఆయుఃకాలం పెరగటం వంటివీ ఈ అంశాన్ని ప్రభావితం చేస్తాయి. కుటుంబ ఆరోగ్య సర్వేలో కొన్ని మంచి ఫలితాలు కనిపిస్తే, మరికొన్ని విషయాల్లో ఆందోళనకర సంకేతాలు వెలువడటాన్ని పాలకులు గుర్తించాలి. పిల్లలు, మహిళల్లో పౌష్టికాహార లోపం, ఇనుము కొరవడి రక్తహీనత (అనీమియా) ప్రబలడాన్ని తీవ్రంగా పరిగణించి, నివారణ చర్యల్ని ముమ్మరం చేయాలి. పిల్లల్లో రక్తహీనత కేసులు గత సర్వే కాలంలో 58.6 శాతం ఉంటే, ఇప్పుడది 67 శాతానికి పెరిగింది. గర్భిణీల్లో 50.4 శాతం నుంచి 52.2 శాతానికి, 15–49 మధ్య వయస్కులైన మహిళల్లో 53 నుంచి 57 శాతానికి పెరిగింది. అదే వయసు పురుషుల్లో 22.7 నుంచి 25 శాతానికి పెరగటం సమస్య తీవ్రతకు నిదర్శనం. ‘అనీమియా రహిత భారత్’ నినాదంతో, 2022 నాటికి కేసుల్ని తగ్గిం చాలని కేంద్ర ప్రభుత్వం నిర్దిష్ట లక్ష్యాలతో పనిచేస్తున్నా ఆశించిన ప్రగతి లేదని సర్వే తేల్చింది. పళ్లు, కూరగాయలు సరిగా తినకపోవడం, ఇతరత్రా పౌష్టికాహార లోపాలతోనే రక్తహీనత పెరిగి సమస్య జటిలమౌతోంది. కరోనా కాలంలో ఆదాయాలు రమారమి పడిపోయి, నిత్యావసరాల ధరలు పెరగ టం కూడా ఈ సమస్యను తీవ్రతరం చేసింది. రోజువారీ భోజనంలో, తమ ఆర్థిక స్థాయిలోనూ సమ కూర్చుకోగలిగిన నిర్దిష్ట ఆహార పదార్థాలపైన జనాలకి స్పష్టమైన అవగాహన ముఖ్యం. జాతీయ పౌష్టికాహార సంస్థ ప్రచారం కల్పిస్తున్నప్పటికీ, సరిపోవడం లేదు. ప్రజలింకా చైతన్యం కావాలి. దేశవ్యాప్తంగా మొత్తం రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను గ్రూపులు చేసి రెండు విడతల్లో నిర్వహించిన ఈ సర్వే ఏపీ, తెలంగాణల్లో తొలివిడతలోనే జరిగింది. వైద్యారోగ్యపరంగా కొన్ని మంచి సంకేతాలీ రాష్ట్రాల్లో వెలువడ్డాయి. పౌరులకు ఆరోగ్య భీమా వర్తింపజేయడంలో దేశంలోనే రెండు తెలుగు రాష్ట్రాలు అగ్రభాగాన ఉన్నాయి. ఏపీలో పెద్ద మొత్తంలో డబ్బు వెచ్చించి ‘నాడు– నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వాసుపత్రుల రూపురేఖల్ని మారుస్తున్న చర్య సత్ఫలితాలిస్తోంది. ఆస్పత్రుల్లో కాన్పులు పెరిగాయి. కాన్పువేళ, తదనంతరం మాతా–శిశు మరణాలు తగ్గాయి. కొన్ని విషయాల్లో దేశవ్యాప్తంగానూ ఆశావహ సంకేతాలున్నాయి. దేశంలో నాల్గింట మూడొంతుల మంది మహిళలు బ్యాంకుల్లో అకౌంట్లు తెరిచారు. స్త్రీ–పురుషుల్లోనూ ఇంటర్నెట్ వాడకం బాగా పెరిగింది. గృహ హింస, అదీ జీవిత భాగస్వామి నుంచి తగ్గినట్టు నమోదైంది. కుటుంబ నియంత్రణ పట్ల అవ గాహన పెరగటమే కాక సురక్షిత పద్ధతులు వారికి తెలిసి వచ్చాయి. జననాల రేటు తగ్గించడంలో ఇదెంతో ఉపయోగపడ్డట్టు గణాంకాలున్నాయి. జనాభా వృద్ధి కట్టడిలో చాలా రాష్ట్రాలు గణనీయ ఫలితాలే సాధిస్తున్నాయి. మొత్తం సంతానోత్పత్తి రేటు(టీఎఫ్పార్)ను 2.1 కన్నా తక్కువకి నియం త్రిస్తే జనన–మరణాల ప్రక్రియ కొనసాగుతూనే, ఇప్పుడున్న జనసంఖ్య స్థిరపడుతుందనేది ఓ లెక్క! బిహార్, మేఘాలయ, మణిపూర్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్ తప్ప దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలూ టీఎఫ్పార్ని 2 కన్నా కిందే నిలిపేయడం మంచి పరిణామం. అయినా, 2040–50 సంవత్సరాల మధ్య భారత్ అత్యధిక (160 నుంచి 180 కోట్ల మందితో) జనాభా దేశంగా ఆవిర్భవించనుంది. 2031 నాటికే చైనాను అధిగమిస్తామని మరో అధ్యయనం! 2022కే అధిగమి స్తామన్న ఐక్యరాజ్యసమితి (యూఎన్) అంచనాను తప్పించామంటే, జన విస్ఫోటన తేదీని మనం ముందుకు, మరింత ముందుకు జరుపుతున్నట్టే లెక్క! ఇది ఆశావహ సంకేతం!! -
వెండి.. బంగారాన్ని మించనుందా?
బంగారం, వెండి ధరల మధ్య నిష్పత్తి ప్రకారం సమీప భవిష్యత్‌లో వెండి కొంతమేర బంగారాన్ని మించనున్న సంకేతాలు ఇస్తున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. లాక్‌డవున్‌వల్ల సరఫరా తగ్గడం, తక్కువ ధర పలుకుతుండటం వంటి అంశాలు వెండికి సానుకూలమని చెబుతున్నారు. గతేడాది సెప్టెంబర్‌లో 79గా ఉన్న పసిడి, వెండి నిష్పత్తి ఈ ఏడాది మార్చిలో 124ను తాకింది. ఇది చరితత్రాత్మక గరిష్టంకాగా.. వెండి కూడా బలమైన కమోడిటీయే కావడంతో గత కొద్ది రోజులుగా ఈ నిష్పత్తి 100కు చేరింది. గత రెండు దశాబ్దాలలో 100 మార్క్‌ను రెండుసార్లు మాత్రమే చేరుకున్నట్లు నిపుణులు తెలియజేశారు. ఈ రేషియో ఎలాగంటే.. ఔన్స్ బంగారంతో ఎన్ని ఔన్స్‌ల వెండి కొనగలమనే అంశాన్ని తెలియజేస్తుంది. వెరసి ఈ రెండు విలువైన లోహాల అంతర్గత బలిమి(రెలిటివ్ స్ట్రెంగ్త్)ను ఈ రేషియో తెలియజేస్తుంది. ప్రస్తుతం న్యూయార్క్ కామెక్స్‌లో పసిడి ఔన్స్ 1734 డాలర్లకు చేరగా.. ఔన్స్ వెండి 17.74 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. నిష్పత్తి ఆధారంగా బంగారం, వెండి నిష్పత్తి ఆధారంగా ట్రేడర్లు సాధారణంగా ఈ విలువైన లోహాలలో పొజిషన్లు తీసుకుంటుంటారని విశ్లేషకులు చెబుతున్నారు. కొంతమంది ఈ రేషియోలో సైతం ట్రేడింగ్ చేస్తుంటారని తెలియజేశారు. ఈ నిష్పత్తి బలపడితే.. ఇందుకు అనుగుణంగా ఓవైపు బంగారాన్ని కొంటూ మరోపక్క వెండిని విక్రయిస్తుంటారని వివరించారు. కాగా.. బంగారం, వెండి చరిత్రాత్మక సగటు నిష్పత్తి 60కాగా.. ప్రస్తుతం 100కు చేరినట్లు కేడియా అడ్వయిజరీ డైరెక్టర్ అజయ్ కేడియా పేర్కొన్నారు. ప్రస్తుత నిష్పత్తి చరిత్రాత్మక సగటును అందుకోవాలంటే బంగారం ధరలు దిగిరావడం లేదా వెండి భారీగా పుంజుకోవడం జరగవలసి ఉన్నట్లు అభిప్రాయపడ్డారు. లేదంటే వెండిని మించి బంగారం ధరలు పతనంకావలసి ఉన్నట్లు వివరించారు. వెండి జోరు పారిశ్రామికంగా అధిక వినియోగం కలిగిన వెండి ధరలు ఈ ఏడాది పుంజుకోవచ్చని భావిస్తున్నట్లు కేడియా చెప్పారు. ఈ లోహంలో పెట్టుబడులు పెరగడం కూడా ఇందుకు సహకరించవచ్చని అంచనా వేస్తున్నారు. వీటితోపాటు వెండి వెలికితీత(మైనింగ్), ఉత్పత్తి తదితర సమస్యలతో సరఫరాలు తగ్గడం కూడా ధరలు పెరిగేందుకు కారణంకావచ్చని అభిప్రాయపడ్డారు. ‘ఇటీవల పలు దేశాలు లాక్‌డవున్ ఎత్తివేస్తున్న కారణంగా పారిశ్రామికోత్పత్తి పుంజుకోనుంది. దీంతో వెండికి డిమాండ్ పెరగనుంది. వెరసి సాంకేతికంగా చూస్తే.. బంగారం, వెండి నిష్పత్తి 94కు దిగిరావచ్చని భావిస్తున్నాం. ఈ స్థాయిలో నిష్పత్తి కొనసాగకుంటే.. మరింత బలహీనపడవచ్చు. అంటే భవిష్యత్‌లో బంగారాన్ని మించి వెండి లాభపడే వీలున్నద’ని కేడియా ఊహిస్తున్నారు. వెండి- రాగి ఆర్థిక వ్యవస్థకు బారోమీటర్‌గా భావించే గోల్డ్, కాపర్(రాగి) నిష్పత్తిని సైతం కమోడిటీ విశ్లేషకులు ప్రస్తావిస్తున్నారు. పసిడి, రాగి నిష్పత్తిని ఆర్థిక స్ట్రెస్ రేషియోగా పేర్కొంటారు. అంటే ఈ నిష్పత్తి అధికంగా ఉంటే ఆర్థిక వ్యవస్థపై అధిక ఒత్తిడి ఉన్నట్లుగా భావిస్తుంటారు. పసిడి ధరలు అధికంగా ఉండి, రాగి ధరలు బలహీనపడుతూ ఉంటే ఈ రేషియో పెరుగుతుంది. ప్రస్తుతం గోల్డ్- కాపర్ రేషియో 727 సమీపంలో ఉంది. గత రెండు నెలల్లో పెరుగుతూ వచ్చింది. 2019 ఏప్రిల్‌లో 429గా ఉన్న ఈ నిష్పత్తి ఈ ఏడాది ఏప్రిల్‌లో 756ను తాకింది. దీంతో మరికొంతకాలం ఆర్థిక వ్యవస్థల్లో ఒత్తిడి కొనసాగవచ్చని, ఇది పసిడి ధరలకు దన్నునిస్తుందని చెబుతున్నారు. కాగా.. పారిశ్రామిక రంగం నుంచి డిమాండ్ లభించే కాపర్, సిల్వర్ రేషియో.. ప్రస్తుతం వెండికి సానుకూలంగా కనిపిస్తున్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు. ఈ రేషియో ఏప్రిల్‌లో 5గా నమోదుకాగా.. ప్రస్తుతం 7.3కు ఎగసింది. -
బ్యాంకింగ్‌లో రికవరీ షురూ
ముంబై: పేరుకుపోయిన మొండిబకాయిలు తగ్గుతుండడంతో బ్యాంకింగ్ రంగం ఊపిరి పీల్చుకుంటోందని ఆర్బీఐ వ్యాఖ్యానించింది. బ్యాంకింగ్ రంగం రికవరీ బాట పట్టినా, పీఎస్‌యూ బ్యాంకుల్లో పాలనా పరంగా మరిన్ని సంస్కరణలు రావాల్సి ఉందని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్‌దాస్ అభిప్రాయపడ్డారు. సోమవారం ఆర్బీఐ అర్ధ వార్షిక ఆర్థిక స్థిరత్వ నివేదికను (ఎఫ్ఎస్ఆర్) విడుదల చేసిన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. స్థూల ఎన్పీఏలు తగ్గుముఖం పట్టాయని నివేదిక వెల్లడించింది. పదకొండు బ్యాంకులను పీసీఏ చట్రం కిందకు తీసుకురావడంతో బ్యాంకింగ్ రంగంలో క్రమశిక్షణ వచ్చినట్లయిందని తెలిపింది. ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ సంక్షోభాన్ని దృష్టిలో ఉంచుకొని ఫైనాన్షియల్ దిగ్గజాల ఆర్థిక స్థిరత్వంపై ఎక్కువ ఫోకస్ పెడతామని సూచించింది. మొండిపద్దులు తగ్గుతున్నాయ్ ఎఫ్ఎస్ఆర్ ప్రకారం... గత మార్చిలో 11.5 శాతం ఉన్న బ్యాంకుల స్థూల ఎన్పీఏలు సెప్టెంబర్ నాటికి 10.8 శాతానికి దిగివచ్చాయి. ఇదే కాలంలో పీఎస్‌యూ బ్యాంకుల జీఎన్‌పీఏలు 15.2 నుంచి 14.8 శాతానికి తగ్గాయి. ప్రైవేట్ బ్యాంకుల జీఎన్‌పీఏలు 4 నుంచి 3.8 శాతానికి పరిమితమయ్యాయి. ఇదే జోరు కొనసాగితే వచ్చే మార్చినాటికి బ్యాంకులన్నింటి స్థూల ఎన్పీఏలు 10.3 శాతానికి, పీఎస్‌బీల జీఏన్పీఏలు 14. 6 శాతానికి, ప్రైవేట్ బ్యాంకుల జీఎన్‌పీఏలు 3.3 శాతానికి తగ్గవచ్చని నివేదిక అంచనా వేసింది. నికర ఎన్పీఏలు గత మార్చిలో 6.2 శాతం ఉండగా మార్చినాటికి 5.3 శాతానికి పతనమయ్యాయి. 2015 అనంతరం అటు స్థూల, నికర ఎన్‌పీఏల్లో అర్ధవార్షిక తరుగుదల నమోదు కావడం ఇదే తొలిసారి. రిస్ట్రక్చర్డ్ స్టాండర్డ్ అడ్వాన్సుల (ఆర్ఎస్ఏ) నిష్పత్తి సెప్టెంబర్ నాటికి 0.5 శాతానికి పతనమైందని, ప్రొవిజన్ కవరేజ్ నిష్పత్తి (పీసీఆర్) 51 శాతానికి పెరిగిందని, క్యాపిటల్ టు రిస్క్ వెయిటెడ్ అసెట్ నిష్పత్తి (సీఆర్ఏఆర్) 13.7 శాతానికి వచ్చిందని నివేదిక వెల్లడించింది. సెప్టెంబర్‌నాటికి బ్యాంకు పోర్టుఫోలియోల్లో పెద్ద రుణఖాతాలు 54.6 శాతానికి, బ్యాంకుల జీఎన్పీఏల్లో బడా బకాయిల వాటా 83.4 శాతానికి చేరాయని వివరించింది. ‘‘ప్రస్తుత ఎన్పీఏలు అధికమే. కానీ తరుగుదల రేటును పరిశీలిస్తే ఇవి మరింత దిగొస్తాయనిపిస్తోంది. నిజానికి ఎన్పీఏ అంశంలో ఈ మెరుగుదల చాలదు. పీఎస్‌యూ బ్యాంకుల నిర్వహణా సామర్ధ్యాన్ని మరింత మెరుగుపరచాల్సిన అవసరం ఉంది. దీనికోసం మరిన్ని పాలనా సంస్కరణలు తీసుకురావడం, బలహీన పీఎస్బీలకు రీక్యాప్ సాయం అందించడం తదితర చర్యలు అవసరం’’ అని దాస్ చెప్పారు. ఎన్పీఏలను గుర్తించే ప్రక్రియతో పీఎస్బీల్లో రిస్క్ మేనేజ్మెంట్ మెరుగుపడిందన్నారు. క్రమశిక్షణ తెచ్చిన పీసీఏ ఇరవై పీఎస్బీల్లో 11 బ్యాంకులను పీసీఏ (స్పష్టమైన దిద్దుబాటు చర్యల) పరిధిలోకి తీసుకురావడం మంచిదయిందని దాస్ అభిప్రాయపడ్డారు. క్రెడిట్ అంచనా, మార్కెట్ రిస్కు అంచనాలకు సంబంధించి పీసీఏ కారణంగా బ్యాంకుల్లో క్రమశిక్షణ వచ్చిందన్నారు. దివాలా చట్టం కింద చేర్చిన కేసుల్లో కొంత జాప్యం జరుగుతున్నా, ఈ చట్టం కారణంగా విత్త క్రమశిక్షణ వస్తుందన్నారు. గత నాలుగు త్రైమాసికాల్లో పీసీఏ కారణంగా 11 పీఎస్‌బీల సాల్వెన్సీ నష్టాలు 73,500 కోట్ల రూపాయల నుంచి 34,200 కోట్ల రూపాయలకు దిగివచ్చాయిని ఆర్బీఐ నివేదిక తెలిపింది. క్రూడాయిల్ ధరలు తగ్గడం, స్థూల స్థిర మూలధన ఏర్పాటులో వృద్ధి కారణంగా ఎకానమీలో వృద్ధి ముందుకే సాగుతుందని దాస్ అంచనా వేశారు. వాణిజ్య భయాలు తగ్గుతున్నాయన్నారు. ఎఫ్‌సీలపై డేగ కన్ను భారీ ఆర్థిక సామ్రాజ్యాల (ఎఫ్‌సీ) విత్త స్థిరత్వంలో రిస్కును ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ సంక్షోభం ఎత్తిచూపిందని ఆర్బీఐ తన నివేదికలో పేర్కొంది. వీటిపై మరింత దృష్టి సారించాల్సిన అవసరం ఉందని తెలిపింది.ఎఫ్‌సీల్లో కచ్చితమైన రిస్కులుండేందుకు పలు అవకాశాలున్నాయని అభిప్రాయపడింది. ప్రస్తుతం ఎఫ్సీల స్థితిగతులను ఐఆర్ఎఫ్– ఎఫ్‌సీ పర్యవేక్షిస్తోంది. ఐఆర్ఎఫ్ పర్యవేక్షణ అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం ఉన్నా, మరింత మెరుగుదల అవసరమని నివేదిక తెలిపింది. ఇకపై అన్ని ఎఫ్‌సీలు త్రైమాసికానికొకసారి తమ వద్ద జరిగిన ఇంటర్‌గ్రూప్ లావాదేవీల డేటాను సమర్పించాలని ఆర్బీఐ ఆదేశించింది. ఎఫ్‌సీలకు క్రెడిట్ రేటింగ్ ఏజన్సీలు ఇచ్చే రేటింగ్ ప్రమాణాలపై సెబీ తీసుకువచ్చిన మార్పులు అవసరమని తెలిపింది. నివేదికలో మరికొన్ని ముఖ్యాంశాలు... ∙ఆర్థిక సంవత్సరం తొలి అర్ధభాగంలో భారత బహిర్గత రుణభారం 3.6 శాతం తగ్గి 52,970 కోట్ల డాలర్ల నుంచి 51,040 కోట్ల డాలర్లకు చేరింది ∙2017 సెప్టెంబర్‌తో పోలిస్తే గత సెప్టెంబర్ నాటికి ఎన్‌బీఎఫ్‌సీల బాలెన్స్ షీటు 17.2 శాతం పెరిగి 26 లక్షల కోట్ల రూపాయలకు చేరింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సర ప్రథమార్ధంలో ఈ రంగ నికర లాభంలో 16.2 శాతం వృద్ధి నమోదయింది. ఎన్బీఎఫ్సీ రంగ స్థూల ఎన్పీఏలు 5.8 శాతం నుంచి 6.1 శాతానికి విస్తరించాయి. లోన్సు, అడ్వాన్సుల్లో వరుసగా 16.3, 14.1 శాతం పెరుగుదల నమోదయింది. ∙విత్త వ్యవస్థలోని మొత్తం ఆర్థిక లావాదేవీల్లో(ఆర్థిక సంస్థల మధ్యన జరిగే లావాదేవీలు– బైలేటరల్ ఎక్స్పోజర్స్) బ్యాంకుల ద్వైపాక్షిక విత్త లావాదేవీల వాటా 46.5 శాతానికి చేరింది. విత్త వ్యవస్థలో ఇలాంటి ద్వైపాక్షిక విత్తలావాదేవీలు అవసరం, కానీ కొన్ని సార్లు ఈ తరహా లావాదేవీలు అనుకోని రిస్కులు వ్యాపించేందుకు కారణమవుతుంటాయి. ∙నియంత్రణా సంస్థల మధ్య మరింత సహకారం అవసరం. నియంత్రణా సంస్థలు కలిసికట్టుగా పనితీరు కనబరిస్తే చట్టాల్లోని లోపాలను అడ్డుపెట్టుకొని ఆటలాడే సంస్థల ఆట కట్టించవచ్చు. -
బాలికల నిష్పత్తి పెరగాలి
కడప సెవెన్‌రోడ్స్: జిల్లాలో బాలికల నిష్పత్తి పెరిగేందుకు కృషి చేయడం అందరి బాధ్యత అని రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యుడు మురళీధర్‌రెడ్డి అన్నారు. శనివారం కలెక్టరేట్ సభా భవనంలో వివిధ శాఖల అధికారులతో బేటీ బచావో–బేటీ పడావో కార్యక్రమ అమలు గురించి ఆయన సమీక్షించారు. ఆడ శిశువుల జననాల సంఖ్యను పెంచి మహిళా సాధికారతను సాధించాలన్న ఉద్దేశ్యంతోనే కేంద్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. జిల్లాలో ప్రతి వెయ్యి మంది మగ పిల్లలకుగాను 918 మంది మాత్రమే బాలికలు ఉన్నారని పేర్కొన్నారు. దీంతో కేంద్ర ప్రభుత్వం జిల్లాను ఈ కార్యక్రమం కింద ఎంపిక చేసిందని చెప్పారు. కార్యక్రమ అమలు బాధ్యతను కమిషన్‌కు అప్పగించిందన్నారు. బాల్య వివాహాలు జరగకుండా చూడాలన్నారు. బాల్య వివాహాలను నివారించేందుకు ప్రజల్లో అవగవాహన తీసుకు రావాలని చెప్పారు. స్త్రీ శిశు సంక్షేమశాఖ ద్వారా ఆరోగ్యకరమైన శిశువు జననాల కోసం గర్బవతులకు పౌష్ఠికాహారం అందించాలన్నారు. బాలల హక్కుల పరిరక్షణ కోసం రూపొందించిన చట్టాలను పకడ్బందీగా అమలు చేయాలన్నారు. బాల్య వివాహాల పట్ల పాఠశాల స్థాయి నుంచే పిల్లలకు అవగాహన కల్పించాలన్నారు. గుర్తింపు లేని ప్రైవేటు పాఠశాలలను మూసి వేయాలని, ప్రైవేటు పాఠశాలల్లో పిల్లలకు అన్ని మౌళిక వసతులు కల్పించాలన్నారు. జాయింట్ కలెక్టర్ శ్వేత తెవతీయ మాట్లాడుతూ బాలికల సంఖ్య పెంచే కార్యక్రమంలో భాగంగా జాతీయ బాలికా దినోత్సవం బేటీ బచావో కార్యక్రమాల్లో భాగంగా ర్యాలీలు, అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నామన్నారు. కార్యక్రమంలో జేసీ–2 నాగేశ్వరరావు, రాజంపేట ఆర్డీఓ ప్రభాకర్పిళ్లై, జిల్లా లీగల్ సర్వీస్సెక్రటరీ ప్రసాద్, డీఎస్పీ అశోక్‌కుమార్, ఐసీడీఎస్ పీడీ రాఘవరావు, చైల్డ్ వెల్ఫేర్ అసోసియేషన్ చైర్మన్ శారద తదితరులు పాల్గొన్నారు.