ప్రతీకాత్మక చిత్రం
లండన్ : కేవలం రెండు నెలలు తీవ్ర ఒత్తిడికి గురైతే పురుషులు సంతాన సాఫల్యతను ప్రమాదకర స్థాయిలో కోల్పోతారని తాజా అథ్యయనం హెచ్చరించింది. ఒత్తిడితో సహవాసం చేస్తే పురుషుల సంతానోత్పత్తి సామర్థ్యం తగ్గడమే కాకుండా వీర్యకణాలు బలహీనమయ్యే ముప్పు 47 శాతం అధికమవుతుందని వెల్లడించింది. 11,000 వీర్య నమూనాలను పరిశీలించిన మీదట ఇజ్రాయెల్ పరిశోధకులు ఈ విషయాలు నిగ్గుతేల్చారు. కేవలం రెండు నెలల పాటు ఒత్తిడికి లోనైన పురుషుల వీర్యకణాలు బలహీనమవుతాయని, వారికి పిల్లలు పుట్టే అవకాశాలు సన్నగిల్లుతాయని పరిశోధనలో వెల్లడైంది.
తీవ్ర ఒత్తిడిలో ఉన్న సందర్భాల్లో, ఒత్తిడి లేని సమయాల్లో సేకరించిన వీర్య నమూనాలను విశ్లేషిస్తూ నెగెవ్‌కు చెందిన బెన్ గురియన్ యూనివర్సిటీ, సొరొక యూనివర్సిటీ మెడికల్ సెంటర్ పరిశోధకులు ఈ అథ్యయనం చేపట్టారు. తొలిసారి తండ్రయ్యే పురుషుల సగటు వయసు 32 ఏళ్ల ఆధారంగా ఈ సర్వే నిర్వహించారు.
మానసిక ఒత్తిడి సంతాన సాఫల్యతపై తీవ్ర ప్రభావం చూపుతుందని తమ అథ్యయనంలో వెల్లడైందని, దీర్ఘకాలం ఒత్తిడికి లోనైతే వీర్యకణాల నాణ్యతపై దుష్ర్పభావం చూపుతుందని తేలిందని అథ్యయన రచయిత డాక్టర్ లెవిటాస్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment