సాక్షి, న్యూఢిల్లీ: బిలియనీర్, టెస్లా సీఈవో ఈలాన్ మస్క్ తొమ్మిది మంది సంతానం వార్తలపై ట్విటర్‌ద్వారా స్పందించారు. అంత కంతకూ తరిగిపోతున్న జనాభా సంక్షోభానికి సాయంగా తన వంతు కృషి చేస్తున్నా అంటూ ట్వీట్ చేశారు. తగ్గిపోతున్న జననాల రేటు సివిలైజేషన్‌కు అతిపెద్ద ప్రమాదమని పునరుద్ఘాటించారు. అంతేకాదు రాసి పెట్టుకోండి! ఇదొక చేదు నిజం అని ట్వీట్ చేశారు.
అంగారక గ్రహంపై ప్రస్తుతం జనాభా సున్నా అంటూ ట్వీట్ చేశారు. ఎక్కువ మంది పిల్లలతో పెద్ద కుటుంబాలు ఉండాలని ఆశిస్తున్నాను. ఇప్పటికే బిగ్ ఫ్యామిలీ వున్న వారికి అభినందనలు అని పేర్కొనడం విశేషం. అమెరికా ఫెర్టిలిటీ రేటు 50 సంవత్సరాల స్థిరమైన స్థాయిల కంటే తక్కువగా ఉందన్న రిపోర్ట్‌ను పిన్ చేశారు.
Mark my words, they are sadly true
— Elon Musk (@elonmusk) July 7, 2022
ఈ రిపోర్టు ప్రకారం అమెరికాలో 1960లో 3.5 శాతంగా సంతానోత్పత్తి రేటు 2020లో 1.5 కంటే తక్కువకు పడిపోయింది. అలాగే 2050, 2100 నాటికి ప్రపంచ సంతానోత్పత్తి రేటు తగ్గే అవకాశం ఉందని వాషింగ్టన్ విశ్వవిద్యాలయం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ మెట్రిక్స్ అండ్ ఎవాల్యుయేషన్ 2020 పేర్కొంది. ప్రపంచ సంతానోత్పత్తి రేటు 2017 లో దాదాపు 2.4 కి సగానికి పడిపోయింది. 2100 నాటికి 1.7 కి తగ్గుతుందని పేర్కొంది.
ఇది కూడా చదవండి : Elon Musk: మరోసారి సెన్సేషన్‌గా ఈలాన్ మస్క్: అంత పిచ్చా?
కాగా మస్క్ తన కంపెనీ న్యూరాలింక్ ఎగ్జిక్యూటివ్ మస్క్, జిలిస్‌తో గత ఏడాది తమ కవల పిల్లలకు జన్మనిచ్చారని, తాజాగా వారి పేర్లను మార్చాల్సిందిగా టెక్సాస్‌లో కోర్టులో పిటిషన్ దాఖలు చేశారన్న వార్తలు హాట్‌టాపిక్‌గా మారాయి. ఇపుడు మస్క్ సంతానం తొమ్మిదికి చేరిందనన్న వ్యాఖ్యలు వినిపించిన సంగతి తె లిసిందే.
Comments
Please login to add a commentAdd a comment