అట్లూరు: మండలంలో ఓ నకిలీ బాబా ఎనిమిది నెలలుగా హల్‌చల్ చేస్తున్నాడు. ఎక్కడి నుంచి వచ్చాడో తెలియదు. కొంత మందితో తెలంగాణ అంటాడు, మరి కొంత మందితో చిత్తూరు అంటాడు, ఇంకొందరితో మన జిల్లాలోని పెద్దముడియం అని చెబుతాడు. పేరు అడిగితే వెంకటసుబ్బయ్య అని, సుబ్రమణ్యంస్వామి అని పేర్కొంటాడు. ఈయన ఏం చేస్తాడో తెలియదు గానీ, కాషాయి వస్త్రాలు ధరించడం, గోచీ కట్టుకుని పంగనామాలు పెట్టుకుని ఉంటాడు. జాతకాలు, వాస్తుతోపాటు సంతానం లేని వారికి సంతానం కలుగజేస్తానని నమ్మబలుకుతాడు. అట్లూరు పునరావాస కాలనీలోని శివారులో ఓ ఇల్లు అద్దెకు తీసుకుని ఈయన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు. ఇతర జిల్లాల నుంచి కూడా సుమోలు, స్కార్పియోల్లో ఇలా ఖరీదైన వాహనాల్లో వచ్చి ఆయనతో మంతనాలు చేసి పోతున్నట్లు విశ్వసనీయ సమాచారం. అయితే పూజలు చేస్తున్నాడా, ఏదైనా వ్యాపారం చేస్తున్నాడా, గుప్త నిధుల అన్వేషణ సాగిస్తున్నాడా? అనేది ఎవరికీ అంతుపట్టని పరిస్థితి. ఆ నోటా ఈ నోటా ద్వారా ప్రచారం సాగింది.
పోలీసుల అదుపులో...
బాబాపై ప్రజల్లో అనుమానాలు బలపడటంతోపాటు పోలీసులకు కూడా అనుమానం రావడంతో తిరుపతికి చెందిన టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఆదివారం అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. అలాగే చిరుతపులి చర్మం, పొడదుప్పి చర్మంతోపాటు అమ్మవారి పంచలోహ విగ్రహం, మరికొన్ని చిన్న విగ్రహాలు కూడా స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఆయనను విచారణ చేయాలని అట్లూరు పోలీస్‌స్టేçÙన్‌లో అప్పగించినట్లు విశ్వసనీయ సమాచారం. ఈ విషయంపై అట్లూరు ఎస్‌ఐ చంద్రశేఖర్‌ను వివరణ అడుగగా.. నకిలీ బాబా అదుపులో ఉన్న మాట వాస్తవమేనని తెలిపారు. విచారణ పూర్తి కాలేదని, పూర్తి వివరాలు సోమవారం విలేకరుల సమావేశంలో నిర్వహించి తెలుపుతామని ఆయన పేర్కొన్నారు. బాబా ఫొటో మాత్రం తీయవద్దని నిరాకరించారు.
నకిలీ బాబా హల్‌చల్
Published Mon, Jul 11 2016 9:32 AM | Last Updated on Mon, Sep 4 2017 4:37 AM
Advertisement
Advertisement