మా కజిన్‌కి 26 ఏళ్లు. బ్రెస్ట్ కేన్సర్ అని తేలింది. కీమో వల్ల భవిష్యత్తులో ఫర్టిలిటీ చాన్సెస్ తగ్గొచ్చు అంటున్నారు. తనకి వేరే ఆప్షన్ ఏదైనా ఉందా?
– పద్మజ, వెస్ట్‌గోదావరి
కేన్సర్ ట్రీట్‌మెంట్‌లో ఇప్పుడు చాలా అడ్వాన్స్‌డ్ మెథడ్స్ వచ్చాయి. అలాగే ఫర్టిలిటీని ప్రిజర్వ్ చేసే కొత్త పద్ధతులు కూడా చాలా వచ్చాయి. కీమో రేడియేషన్‌తో అండాశయాలు దెబ్బతింటే భవిష్యత్తులో గర్భం దాల్చే అవకాశాలు తగ్గిపోతాయి. కొన్ని ట్రీట్‌మెంట్స్ వల్ల అండాశయాలు చాలా వేగంగా దెబ్బతింటాయి. అందుకే క్యాన్సర్ ట్రీట్‌మెంట్‌కి ముందే ఫర్టిలిటీ ప్రిజర్వేషన్ ఆప్షన్స్ గురించి తెలుసుకోవాలి. వీటి గురించి ఆంకో ఫర్టిలిటీ క్లినిక్స్‌లో డిస్కస్ చేస్తారు.
ఒవేరియన్ కార్టెక్స్ అంటే అండాశయ బాహ్యపొరలో అపరిపక్వ అండాలు ఉంటాయి. ఇవి నెమ్మదిగా డెవలప్ అయ్యి పరిపక్వ అండాలుగా, మంత్లీ సైకిల్‌లో విడుదలవుతాయి. కాబట్టి ఒవేరియన్ లేయర్‌ని డామేజ్ చేసే ట్రీట్‌మెంట్ తీసుకునే ముందు మల్టీ డిసిప్లినరీ టీమ్ డిస్కషన్‌తో.. ఈ ఒవేరియన్ టిష్యూని ప్రిజర్వ్ చేస్తారు. మత్తు మందు ఇచ్చి కీ హోల్ (లాపరోస్కోపీ) సర్జరీ ద్వారా ఒవేరియన్ టిష్యూని తీసి క్రయోప్రిజర్వ్ చేస్తారు.
ఇందులో ఒక ఓవరీని లేదా ఒవేరియన్ టిష్యూ బయాప్సీస్‌ని తీసి ఫ్రీజ్ అండ్ ప్రిజర్వ్ చేస్తారు. మైనస్ 170 డిగ్రీ సెంటీగ్రేడ్ అల్ట్రా లో టెంపరేచర్‌లో ఉంచుతారు. క్యాన్సర్ ట్రీట్‌మెంట్ పూర్తయిన తరువాత లేదా ప్రెగ్నెన్సీ ప్లానింగ్ సమయంలో ఈ టిష్యూను తిరిగి ఇంప్లాంట్ చేస్తారు. కొన్ని నెలల తరువాత ఈ టిష్యూ బాడీలో నార్మల్ ఫంక్షన్‌లోకి వచ్చి.. మంత్లీ సైకిల్స్, ఎగ్ డెవలప్‌మెంట్‌కి సిద్ధమవుతుంది.
ఇది గత పదేళ్లుగా ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ఆసుపత్రుల్లో ప్రాక్టీస్‌లో ఉంది. దీనిద్వారా ప్రెగ్నెన్సీ సక్సెస్ అయిన కేసులూ ఉన్నాయి. మీ కజిన్‌ని ఒకసారి కౌన్సెలింగ్ సెషన్‌కి అటెండ్ అవమనండి. విషయం వివరంగా తెలుస్తుంది.
డాక్టర్ భావన కాసు, గైనకాలజిస్ట్ – ఆబ్‌స్టెట్రీషియన్, హైదరాబాద్
(చదవండి: అలా జన్మించిన శిశువుల్లో గుండె లోపాలు..!)
Comments
Please login to add a commentAdd a comment