పదేళ్లుగా టచ్ చేయకుండా పోర్న్ చూశాడని.. | Furious pensioner beat husband with hammer after catching him watching porn | Sakshi
Sakshi News home page

పదేళ్లుగా టచ్ చేయకుండా పోర్న్ చూశాడని..

Published Thu, Apr 21 2016 4:06 PM | Last Updated on Mon, Jul 30 2018 8:29 PM

పదేళ్లుగా టచ్ చేయకుండా పోర్న్ చూశాడని.. - Sakshi

పదేళ్లుగా టచ్ చేయకుండా పోర్న్ చూశాడని..

లాంక్ షైర్: పోర్న్ వీడియోలు చూస్తున్నాడనే ఆగ్రహంతో తన వృద్ధ భర్తను ఓ వృద్ధురాలైన భార్య కొట్టి చంపింది. ఆమె స్వయంగా ఈ హత్యను చేసినట్లు అంగీకరించింది. లాంక్ షైర్లోని ఓస్వాల్డ్ విజిల్లో లిండా హోమ్స్(70), గోర్డాన్(78) అనే ఇద్దరు వృద్ధ దంపతులు నివసిస్తున్నారు. వీరికి వివాహం అయ్యి కూడా దాదాపు 50 ఏళ్లు దాటింది. ఆమె ఒకసారి బయటకు వెళ్లి తిరిగి రాగా అతడు ఇంట్లో అశ్లీల చిత్రాలు చూస్తూ కనిపించాడు. ఆమె అడిగితే తాను చూడలేదని బుకాయించాడు.

దీంతో వెంటనే చికెన్ లాంటి దాన్ని నుజ్జునుజ్జు చేసే సుత్తెలాంటి దాన్ని తీసుకొని పదేపదే అతడి తలపై కొట్టడంతో చనిపోయాడు. ఈ ఘటనకు సంబంధించి ఆమె వివరణ ఇస్తూ 'అతడు పోర్న్ వీడియోలు చూస్తుండగా పట్టుకున్నాను. కానీ, ఆ విషయం నుంచి పక్కకు తప్పుకునేందుకు ప్రయత్నించాడు. నాకు తీవ్ర కోపం వచ్చింది. చంపేయాలనుకున్నాను. తీవ్రంగా కొట్టాను. నేను చేసేది ఓ హత్యలాగా ఉండాలని భావించాను. గడిచిన పదేళ్లలో అతడు నన్ను ఒక్కసారి కూడా తాకలేదు. కానీ, పోర్న్ మాత్రం చూస్తున్నాడు. అతడికి ఎంత ధైర్యం. నా పదేళ్ల జీవితంలోకి నేను తిరిగి ఎలా వెళ్లగలను? అని ఆమె చెప్పింది. అతడి ప్రవర్తన చూసి మానసిక ఆందోళనకు లోనయ్యే తాను ఈ హత్య చేసినట్లు చెప్పింది. పదిహనేళ్ల వయసులో ఒకరినొకరు కలిసిన వీరిద్దరు ఐదేళ్లు గడిచిన తర్వాత భార్యాభర్తలుగా జీవితాన్ని ప్రారంభించారు. ప్రేమతో మొదలైన వీరి జీవితం చరమాంకంలో మాత్రం విషాదంగా మిగిలింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement