హత్య కేసులో భారతీయ విద్యార్థికి జీవిత ఖైదు!
న్యూయార్క్: యూఎస్లో స్నేహితుడి హత్య కేసులో భారతీయ విద్యార్థి రాహుల్ గుప్తాకు జీవిత ఖైదు పడే అవకాశాలు ఉన్నాయి. ఈ కేసులో మేరిల్యాండ్ కోర్టు ఏప్రిల్ 16న తుది తీర్పు వెలువరించనుంది. భారతీయ విద్యార్థి రాహుల్ గుప్తా జార్జీ వాషింగ్టన్ యూనివర్శిటీలో ఉన్నత విద్యను అభ్యసిస్తున్నాడు. అయితే అతడి గర్ల్ ఫ్రెండ్ టైలర్ తోపాటు అతడి సహా విద్యార్థి మార్క్ వాగ్ తనను మోసం చేస్తున్నారని రాహుల్ అనుమానించాడు.
ఆ క్రమంలో 2013, ఆక్టోబర్ 13వ తేదీన రాహుల్ పుట్టిన రోజు సందర్భంగా అతడి అపార్ట్మెంట్లో పుట్టిన రోజు వేడుకలు ఏర్పాటు చేసి... స్నేహితులను ఆహ్వానించాడు. ఆ వేడుకలకు గర్ల ఫ్రెండ్, మార్క్ వాగ్తోపాటు మరో స్నేహితుడు విచ్చేశారు. ఇదే సమయమని భావించిన రాహుల్ కత్తితో పొడిచి మార్క్ వాగ్ను హత్య చేశాడు. గర్ల ఫ్రెండ్ పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని రాహుల్ను అరెస్ట్ చేశాడు.
పోలీసుల విచారణలో రాహుల్ తన నేరాన్ని అంగీకరించాడు. చిన్న నాటి నుంచి కలసి చదువుకున్న గర్ల ఫ్రెండ్, మార్క్ వాగ్తో కలసి తనను మోసం చేసిందని అందుకే అతడిని హత్య చేశానని రాహుల్ పోలీసులకు తెలిపాడు.