రాంచీ: ఇటలీలో భారతీయ విద్యార్థి మృతి చెందాడు. జార్ఖండ్‌లోని పశ్చిమ సింగ్‌భమ్ జిల్లాకు చెందిన రామ్ రౌత్ మరణించాడని అధికారులు తెలిపారు. నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేయడానికి రౌత్ తల్లిదండ్రులు అతనికి ఫోన్ చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రౌత్ ఎంబీఏ చదివేందుకు ఇటలీ వెళ్లాడు. కాల్ లిఫ్ట్ చేయకపోవడంతో రౌత్ తల్లిదండ్రులు అతని వసతి గృహ యజమానిని సంప్రదించారు. విద్యార్థి మరొక ఇంటి వాష్‌రూమ్‌లో శవమై కనిపించాడని గుర్తించారు. అతని మృతదేహాన్ని భారతదేశానికి తీసుకురావడానికి జార్ఖండ్‌లోని సీనియర్ ప్రభుత్వ అధికారులు, ప్రజా ప్రతినిధులను రౌత్ కుటుంబం సంప్రదించింది.
ఈ సంఘటనపై వెస్ట్ సింగ్‌భమ్ డిప్యూటీ కమిషనర్ అనన్య మిట్టల్ మాట్లాడుతూ.. రామ్ రౌత్ మరణం గురించి తమకు సమాచారం అందిందని తెలిపారు. అవసరమైన చర్యల కోసం హోం శాఖ, రాష్ట్ర మైగ్రేషన్ విభాగానికి తెలియజేసినట్లు చెప్పారు. ఈ కేసులో అన్ని పరిణామాలను తాను పర్యవేక్షిస్తున్నానని, బాధిత కుటుంబంతో కూడా టచ్‌లో ఉన్నానని మిట్టల్ తెలిపారు.
ఇదీ చదవండి: ఫ్లోరిడాలో టోర్నడో బీభత్సం
Comments
Please login to add a commentAdd a comment