Rahul gupta
-
భారతీయ–అమెరికన్ వైద్యులకు కీలక పదవులు
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఇద్దరు ప్రముఖ భారతీయ–అమెరికన్ వైద్యులను తన ప్రభుత్వ అధికార యంత్రాంగంలో కీలక స్థానాల్లో నియమించారు. వెస్ట్ వర్జీనియా మాజీ హెల్త్ కమిషనర్ డాక్టర్ రాహుల్ గుప్తాను ‘ఆఫీసు ఆఫ్ ద నేషనల్ డ్రగ్ కంట్రోల్ పాలసీ’ తదుపరి డైరెక్టర్‌గా నామినేట్ చేశారు. ప్రఖ్యాత సర్జన్, రచయిత అతుల్ గవాండేను యూఎస్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్లో ‘బ్యూరో ఫర్ గ్లోబల్ హెల్త్’ అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటర్‌గా నియమించారు. రాహుల్ గుప్తా వెస్టు వర్జీనియాలో ఇద్దరు గవర్నర్ల హయాంలో హెల్త్ కమిషనర్‌గా సేవలందించారు. స్థానిక, జాతీయ, అంతర్జాతీయ ప్రజారోగ్య పాలసీపై పలు సంస్థలు, టాస్క్‌ఫోర్సులకు సలహాదారుడిగా పనిచేశారు. భారత దౌత్యవేత్త కమారుడైన డాక్టర్ రాహుల్ గుప్తా భారత్‌లో జన్మించారు. వాషింగ్టన్ డీసీలో పెరిగారు. ఇక అతుల్ గవాండే రాసిన ద చెక్‌లిస్టు మేనిఫెస్టో, బీయింగ్ మోర్టల్, కాంప్లికేషన్స్ తదితర పుస్తకాలు న్యూయార్క్ టైమ్స్ బెస్టు–సెల్లింగ్ బుక్స్ జాబితాలో చోటు దక్కించుకున్నాయి. ‘బ్యూరో ఫర్ గ్లోబల్ హెల్త్’ అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటర్‌గా తనను నియమించడం గొప్ప గౌరవంగా భావిస్తున్నట్లు అతుల్ గవాండే చెప్పారు. -
ఆన్లైన్లో పూజ.. ఇంటికి ప్రసాదం!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మనం గుడికి వెళితే అర్చన చేయిస్తాం. పేరు, గోత్రం పూజారికి చెబితే.. వేద మంత్రాలు చదువుతూ మన పేరిట అర్చన చేసేస్తాడు! ఈ సందర్భాన్ని కొద్దిగా మార్చేసింది మై మందిర్ స్టార్టప్. గుడికి స్వయంగా వెళ్లి అర్చన చేయించే బదులు.. మనం ఇంట్లోనే ఉండి మన పేరిట పూజారి అర్చన చేస్తే? పూజ పూర్తయ్యాక ప్రసాదమూ ఇంటికి పంపిస్తే...? ఇదిగో... ఈ సేవలనే అందిస్తోంది బెంగళూరుకు చెందిన స్టార్టప్ మై మందిర్! మరిన్ని వివరాలు ఫౌండర్ అండ్ సీఈఓ రాహుల్ గుప్తా ‘స్టార్టప్ డైరీ’తో పంచుకున్నారు. ‘‘మాది ఉత్తర్ ప్రదేశ్‌లోని ఘజియాబాద్. ఐఐటీ ముంబైలో ఇంజనీరింగ్ పూర్తయ్యాక.. ఆక్స్‌వర్డ్ యూనివర్సిటీలో ఎంబీఏ చేశా. ఆ తర్వాత పదిహేనేళ్ల పాటు వివిధ స్టార్టప్ కంపెనీల్లో పనిచేశా. 2016 అక్టోబర్‌లో రూ.10 లక్షల పెట్టుబడితో బెంగళూరు కేంద్రంగా మై మందిర్. కామ్‌ను ప్రారం భిం చాం. మై మందిర్ అనేది ఒక ఆధ్యాత్మిక సామాజిక మాధ్యమం. దేశం లోని అన్ని దేవాలయా లు, గోపురాలు, వాటి ప్రాశస్త్యం, పూజలు ఇతర వివరాలుంటాయి. రిజిస్టర్ అయిన భక్తులు ఆధ్యాత్మిక సమాచారం, ఫొటోలు, వీడియోలను షేర్ చేసుకోవచ్చు. 300లకు పైగా ఆలయాల నమోదు.. ప్రస్తుతం మై మందిర్‌కు ఇస్కాన్, అలంపూర్ జోగుళాంబ, పిల్లలమర్రి శివాలయం, బాలత్రిపుర సుందరి పీఠం వంటి 300కు పైగా దేవాలయాలు, స్థానిక పూజారులతో ఒప్పందం ఉంది. ఆయా ఆలయాల్లో అర్చనలు, ప్రత్యేక పూజలు, అన్నదానం వంటి అన్ని రకాల కార్యక్రమాలను నిర్వహించవచ్చు. వీటి ధరలు పూజను బట్టి రూ.600 నుంచి రూ.10 వేల వరకున్నాయి. ఆన్లైన్లో జాతకచక్ర సేవలు కూడా ఉన్నాయి. వీటి ధరలు రూ.99 నుంచి రూ.211 వరకున్నాయి. ప్రవచనాల ప్రసారం కూడా.. దేవీ చిత్రలేఖ, కృష్ణ ప్రియ జీ, దేవీ నిధినేహా, సాధ్వి భవ్యశ్రీ, ప్రమోద్ కుమార్, రాధే ప్రియ, బాలాజీ స్వామి వంటి ప్రముఖ వందకు పైగా ఆధ్యాత్మిక బోధకులు కూడా మై మందిర్‌లో నమోదయ్యారు. దీంతో ఆయా బోధకుల భజనలు, ప్రవచనాలు, పురాణాలు, గ్రంథాలు, పంచాంగ శ్రవణం వంటి అన్ని రకాల కార్యక్రమాలు ప్రసారమవుతాయి. ఏడాదిలో కోటి మందికి.. తెలుగు, హిందీ, కన్నడం, మలయాళం, తమిళం, మరాఠీ, గుజరాతీ, బంగ్లా, ఒరియా భాషల్లో మా సేవలు అందుబాటులో ఉన్నాయి. ఏడాదిలో అన్ని భారతీయ భాషల్లోకి విస్తరిస్తాం. ప్రస్తుతం మై మందిర్‌లో 50 లక్షల మంది యూజర్లున్నారు. ఇందులో 30% వాటా తెలుగు రాష్ట్రాల నుంచి ఉంటుంది. రోజుకు లక్ష ఫొటోలు, వీడియోలు అప్లోడ్ అవుతున్నాయి. ఏడాదిలో కోటి మంది కస్టమర్లకు చేరుకోవాలని లకి‡్ష్యంచాం. ప్రస్తుతం మా కంపెనీలో 25 మంది ఉద్యోగులున్నారు. నిధుల సమీకరణ కోసం చూస్తున్నాం’’ అని వివరించారు. -
యూఎస్‌లో ఎన్నారై విద్యార్థికి జీవిత ఖైదు
వాషింగ్టన్: స్నేహితుడి హత్య కేసులో భారతీయ అమెరికన్ ఇంజినీరింగ్ విద్యార్థి రాహుల్ గుప్తాకి జీవిత ఖైదీ విధిస్తూ.. ఆమెరికన్ కోర్టు గురువారం తీర్పు వెలువరించింది. రాహుల్ గుప్తా జార్జియా వాషింగ్టన్ యూనివర్శిటీలో ఇంజినీరింగ్ ఉన్నత విద్యను అభ్యసిస్తున్నాడు. జార్జీటౌన్ యూనివర్శిటీలో న్యాయశాస్త్రం చదువుతున్న మార్క్ వా (24) బాల్య స్నేహితులు. అయితే రాహుల్ గర్ల్ ఫ్రెండ్‌కు మార్క్... చాటింగ్ చేయడం తట్టుకోలే పోయాడు. మార్క్‌తోపాటు తన గర్ల ఫ్రెండ్ తనను మోసం చేశారని రాహుల్ భావించాడు. ఆ అక్కసుతో 2013, అక్టోబర్ 13న మార్క్ నివసిస్తున్న అపార్ట్‌మెంట్‌కు వెళ్లి అతడిపై దాడి చేసి... 11 సార్లు కత్తితో పొడిచాడు. దాంతో అతడు అక్కడికక్కడే మరణించారు. ఈ కేసులో రాహుల్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం అతడిని కోర్టులో హాజరుపరిచి రిమాండ్ తరలించారు. ఈ కేసు విచారణ భాగంగా రాహుల్ పొంతన లేని సమాధానాలు చెప్పాడు. దాంతో ఈ హత్య కేసులో నిందితుడు రాహుల్ అని భావించిన కోర్టు జీవిత ఖైదీ విధిస్తూ తీర్పు వెలువరించింది. -
హత్య కేసులో భారతీయ విద్యార్థికి జీవిత ఖైదు!
న్యూయార్క్: యూఎస్‌లో స్నేహితుడి హత్య కేసులో భారతీయ విద్యార్థి రాహుల్ గుప్తాకు జీవిత ఖైదు పడే అవకాశాలు ఉన్నాయి. ఈ కేసులో మేరిల్యాండ్ కోర్టు ఏప్రిల్ 16న తుది తీర్పు వెలువరించనుంది. భారతీయ విద్యార్థి రాహుల్ గుప్తా జార్జీ వాషింగ్టన్ యూనివర్శిటీలో ఉన్నత విద్యను అభ్యసిస్తున్నాడు. అయితే అతడి గర్ల్ ఫ్రెండ్ టైలర్ తోపాటు అతడి సహా విద్యార్థి మార్క్ వాగ్ తనను మోసం చేస్తున్నారని రాహుల్ అనుమానించాడు. ఆ క్రమంలో 2013, ఆక్టోబర్ 13వ తేదీన రాహుల్ పుట్టిన రోజు సందర్భంగా అతడి అపార్ట్మెంట్లో పుట్టిన రోజు వేడుకలు ఏర్పాటు చేసి... స్నేహితులను ఆహ్వానించాడు. ఆ వేడుకలకు గర్ల ఫ్రెండ్, మార్క్ వాగ్తోపాటు మరో స్నేహితుడు విచ్చేశారు. ఇదే సమయమని భావించిన రాహుల్ కత్తితో పొడిచి మార్క్ వాగ్ను హత్య చేశాడు. గర్ల ఫ్రెండ్ పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని రాహుల్‌ను అరెస్ట్ చేశాడు. పోలీసుల విచారణలో రాహుల్ తన నేరాన్ని అంగీకరించాడు. చిన్న నాటి నుంచి కలసి చదువుకున్న గర్ల ఫ్రెండ్, మార్క్ వాగ్‌తో కలసి తనను మోసం చేసిందని అందుకే అతడిని హత్య చేశానని రాహుల్ పోలీసులకు తెలిపాడు. -
హెచ్‌పీసీఎల్ చెస్‌కు విజయేంద్ర
సాక్షి, హైదరాబాద్: హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్‌పీసీఎల్) చెస్ జట్టుకు విజయేంద్ర కుమార్, రాహుల్ గుప్తా ఎంపికయ్యారు. వీరితో పాటు మరో ఇద్దరు అజిత్, గోలప్ దాస్‌లు కూడా నగరం నుంచి అర్హత సాధించారు. హైటెక్ సిటీలోని హెచ్‌పీసీఎల్ బిల్డింగ్‌లో గురువారం నిర్వహించిన సెలక్షన్ టోర్నమెంట్లో విజయేంద్ర ఏడు రౌండ్లకు గాను 6.5 పాయింట్లు సాధించి అగ్రస్థానంలో నిలిచాడు. రౌండ్ రాబిన్ పద్ధతిలో జరిగిన ఈ సెలక్షన్ టోర్నీలో రాహుల్ గుప్తా కూడా ఆరున్నర పాయింట్లు సాధించినప్పటికీ ప్రోగ్రెసివ్ స్కోరు ఆధారంగా రెండో స్థానానికి పరిమితమయ్యాడు. అజిత్ (5), గోలప్ దాస్ (4)లు వరుసగా మూడు, నాలుగు స్థానాలు పొందారు. వీరంతా జాతీయ స్థాయిలో జరిగే ఆలిండియా హెచ్‌పీసీఎల్ చెస్ చాంపియన్‌షిప్‌లో పాల్గొననున్నారు. ఈ టోర్నీ ఈ నెల 23, 24 తేదీల్లో మంగళూరు (కర్ణాటక)లో జరగనుంది.