హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మనం గుడికి వెళితే అర్చన చేయిస్తాం. పేరు, గోత్రం పూజారికి చెబితే.. వేద మంత్రాలు చదువుతూ మన పేరిట అర్చన చేసేస్తాడు! ఈ సందర్భాన్ని కొద్దిగా మార్చేసింది మై మందిర్ స్టార్టప్. గుడికి స్వయంగా వెళ్లి అర్చన చేయించే బదులు.. మనం ఇంట్లోనే ఉండి మన పేరిట పూజారి అర్చన చేస్తే? పూజ పూర్తయ్యాక ప్రసాదమూ ఇంటికి పంపిస్తే...? ఇదిగో... ఈ సేవలనే అందిస్తోంది బెంగళూరుకు చెందిన స్టార్టప్ మై మందిర్! మరిన్ని వివరాలు ఫౌండర్ అండ్ సీఈఓ రాహుల్ గుప్తా ‘స్టార్టప్ డైరీ’తో పంచుకున్నారు. ‘‘మాది ఉత్తర్ ప్రదేశ్‌లోని ఘజియాబాద్. ఐఐటీ ముంబైలో ఇంజనీరింగ్ పూర్తయ్యాక.. ఆక్స్‌వర్డ్ యూనివర్సిటీలో ఎంబీఏ చేశా. ఆ తర్వాత పదిహేనేళ్ల పాటు వివిధ స్టార్టప్ కంపెనీల్లో పనిచేశా. 2016 అక్టోబర్‌లో రూ.10 లక్షల పెట్టుబడితో బెంగళూరు కేంద్రంగా మై మందిర్. కామ్‌ను ప్రారం భిం చాం. మై మందిర్ అనేది ఒక ఆధ్యాత్మిక సామాజిక మాధ్యమం. దేశం లోని అన్ని దేవాలయా లు, గోపురాలు, వాటి ప్రాశస్త్యం, పూజలు ఇతర వివరాలుంటాయి. రిజిస్టర్ అయిన భక్తులు ఆధ్యాత్మిక సమాచారం, ఫొటోలు, వీడియోలను షేర్ చేసుకోవచ్చు.
300లకు పైగా ఆలయాల నమోదు..
ప్రస్తుతం మై మందిర్‌కు ఇస్కాన్, అలంపూర్ జోగుళాంబ, పిల్లలమర్రి శివాలయం, బాలత్రిపుర సుందరి పీఠం వంటి 300కు పైగా దేవాలయాలు, స్థానిక పూజారులతో ఒప్పందం ఉంది. ఆయా ఆలయాల్లో అర్చనలు, ప్రత్యేక పూజలు, అన్నదానం వంటి అన్ని రకాల కార్యక్రమాలను నిర్వహించవచ్చు. వీటి ధరలు పూజను బట్టి రూ.600 నుంచి రూ.10 వేల వరకున్నాయి. ఆన్‌లైన్‌లో జాతకచక్ర సేవలు కూడా ఉన్నాయి. వీటి ధరలు రూ.99 నుంచి రూ.211 వరకున్నాయి.
ప్రవచనాల ప్రసారం కూడా..
దేవీ చిత్రలేఖ, కృష్ణ ప్రియ జీ, దేవీ నిధినేహా, సాధ్వి భవ్యశ్రీ, ప్రమోద్ కుమార్, రాధే ప్రియ, బాలాజీ స్వామి వంటి ప్రముఖ వందకు పైగా ఆధ్యాత్మిక బోధకులు కూడా మై మందిర్‌లో నమోదయ్యారు. దీంతో ఆయా బోధకుల భజనలు, ప్రవచనాలు, పురాణాలు, గ్రంథాలు, పంచాంగ శ్రవణం వంటి అన్ని రకాల కార్యక్రమాలు ప్రసారమవుతాయి.
ఏడాదిలో కోటి మందికి..
తెలుగు, హిందీ, కన్నడం, మలయాళం, తమిళం, మరాఠీ, గుజరాతీ, బంగ్లా, ఒరియా భాషల్లో మా సేవలు అందుబాటులో ఉన్నాయి. ఏడాదిలో అన్ని భారతీయ భాషల్లోకి విస్తరిస్తాం. ప్రస్తుతం మై మందిర్‌లో 50 లక్షల మంది యూజర్లున్నారు. ఇందులో 30% వాటా తెలుగు రాష్ట్రాల నుంచి ఉంటుంది. రోజుకు లక్ష ఫొటోలు, వీడియోలు అప్‌లోడ్ అవుతున్నాయి. ఏడాదిలో కోటి మంది కస్టమర్లకు చేరుకోవాలని లకి‡్ష్యంచాం. ప్రస్తుతం మా కంపెనీలో 25 మంది ఉద్యోగులున్నారు. నిధుల సమీకరణ కోసం చూస్తున్నాం’’ అని వివరించారు.
ఆన్‌లైన్‌లో పూజ.. ఇంటికి ప్రసాదం!
Published Sat, Mar 9 2019 12:22 AM | Last Updated on Sat, Mar 9 2019 12:22 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment