worship ..
-
ఖమ్మం ‘చంద్రముఖి’ నిజ స్వరూపం: అప్పుడు.. ఇప్పుడు
సాక్షి, హైదరాబాద్: సామాన్య జనాలకు మూఢ నమ్మకాల నిర్మూలనపై అవగాహన కల్పించాల్సిన వ్యక్తే.. ఓ దేవతా అవతారం ఎత్తిన ఎంపీపీ చుట్టూ ప్రదక్షిణలు చేయడం చర్చాంశనీయంగా మారింది. ఆయనే తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు.. అంతేకాదు ఆమె ఆశ్వీరాదం కోసం వంగి వంగి దండాలు పెడుతూ తాను కూడా మిరపకాయల పూజలు చేశారు. మరో అడుగు ముందుకేసి.. ఆమెను పొగడ్తలతో ముంచెత్తారు. మాతను దర్శించుకోవడం తన పూర్వ జన్మ సుకృతం అంటూ భక్తిని చాటుకున్నారు. విచిత్రమేమిటంటే.. తనతో పాటు డాక్టర్లు, వైద్య సిబ్బందిని కూడా తీసుకెళ్లి పూజలు చేయించడం మరింత ఆశ్చర్యానికి గురి చేస్తోంది. చదవండి: వివాదంలో తెలంగాణ డీహెచ్.. ఖమ్మంలో విచిత్ర పూజలు.. అనేక వివాదాల్లో ఉన్న ఎంపీపీ దేవత అవతారం ఎత్తడం విచిత్రం. తను నడిచే నడక, చూపు, మాట అంతా అమ్మవారిలా కనిపించేలా తెగ కవర్ చేస్తూ భక్తులకు దర్శనమిచ్చింది. మరో విశేషమేమిటంటే.. ఎంపీపీ భర్త సింగరేణి ఉద్యోగి. ఆయన సైతం డ్యూటీకి వెళ్లకుండా పూజలో నిమగ్నమయ్యారు. పూజలు, హోమాలు, అన్నదానాల పేరుతో వీళ్లు చేసే దందా అంత ఇంత కాదు. భూత, భవిష్యత్, వర్తమానం గురించి చెప్తా అంటూ అమాయక ప్రజలను మోసం చేసే ఇలాంటి వారిపై ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. -
ఆన్లైన్లో పూజ.. ఇంటికి ప్రసాదం!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మనం గుడికి వెళితే అర్చన చేయిస్తాం. పేరు, గోత్రం పూజారికి చెబితే.. వేద మంత్రాలు చదువుతూ మన పేరిట అర్చన చేసేస్తాడు! ఈ సందర్భాన్ని కొద్దిగా మార్చేసింది మై మందిర్ స్టార్టప్. గుడికి స్వయంగా వెళ్లి అర్చన చేయించే బదులు.. మనం ఇంట్లోనే ఉండి మన పేరిట పూజారి అర్చన చేస్తే? పూజ పూర్తయ్యాక ప్రసాదమూ ఇంటికి పంపిస్తే...? ఇదిగో... ఈ సేవలనే అందిస్తోంది బెంగళూరుకు చెందిన స్టార్టప్ మై మందిర్! మరిన్ని వివరాలు ఫౌండర్ అండ్ సీఈఓ రాహుల్ గుప్తా ‘స్టార్టప్ డైరీ’తో పంచుకున్నారు. ‘‘మాది ఉత్తర్ ప్రదేశ్‌లోని ఘజియాబాద్. ఐఐటీ ముంబైలో ఇంజనీరింగ్ పూర్తయ్యాక.. ఆక్స్‌వర్డ్ యూనివర్సిటీలో ఎంబీఏ చేశా. ఆ తర్వాత పదిహేనేళ్ల పాటు వివిధ స్టార్టప్ కంపెనీల్లో పనిచేశా. 2016 అక్టోబర్‌లో రూ.10 లక్షల పెట్టుబడితో బెంగళూరు కేంద్రంగా మై మందిర్. కామ్‌ను ప్రారం భిం చాం. మై మందిర్ అనేది ఒక ఆధ్యాత్మిక సామాజిక మాధ్యమం. దేశం లోని అన్ని దేవాలయా లు, గోపురాలు, వాటి ప్రాశస్త్యం, పూజలు ఇతర వివరాలుంటాయి. రిజిస్టర్ అయిన భక్తులు ఆధ్యాత్మిక సమాచారం, ఫొటోలు, వీడియోలను షేర్ చేసుకోవచ్చు. 300లకు పైగా ఆలయాల నమోదు.. ప్రస్తుతం మై మందిర్‌కు ఇస్కాన్, అలంపూర్ జోగుళాంబ, పిల్లలమర్రి శివాలయం, బాలత్రిపుర సుందరి పీఠం వంటి 300కు పైగా దేవాలయాలు, స్థానిక పూజారులతో ఒప్పందం ఉంది. ఆయా ఆలయాల్లో అర్చనలు, ప్రత్యేక పూజలు, అన్నదానం వంటి అన్ని రకాల కార్యక్రమాలను నిర్వహించవచ్చు. వీటి ధరలు పూజను బట్టి రూ.600 నుంచి రూ.10 వేల వరకున్నాయి. ఆన్లైన్లో జాతకచక్ర సేవలు కూడా ఉన్నాయి. వీటి ధరలు రూ.99 నుంచి రూ.211 వరకున్నాయి. ప్రవచనాల ప్రసారం కూడా.. దేవీ చిత్రలేఖ, కృష్ణ ప్రియ జీ, దేవీ నిధినేహా, సాధ్వి భవ్యశ్రీ, ప్రమోద్ కుమార్, రాధే ప్రియ, బాలాజీ స్వామి వంటి ప్రముఖ వందకు పైగా ఆధ్యాత్మిక బోధకులు కూడా మై మందిర్‌లో నమోదయ్యారు. దీంతో ఆయా బోధకుల భజనలు, ప్రవచనాలు, పురాణాలు, గ్రంథాలు, పంచాంగ శ్రవణం వంటి అన్ని రకాల కార్యక్రమాలు ప్రసారమవుతాయి. ఏడాదిలో కోటి మందికి.. తెలుగు, హిందీ, కన్నడం, మలయాళం, తమిళం, మరాఠీ, గుజరాతీ, బంగ్లా, ఒరియా భాషల్లో మా సేవలు అందుబాటులో ఉన్నాయి. ఏడాదిలో అన్ని భారతీయ భాషల్లోకి విస్తరిస్తాం. ప్రస్తుతం మై మందిర్‌లో 50 లక్షల మంది యూజర్లున్నారు. ఇందులో 30% వాటా తెలుగు రాష్ట్రాల నుంచి ఉంటుంది. రోజుకు లక్ష ఫొటోలు, వీడియోలు అప్లోడ్ అవుతున్నాయి. ఏడాదిలో కోటి మంది కస్టమర్లకు చేరుకోవాలని లకి‡్ష్యంచాం. ప్రస్తుతం మా కంపెనీలో 25 మంది ఉద్యోగులున్నారు. నిధుల సమీకరణ కోసం చూస్తున్నాం’’ అని వివరించారు. -
ఐఎన్ఎస్ కిల్టాన్ జలప్రవేశం
విశాఖ సిటీ: అత్యున్నత సాంకేతిక ప్రమాణాలు పాటిస్తూ యుద్ధ నౌకల నిర్మాణంలో భారత్ ముందంజలో ఉండాలని కేంద్ర రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పిలుపునిచ్చారు. ఇందుకు అవసరమైన నిధుల్ని సమకూర్చేందుకు కేంద్ర ప్రభుత్వం వెనుకాడబోదని స్పష్టం చేశారు. రక్షణ మంత్రి హోదాలో తూర్పు నౌకాదళాన్ని తొలిసారిగా సందర్శించిన ఆమె ప్రాజెక్టు–28లో భాగంగా రూపొందించిన యాంటీ సబ్‌మెరైన్ యుద్ధ నౌక ఐఎన్ఎస్ కిల్టాన్‌ను జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ.. ఐఎన్ఎస్ కిల్టాన్‌ను జాతికి అంకితం చేయడం ద్వారా హిందూ మహా సముద్రంలో శాంతి పరిరక్షణలో కీలక పాత్ర పోషిస్తున్న నౌకాదళానికి మరింత బలం చేకూరిందని అభిప్రాయపడ్డారు. 90 శాతం స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఐఎన్ఎస్ కిల్టాన్ నౌకాదళ రంగంలో నూతన ప్రమాణాలకు నాంది పలుకుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. స్వయం సమృద్ధి దిశగా దేశ ఆయుధ సాంకేతికత వృద్ధి చెందడం గర్వకారణమని, అత్యున్నత ప్రమాణాలతో యుద్ధ నౌకల నిర్మాణానికి అవసరమైన ఆర్థిక చేయూతను ప్రభుత్వం అందిస్తుందని కేంద్ర మంత్రి తెలిపారు. యుద్ధ సమయంలోనే కాకుండా.. ప్రకృతి విపత్తుల సమయంలో సహాయక చర్యల్లో పాల్గొంటూ ఇండియన్ నేవీ చేస్తున్న సేవలు నిరుపమానమైనవని కొనియాడారు. ప్రొపెల్షన్, ఆయుధ సాంకేతికతల్ని దేశీయంగా అభివృద్ధి చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉందని సీతారామన్ పేర్కొన్నారు. కార్బన్ ఫైబర్ టెక్నాలజీతో కిల్టాన్ నిర్మాణం భారత నౌకాదళాధిపతి అడ్మిరల్ సునీల్ లాంబా మాట్లాడుతూ.. యుద్ధ నౌకల తయారీలో ఐఎన్ఎస్ కిల్టాన్‌ను ముందడుగుగా అభివర్ణించారు. భారీ యుద్ధ నౌకల్ని దేశీయంగా నిర్మించడం వల్ల దేశ రక్షణ రంగ అవసరాలు తీరతాయన్నారు. సూపర్ స్ట్రోమ్ ఇంటిగ్రేటెడ్ వెపన్ వంటి ఆయుధ సంపత్తితో భారత నౌకాదళానికి అదనపు హంగులు సమకూరుతున్నాయని లాంబా వివరించారు. కార్బన్ ఫైబర్ టెక్నాలజీతో నూతన సాంకేతిక పరిజ్ఞానంతో నిర్ణీత సమయంలో ఈ భారీ యుద్ధ నౌకను సిద్ధం చేశామని కోల్‌కతాకు చెందిన గార్డెన్ రీచ్ షిప్‌బిల్డర్స్ అండ్ ఇంజినీర్స్ లిమిటెడ్ (జీఆర్ఎస్ఈ) సీఎండీ రియర్ అడ్మిరల్ వీఎస్ సక్సేనా అన్నారు. అంతకుముందు తూర్పు నౌకాదళ ప్రధాన కార్యాలయంలో నిర్మలా సీతారామన్‌కు నేవీ సిబ్బంది ఘన స్వాగతం పలికి గౌరవ వందనం సమర్పించారు. ఈఎన్సీ ప్రధాన స్థావరంతో పాటు నౌకాదళంలోని వివిధ విభాగాల్ని ఆమె పరిశీలించారు. అనంతరం.. భారత నేవీ చీఫ్ అడ్మిరల్ సునీల్లాంబాతో పాటు ఈఎన్సీ చీఫ్ వైస్ అడ్మిరల్ హెచ్‌సీఎస్ బిస్త్‌తో పాటు ఇతర ఉన్నతాధికారులతో చర్చించారు. -
పూజకు పూలేవయ్యా..
రామాలయంలో గాడితప్పిన పాలన నాలుగు రోజులుగా గజమాల అలంకరణ బంద్ స్వామివారి పూజల్లో సైతం లోపాలు పట్టించుకోని ఆలయ అధికారులు భద్రాచలం : ఆలయ పాలన అస్తవ్యస్తం.. అర్చకులు, ఉద్యోగుల మధ్య ఆధిపత్య పోరు.. నిత్య పూజలందుకునే రామయ్య అలంకరణకే పూలు కరువు.. దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాద్రి సీతారాములకే పరీ„ý పెడుతుంటే.. అధికారులు తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. శ్రీసీతారామచంద్ర స్వామి ఆలయంలో పాలన అస్తవ్యస్తంగా మారింది. అర్చకులు, ఉద్యోగుల మధ్య ఆధిపత్య పోరుతో రాములోరికి నిత్య పూజలు సైతం సవ్యంగా సాగడం లేదు. సోమవారం స్వామివారి అలంకరణ కోసం తెచ్చిన పూలు కుళ్లిపోవడంతో అలంకరించలేదని అర్చకులు చెబుతున్నారు. నాలుగు రోజులుగా పూల సరఫరా ఇలాగే ఉందని, అందుకే గజమాలల అలంకరణ చేయడం లేదని అర్చకులు తెలిపారు. ఈ విషయాన్ని ఆలయ పర్యవేక్షకుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని, చేసేది లేక పూలదండలు స్వామివారి మెడలో కాకుండా గర్భగుడిలోని బంగారు వాకిలి వద్ద అలంకరించాల్సి వస్తోందన్నారు. ప్రతీ రోజు స్వామివారి అలంకరణ నిమిత్తం నాలుగు గజమాలలు ఉపయోగిస్తారు. ఆలయ ప్రాంగణంలోని పరివార దేవతలను కూడా అలంకరిస్తారు. అయితే స్వామివారికి నాలుగు రోజులుగా గజమాలల అలంకరణ జరగటం లేదని ఆలయ ఉద్యోగులు బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. ప్రతీ రోజు తొమ్మిది గజమాలలు ఆలయానికి వస్తాయి. మూలవరులకు నాలుగు, లక్ష్మీతాయారమ్మ వారికి, ఆంజనేయస్వామికి, ఆండాళ్లమ్మ వారికి, హయగ్రీవ స్వామికి, రంగనాయక స్వామి వారికి ఒక్కొక్కటి చొప్పున మొత్తం 9 గజమాలలు, 5 చిన్న గజమాలలు, 59 పూలమాలలతో ఆలయంలో ప్రతీ రోజు అలంకరిస్తారు. గజమాల అలంకరణలో మెరిసిపోయే స్వామి వారిని చూసి భక్తులు తరిస్తారు. నాలుగు రోజుల నుంచి బూజుపట్టిన పూలదండలు వస్తుండటంతో వాటిని ఉపయోగించడం లేదని అర్చకులు చెబుతున్నారు. పూలు సరఫరా చేసే వారు సరైన పూలు సరఫరా చేయకపోవడం, మాలలు కట్టడంలో లోపాలు ఉండటంతో అవి స్వామివారికి అలంకరణ యోగ్యంగా ఉండటం లేదని అర్చకులు తెలిపారు. అంతేకాక స్వామివారి పూజల్లో సైతం పలు లోపాలు తలెత్తుతున్నట్లు తెలుస్తోంది. తీరు మారదా.. ఆలయంలో రెండు బంగారు ఆభరణాలు మాయం కావడంపై దేశవ్యాప్తంగా చర్చ సాగుతోంది. వీటిని అర్చకులే మాయం చేశారని దాదాపుగా వెల్లడైంది. దీనిపై ఆలయంలో అధికారులు, ఉద్యోగుల మధ్య తీవ్ర తర్జన భర్జన సాగుతుండగా.. ఇటువంటి తరుణంలో ఆలయంలో జరిగే పూజల్లోఅపశ్రుతులు చోటుచేసుకోవడం విమర్శలకు తావిస్తోంది. రెండు వారాల కాలంలో ఆలయంలో జరుగుతున్న పరిణామాలు రాములోరి క్షేత్ర ప్రతిష్టకు మాయని మచ్చ తెచ్చిపెట్టాయి. ఆలయ తలుపులు ఆలస్యంగా తెరవడం.. సీతరాముల కల్యాణాన్ని సకాలంలో ప్రారంభించకపోవడం.. తాజాగా గజమాల అలంకరణ లేకపోవడం ఇక్కడి పాలన తీరుపై వేలెత్తి చూపుతోంది. బంగారు నగలు మాయమైన కేసును మరుగున పడేసేందుకు పై స్థాయిలో ఇక్కడి అధికారులపై వత్తిళ్లు వస్తుండటంతో.. ఆభరణాలు మాయం చేసిన అర్చకులు తమకేమీ కాదులే అని ధీమాగా ఉన్నారు. అర్చకుల మధ్య ఆదిపత్య పోరు, ఉద్యోగులతో వారికి పొసగకపోవడం వంటి కారణాలతోనే తరచూ ఇటువంటి పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఆలయానికి సంబంధించి వస్త్రాలు తీసుకుని వెళ్తున్నారనే నెపంతో గతంలో ఇక్కడి అధికారులు ఓ అర్చకుడిని పోలీసులకు అప్పగించారు. విధుల పట్ల అలసత్వంగా ఉంటున్నారనే కారణంతో సస్పెన్షన్లు, రివర్షన్ ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. కానీ.. ఏకంగా సీతమ్మ వారి పుస్తెల తాడునే మాయం చేసిన అర్చకులపై ఇప్పటివరకు ఎటువంటి చర్యలు లేకపోవడం గమనార్హం. పూల కాంట్రాక్టర్‌ను హెచ్చరించాం.. స్వామివారి అలంకరణకు సరఫరా చేసే పూలు పాడైపోయిన విషయం వాస్తవమేనని ఆలయ సూపరింటెండెంట్ నర్సింహరాజు తెలిపారు. వర్షంతో పూలు తడిసి పోయినందునే ఇలా జరిగిందని చెప్పారు. మంగళవారం నుంచి మంచి పూలు తెప్పిస్తామన్నారు. స్వామివారి అలంకరణకు పూల సరఫరా చేసే కాంట్రాక్టర్‌కు వార్నింగ్ ఇచ్చినట్లు ఆయన తెలిపారు.