సాక్షి, హైదరాబాద్: హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్‌పీసీఎల్) చెస్ జట్టుకు విజయేంద్ర కుమార్, రాహుల్ గుప్తా ఎంపికయ్యారు. వీరితో పాటు మరో ఇద్దరు అజిత్, గోలప్ దాస్‌లు కూడా నగరం నుంచి అర్హత సాధించారు.
హైటెక్ సిటీలోని హెచ్‌పీసీఎల్ బిల్డింగ్‌లో గురువారం నిర్వహించిన సెలక్షన్ టోర్నమెంట్‌లో విజయేంద్ర ఏడు రౌండ్లకు గాను 6.5 పాయింట్లు సాధించి అగ్రస్థానంలో నిలిచాడు. రౌండ్ రాబిన్ పద్ధతిలో జరిగిన ఈ సెలక్షన్ టోర్నీలో రాహుల్ గుప్తా కూడా ఆరున్నర పాయింట్లు సాధించినప్పటికీ ప్రోగ్రెసివ్ స్కోరు ఆధారంగా రెండో స్థానానికి పరిమితమయ్యాడు. అజిత్ (5), గోలప్ దాస్ (4)లు వరుసగా మూడు, నాలుగు స్థానాలు పొందారు. వీరంతా జాతీయ స్థాయిలో జరిగే ఆలిండియా హెచ్‌పీసీఎల్ చెస్ చాంపియన్‌షిప్‌లో పాల్గొననున్నారు. ఈ టోర్నీ ఈ నెల 23, 24 తేదీల్లో మంగళూరు (కర్ణాటక)లో జరగనుంది.
హెచ్‌పీసీఎల్ చెస్‌కు విజయేంద్ర
Published Fri, Jun 6 2014 12:09 AM | Last Updated on Sat, Sep 2 2017 8:21 AM
Advertisement
Advertisement