
బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకుడు సిద్దరామయ్యపై పోటీ పడడానికి బీజేపీ నేత బి.ఎస్. యడియూరప్ప కుమారుడు వెనకడుగు వేశారు. వరుణ నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలో ఉన్న సిద్దరామయ్యపై తన కుమారుడు విజయేంద్ర పోటీపడే అవకాశాలున్నాయని నిన్నటికి నిన్న చెప్పిన యడియూరప్ప ఒక రోజు గడిచిందో లేదో మాట మార్చారు. తన కుమారుడు వరుణ నుంచి పోటీ పడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పేశారు.
శివమొగ్గ జిల్లాలోని తన సొంత నియోజకవర్గమైన షికారిపురి నుంచి విజయేంద్ర పోటీ చేస్తారని శుక్రవారం విలేకరులకు చెప్పారు. ఈ విషయాన్ని హైకమాండ్‌కు కూడా చెప్పానని వెల్లడించారు. అయితే వరుణ నుంచి విజయేంద్ర పోటీ చేయాలన్న ఒత్తిడి ఉందని అంగీకరించారు.
Comments
Please login to add a commentAdd a comment