Shikarpur
-
షికారిపుర నుంచి విజయేంద్ర పోటీ
బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకుడు సిద్దరామయ్యపై పోటీ పడడానికి బీజేపీ నేత బి.ఎస్. యడియూరప్ప కుమారుడు వెనకడుగు వేశారు. వరుణ నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలో ఉన్న సిద్దరామయ్యపై తన కుమారుడు విజయేంద్ర పోటీపడే అవకాశాలున్నాయని నిన్నటికి నిన్న చెప్పిన యడియూరప్ప ఒక రోజు గడిచిందో లేదో మాట మార్చారు. తన కుమారుడు వరుణ నుంచి పోటీ పడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పేశారు. శివమొగ్గ జిల్లాలోని తన సొంత నియోజకవర్గమైన షికారిపురి నుంచి విజయేంద్ర పోటీ చేస్తారని శుక్రవారం విలేకరులకు చెప్పారు. ఈ విషయాన్ని హైకమాండ్‌కు కూడా చెప్పానని వెల్లడించారు. అయితే వరుణ నుంచి విజయేంద్ర పోటీ చేయాలన్న ఒత్తిడి ఉందని అంగీకరించారు. -
కూతుళ్లను బావిలోకి తోసేసి ఆపై ఆయన కూడా..
పుణె: ఏం కష్టమొచ్చిందో కానీ ముక్కుపచ్చలారని కూతుళ్లను బావిలోకి తోసేసి ఆపై అతడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన మహారాష్ట్రలోని పుణెలో జరిగింది. తినడానికి వంట చేయి అని ఇంట్లోంచి ఇద్దరు పిల్లలతో వెళ్లిన ఆయన శవమై ఇంటికి తిరిగొచ్చాడు. ఒకేసారి ముగ్గురి మృతితో ఆ కుటుంబం దుఃఖసాగరంలో మునిగింది. అయితే కుటుంబ కలహాలే ఆయన ఇంతటీ దారుణానికి ఒడిగట్టి ఉంటాడని తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పుణెకు సమీపంలోని తాలేగావ్ ధందేర్‌లో రాజేంద్ర బుజ్బాల్ (42) నివసిస్తున్నాడు. అతడికి ఇద్దరు కుమార్తెలు దీక్ష (10), రితుజ (8). కూతుళ్లతో కలిసి గురువారం సాయంత్రం రాజేంద్ర బయటకు వెళ్లాడు. భోజనం సమయమైనా ఎంతకీ ఇంటికి రాకపోవడంతో కుటుంబసభ్యులు గాలించారు. ఈ సందర్భంగా పొలం సమీపంలో ఉన్న బావి వద్ద వారికి సంబంధించిన వస్తువులు లభించాయి. వెంటనే బావిలోకి చూడగా ముగ్గురి మృతదేహాలు బావిలో తేలుతున్నాయి. మొదట ఇద్దరు కూతుళ్లను బావిలోకి విసిరేసిన అనంతరం ఆయన బావిలోకి దూకి ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని శిఖర్పూర్ పోలీసులు భావిస్తున్నారు. అయితే కుటుంబ కలహాలే అతడు ఇంత ఘాతుకానికి ఒడిగట్టాడని తెలుస్తోంది. భార్యాభర్తల మధ్య మనస్ఫర్థలు ముగ్గురి ప్రాణాలు తీశాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
భారీ బాంబు పేలుడు, 58 మంది మృతి
ఇస్లాబాబాద్: పాకిస్థాన్ మరోసారి నెత్తురోడింది. సింధ్ ప్రావిన్స్ లోని షికార్ పూర్ నగరంలోని లఖీ దార్ ప్రాంతంలో ఉన్న షియా మసీదులో శుక్రవారం భారీ బాంబు పేలుడు సంభవించి 58 మంది ప్రాణాలు కోల్పోయారు. 50 మందిపైగా గాయపడ్డారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశముంది. మసీదులో మెట్ల దగ్గర బాంబు పెట్టినట్టు పోలీసులు గుర్తించారు. దాదాపు 5 కేజీల పేలుడు పదార్థం ఉపయోగించినట్టు బాంబు స్క్వాడ్ గుర్తించింది. ఓ కుర్రాడు ఈ బాంబు పెట్టినట్టు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. పేలుడు సమయంలో మసీదులో దాదాపు 600 మంది ఉన్నారు.